ఘంటసాల గాయకుడే కాదు మానవతా వాది, స్వాతంత్య్ర సమరయోథులని ఎన్‌ఆర్‌ఐలు కొనియాడారు. ఫిబ్రవరి 11న ఘంటసాల వర్ధంతి సందర్భంగా అమెరికాలో ఘంటసాల వర్ధంతి కార్యక్రమాలు జరిగాయి. ఘంటసాల సంగీత కళాశాల ఇంటర్నేషనల్ (GSKI) న్యూజెర్సీ ఆధ్వర్యంలో అన్నా మధుసూదనరావు అద్యక్షతన ఫిభ్రవరి 11న స్థానిక సంగం చెట్టినాడ్ రెష్టారెంట్‌లో ఈ కార్యక్రమం జరిగింది.
సాయిదత్తపీఠం శివ విష్ను టెంపుల్ ఛైర్మన్ రఘుశర్మ శంకరమంచి వేదమంత్రాల ఉచ్ఛారణ తో జ్యోతి వెలిగించి ప్రార్థనాగీతాలతో సభను ప్రారంభించారు. అనంతరం రవి మరింగంటి, రాజ రాజేశ్వరి కలగా, కృష్ణ కీర్తి ,హర్ష శిష్టా, దీప్తి,లాస్య, శ్రీకన్, జీఎస్‌కే సభ్యులు భక్తిగీతాలాపనలతో ఘంటసాలపై తమ అభిమానాన్ని వ్యక్తం చేశారు.
జీఎస్‌కేఐ న్యూ జెర్సీ అడ్వైజర్స్ రఘు శర్మ శంకరమంచి, న్యూజెర్సీ మాజీ అసెంబ్లీ సభ్యులు ఉపేంద్ర చివుకుల ప్రత్యేకంగా ఈ సభలో పాల్గొని సభికులకు తమ సంస్థ గురించి తెలియజేశారు. GSKI హ్యూస్టన్ సభ్యుడు రవి మరింగంటి ఆధ్వర్యంలో ఈ సభ విజయవంతంగా జరిగింది.
ఈ వేడుకలకు ప్రత్యేక అతిథులుగా విచ్చేసిన తెలుగు భవనం శ్రీరాజ్ పసల, తెలంగాణ అసోసియేషన్ గ్రేటర్ హ్యూస్టన్ ఆధ్యక్షులు నారాయణ్ రెడ్డి, ఆశా జ్యోతి దేవకి, రాంబాబు కట్టా తదితరులు GSKI చేస్తున్న కార్యక్రమాలను ప్రశంసించారు. ఘంటసాల వర్ధంతిని శ్రద్దతో నిర్వహించడానికి తోడ్పడిన ప్రతి ఒక్కరికీ GSKI ప్రెసిడెంట్ అన్నా మధు, రవి మరింగంటి కృతఙ్ఞతలు తెలియజేశారు. ‘తెలుగు భాషకు వరం.. ఘంటసాల స్వరం’ అన్న నినాదంతో ముందుకు సాగుతూ.. తెలుగు భాషను ముందు తరాలకు పదిలంగా అందించడమే తమ లక్ష్యమని GSKI సభ్యులు తెలియజేశారు.
Comments
Please login to add a commentAdd a comment