Gandharva
-
‘అమెజాన్’ లో ఆకట్టుకుంటున్న గంధర్వ
ఈ మధ్య రిలీజ్ అయిన చిన్న సినిమాల్లో తనదంటూ ఓ ప్రత్యేకత సంతరించుకున్న చిత్రం గంధర్వ . ఫన్ని ఫాక్స్ ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై దర్శకుడు అప్సర్ ని పరిచయం చేస్తూ సందీప్ మాధవ్ , గాయత్రీ ఆర్ సురేష్ జంటగా నటించిన చిత్రం గంధర్వ. ఈ చిత్రంలో సాయి కుమార్ , సురేష్ బాబు , బాబు మోహన్ , పోసాని , సమ్మెట గాంధీ , టెంపర్ వంశీ , సూర్య , పాల్ , జయరాం తదితరులు నటించారు. యాంటి ఏజింగ్ కాన్సెప్ట్ పై చేసిన కొత్త ప్రయోగం విమర్శకులను సైతం మెప్పించింది . ఒక సంఘటనలో ఆక్సిజన్ చాంబర్ లో ఇరుక్కు పోయిన కథా నాయకుడికి కళ్ళు తెరిచే సరికి యాభై ఏళ్ళు గడిచి పోతాయి . కాని అతని వయసు మాత్రం మారాదు . తిరిగి ఇంటికి చేరుకున్న హీరో కి తన భార్య డెబ్భై ఏళ్ల ముసలావిడ గా కొడుకు యాభై ఏళ్ల వ్యక్తిగా కలుస్తారు. అసలు అతనికి జరిగిన సంఘటన ఏంటీ , ఆక్సిజన్ చాంబర్ కథ ఎలా సాగింది, పాతికేళ్ళ తండ్రికి యాభై ఏళ్ల కొడుకుకి మధ్య జరిగిన యుద్ధం ఏమిటీ , అసలు ప్రపంచం ఎలా నమ్మింది అనే కథాంశంతో దర్శకుడు అప్సర్ తన తొలి ప్రయత్నం లోనే భారి స్పాన్ ఉన్న కథ ఎంచుకున్నాడు. జూలై 8 న థియేటర్లలో రిలీజ్ అయిన గంధర్వ మంచి మార్కులే కొట్టేసింది . అయితే తాజాగా ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ లో సైతం తన హవా కొనసాగిస్తుంది . అది చూసిన నిర్మాణ సంస్థ వెంటనే ఈ చిత్రాన్ని అటు తమిళ్ , మలయాళం మరియు కన్నడ భాషల్లో కూడా ఈ నెల ఆఖరున రిలీజ్ చేసే పనుల్లో పడ్డారు. ఏది ఏమైనా కొత్త కథ తో అందర్నీ ఆకట్టుకున్న దర్శకుడు అప్సర్ , ప్రస్తుతం ఒక పెద్ద నిర్మాణ సంస్థ కోసం కథ రెడి చేస్తున్నట్టు సమాచారం. -
72 ఏళ్ల వయసులో NTR పైనుంచి దూకారు: సాయి కుమార్
Sai Kumar About Gandharva Movie: సందీప్ మాధవ్, గాయ్రతి ఆర్. సురేష్ జంటగా నటించిన చిత్రం `గంధర్వ`. ఫన్నీ ఫాక్స్ ఎంటర్టైన్మెంట్ బేనర్ పై యఎస్.కె. ఫిలిమ్స్ సురేష్ కొండేటి సహకారంతో యాక్షన్ గ్రూప్ సమర్పిస్తున్న చిత్రమిది. అప్సర్ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ సుబాని నిర్మించారు. సెన్సార్ పూర్తయి జూలై 8న విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా గంధర్వలో కీలక పాత్ర పోషించిన డైలాగ్ కింగ్ సాయికుమార్ పాత్రికేయుల సమావేశంలో పలు విషయాలు తెలియజేశారు. గంధర్వ కథ చెప్పగానే మీరెలా ఫీలయ్యారు? దర్శకుడు అప్సర్ ఆర్మీ మనిషి. ఏదో కొత్తదనం ఆయనలో కనిపించింది. నాకు దర్శకుడు వీరశంకర్ ఫోన్ చేశాడు. అప్సర్ అనే కొత్త దర్శకుడు కథ చెబుతాడు వినమన్నారు. నేను ఈ మధ్య కన్నడలో `రంగీ తరంగా` చేశాను. ఆస్కార్ దాకా వెళ్లింది. నేను ఆ సినిమా చేశాక కొత్తవాడితో ఎలా చేశావ్! అని నన్ను చాలామంది అడిగారు. కథను నమ్మాను అన్నాను. అలాగే ఎస్.ఆర్. కళ్యాణమండపం కూడా అలానే జరిగింది. ఇప్పుడు గంధర్వ కథ కూడా అంతే. చాలా కొత్తగా కథ వుంది. మనసావాచా కర్మనా మన పని మనం చేసుకుంటూ పోతే తప్పకుండా హిట్ వస్తుంది. గంధర్వలోనూ అంతా కొత్తవారైనా కథలోని ఎమోషన్స్, ఫీలింగ్స్ చాలా అద్భుతంగా వున్నాయి. కలికాలంలో ఓ సీన్ వుంటుంది. నాన్న చనిపోయాడు అనుకుంటాం. తిరిగి వస్తే ఎలా వుంటుందనే ఆసక్తికరంగా అనిపిస్తుంది. గంధర్వలో అలానే వుంటుంది. ఈ పాయింట్‌ను దర్శకుడు అద్భుతంగా ప్రెజెంట్ చేశాడు. చాలా పాత్రలు పోషించిన మీకు గంధర్వ ఎంత మేరకు కొత్తగా అనిపించింది? నేను పోలీస్ స్టోరీ చేసి 25 ఏళ్లయింది. ఈరోజుకీ ఇంకా అదే ప్రేక్షకులు గుర్తుపెట్టుకుని పలుకరిస్తున్నారు. ఇప్పుడు సీక్వెల్ చేయడానికి కమల్ హాసన్ 'విక్రమ్' సినిమా కిక్ ఇచ్చింది. అండర్ ప్లే, డ్రామా.. ఇలా ప్రతీదీ నేను చేశాను. అలాంటి కొత్త ప్రయత్నమే గంధర్వ సినిమాలోని నా పాత్ర వుంటుంది. గంధర్వలో 1971-2021 అని వుంది. దానికి మీ పాత్రకు సంబంధం వుందా? నేను ఇంతకుముందు ఇప్పుడు చేయబోయే సినిమాలోని పాత్రలు కూడా భిన్నంగా చేస్తున్నవే. ధనుష్ చిత్రం `సర్`లో నెగెటివ్ పాత్ర చేస్తున్నా. అలాగే దసరాలో ఊహించని ట్విస్ట్ నా పాత్రలో వుంటుంది. ఇప్పుడు గంధర్వలో కూడా ఎవరూ ఊహించని ట్విస్ట్ నా పాత్రలో వుంది. నేను పొలిటీషియన్. సీఎం అవ్వాలనుకుంటాను. సరిగ్గా ఆ టైంలో నా తండ్రి అంటూ సందీప్ మాధవ్ నా జీవితంలోకి వస్తాడు. తను యంగ్‌గా వుంటాడు. మా అమ్మకు, ఈయనకు వున్న రిలేషన్ ఏమిటని. మీడియా హైలైట్ చేస్తుంది. కథలో ట్విస్ట్ అదే. 1971-2021 టైం ట్రావెల్లో జరిగే కథ కాబట్టి అలా పెట్టారు. గంధర్వ చూశారు కదా ఎలా అనిపించింది? ఇప్పటి జనరేషన్ ప్రతీదీ పరిశీలిస్తున్నారు. మేథావుల్లా ఆలోచిస్తున్నారు. కంటెన్యూటీకూడా వేలెత్తి చూపిస్తున్నారు. అందుకే కథను ముగింపులో చాలా జాగ్రత్తగా చెప్పాలని దర్శకుడితో అన్నాను. ఎక్కడా లాజిక్ మిస్ కాకుండా సినిమాటిక్‌గా ఒప్పించగలగాలి. క్లైమాక్స్‌లో సైంటిఫిక్‌గా వుంటూనే అందరినీ మెప్పించేలా చేశాడని నేను సురేష్ కొండేటి ద్వారా విన్నాను. ఆయన సినిమా చూసి సూపర్‌డూపర్ హిట్ అవుతుందన్నారు. ఇదే అభిప్రాయాన్ని డబ్బింగ్ చెప్పినవాళ్లు, సందీప్ మాధవ్, జయసింహ కూడా చెప్పారు. ఇంటర్వెల్లో మంచి ట్విస్ట్ వుంటుంది. ఇందులో అన్ని ఎమోషన్స్ వుంటాయి. ఓ పజిల్ కూడా వుంటుంది. సేమ్ మా నాన్నలా వుండే సందీప్‌ను చూసి మనిషిని పోలిన మనుషులు ఏడుగురు వుంటారనుకుంటాం. అనేది లాజిక్‌గా దర్శకుడు ముడివిప్పిన విధానం చాలా బాగుంది. ఈ జనరేషన్ హీరోలతో నటించడం ఎలా అనిపిస్తుంది? సందీప్ చేసిన గత సినిమాలు చూశాను. చాలా టాలెంటెడ్. కొత్త జనరేషన్ అయిన సత్యదేవ్, ప్రియదర్శితో నేను చేస్తున్నా. వారి నటనకు అనుగుణంగా నేను మార్చుకుని చేస్తున్నా. అలాగే గంధర్వలో సందీప్‌తో చేశా. టైటిల్‌కు తగ్గట్టు కొత్త కాన్సెప్ట్ ఫిలిం. ఇన్నేళ్ల కెరీర్లో చేయని పాత్రలేదు. ఇంకా కొరత వుందా? నేను నాటకాలు వేసే నాటినుంచి మేకప్ వేసుకుని ఇప్పటికి 50 ఏళ్లయింది. నటుడిగా, డబ్బింగ్ ఆర్టిస్టుగా యాభై ఏళ్ల ప్రస్థానం నాది. కొన్ని సినిమాలు చూసినప్పుడు ఇంకా ఏదో చేయాలని నటుడిగా అనిపిస్తుంది. నటుడికి సంతృప్తి వుండదు. మేజర్ చంద్రకాంత్ షూట్లో ఎన్టీఆర్‌కు 72 ఏళ్లు. ఆ వయస్సులో ఆయన ఓ సీన్లో పైనుంచి దూకాలి. డూప్‌లేకుండా దూకేస్తానని చేసేశాడు. నటుడిగా అంత డెడికేషన్ వుండాలి. నేను నేర్చుకుంది అదే. కన్నడలో కామెడీ చేశాను. ఇటీవలే పౌరాణికంలో దుర్యోధనుడిగా నటించాను. ఇంకా పలు భిన్నమైన పాత్రలు చేయాలనుంది. కొత్త చిత్రాలు? తమిళంలో `డీజిల్` సినిమా చేస్తున్నా. అందులో డీజిల్ మాఫియా లీడర్‌గా నటిస్తున్నా. ఇందులో మూడు గెటప్లుంటాయి. ఇంకా ఓ వెబ్ సీరీస్ చేయబోతున్నా. -
సైన్స్ ఫిక్షన్ కావడంతో థ్రిల్ ఫీల్ అవుతారు: హీరో
Sandeep Madhav About Gandharva Movie In Press Meet: సందీప్ మాధవ్, గాయత్రీ ఆర్. సురేష్ జంటగా అప్సర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘గంధర్వ’. ఫన్నీ ఫాక్స్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై సుభాని నిర్మించిన ఈ సినిమా ఎస్కే ఫిలింస్ సహకారంతో యాక్షన్ గ్రూప్ సమర్పిస్తోంది. ఈ నెల 8న విడుదల కానున్న ఈ సినిమా ప్రివ్యూను కొంతమంది ప్రేక్షకులకు చూపించారు. ఈ సందర్భంగా దర్శకుడు అప్సర్ మాట్లాడుతూ.. ‘‘గంధర్వ’ యూనిక్ పాయింట్. సందీప్ ఈ కథ విని ఎగ్జయిట్ అయ్యాడు. క్లైమాక్స్ ప్రేక్షకులను మెప్పిస్తుంది. ఫస్ట్ కాపీ చూసిన తర్వాత సురేష్ కొండేటి ఈ సినిమాను విడుదల చేస్తానని చెప్పడం మా మొదటి విజయంగా భావిస్తున్నాం’’ అని తెలిపారు. ‘‘సైన్స్ ఫిక్షన్ కావడంతో ఈ కథను ఆడియన్స్ కొత్తగా ఫీలవుతారు.. థ్రిల్ అవుతారు. కామెడీ, యాక్షన్ కూడా ఉన్నాయి’’ అని సందీప్ పేర్కొన్నాడు. ‘‘ఇండియన్ సినిమాలో ఇంతవరకు రాని పాయింట్ ఇది. ‘వంగవీటి’, ‘జార్జిరెడ్డి’ చిత్రాల తర్వాత సందీప్‌కు ఈ చిత్రం హాట్రిక్ అవుతుంది’’ అన్నారు ఎస్కే ఫిలింస్ అధినేత సురేష్ కొండేటి. చదవండి:👇 ఫ్రెండ్‌తో బెడ్ షేర్.. అబార్షన్.. ఎలాంటి పశ్చాత్తాపం లేదు: నటి నగ్నంగా విజయ్ దేవరకొండ.. ఫొటో వైరల్ తొలిసారిగా మోహన్ బాబు, మంచు లక్ష్మీల కాంబినేషన్.. నా రిలేషన్ గురించి దాచాలనుకోవట్లేదు: శ్రుతి హాసన్ -
'గంధర్వ' రిలీజ్ డేట్ ఫిక్స్.. వచ్చేది ఆ రోజే..
Sandeep Madhav Gandharva Movie Release Date Confirmed: సందీప్ మాధవ్, గాయత్రి సురేష్ జంటగా తెరకెక్కిన చిత్రం 'గంధర్వ'. ఈ సినిమాను ఫన్నీ ఫాక్స్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిర్మించగా ఎస్ కె ఫిలిమ్స్ సహకారంతో యాక్షన్ గ్రూప్ ఆఫ్ కంపనీస్ సమర్పిస్తోంది. ఇక ఈ సినిమాలో శీతల్, సాయి కుమార్, పోసాని కృష్ణమురళి, బాబు మోహన్ , సురేష్ తదితరులు నటించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన మూడు పాటలు, ట్రైలర్ మూవీపై మంచి అంచనాలు ఏర్పడేలా చేశాయి. దీంతోపాటు ప్రమోషన్స్‌లో భాగంగా ఈ సినిమా గురించి దర్శకుడు అప్సర్, హీరో సందీప్ మాధవ్ చెప్పిన విశేషాలు టాలీవుడ్లో చిత్రంపై మంచి బజ్ ఏర్పడేలా చేశాయి. అద్భుతమైన కొత్త పాయింట్‌తో అందరి దృష్టిని ఆకర్షించడానికి దర్శకుడు అప్సర్ సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ జూలై 8 న థియేటర్లలో విడుదల కాబోతుంది. ప్రముఖ డిస్ట్రిబ్యూటర్, ప్రొడ్యూసర్ సురేష్ కొండేటి ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా భారీగా ఎత్తున విడుదల చేస్తున్నారు. ఇక ఈ సినిమాకు రాప్ రాక్ షకీల్ సంగీతం అందించారు. సినిమాటోగ్రఫీ జవహర్ రెడ్డి అందించగా ఎడిటర్‌గా బసవా పైడి రెడ్డి వ్యవహరించారు. చదవండి:👇 చై-సామ్ బాటలో మరో టాలీవుడ్ జంట? హీరోను దుమ్మెత్తిపోసిన నెటిజన్లు.. సైలెంట్‌గా ఉండమని కామెంట్లు.. 'నువ్వే కావాలి' నటుడికి నిర్మాత బెదిరింపులు.. పోలీసులకు ఫిర్యాదు 9 సార్లు పిల్లలను కోల్పోయిన స్టార్ హీరోయిన్.. -
‘‘గంధర్వ’ కోసం రెండేళ్లు కష్టపడ్డా.. ముగ్గురు హీరోలు ఒప్పుకోలేదు’
‘‘ఇజ్రాయిల్‌లో జరిగిన వాస్తవ ఘటన నేపథ్యంలో నాకు ‘గంధర్వ’ ఆలోచన పుట్టింది. యాంటీ ఏజింగ్ (వయసు ఎక్కువైనా యంగ్‌గా ఉండేలా) ఉన్న వ్యక్తి కథే ‘గంధర్వ’. వాస్తవానికి 90 శాతం దగ్గరగా ఉండేలా ఈ సినిమా తీశాను’’ అన్నారు దర్శకుడు అఫ్సర్. సందీప్ మాధవ్, గాయ్రతి ఆర్. సురేష్ జంటగా నటించిన చిత్రం ‘గంధర్వ’. ఫన్నీ ఫాక్స్ ఎంటర్టైన్మెంట్పై ఎస్కె ఫిలిమ్స్ సహకారంతో యాక్షన్ గ్రూప్ సమర్పిస్తున్న చిత్రమిది. సుభాని నిర్మించిన ఈ సినిమా జూలై 1న రిలీజవుతోంది. ఈ సందర్భంగా చిత్రదర్శకుడు అఫ్సర్ మాట్లాడుతూ– ‘‘వాస్తవానికి దగ్గరగా ఉండాలని ‘గంధర్వ’ కథపై రెండేళ్లు పరిశోధన చేశాను. ఈ కథను ముగ్గురు హీరోలకు చెప్పాను.. కానీ, నేను కొత్తవాడిని కావడంతో చాన్స్ ఇవ్వలేదు. మరో ఇద్దరు ‘కథ మాకు ఇవ్వండి.. వేరే దర్శకుడితో తీస్తాం’ అన్నారు. నేను ఒప్పుకోలేదు. సందీప్‌కి కథ చెప్పగానే ఓకే అన్నాడు. 1971లో భారత్–బంగ్లాదేశ్ యుద్ధం నేపథ్యంలో కథ సాగుతుంది. అయితే ఆర్మీ నేపథ్యం ఐదు నిమిషాలే ఉంటుంది. ప్రస్తుతం రెండు కథలు రెడీగా ఉన్నాయి. ఓ పెద్ద నిర్మాణ సంస్థలో ఒక సినిమా త్వరలో ప్రారంభమవుతుంది’’ అన్నారు. -
కుటుంబమంతా చూసేలా ఉంటుంది
‘‘గంధర్వ’ యూత్‌ఫుల్ సినిమా కాదు. కుటుంబమంతా కలిసి చూసే చిత్రం. శ్రీకాంత్, జగపతిబాబుగార్లు ఇలాంటి కుటుంబ కథా చిత్రాలు చేశారు. ఈ జనరేష¯Œ లో ‘గంధర్వ’ ద్వారా నాకు మంచి అవకాశం వచ్చింది’’ అని హీరో సందీప్ మాధవ్ అన్నారు. అప్సర్ దర్శకత్వంలో సందీప్ మాధవ్, గాయ్రతి ఆర్.సురేష్ జంటగా నటించిన చిత్రం ‘గంధర్వ’. సుభాని నిర్మించిన ఈ సినిమా ఎస్కే ఫిల్మ్స్ ద్వారా జూలై 1న రిలీజ్ కానుంది. సందీప్ మాధవ్ మాట్లాడుతూ–‘‘గంధర్వ’ కథని లాక్డౌన్లో విన్నాను. మిలటరీ వ్యక్తి కుటుంబంలో వాతావరణం ఎలా ఉంటుంది? పెళ్లి అయిన మరుసటిరోజే యుద్ధానికి వెళ్లాల్సివస్తే పరిస్థితి ఏంటి? వంటి అంశాలున్నాయి. ఈ కథ 1971లో మొదలై 2021 వరకు రన్ అవుతుంది. దర్శకుడు అప్సర్ సోదరుడే నిర్మాత సుభానిగారు.. ఎక్కడా రాజీ పడలేదు. ఎస్.కె. ఫిలిమ్స్ ద్వారా సురేష్ కొండేటిగారు మా సినిమాని విడుదల చేస్తుండటంతో జనాలకు బాగా రీచ్ అవుతోంది. రామ్‌గోపాల్ వర్మ, పూరి జగన్నాథ్‌గార్లకు 24 గంటలు సినిమానే ప్రపంచం.. వారితో పనిచేసేటప్పుడు చాలా విషయాలు నేర్చుకున్నా. ప్రస్తుతం ‘మాస్ మహారాజ్’ అనే సినిమా చేస్తున్నా’’ అన్నారు. -
గంధర్వ: సునీత పాడిన ఏమైందో ఏమో.. లిరికల్ సాంగ్ విన్నారా?
సందీప్ మాధవ్, గాయ్రతి ఆర్.సురేష్ జంటగా నటిస్తున్న చిత్రం `గంధర్వ`. ఫన్నీ ఫాక్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై ఎస్.కె. ఫిలిమ్స్ సహకారంతో యాక్షన్ గ్రూప్ సమర్పిస్తున్న చిత్రమిది. ఆదివారంనాడు బాబూ మోహన్ గంధర్వ చిత్ర పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మూవీని జూలై 1న విడుదల చేస్తున్నట్లు హీరో సందీప్ మాధవ్ ప్రకటించగా ఏమైందో ఏమో.. లిరికల్ సాంగ్ వీడియోను హీరో సాయికుమార్ విడుదల చేశారు. ఈ పాటను సింగర్ సునీత ఆలపించింది. అనంతరం బాబూ మోహన్ మాట్లాడుతూ, మాకు కోడిరామకృష్ణ గురువు. ఆ తర్వాత మా సోదరుడు వీరశంకర్. ఎందుకనో ఆయనకు నామీద కోపం. నాకు ఏ సినిమా ఇవ్వలేదు. అయితే ఈ సినిమా పూజరోజు వీరశంకర్ సినిమా చేస్తున్నాడనిపించింది. కానీ ఆ తర్వాత చెప్పారు కొత్త దర్శకుడు అప్సర్ చేస్తున్నాడని. చిత్ర కథలోని పాయింట్ కొత్తది. చెప్పడం వేరు, తీయడం వేరు. సెట్లో ఎక్కడా టెన్షన్ పడలేదు. అనున్నది అనుకున్నట్లు తీశాడు అని తెలిపారు. సాయికుమార్ మాట్లాడుతూ, ఈ మధ్య దేశభక్తి చిత్రాలు సూపర్ హిట్ అవుతున్నాయి. వాటిలో ఎమోషన్స్ బాగా పండుతుంది. మొన్న విడుదలైన మేజర్, విక్రమ్ అందుకు ఉదాహరణలు. ఇక దర్శకుడు వీరశంకర్గారు గంధర్వ కథను నా దగ్గరకు తీసుకువచ్చారు. సందీప్‌తో చేయడం గాప్పగా ఫీలవుతున్నాను. గంధర్వ టైటిల్లో చూపించినట్లుగా 1971-2021 కథ. అయితే నా సినీ కెరీర్కూడా 1972 నుంచి ఇంకా కొనసాగుతుంది. నా ఫిలిం కెరీర్ యాభై ఏళ్ళ జర్నీలో గంధర్వ విడుదల కావడం ఆనందంగా వుంది. ఇందులో ప్రధానమైన పాత్ర పోషించాను. కథే చాలా కొత్త పాయింట్. ఇండియన్ తెరపై ఇప్పటివరకు రాని పాయింట్. ఇలాంటివి చెప్పడం ఈజీ. తీయడం కష్టం. దర్శకుడు అప్సర్ బాగా తీశాడు. దర్శకుడు మిలట్రీ మనిషి కాబట్టి నాతో కూడా యాక్షన్ చేయించాడు. అన్ని సినిమాలు బాగుండాలి. అందులో మా సినిమా వుండాలి అన్నారు. -
గంధర్వ విజయం!
ఐఐటీ చదువు అతడిని ఎవరి దగ్గరా ఉద్యోగం చేయనీయలేదు, ఊరికే ఉండనీయలేదు. సొంత కాళ్ల మీద నిలబడాలి, కొంతమందికైనా ఉపాధిని చూపించగలగాలి అనే లక్ష్యాన్ని నిర్దేశించింది. మదిలో ఉన్న ఆలోచన, సేవింగ్స్ ఖాతాలో ఉన్న డబ్బు అందుకు సహకరించాయి. సక్సెస్‌కు దారి చూపెట్టాయి. ఈ దారిలో భార్య కూడా తోడయ్యింది. సగం శ్రమ తగ్గించింది. గంధర్వ్, లవీనా బక్షీ అనే యువజంట సాధించిన విజయం ఇది... ఇటీవల బెంగళూరులో నాస్కామ్ ఆధ్వర్యంలో జరిగిన ‘స్టార్టప్ రియాలిటీ షో’తో వెలుగులోకి వచ్చాడు గంధర్వ్. ఈ షో లో తన ప్రాజెక్ట్ గురించి ఎనిమిది నిమిషాల పాటు గంధర్వ్ ఇచ్చిన ప్రెజెంటేషన్ అనేకమంది పారిశ్రామికవేత్తలను ఆకట్టుకొంది. గంధర్వ ఆలోచనపై పెట్టుబడి పెట్టడానికి వారు ముందుకు వచ్చారు. గంధర్వ ఐడియా పాతిక లక్షల రూపాయల బహుమతిని, కోటి రూపాయల పెట్టుబడులను సాధించి పెట్టింది! ఇరవై ఆరేళ్ల గంధర్వ్బక్షీ ఐఐటీ మద్రాస్‌లో ఇంజినీరింగ్, బెంగళూరు ఐఐఎమ్‌లో ఎమ్బీఏ పూర్తి చేశాడు. మంచి జీతం ఇచ్చే ఉద్యోగాలు ఎన్నో వచ్చాయి. అయితే ఉద్యోగం చేయడం అంటే ఒకరకంగా రాజీపడిపోవడం అనే భావనతో, సొంతంగా పదిమందికి ఉపాధి కల్పించే స్థాయికి చేరాలనే లక్ష్యాన్ని పెట్టుకొన్నాడు. గంధర్వ్ మదిలో లక్ష్యాలే కాదు... ఇన్నోవేటివ్ ఐడియాలు కూడా ఉన్నాయి. అవకాశం కూడా కలిసి రావడంతో సూపర్ సక్సెస్‌ను సాధించాడు. చార్జింగ్ ఇబ్బందులు తప్పించేందుకే... ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్ఫోన్లు అందరికీ అందుబాటులోకి వచ్చాయి. అలాగే వీటి చార్జింగ్ విషయంలో ఇబ్బందులు పడే వారు చాలా ఎక్కువ మంది ఉన్నారు. బిజీ లైఫ్‌లో ల్యాప్‌టాప్‌లకు, స్మార్ట్ఫోన్లకు చార్జింగ్ కోసం ప్రత్యేకంగా సమయం కేటాయించాల్సిన అవసరం లేకుండా, జర్నీలోనే అవి చార్జింగ్ అయ్యే ఐడియాను ఆవిష్కరించాడు గంధర్వ్. ఇక్కడ క్యారీబ్యాగ్ సోలార్ ప్యానల్‌గా ఉపయోగపడుతుంది. అందులో పెట్టిన ల్యాప్‌టాప్, స్మార్ట్ఫోన్లు చార్జింగ్ అవుతాయి. ఆ బ్యాగ్‌ను భుజానికి తగిలించుకొని నడుచుకొని వెళ్లినా, సైకిల్‌పై వెళ్లినా తక్కువపాటి సూర్యరశ్మితోనే ఎలక్ట్రానిక్ గాడ్జెట్ బ్యాటరీని ఫిల్ చేయవచ్చు. బెంగళూరులో ‘లూమస్’ అనే కంపెనీని స్థాపించి, ఈ ప్రాజెక్ట్‌పై పనిచేస్తున్న గంధర్వ తన ఐడియా నచ్చితే తనతో కలిసి రావొచ్చని షోకు హాజరైన ప్రముఖ వ్యాపారవేత్తలను కోరాడు. దీనికి మంచి స్పందన వచ్చింది. గూగుల్ ఇండియా ఎమ్డీ ఆనంద్ రాజన్‌తో సహా అనేకమంది ప్రముఖ పారిశ్రామికవేత్తలు ‘లూమస్’కు సహకారం అందిస్తామని ప్రకటించారు. ఈ బడ్డింగ్ కంపెనీలో కొంతశాతం వాటాలను కొంటూ కోటి రూపాయల పెట్టుబడి పెడుతున్నట్టు ప్రకటించారు. దీంతో గంధర్వ దశ తిరిగింది. ఆలోచనను అమల్లో పెట్టడానికి కావాల్సిన పెట్టుబడి లభించింది. ఎన్నో ఐడియాల మధ్య వికసించింది... బెంగళూరులో జరిగిన ‘స్టార్టప్ రియాలిటీ షో’కు తమ ఐడియాలతో ఎంతోమంది యువతీ యువకులు హాజరైనా ఎక్కువమందిని ఆకట్టుకొన్నది, నవ్యతతో కూడుకొన్నది... అనే పేరు మాత్రం ‘లూమస్’కే వచ్చింది. ఇది ఒక సామాజిక అవసరమని, తక్కువ ధరలో రీచార్జింగ్ బ్యాగ్స్‌ను అందుబాటులోకి తీసుకువస్తే మంచిదని పారిశ్రామికవేత్తలు వ్యాఖ్యానించారు. పునరుద్ధరింపదగిన ఇంధన వనరు అయిన సౌరశక్తిని చార్జింగ్కు ఉపయోగించుకోవడం మంచి విషయమని, చార్జింగ్ కోసం ప్రత్యేకంగా సమయాన్ని కేటాయించాల్సిన అవసరాన్ని నిరోధించడం అభినందించాల్సిన విషయం అని షో కు వచ్చిన వ్యాపారవేత్తలు అభిప్రాయపడ్డారు. భార్య సహకారం గొప్పది... పాతికేళ్ల వ యసులోనే లవీనాను వివాహం చేసుకొన్నాడు గంధర్వ్. వీరిద్దరూ కలిసి ‘లూమస్’ కంపెనీని నెలకొల్పారు. తను చేస్తానన్న ఈ ప్రయోగానికి భార్య సహకరించిందని, తన సేవింగ్స్ ఖాతాలో ఉన్న డబ్బును పెట్టుబడిగా పెట్టడానికి అనుమతి ఇచ్చిందని గంధర్వ చెప్పాడు. ఈ విధంగా తన విజయంలో భార్యకు వాటా ఉందంటూ ఆమెను వేదికపైకి పిలిచి, జంటగా అవార్డును, అభినందనలను అందుకొన్నాడు.