ghantasala venkateswara rao
-
డిసెంబరులో ఘంటసాల ది గ్రేట్
ప్రముఖ గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు జీవితం ఆధారంగా రూపొందిన చిత్రం ‘ఘంటసాల ది గ్రేట్’. గాయకుడు కృష్ణ చైతన్య టైటిల్ రోల్ చేయగా, ఘంటసాల భార్య సావిత్రి ఘంత్రను మృదుల చేశారు. ‘ఘంటసాల ఘంటశాల’ సంకలనకర్త సీహెచ్ రామారావు దర్శకత్వంలో గాయకుడు జీవీ భాస్కర్ నిర్మాణ సారథ్యంలో ఫణి నిర్మించారు. ఈ సినిమాను డిసెంబరులో విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. ఈ సందర్భంగా జరిగిన విలేకర్ల సమావేశంలో సీహెచ్ రామారావు మాట్లాడుతూ– ‘‘ఘంటసాలగారి గురించి తెలియని చాలా విషయాలను ఈ సినిమాలో చూపించనున్నాం. ఘంటసాలగా కృష్ణచైతన్య సరి΄ోయారని గతంలో ఎస్పీ బాలుగారు అన్నారు. అదే మా తొలి సక్సెస్‌గా భావిస్తున్నాం’’ అన్నారు. ‘‘ఘంటసాలగారి ఘంత్ర చేయడం నా అదృష్టం’’ అన్నారు కృష్ణచైతన్య. ‘‘2018లోనే ఈ సినిమా టీజర్‌ను ఎస్పీ బాలుగారితో రిలీజ్ చేయించాం. అయితే ఘంటసాలగారి కుటుంబంతో కొన్ని లీగల్ సమస్యలొచ్చాయి. ఇప్పుడు వాళ్లే ఈ సినిమాకు స΄ోర్ట్ ఇస్తున్నారు’’ అన్నారు జీవీ భాస్కర్. చిత్ర సమర్పకులు లక్ష్మీ ప్రసాద్ ఘంల్గొన్నారు. -
అమెరికాలో ఘంటసాల వర్ధంతి.. నివాళులర్పించిన ప్రవాసులు
ఘంటసాల గాయకుడే కాదు మానవతా వాది, స్వాతంత్య్ర సమరయోథులని ఎన్ఆర్ఐలు కొనియాడారు. ఫిబ్రవరి 11న ఘంటసాల వర్ధంతి సందర్భంగా అమెరికాలో ఘంటసాల వర్ధంతి కార్యక్రమాలు జరిగాయి. ఘంటసాల సంగీత కళాశాల ఇంటర్నేషనల్ (GSKI) న్యూజెర్సీ ఆధ్వర్యంలో అన్నా మధుసూదనరావు అద్యక్షతన ఫిభ్రవరి 11న స్థానిక సంగం చెట్టినాడ్ రెష్టారెంట్లో ఈ కార్యక్రమం జరిగింది. సాయిదత్తపీఠం శివ విష్ను టెంపుల్ ఛైర్మన్ రఘుశర్మ శంకరమంచి వేదమంత్రాల ఉచ్ఛారణ తో జ్యోతి వెలిగించి ప్రార్థనాగీతాలతో సభను ప్రారంభించారు. అనంతరం రవి మరింగంటి, రాజ రాజేశ్వరి కలగా, కృష్ణ కీర్తి ,హర్ష శిష్టా, దీప్తి,లాస్య, శ్రీకన్, జీఎస్కే సభ్యులు భక్తిగీతాలాపనలతో ఘంటసాలపై తమ అభిమానాన్ని వ్యక్తం చేశారు. జీఎస్‌కేఐ న్యూ జెర్సీ అడ్వైజర్స్ రఘు శర్మ శంకరమంచి, న్యూజెర్సీ మాజీ అసెంబ్లీ సభ్యులు ఉపేంద్ర చివుకుల ప్రత్యేకంగా ఈ సభలో పాల్గొని సభికులకు తమ సంస్థ గురించి తెలియజేశారు. GSKI హ్యూస్టన్ సభ్యుడు రవి మరింగంటి ఆధ్వర్యంలో ఈ సభ విజయవంతంగా జరిగింది. ఈ వేడుకలకు ప్రత్యేక అతిథులుగా విచ్చేసిన తెలుగు భవనం శ్రీరాజ్ పసల, తెలంగాణ అసోసియేషన్ గ్రేటర్ హ్యూస్టన్ ఆధ్యక్షులు నారాయణ్ రెడ్డి, ఆశా జ్యోతి దేవకి, రాంబాబు కట్టా తదితరులు GSKI చేస్తున్న కార్యక్రమాలను ప్రశంసించారు. ఘంటసాల వర్ధంతిని శ్రద్దతో నిర్వహించడానికి తోడ్పడిన ప్రతి ఒక్కరికీ GSKI ప్రెసిడెంట్ అన్నా మధు, రవి మరింగంటి కృతఙ్ఞతలు తెలియజేశారు. ‘తెలుగు భాషకు వరం.. ఘంటసాల స్వరం’ అన్న నినాదంతో ముందుకు సాగుతూ.. తెలుగు భాషను ముందు తరాలకు పదిలంగా అందించడమే తమ లక్ష్యమని GSKI సభ్యులు తెలియజేశారు. -
నాన్న చివరి కోరిక.. అమ్మ చనిపోయింది: ఘంటసాల కుమారుడు
అమరగాయకుడు ఘంటసాల స్వరం వినిపిస్తే చాలు.. పులకించిపోయే జనాలు చాలామంది ఉన్నారు. జానపదాల నుంచి జావళీల దాకా, భక్తి గీతాల నుంచి అష్టపదుల దాకా ఆయన ముద్ర కనిపిస్తుంది. ఆయనకు ఇద్దరు భార్యలన్న విషయం చాలా తక్కువమందికి తెలుసు. ఒకరు సావిత్రి అయితే మరొకరు సరళ. ఘంటసాల- సరళల సంతానమే రవి కుమార్. తాజాగా రవి కుమార్ ఓ ఇంటర్వ్యూలో తన తల్లిదండ్రుల గరించి మాట్లాడారు. 'నాన్నకు మానస సరోవర యాత్ర వెళ్లాలని ఎప్పటినుంచో కోరిక. కానీ ఆ కోరిక తీరకుండానే ఆయన కన్నుమూశారు. అయితే ఎలాగైనా ఆ యాత్ర పూర్తి చేయాలని అమ్మ భావించింది. ఒక బృందంతో కలిసి మానస సరోవర యాత్రకు వెళ్లింది. ఎంతో సంతోషంతో మాకు ఫోన్ చేసి తన యాత్ర విశేషాలు చెప్పింది. సరోవర యాత్ర పూర్తి చేసుకున్నాక అందరికీ బాయ్ చెప్పి టెంట్‌లోకి వెళ్లి నిద్రించింది. అక్కడే తుదిశ్వాస విడిచింది' అని చెప్పుకొచ్చారు. చదవండి: బిగ్‌బాస్ 7లో రష్మీ, స్పందించిన యాంకర్ -
మరచిపోలేని మహనీయుడు
మద్రాసులో బడిలో చదువు కొంటున్న రోజులలో ఘంటసాల గారి ఇంటిముందునుంచి వెడుతూ – ఆ వాకిలి ముందు ఆగి అక్కడ ఉన్న ఆయన పేరు చదివి సంతోషిస్తూ ఉండేవాడిని. యాభై అయిదేళ్ల కిందట ఒక వేసవి మధ్యాహ్నం ఆయనను ఎట్లాగైనా చూసి మాట్లాడాలని ఆయన ఇంటికి వెళ్ళాను. ఎండవేళ వచ్చినందుకు బాధ పడి మజ్జిగ తెచ్చి ఇచ్చి నన్ను తాగమన్నారు. నా గురించీ, నా చదువు సంధ్యల గురించి అడిగారు. ఆయన అంటే నాకు చాలా అభిమానమనీ, ఆయన జీవిత చరిత్ర రాయాలని ఉందనీ చెబితే నవ్వి– ‘ముందు బాగా చదువుకో నాయనా! తర్వాత చూద్దాం’ అన్నారు. 1969 నుంచి ఆయనను నేను తరుచుగా కలుసు కొంటూ ఉండేవాడిని. ఎంత పనితొందరలో ఉన్నా కాసేపయినా నాతో మాట్లాడేవారు. ఆ అభిమానంతో – ఆయన విదేశీ యాత్రల వేళ– విదేశాలలో పాడడానికి ఎన్నుకొన్న పాటలను నాకు వినిపించేవారు. ఆ సందర్భాలలో – నేను ఒక్కడినే శ్రోత కావడం నా భాగ్యం. ఆయన విదేశీ యాత్రలకు బయలుదేరేముందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో – నేను ఆయన గురించి తెలుగు, తమిళం, కన్నడం, హిందీ భాషలలో నా చిన్న తనపు మిడిమిడి జ్ఞానంతో రాసిన కవితలు వినిపించాను. ఆయన వాటి ప్రతులు తీయించి పత్రికల వారికి పంపడం ఒక గొప్ప అనుభవం. విదేశీయాత్రల నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఆయన ఆ విశేషాలు పత్రికల వారితో ముచ్చ టించడానికి ఒక సాయంకాలం విందు ఏర్పాటు చేశారు. దానికి నన్నూ రమ్మన్నారు. ఆ గోష్ఠిలో ఇమడలేనేమో అని నేను ఆ విందుకు వెళ్లలేదు. ఆ కార్యక్రమం అయిన కొన్నాళ్ల తర్వాత ఒక సాయంకాలం నేను ఆయనను చూడడానికి వెళ్లాను. రికార్డింగ్‌కు బయలుదేరడానికి సిద్ధమవుతున్న ఘంటసాల నన్ను చూసి ‘ఏం బాబూ! ఆరోజు పార్టీకి రాలేదు?’ అన్నారు. నేను సమాధానం చెప్పడానికి తట పటాయిస్తుంటే ‘నీకు ఇప్పుడే ఇక్కడే పార్టీ ఇస్తున్నాను నా పక్కన కూర్చో... రా...’’ అన్నారు. భార్య సావిత్రమ్మ గారికి ఆ సంగతి చెప్పారు. వేడి వేడి ఇడ్లీలు, లడ్లు, కాఫీలతో సాగిన ఆ ప్రత్యేకమైన విందు నేను ఏనాటికీ మరచిపోలేనిది. అది ఆయన నా మీద చూపిన వాత్సల్యానికి గుర్తు. ఆయన నాతో చాలా విషయాలు మాట్లాడేవారు. ఒకసారి చదువు గురించిన ప్రస్తావన వస్తే – చదువు కొంటున్న రోజులలో చదువు మీద దృష్టి ఉంచాలనీ, వయసు చిన్నదిగా ఉన్నపుడే చదవగలిగినంత చదువులు చదవాలనీ చెప్పారు. ఆయన పాటలు వినిపించడానికి తమ దగ్గరికి వచ్చే యువతీయువకులకు – సంగీతంతో పాటు చదువు మీద కూడా దృష్టి పెట్టాలని చెప్పేవారు. ఆయన వాక్శుద్ధి అద్వితీయం. ఒక వర్ధమాన సినిమా రచయిత, పెద్ద దర్శకులు కాగలరని ఘంటసాల గారు చెప్పారు. ఆ తరువాత దర్శకులు కూడా అయిన ఆ రచయితే దాసరి నారాయణ రావుగారు! చిత్తూరులో ఒక బాలుణ్ణి చూసి – ‘బాగా చదువుకో బాబూ! పెద్ద పెరిగాక ఏం కావాలనుకుంటున్నావు?’ అని అడిగితే ఆ బాలుడు తనకు గాయకుడు కావాలని ఉందన్నాడు. ‘కాదు బాబూ! నీవు బాగా చదువుకొని కలెక్టర్ కావాలి’ అన్నారు ఘంటసాల గారు. ఆ బాలుడు ఉత్తరోత్తర కలెక్టర్ అయ్యారు. కలెక్టర్ అయిన ఆ బాలుడి పేరు – కె. చంద్రమౌళి. నాకు మంచి ఉద్యోగం దొరికి నేను పెద్ద అధికారి కాగలననీ ఆయన దీవించారు. ఆ దీవెన ఫలించింది. నేపథ్య గాయకులలో ‘మీ తర్వాత ఎవరు?’ అని అడిగితే ‘ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం’ అన్నారు ఆ ఘంట సాల. ఆ మాటా నిజం అయింది. ఆయన జీవిత చరిత్ర రాయడానికి నాకు అనుమతి ఇవ్వడం, నన్ను ఆశీర్వదించడం నాకు దొరికిన గొప్ప అదృష్టం. భాగ్యం. అర్ధంతరంగా అస్తమించిన ఆ అమృత మూర్తి అంతిమ యాత్రవేళ ఆయన భౌతిక కాయాన్ని నేను కూడా మోశాను. ఆ బాధ మాటలలో చెప్పలేనిది. తమ సంగీతం ద్వారా ఇంకా జీవించి ఉన్న ఆ మహనీయుడి గురించి ఎంత చెప్పినా తనివి తీరదు. వ్యాసకర్త ఆకాశవాణి పూర్వసంచాలకులు,ఘంటసాల జీవిత చరిత్ర ‘మన ఘంటసాల’ రచయిత డాక్టర్ పి. ఎస్. గోపాలకృష్ణ -
ఘంటసాలకి భారతరత్న ప్రకటించాలంటూ కేంద్రానికి విజ్ఞప్తి
అమరగాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు శత జయంతి వేడుకల సందర్భంగా వారికి భారతరత్న పురస్కారం ఇవ్వాలనే డిమాండ్‌తో శంకర నేత్రాలయ (యూఎస్ఏ) అధ్యక్షుడు బాల ఇందుర్తి ఆధ్వర్యములో వరుసగా అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇప్పటివరకు 80 పైగా టీవీ కార్యక్రమాలను నిర్వహించి ప్రపంచం నలుమూలలో ఉన్న తెలుగు సంస్థలను ఏకాతాటిపై తీసుకువస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఇందులో భాగంగా యూఎస్ఏ నుంచి నుండి నీలిమ గడ్డమణుగు వ్యాఖ్యాతగా 24 ఏప్రిల్ 2022 నాడు జరిగిన అంతర్జాల కార్యక్రమం నిర్వహించారు. ఇందులో ఇండియన్ అమెరికన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షుడు, ఆపి (AAPI) పూర్వ అధ్యక్షులు డాక్టర్ సురేష్ రెడ్డి ముఖ్య అతిథిగా, చెన్నై నుంచి ఘంటసాల కోడలు శ్రీమతి కృష్ణ కుమారి ఘంటసాల అతిధులుగా పాల్గొన్నారు. సురేష్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర పాలకులు మొదటి నుంచి దక్షిణాది వారి మీద చిన్నచూపుతో వ్యవహరించారని, ముఖ్యంగా తెలుగు వారికీ అన్ని విధాలుగా అన్యాయం జరిగిందన్నారు. ఘంటసాల గారికి భారతరత్న విషయంలో అదే జరిగిందన్నారు. ఇప్పటికయినా ఘంటసాలకి భారతరత్న వచ్చేంతవరకు అందరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఇండియన్ అమెరికన్ మెడికల్ అసోసియేషన్ (IAMA) సంస్థలో ఉన్న తెలుగు డాక్టర్లందరి సహకారంతో భారతరత్న కోసం ప్రయత్నం చేస్తామని హామీ ఇస్తూ ఈ కార్యక్రమానికి పూర్తి మద్దతుని ప్రకటించారు. కృష్ణ కుమారి ఘంటసాల మాట్లాడుతూ నిర్వాహుకులు చేస్తున్న ప్రయత్నాన్ని ఘంటసాల కుటుంబం తరుపున మనస్ఫూర్తిగా అభినందిస్తున్నట్టు తెలిపారు. మనందరి ప్రయత్నాలు సఫలం కావాలని ఆకాంక్షించారు, ఈ సందర్భంగా బాల ఇందుర్తిని ప్రత్యేకంగా అభినందించారు. అతిత్వరలోనే రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలసి వారి సహకారంతో మన అందరి ప్రయత్నాలను ఇంకా ముందుకు తీసుకువెళ్లాలని అభ్యర్ధించారు. ఆస్ట్రేలియా, సిడ్నీ నుండి సంగీత దర్శకుడు, తబలా ప్లేయర్ ఆదిశేషు కోట, సింగపూర్ నుండి శ్రీ సాంస్కృతిక కళాసారథి వ్యవస్థాపక అధ్యక్షుడు రత్న కుమార్ కవుటూరు, డెన్మార్క్ నుండి తెలుగు అసోసియేషన్ వ్యవస్థాపకుడు అమర్నాధ్ పొట్లూరి, ఉగాండా నుండి తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ ఉగాండా చైర్మన్ వి.పార్థసారథి, సౌదీ అరేబియా నుండి సౌదీ తెలుగు అసోసియేషన్ అధ్యక్షురాలు దీపికా రవి, UK నుండి తెలుగు అసోసియేషన్ ఆఫ్ సట్టన్ (TAS) అధ్యక్షుడు నవీన్ జలగడుగు, హంగేరి నుండి యోగహిత ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షురాలు, అరవింద కొల్లిపార, యు.యెస్.ఏ నుండి శంకర్ నేత్రాలయ బోర్డు సభ్యులు, ఉపేంద్ర రాచుపల్లి తదితరులు పాల్గొని ఘంటసాల పాటలతో తమకున్న అభిమానాన్ని, వారి పాటలలోని మాధుర్యాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు, ఘంటసాల కి భారతరత్న దక్కకపోవడం చాలా బాధాకరం, ఇది తెలుగు వారి ఆత్మ గౌరవం అని అభిప్రాయపడుతూ, ఘంటసాల కి కేంద్ర ప్రభుత్వం తగిన రీతిన గుర్తించి భారతరత్న అవార్డు తో సత్కరించాలి అని అభ్యర్ధించారు, అందుకు విదేశాలలో నివసిస్తున్న తెలుగు సంస్థలతో పాటు తెలుగేతర సంస్థలను కూడా అందరిని ఏకతాటిపై తెచ్చి భారతరత్న వచ్చేంతవరకు అందరూ సమిష్టిగా కృషి చేయాలని తెలిపారు. ఈ బృహత్ కార్యక్రమంలో ఇప్పటివరకు అమెరికా లోని పలు తెలుగు జాతీయ సంస్థల సహకారంతో, భారతదేశం నుంచి పలువురు ప్రముఖులతో పాటు డెన్మార్క్, ఉగాండా, సౌదీ అరేబియా, హంగేరి, బ్రూనై, బోత్సవాన, మారిషస్, ఇండోనేషియా, హాంగ్ కాంగ్, థాయిలాండ్, కెనడా, బెహ్రెయిన్, ఫ్రాన్స్, న్యూజీలాండ్, ఆస్ట్రేలియా, సింగపూర్, మలేషియా, యూఏఈ, ఖతార్, ఒమాన్, నార్వే, లండన్, దక్షిణాఫ్రికా లోని పలు తెలుగు సంస్థలతో 83 టీవీ కార్యక్రమాలను నిర్వహించామని, ఈ టీవీ చర్చా కార్యక్రమాలకు ప్రపంచ దేశాలలోని తెలుగు సంఘాలకి అనుసంధాన కర్తగా సింగపూర్ నుండి రత్న కుమార్ కవుటూరు వ్యవహరిస్తున్నారు. ఈ కార్యక్రమానికి కావలసిన సహకారాన్ని శ్రీమతి కృష్ణ కుమారి ఘంటసాల అందిస్తున్నారు. ఘంటసాల కు భారతరత్న ఇవ్వాలని మొదలుపెట్టిన సంతకాల సేకరణకు అనూహ్యస్పందన లభిస్తోందని నిర్వాహుకులు తెలిపారు. చదవండి: ఘంటసాలకు భారతరత్న వచ్చే వరకు కృషి చేద్దాం -
ఘంటసాలకు భారతరత్న ఇవ్వాలి
అమరగాయకుడు, ప్రముఖ సంగీత దర్శకులు, స్వాతంత్ర సమరయోధుడు పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు శత జయంతి సంవత్సర సందర్భముగా వారికి భారతరత్న పురస్కారం ఇవ్వడం సముచితం అనే నినాదంతో అమెరికా నుంచి శంకర నేత్రాలయ అమెరికా అధ్యక్షులు బాల ఇందుర్తి ఆధ్వర్యములో ఇప్పటివరకు 40 పైగా టీవీ కార్యక్రమాలను నిర్వహించి ప్రపంచం నలుమూలలో ఉన్న తెలుగు సంస్థలను ఏకాతాటిపై తీసుకువస్తున్నట్లు నిర్వాహుకులు తెలిపారు. అందులో భాగంగా అమెరికా నుంచి విజ్జు చిలువేరు వ్యాఖ్యాతగా 27 మార్చి 2022 నాడు జరిగిన అంతర్జాల(జూమ్) కార్యక్రమంలో జాతీయ అవార్డు గ్రహీత ఉన్నికృష్ణన్ ముఖ్యఅతిథిగా పాల్గొని ఘంటసాల పాటలోని మాధుర్యం, దేశభక్తిని కొనియాడారు. వాగ్గేయకారుడు అన్నమయ్య తరువాత కలియుగదైవం అయినా వెంకటేశ్వర స్వామి సన్నిధిలో పాడే అరుదైన అవకాశాన్ని ఘంటసాల పొందారు అని కీర్తించారు. ఈ సందర్భంగా ఘంటసాలకి భారతరత్న కోసం మీరందరు చేస్తున్న కృషిని అభినందించి తన పూర్తి సంఘీభావాన్ని ప్రకటించారు. బాల ఇందుర్తి మాట్లాడుతూ ఇప్పటివరకు 48 మంది భారతరత్న అవార్డుకి ఎంపిక అవ్వగా, అందులో ఒక్క తెలుగువారికి కూడా దక్కకపోవడం బాధాకరం విషయం అని అన్నారు. అతిత్వరలోనే సంతకాల సేకరణ చేపడుతున్నట్లు తెలిపారు. సింగపూర్ నుంచి శ్రీ సాంస్కృతిక కళాసారథి అధ్యక్షులు కవుటూరు రత్నకుమార్, కెనడా నుండి తెలుగు అలయన్స్ అఫ్ కెనడా అధ్యక్షులు కల్పన మోటూరి, హాంగ్ కాంగ్ నుండి హాంగ్ కాంగ్ తెలుగు సమాఖ్య అధ్యక్షులు జయ పీసపాటి, థాయిలాండ్ నుండి తెలుగు అసోసియేషన్ అఫ్ థాయిలాండ్ అధ్యక్షులు రవికుమార్ బోబ్బా, బెహ్రెయిన్ నుంచి తెలుగు కళా సమితి అధ్యక్షులు శివ యెల్లపు, ఫ్రాన్స్ నుండి ఫ్రాన్స్ తెలుగు అసోసియేషన్, పారిస్ ఉపాధ్యక్షురాలు ఆన్నపూర్ణ మహేంద్ర తదితరులు పాల్గొని ఘంటసాల జీవించిన సమయంలో తామెవరు లేకపోయినా ఇప్పటికి వారి పాటలు తమ మదిలోనే ఉన్నాయని, వారు పరమపదించిన 48 సంవత్సరాలు తరువాత కూడా ఘంటసాల పాటలను ఈనాటి తరం పిల్లలతో సహా అందరు పాడుకోవడం వారి పాటలలో అమరత్వం ఉందని చెప్పడానికి నిదర్శనమని తెలిపారు. ఘంటసాలకి భారతరత్న దక్కకపోవడం చాలా బాధాకరం అని అభిప్రాయపడుతూ, ఇది 15 కోట్ల తెలుగువారందరికి ఆత్మ గౌరవానికి సంభందంచిన విషయం అని, ఘంటసాలకి కేంద్ర ప్రభుత్వం తగిన రీతిన గుర్తించి భారతరత్న అవార్డుతో సత్కరించాలని అభ్యర్ధించారు. అందుకు విదేశాలలో నివసిస్తున్న తెలుగు సంస్థలు ఏకతాటిపై వచ్చి భారతరత్న వచ్చేంతవరుకు అందరు సమిష్టిగా కృషి చేయాలనీ అని తెలిపారు. -
నిరాటంకంగా ఘంటసాల స్వర రాగ మహాయాగం
అమరగాయకుడు పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వర రావు శత జయంతి సంవత్సర వేడుకలు నిరాటకంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా ‘‘ఘంటసాల స్వర రాగ మహాయాగం’’ కార్యక్రమం 50వ రోజు పూర్తి చేసుకుంది. ‘‘ఘంటసాల ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ట్రస్ట్’’, శ్రీ సాంస్కృతిక కళాసారథి సింగపూర్, వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, వంశీ ఇంటర్నేషనల్, శుభోదయం గ్రూప్స్ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి ఈ వేడుకల్ని. 2021 డిసెంబర్ 4వ తేదీన ప్రారంభమై దిగ్విజయంగా కొనసాగుతున్న ఈ బృహత్ కార్యక్రమంలో.. ఇప్పటికే భారత్‌తో పాటు న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, సింగపూర్, హాంగ్ కాంగ్, ఖతార్, బహరైన్, ఒమాన్, అమెరికా మొదలైన దేశాలనుండి గాయనీగాయకులు పాల్గొన్నారు. మధురగాయకుడు ఘంటసాల గీతాలను ఆలపించారు. ఇక 50వ రోజు సందర్భంగా శిరోమణి డా. వంశీ రామరాజు ఘంటసాల మందిరంలో దీపారాధన చేసి కార్యక్రమం ప్రారంభించారు. విజయనగరం నుండి లలితా అలమేలు మంగ, జడ్చర్ల నుండి శైలజామూర్తి ఘంటసాల వారి చక్కటి వైవిధ్యభరితమైన పాటలను ఎన్నుకుని ఆలపించారు. రాధిక మంగిపూడి వ్యాఖ్యాతగా , సింగపూర్ నుండి కవుటూరు రత్నకుమార్ అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. శుభోదయం మీడియా ద్వారా ప్రపంచవ్యాప్తంగా యూట్యూబ్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయబడిన ఈ కార్యక్రమాన్ని వివిధ దేశాలలోని తెలుగువారందరూ వీక్షిస్తున్నారు. చదవండి: ‘శత వసంతాల ఘంటసాల’ పుస్తకాన్ని ఆవిష్కరించిన సీఎం జగన్ -
ఘంటసాల కుటుంబ సభ్యులకు అండగా ప్రభుత్వం
మహారాణిపేట (విశాఖ దక్షిణ): అమర గాయకుడు పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు సరస్వతీ పుత్రుడని, తన అమృత గానంతో శ్రోతలను మంత్రముగ్ధులను చేశారని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు కొనియాడారు. ఘంటసాల కుటుంబ సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. ఘంటసాల శత జయంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం తరఫున వీఎంఆర్డీఎ చిల్డ్రన్స్ ఎరీనాలో శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా తపాలా శాఖ పోస్టల్ కవర్ విడుదల చేయగా.. మంత్రి ఆవిష్కరించారు. ఘంటసాలపై రచించిన రెండు పుస్తకాలను కూడా ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గుడివాడ అమర్నాథ్, తిప్పల నాగిరెడ్డి, నెడ్‌క్యాప్ చైర్మన్ కె.కె.రాజు, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మల్లికార్జున, మేయర్ గొలగాని హరి వెంకటకుమారి, జిల్లా పరిషత్ చైరపర్సన్ జె.సుభద్ర, రాష్ట్ర సృజనాత్మక, సాంస్కృతిక సమితి చైర్పర్సన్ వంగపండు ఉష తదితరులు పాల్గొన్నారు. -
ఈ రాజకీయాలతో చదవలేం
గవర్నర్‌కు ఘంటసాల సంగీత, నృత్య కళాశాల విద్యార్థుల లేఖ రాజకీయాల వల్ల ఎదురవుతున్న ఇబ్బందులు ఏకరువు ‘సాక్షి’ చేతికి చిక్కిన లేఖ విజయవాడ కల్చరల్ : నగరంలోని ఘంటసాల వెంకటేశ్వరరావు ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాలలో జరుగుతున్న రాజకీయాలతో తాము చదువుకోలేని పరిస్థితి ఏర్పడిందని విద్యార్థులు ఉమ్మడి రాష్ట్ర గవర్నర్ ఇ.సి.ఎల్.నరసింహన్‌కు లేఖ రాశారు. కళాశాల వ్యవహారాల్లో జోక్యం చేసుకుని తమకు విద్యాభిక్ష పెట్టాలని ఆ లేఖలో వేడుకున్నారు. ఆ లేఖ ‘సాక్షి’ చేతికి చిక్కింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఘంటసాల వెంకటేశ్వరరావు ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాలకు మంచి పేరు ఉంది. వేలాది మంది నృత్య కళాకారులు, సంగీత కోవిదులను ప్రపంచానికి అందించిన ఘనత ఈ కళాశాల సొంతం. సంగీత ప్రపంచ రారాజు మంగళంపల్లి బాలమురళీ కృష్ణ వంటి ప్రముఖులు కళాశాల ప్రతిష్టను ప్రపంచానికి చాటిచెప్పారు. దురదృష్టవశాత్తూ రెండేళ్లుగా సంగీత కళశాలలో అధికార పార్టీ నాయకులు తిష్టవేసి సాంస్కృతిక, భక్తి కార్యక్రమాల పేరుతో కళాశాల ప్రతిష్టను దిగజార్చారు. చివరకు అధిపత్య పోరులో దాడులు, హత్యాయత్నం కేసుల వరకూ తీసుకెళ్లారు. రెండేళ్లు ఓపికపట్టిన విద్యార్థులు తాజాగా తమ కళాశాలలో మరో కార్యక్రమం నిర్వహించేందుకు అధికార పార్టీ నాయకులు చర్యలు చేపట్టిన నేపథ్యంలో సంగీత కళాశాల వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని గవర్నర్ నరసింహన్‌కు లేఖ రాశారు. లేఖలోని ముఖ్యాంశాలు సంగీత కళాశాలలో నెలల తరబడి కార్యక్రమాలు నిర్వహించడం వల్ల ఏకాగ్రత కుదరడంలేదు. కళాశాల పని దినాల్లో కారిడార్‌లో అపరిచిత వ్యక్తులు తిరుగుతున్నారు. ముఖ్యంగా బాలికలమైన మేం భయంతో వణికిపోతున్నాం. గతంలో కళాశాలలో ప్రయివేటు కార్యక్రమాలు జరిగినప్పుడు పేరెంట్స్ కమిటీ ద్వారా కళాశాల ప్రిన్సిపాల్‌కు, సంబంధిత అధికారులకు విన్నవించుకున్నాం. భవిష్యత్‌లో జరుగకుండా చేస్తామని వారు హామీ ఇచ్చారు. కానీ పరిస్థితిలో మార్పులేదు సరికదా ఇంకా దారుణంగా తయారైంది. ప్రభుత్వ కార్యాలయాల్లో మతపరమైన కార్యక్రమాలు జరుగకూడదని నింధనలు చెపుతున్నా రాజకీయ నాయకులు పూజల పేరుతో కళాశాలలో ప్రవేశిస్తున్నారు. రాజకీయ నాయకులు విలేకరుల సమావేశాలు పెట్టడం, బహిరంగంగా తిట్టుకోవటం వల్ల సంగీత కళాశాల ప్రతిష్ట దిగజారుతోంది. భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుల కార్యాలయం సంగీత కళాశాలలోనే పనిచేస్తోంది. అయితే సంచాలకుడు ప్రభుత్వంతో సంబంధం ఉన్న రాజకీయ నాయకులకు వత్తాసు పలుకుతున్నారు. గతంలో కళాశాలలో జరుగుతున్న కార్యక్రమంలో కళాకారుల ప్రవేశం ఉండేది. కొద్దికాలంగా రాజకీయ నాయకులు మతపరమైన కార్యక్రమాలు చేస్తూ కళాశాల ప్రతిష్టను దిగజారుస్తున్నారు. సంగీత కళాశాలలో జరుగుతున్న కార్యక్రమాల వల్ల సంగీతం, నృత్యం అభిరుచి ఉన్నా తల్లిదండ్రులు తమ పిల్లలను కళాశాలకు పంపడానికి భయపడుతున్నారు. సంగీత కళాశాలలో చేరే విద్యార్థుల సంఖ్య కూడా తగ్గిపోతోంది. సంగీత కళాశాల రక్షణగా ఉన్న గోడను కూల్చివేశారు. గతంలో సంగీత కళాశాలకు రాజకీయ నాయకులు లేని కమిటీ ఉండేది. కళాశాలోని కార్యక్రమాలను పర్యవేక్షించేది. ఇప్పుడు ఆ కమిటీ లేకపోవడం వల్ల సంస్కృతి, సంప్రదాయాలు లేని కార్యక్రమాలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. దయజేసి రాజకీయ నాయకుల ప్రవేశం నుంచి కళాశాలను కాపాడాలి. -
పాటశాల
-
అమరగాన స్మరణ
మూడు తరాల పాటు తెలుగుదేశంలోని ఆబాలగోపాలాన్ని తన కమనీయ కంఠ మాధుర్యంతో పరవశింపచేసిన గంధర్వ గాయకుడు ఘంటసాల. చందమామకు చల్లదనం నేర్పినా, తేటతెలుగుకు తియ్య దనం అందించినా అది అయనకే చెల్లించిం దనటం అతిశయోక్తి కాదు. జన్మతః కాకున్నా అభ్యాసగతంగా తండ్రినుంచి గురువునుంచి ఆయన నేర్చుకున్న సంగీత జ్ఞానం తెలుగు లలిత సంగీతానికి, చలనచిత్ర సంగీతానికి ప్రాణప్రతిష్ట పోసింది. ఆ గళ గంధర్వహేల ప్రతి తెలుగువారి మదిలో నిలిచింది. తెలుగుపాట, పద్యం ఉన్నంత వరకు ప్రతి ఇంటా, ప్రతి నిమిషం ఆయన గొంతు మారుమోగుతూనే ఉంటుంది. ఘంటారావంలా ఖంగున మ్రోగే కంచుకంఠంతో ప్రపంచ తెలుగు శ్రోతల్ని ముగ్ధులను గావించిన గానగంధర్వుడు ఘంటసాల. మానవుడే మహనీయుడన్న సుభాషి తానికి ప్రత్యక్ష సాక్షిగా, పాటతో సాగిన గానధీమం తుడాయన. భగవద్గీతని, భారతజాతికి అపూర్వ మైన వరంగా వదిలి వెడలిన భక్త శిఖామణి. వెండివెన్నెల జాబిలి, నిండు పున్నమి జాబిలీ అంటూ తీయని పాటలు పాడుతూ తెలుగు స్వరకీర్తిని అజరా మరం చేసిన విశిష్టగాయకుడు. అందుకే పరమపదించి నాలుగు దశాబ్దాలు దాటినా బహుదూరపు బాటసారీ ఇటు రావో ఒక్కసారీ అంటూ ఆయనను తెలుగు జాతి స్మరించుకుంటూనే ఉంది. తెలుగు సినిమా పాటల కు అర్ధశతాబ్దంపాటు గాత్రదానం చేసిన తొలి తరం నేపథ్య గాయకులలో ప్రముఖుడు. మరో వెయ్యేళ్ల పాటు తెలుగు సినీ సంగీతాన్ని నేపథ్యగాన చరిత్ర లో చెరిగిపోని సంతకంలా రూపొందించి తెలుగు వారి హృదయాల్లో నిలిచిపోయారు. పాటను, పద్యాన్ని హిమవన్నగ శిఖరాలపై నిలిపిన ఆ గాన విశారదుడికి నిండు నీరాజనాలు. (నేడు ఘంటసాల వెంకటేశ్వరరావు 41వ వర్థంతి) -డా. సయ్యద్ రహంతుల్లా అపోలో, సికింద్రాబాద్ -ఎం లక్ష్మయ్య హైదరాబాద్ -
ఆ బాణీలో ప్రత్యేకత అది!
సందర్భం: ఘంటసాల జయంతి వి.ఎ.కె. రంగారావు (ప్రసిద్ధ సినీ, సంగీత, కళా విమర్శకుడు) అమర గాయకుడు ఘంటసాల సంగీతం అందిం చిన తొలి చిత్రం అంటే, సినీప్రియులు సహజంగా ‘మనదేశం’ పేరు చెబుతారు. కానీ, అంతకన్నా ముందే ఆయన కొన్ని చిత్రాల్లోని పాటలకు బాణీలు కట్టారని చాలామందికి తెలియదు. కృష్ణవేణి నటించిన ‘లక్ష్మమ్మ’కి పాటలు రాసింది, ట్యూన్లు చేసింది ప్రముఖ లలిత సంగీతజ్ఞుడు బాలాంత్రపు రజనీకాంతరావు. అప్పటికే రజనీ ఆకాశవాణిలో ప్రభుత్వోద్యోగి. అందువల్ల ఆ సినిమా టైటిల్స్‌లో ఆయన అసలు పేరు వాడలేదు. గమ్మత్తేమిటంటే, ఆ చిత్రానికి పాటలు రికార్డు చేసింది ఘంటసాల వెంకటేశ్వరరావు. టైటిల్స్‌లో ‘జి.వి. రావు’ అని వేశారు. ఆ సినిమాలో తాను పాడిన పాటల కోసం ఘంట సాల స్వయంగా రజనీ దగ్గరకు వెళ్ళి, పాటలు నేర్చుకొని వచ్చి మరీ, రికార్డింగ్‌కు పాడారు. మరో విశేషం ఏమిటంటే, ఆ సినిమాలో రెండు పాటలు మాత్రం రజనీకాంతరావు బాణీల్లో కాకుండా, వాటిని ఘంటసాల మార్చి, కొత్త బాణీలు కట్టుకొని పాడారు. ఆ సంగతి స్వయంగా రజనీకాంతరావే నాకు చెప్పారు. ఆ రెండు పాటల్లో ఒకటి - వేశ్య పాత్రధారిణి కుమారి రుక్మిణి మీద ఫరజు రాగంలో వచ్చే ‘సుదతి నీకు తగిన చిన్నదిరా...’ జావళీ. అలాగే, చాలామందికి తెలీని మరో సంగతి - అక్కినేని నటించిన ‘బాలరాజు’లో కూడా ఘంటసాల బాణీలు కట్టిన పాటలు న్నాయి. ఆ చిత్రానికి సంగీత దర్శకుడు గాలి పెంచల నరసింహారావు. ఆయనకు సహాయకుడు - ‘జి.వి. రావు’. ఆ చిత్రంలో మూడు పాటలు స్వయంగా ఘంటసాల బాణీలు కట్టినవే. ఆ పాటలేమిటంటే, ‘నవో దయం...’ అనే బృంద నృత్యం, ‘తీయని వెన్నెల రేయి...’ గీతం, ‘తేలీ చూడుము హాయి...’ అనే పాట. ఈ పాటలకున్న మరో విశేషం- పాట లకు వాద్యగోష్ఠి కూర్చినది మరో సంగీత దర్శకుడు సి.ఆర్. సుబ్బురామన్. టైటిల్స్ చూస్తే ఆర్కెస్ట్రా సుబ్బురామన్ అండ్ పార్టీ అని ఉంటుంది. అలా ‘లక్ష్మమ్మ’ (ఆలస్యంగా 1950లో రిలీజైంది)లో 2 పాటలు, ‘బాలరాజు’ (’48)లో 3 పాటలకు సంగీతం అందించాక... ఘంటసాల పూర్తిస్థాయిలో సంగీత దర్శకుడిగా పనిచేసింది ‘మనదేశం’ (’49)లో. ఆ చిత్రానికి పనిచేస్తున్నప్పుడే ‘కీలుగుఱ్ఱం’ (’49) అవకాశమొచ్చింది. అదీ గమ్మత్తుగా! ‘కీలుగుఱ్ఱం’ చిత్రాన్ని మొదట తీయాలనుకున్నది - నిర్మాత, దర్శకుడైన మీర్జాపురం రాజా కాదు. ముందుగా పెదపవని జమీందార్ ఈ సినిమాను ప్రారంభించారు. అప్పటికి ఆ చిత్రానికి సంగీత దర్శకుడిగా ఘంటసాలను కూడా అనుకోలేదు. అయితే, అవాంతరాలతో ఆ చిత్రం ఆగిపోయింది. పెదపవని వారు మానుకోవడంతో, ఈ ‘కీలుగుఱ్ఱం’ స్క్రిప్టును మీర్జాపురం రాజా వారికి ఇచ్చారు రచయిత తాపీ ధర్మారావు. కృష్ణవేణి తాను నిర్మిస్తున్న ‘మనదేశం’కి సంగీత మిస్తున్న ఘంటసాల పేరు ‘కీలు గుఱ్ఱం’కి సిఫార్సు చేశారు. ‘పెద్ద బడ్జెట్లో తీస్తున్న సినిమా అంటూ మొదట ఆయన తటపటాయించారు. అయితే, కృష్ణవేణి అంతగా చెప్పడంతో ఘంట సాలతో ముందుగా 2 పాటలకు సంగీతం కట్టించి చూద్దామనుకున్నారు. అవి అద్భుతంగా ఉండడంతో, ఆయననే ‘కీలుగుఱ్ఱం’కి మ్యూజిక్ డెరైక్టర్‌ను చేసేశారు. ఇక అక్కడ నుంచి సంగీత దర్శకుడిగా ఘంటసాల వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పని రాలేదు. అలా ‘లక్ష్మమ్మ’ సమయంలోనే నమ్మకం కుదిరి, ‘మనదేశం’లో పూర్తి బాధ్యతలిచ్చి, ఆయనను సంగీత దర్శకుడిగా పరిచయం చేసిన ఘనత కృష్ణవేణిది.గాయకుడిగా ఆయన తెలుగు పాటల్లో నాకు నచ్చినవి చాలానే ఉన్నాయి. ఆ కథ మరోసారి. కెరీర్ తొలి రోజుల్లో ఘంటసాల తమిళ గీతాలు పాడినా, అవన్నీ ఆయన కంఠం పరిపక్వత చెందక ముందువి. నాకు తెలిసి ఆయన హిందీలో పాడిన ఒకే పాట - తమిళ ‘రత్నతిలకం’కి హిందీ అనువాదమైన ‘ఝండా ఊంఛా రహే హమారా’(’64)లోని టైటిల్ సాంగ్. ఘంటసాల ప్రైవేట్ రికార్డులూ ప్రసిద్ధమే. జాషువా, కరుణశ్రీ, ప్రసాదరాయ కులపతి లాంటి ప్రసిద్ధుల పద్యాలు ఆయన గ్రావ్‌ుఫోన్ రికార్డులుగా ఇచ్చారు. ఆ రికార్డుల్లో ముందు వచ్చే వచనం ఘంటసాల స్వయంగా రాసుకొన్నదే. రేడియో నాటిక ‘లైలా మజ్ను’ కోసం రజనీ రాసి, సంగీతం కూర్చిన 2 పాటల్ని రేడియోలో ఘంటసాల పాడారు. ఆ తర్వాత ‘మజ్ను విలాపము’, ‘లైలా విశ్వరూపము’ పేరుతో రికార్డులుగా ఇచ్చారు. ఘంటసాల తెరపై కనిపించిన చిత్రమంటే చాలామంది ‘శ్రీవేంకటేశ్వర మాహాత్మ్యం’ (’60)లో ‘శేషశైలావాస..’ పాట చెబుతారు. కానీ, అంతకన్నా ముందే ‘యోగి వేమన’ (’47)లో ఎం.వి. రాజమ్మ నర్తించే ‘ఆపరాని తాపమాయెరా...’ జావళీలో చేతిలో తాళాలు పట్టుకొని జతులు వేస్తూ, అంటూ కనిపిస్తారు ఘంటసాల. అంతకు ముందు ‘త్యాగయ్య’ (’46)లో శిష్యబృందంలోనూ ఆయన ఉన్నారంటారు. నాకు పోలిక తెలియలేదు. సంగీత దర్శకుడిగా ఘంటసాల బాణీలో ప్రత్యేకత ఉంది. శాస్త్రీయ, జానపద, ప్రేమగీతాలలో వేటికి బాణీ కట్టినా ఆ పాటలకు నోటికి సులభంగా పట్టుబడే సుగుణం ఆయన విలక్షణత. ఘంటసాల బాణీల్లో వినిపించే ‘వాల్మీకి’లోని ‘జలల జలల జలధార...’, ‘శకుంతల’లో ‘...సుధలు కురియు సుమసీమ’ అంటూ వచ్చే పాట శుద్ధ మలయమారుత రాగంలో అలరిస్తాయి. శాస్త్రీయ స్వరాల వ్యవహారం ఎక్కువగా వినిపించే పెండ్యాల పాటలంత బాగానూ ఉంటాయి. ఘంటసాల గాయకుడిగా, సంగీత దర్శకుడిగా ఇవాళ్టికీ అజరామరమైంది అందుకే. మరొక్క మాట - ఘంటసాల గురించి వచ్చిన మొట్టమొదటి పుస్తకం ‘భువనవిజయం’. దాన్ని ప్రచురించింది నేను. ముఖపత్రం బాపూది. ముప్పాతిక శ్రమ ఘంటసాల సావిత్రమ్మ గారిది. ఒక వీసం పి.ఎస్. గోపాలకృష్ణది. పేరు నాది! నాకంటే అదృష్టవంతుడు ఎవరు! సంభాషణ: రెంటాల జయదేవ -
రేపు విజయవాడలో ఘంటసాల జయంత్యుత్సవాలు
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 4న పద్మశ్రీ పురస్కార గ్రహీత ఘంటసాల వెంకటేశ్వరరావు 92వ జయంతి ఉత్సవాలను పెద్ద ఎత్తున నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు శశిబాబు కనపాల తెలిపారు. విజయవాడలోని ఘంటసాల వెంకటేశ్వరరావు ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాల ప్రాంగణంలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నామని చెప్పారు. కాకినాడకు చెందిన ఎ. శివప్రసాద్‌చే ఘంటసాల వారి మధుర గీతాలాపన జరుగుతుందని తెలిపారు. సాయంత్రం మాస్టర్ టి. శరత్చంద్ర ఆధ్వర్యంలో ఘంటసాల స్వరామృతధార కార్యక్రమం ఉంటుందన్నారు. -
సల్మాన్, షారుక్‌లకు ఎక్కువగా డబ్బింగ్ చెప్పా
ఘంటసాల.. ఆ పేరు వినగానే మధురమైన గాత్రం మనకు గుర్తుకు వస్తుంది. వేలాది సినీ గీతాలు పాడి తెలుగు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన దివంగత ఘంటసాల వెంకటేశ్వరరావు తనయుడు రత్నకుమార్ డబ్బింగ్ విభాగంలో తనకంటూ ఓ ముద్ర వేసుకున్నారు. ఇప్పటికే మాటల రచయితగా మారిన ఈయన త్వరలో దర్శకత్వం వహిస్తానని చెప్పారు. రాజమండ్రిలో ఘంటసాల విగ్రహావిష్కరణకు వచ్చిన ఆయన సోమవారం అమలాపురంలోని ప్రముఖ సాహితీవేత్త, సినీ విమర్శకుడు పైడిపాల నివాసానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన ‘న్యూస్‌లైన్’తో మాట్లాడారు. ప్ర : మీ కుటుంబం గురించి చెప్పండి ? జ : ఘంటసాల వెంకటేశ్వరరావు దంపతులకు మేము ఆరుగురు సంతానం. ముగ్గురు కుమారులు,ముగ్గురు కుమార్తెలు. నేను రెండో వాడిని. మాలో నేను తప్ప మిగిలిన వారెవరూ సినీ రంగంలో అడుగుపెట్టలేదు. ప్ర: ఘంటసాల వారసత్వంగా నేపథ్యగానం వైపు రాకుండా డబ్బింగ్ వైపు ఎందుకెళ్లారు? జ: మొదట్లో నాలుగైదు చిత్రాలకు పాటలు పాడాను. పాటలు పాడేందుకు, డబ్బింగ్‌కు గాత్రం ఒక్కటే. ఆ తరువాత అనువాద విభాగంలోనే ఎక్కువ అవకాశాలు వచ్చాయి. ఇక వారసత్వం అంటారా... నా కుమార్తె వీణ తాత వారసత్వాన్ని అందిపుచ్చుకుంది. తెలుగులో అందాల రాక్షసి, తమిళంలో ఉరుం చిత్రాల్లో నేపథ్య గాయనిగా మంచి పేరు తెచ్చుకుంది. ఇంకా కొన్ని సినిమాలకు పాడుతోంది. ప్ర: ఇండస్ట్రీలో మీ అనుభవం ? జ:. 30 ఏళ్లుగా చిత్ర పరిశ్రమలో ఉన్నాను. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, సంస్కృత భాషల్లో 1090 సినిమాలకు డబ్బింగ్ చెప్పాను. హీరోలు అర్జున్, కార్తీక్, అరవిందస్వామి, సల్మాన్‌ఖాన్, షారుక్‌ఖాన్‌లకు ఎక్కువ డబ్బింగ్ చెప్పాను. ప్ర: డబ్బింగ్ గురించి ... ? జ : డబ్బింగ్ చెప్పడం చాలా కష్టమైన కళ. గాత్రం ఒక్కటే ప్రధానం కాదు. నటుల హావభావాలు, సన్నివేశానికి అనుగుణంగా భావాన్ని పలికించాలి. నటులకు, సాంకేతిక నిపుణులకు వస్తున్న గుర్తింపు డబ్బింగ్ అరిస్టులకు రావడంలేదు. ఈ రంగంలో నాకంటూ ఓ గుర్తింపు వచ్చింది. డబ్బింగ్ ఆర్టిస్టులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నంది అవార్డు అందుకున్నాను. జెమినీ టీవీలో విశ్వదర్శనం సీరియల్ యాంకర్‌గా పనిచేశాను. తమిళనాడు, కర్నాటక మూవీ అసోసియేషన్లు కళై శైవం, కురల్ సెల్వం బిరుదులతో సత్కరించాయి. ప్ర: ఇప్పుడు వస్తున్న మార్పుల గురించి ? జ: ఇండస్ట్రీలో ఇటీవల మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త కొత్త ధోరణులు వస్తున్నాయి. తెలుగు డబ్బింగ్‌కు కూడా తమిళం వాళ్లను తీసుకు వస్తున్నారు. తమిళం వాళ్లు తెలుగు వాళ్లను తీసుకు వస్తున్నారన్నారు. ప్ర: మాటల రచయితగా మారడం వెనుక కారణం? జ: ఇండస్ట్రీలో 200 మంది వరకు డబ్బింగ్ ఆర్టిస్టులు ఉన్నారు. కొత్తవారికి అవకాశమివ్వాలనుకున్నాను. అందుకే మాటల రచయితగా అటువైపు అడుగులు వేశాను. ఇప్పటికే 35 సినిమాలకు మాటలను అందించా. వాటిలో ఆట ఆరంభం, వీరుడొక్కడే, అంబేద్కర్ సినిమాలున్నాయి. ప్ర: మరి మీ వారసులు..? జ: అనువాదంలో నా వారసులుగా శశాంక్ వెన్నెలకంటి, వాసులతో పాటు మరికొందరిని డబ్బింగ్ ఆర్టిస్టులుగా తీర్చిదిద్దాను. వారికి అవసరమైన సలహాలు, సూచనలు ఎప్పటికీ ఇస్తాను. ప్ర: మీ ఆశయం ? జ : ఎప్పటికైనా సినిమా దర్శకుడుగా మారాలని. ఇప్పటికే ఇందుకోసం కథ, డైలాగులు, మాటలు, పాటలు సిద్ధం చేసుకుంటున్నారు. మంచి నిర్మాత దొరికితే త్వరలోనే తీస్తా. -
గానశాల: ఘంటశాల వర్థంతి నేడు