మూడు మూవీలాట! | Nithin And Krishna Chaitanya Power Peta Movie | Sakshi
Sakshi News home page

మూడు మూవీలాట!

Published Tue, Apr 2 2019 3:03 AM | Last Updated on Tue, Apr 2 2019 3:03 AM

Nithin And Krishna Chaitanya Power Peta Movie - Sakshi

నితిన్‌, కృష్ణ చైతన్య

చెప్పాల్సిన కథ ఒక్క సినిమాలోనే సరిపోనప్పుడు రెండు భాగాలుగా డివైడ్‌ చేసి, తెరకెక్కిస్తారు దర్శకులు. ‘బాహుబలి, ఎన్టీఆర్‌’.. ఇలా రెండు భాగాలుగా రూపొందిన సినిమాలున్నాయి. లేటెస్ట్‌గా మూడు భాగాల చిత్రాన్ని అందించడానికి రెడీ అయ్యారు దర్శకుడు కృష్ణ చైతన్య, హీరో నితిన్‌. ‘రౌడీ ఫెల్లో, ఛల్‌ మోహన్‌ రంగ’ సినిమాలతో మంచి అభిరుచి ఉన్న దర్శకుడిగా పేరు పొందారు పాటల రచయిత కృష్ణ చైతన్య. నితిన్‌ సొంతబ్యానర్‌ శ్రేష్ట్‌ మూవీస్‌పై తాజా చిత్రం రూపొందనుంది. ‘‘మొదటి భాగం పూర్తి కథను నితిన్‌కు నరేట్‌ చేశారు కృష్ణచైతన్య.

మిగతా రెండు పార్ట్స్‌ అవుట్‌లైన్‌ వినిపించారు. చిత్రకథలో హీరో, హీరోయిన్, మిగతా పాత్రలన్నింటికీ కూడా ఒకేలాంటి ప్రాముఖ్యత ఉంటుంది. ఎమోషనల్‌గా సాగే ఈ డ్రామా డిసెంబర్‌లో సెట్స్‌ మీదకు వెళ్తుంది’’ అని చిత్ర సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి. ఇదో మాస్‌ సబ్జెక్ట్‌ అని, ‘పవర్‌ పేట’ అనే టైటిల్‌ కూడా అనుకుంటున్నారని ఫిల్మ్‌నగర్‌లో ఓ వార్త ప్రచారంలో ఉంది. ‘నా కెరీర్‌లో చాలెంజింగ్‌ సినిమా ఇది’ అని నితిన్‌ ఆల్రెడీ ట్వీటర్‌లో పేర్కొన్న సంగతి తెలిసిందే. తెలుగులో మూడు భాగాలుగా తెరకెక్కబోతోన్న తొలి సినిమా ఇదే కావడం విశేషం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement