Gandharwa Movie Streaming On Amazon Prime Video - Sakshi
Sakshi News home page

‘అమెజాన్’ లో ఆకట్టుకుంటున్న గంధర్వ

Published Wed, Oct 26 2022 10:40 AM | Last Updated on Thu, Oct 27 2022 10:37 AM

Gandharva Movie Streaming On Amazon Prime - Sakshi

ఈ మధ్య రిలీజ్ అయిన చిన్న సినిమాల్లో తనదంటూ ఓ ప్రత్యేకత సంతరించుకున్న చిత్రం గంధర్వ . ఫన్ని ఫాక్స్ ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై దర్శకుడు అప్సర్ ని పరిచయం చేస్తూ సందీప్ మాధవ్ , గాయత్రీ ఆర్ సురేష్ జంటగా నటించిన చిత్రం గంధర్వ. ఈ చిత్రంలో సాయి కుమార్ , సురేష్ బాబు , బాబు మోహన్ , పోసాని , సమ్మెట గాంధీ , టెంపర్ వంశీ , సూర్య , పాల్ , జయరాం తదితరులు నటించారు.

యాంటి ఏజింగ్ కాన్సెప్ట్ పై చేసిన కొత్త ప్రయోగం విమర్శకులను సైతం మెప్పించింది . ఒక సంఘటనలో ఆక్సిజన్ చాంబర్ లో ఇరుక్కు పోయిన కథా నాయకుడికి కళ్ళు తెరిచే సరికి యాభై ఏళ్ళు గడిచి పోతాయి . కాని అతని వయసు మాత్రం మారాదు . తిరిగి ఇంటికి చేరుకున్న హీరో కి తన భార్య డెబ్భై ఏళ్ల ముసలావిడ గా కొడుకు యాభై ఏళ్ల వ్యక్తిగా కలుస్తారు. అసలు అతనికి జరిగిన సంఘటన ఏంటీ , ఆక్సిజన్ చాంబర్ కథ ఎలా సాగింది, పాతికేళ్ళ తండ్రికి యాభై ఏళ్ల కొడుకుకి మధ్య జరిగిన యుద్ధం ఏమిటీ , అసలు ప్రపంచం ఎలా నమ్మింది అనే కథాంశంతో దర్శకుడు అప్సర్ తన తొలి ప్రయత్నం లోనే భారి స్పాన్ ఉన్న కథ ఎంచుకున్నాడు.

జూలై 8 న థియేటర్లలో రిలీజ్ అయిన గంధర్వ మంచి మార్కులే కొట్టేసింది . అయితే తాజాగా ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ లో సైతం తన హవా కొనసాగిస్తుంది . అది చూసిన నిర్మాణ సంస్థ వెంటనే ఈ చిత్రాన్ని అటు తమిళ్ , మలయాళం మరియు కన్నడ భాషల్లో కూడా ఈ నెల ఆఖరున రిలీజ్ చేసే పనుల్లో పడ్డారు. ఏది ఏమైనా  కొత్త కథ తో అందర్నీ ఆకట్టుకున్న దర్శకుడు అప్సర్ , ప్రస్తుతం ఒక పెద్ద నిర్మాణ సంస్థ కోసం కథ రెడి చేస్తున్నట్టు సమాచారం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement