
ఘంటసాల చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న మంత్రి శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు అమర్‌నాథ్, నాగిరెడ్డి, మేయర్ వెంకట కుమారి, జెడ్పీ చైర్‌పర్సన్ సుభద్ర తదితరులు
మహారాణిపేట (విశాఖ దక్షిణ): అమర గాయకుడు పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు సరస్వతీ పుత్రుడని, తన అమృత గానంతో శ్రోతలను మంత్రముగ్ధులను చేశారని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు కొనియాడారు. ఘంటసాల కుటుంబ సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. ఘంటసాల శత జయంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం తరఫున వీఎంఆర్‌డీఎ చిల్డ్రన్స్ ఎరీనాలో శనివారం నిర్వహించారు.
ఈ సందర్భంగా తపాలా శాఖ పోస్టల్ కవర్ విడుదల చేయగా.. మంత్రి ఆవిష్కరించారు. ఘంటసాలపై రచించిన రెండు పుస్తకాలను కూడా ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గుడివాడ అమర్‌నాథ్, తిప్పల నాగిరెడ్డి, నెడ్‌క్యాప్ చైర్మన్ కె.కె.రాజు, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మల్లికార్జున, మేయర్ గొలగాని హరి వెంకటకుమారి, జిల్లా పరిషత్ చైరపర్సన్ జె.సుభద్ర, రాష్ట్ర సృజనాత్మక, సాంస్కృతిక సమితి చైర్‌పర్సన్ వంగపండు ఉష తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment