ప్రముఖ గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు జీవితం ఆధారంగా రూపొందిన చిత్రం ‘ఘంటసాల ది గ్రేట్’. గాయకుడు కృష్ణ చైతన్య టైటిల్ రోల్ చేయగా, ఘంటసాల భార్య సావిత్రి ఘంత్రను మృదుల చేశారు. ‘ఘంటసాల ఘంటశాల’ సంకలనకర్త సీహెచ్ రామారావు దర్శకత్వంలో గాయకుడు జీవీ భాస్కర్ నిర్మాణ సారథ్యంలో ఫణి నిర్మించారు. ఈ సినిమాను డిసెంబరులో విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది.
ఈ సందర్భంగా జరిగిన విలేకర్ల సమావేశంలో సీహెచ్ రామారావు మాట్లాడుతూ– ‘‘ఘంటసాలగారి గురించి తెలియని చాలా విషయాలను ఈ సినిమాలో చూపించనున్నాం. ఘంటసాలగా కృష్ణచైతన్య సరి΄ోయారని గతంలో ఎస్పీ బాలుగారు అన్నారు. అదే మా తొలి సక్సెస్‌గా భావిస్తున్నాం’’ అన్నారు. ‘‘ఘంటసాలగారి ఘంత్ర చేయడం నా అదృష్టం’’ అన్నారు కృష్ణచైతన్య. ‘‘2018లోనే ఈ సినిమా టీజర్‌ను ఎస్పీ బాలుగారితో రిలీజ్ చేయించాం. అయితే ఘంటసాలగారి కుటుంబంతో కొన్ని లీగల్ సమస్యలొచ్చాయి. ఇప్పుడు వాళ్లే ఈ సినిమాకు స΄ోర్ట్ ఇస్తున్నారు’’ అన్నారు జీవీ భాస్కర్. చిత్ర సమర్పకులు లక్ష్మీ ప్రసాద్ ఘంల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment