సందీప్ మాధవ్, గాయ్రతి ఆర్.సురేష్ జంటగా నటిస్తున్న చిత్రం `గంధర్వ`. ఫన్నీ ఫాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ఎస్.కె. ఫిలిమ్స్ సహకారంతో యాక్షన్ గ్రూప్ సమర్పిస్తున్న చిత్రమిది. ఆదివారంనాడు బాబూ మోహన్ గంధర్వ చిత్ర పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మూవీని జూలై 1న విడుదల చేస్తున్నట్లు హీరో సందీప్ మాధవ్ ప్రకటించగా ఏమైందో ఏమో.. లిరికల్ సాంగ్ వీడియోను హీరో సాయికుమార్ విడుదల చేశారు. ఈ పాటను సింగర్ సునీత ఆలపించింది.
అనంతరం బాబూ మోహన్ మాట్లాడుతూ, మాకు కోడిరామకృష్ణ గురువు. ఆ తర్వాత మా సోదరుడు వీరశంకర్. ఎందుకనో ఆయనకు నామీద కోపం. నాకు ఏ సినిమా ఇవ్వలేదు. అయితే ఈ సినిమా పూజరోజు వీరశంకర్ సినిమా చేస్తున్నాడనిపించింది. కానీ ఆ తర్వాత చెప్పారు కొత్త దర్శకుడు అప్సర్ చేస్తున్నాడని. చిత్ర కథలోని పాయింట్ కొత్తది. చెప్పడం వేరు, తీయడం వేరు. సెట్లో ఎక్కడా టెన్షన్ పడలేదు. అనున్నది అనుకున్నట్లు తీశాడు అని తెలిపారు.
సాయికుమార్ మాట్లాడుతూ, ఈ మధ్య దేశభక్తి చిత్రాలు సూపర్ హిట్ అవుతున్నాయి. వాటిలో ఎమోషన్స్ బాగా పండుతుంది. మొన్న విడుదలైన మేజర్, విక్రమ్ అందుకు ఉదాహరణలు. ఇక దర్శకుడు వీరశంకర్‌గారు గంధర్వ కథను నా దగ్గరకు తీసుకువచ్చారు. సందీప్‌తో చేయడం గాప్పగా ఫీలవుతున్నాను. గంధర్వ టైటిల్‌లో చూపించినట్లుగా 1971-2021 కథ. అయితే నా సినీ కెరీర్‌కూడా 1972 నుంచి ఇంకా కొనసాగుతుంది. నా ఫిలిం కెరీర్ యాభై ఏళ్ళ జర్నీలో గంధర్వ విడుదల కావడం ఆనందంగా వుంది. ఇందులో ప్రధానమైన పాత్ర పోషించాను. కథే చాలా కొత్త పాయింట్. ఇండియన్ తెరపై ఇప్పటివరకు రాని పాయింట్. ఇలాంటివి చెప్పడం ఈజీ. తీయడం కష్టం. దర్శకుడు అప్సర్ బాగా తీశాడు. దర్శకుడు మిలట్రీ మనిషి కాబట్టి నాతో కూడా యాక్షన్ చేయించాడు. అన్ని సినిమాలు బాగుండాలి. అందులో మా సినిమా వుండాలి అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment