Department of Tourism
-
పర్యాటక ప్రాంతాలుగా తీర్చి దిద్దుతాం
సాక్షి, హైదరాబాద్: మూసీనది పరీవాహక ప్రాంతంలో చారిత్రక భవనాలను పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దుతామని సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు. హైదరాబాద్ సంస్కృతిని ప్రతిబింబించే కట్టడాల పరిరక్షణకు ముందుకురావాలని ఆయన పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలతోపాటు పర్యాటక రంగాన్ని కూడా ముందుకు తీసుకెళుతోందని తెలిపారు. హైదరాబాద్‌లోని పలు పురాతన మెట్ల బావుల పునరుద్ధరణకు సీఐఐ(కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ)తో రాష్ట్ర పర్యాటక శాఖ శుక్రవారం ఒప్పందం చేసుకుంది.ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ మూసీ ప్రక్షాళనను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందన్నారు. ప్రస్తుతం పాత అసెంబ్లీ భవనాన్ని పునరుద్ధరిస్తున్నామని, త్వరలోనే అందులో శాసనమండలి ఏర్పాటు చేస్తామని చెప్పారు. ప్రస్తుతం శాసనమండలి ఉన్న జూబ్లీహాలుకు చారిత్రక ప్రాధాన్యం ఉందని, ప్రత్యేక టెక్నాలజీతో ఆ భవనాన్ని నిర్మించారని, భవిష్యత్‌లో దాన్ని పరిరక్షించాల్సిన అవసరముందన్నారు. జూబ్లీహాలును కూడా దత్తత తీసుకొని పరిరక్షించాలని ఆయన సీఐఐకి సూచించారు.ఉస్మానియా ఆస్పత్రి భవనాన్ని పరిరక్షిస్తామని, ఉస్మానియా ఆస్పత్రిని గోషామహల్ స్టేడియానికి తరలిస్తున్నట్టు సీఎం ప్రకటించారు. హైకోర్టు భవనం, హైదరాబాద్ సిటీ కాలేజ్ భవనంతో పాటు పురానాపూల్ బ్రిడ్జి వంటి కట్టడాలను కూడా పరిరక్షిస్తామని, ఇప్పటికే చారి్మనార్ పరిరక్షణ ప్రాజెక్ట్ కొనసాగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, టూరిజం ప్రిన్సిపల్ సెక్రటరీ వాణీప్రసాద్, సీఐఐ తెలంగాణ చైర్మన్ సాయిప్రసాద్, ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి అజిత్‌రెడ్డి, సీఎం ఓఎస్డీ వేముల శ్రీనివాసులు పాల్గొన్నారు. పురాతన మెట్ల బావులను దత్తత తీసుకున్న పారిశ్రామికవేత్తలు ⇒ నగరంలో పురాతన మెట్ల బావులను పునరుద్ధరించి పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దడానికి పలువురు పారిశ్రామికవేత్తలు ముందుకొచ్చారు. ఈ మేరకు సీఎం రేవంత్‌కు వారు ఒప్పందపత్రాలు అందజేశారు. ⇒ ఉస్మానియా యూనివర్సిటీలోని మహాలఖా మెట్ల బావి పునరుద్ధరణకు ఇన్ఫోసిస్ సంస్థ ఒప్పందం చేసుకుంది. ⇒ సాయిలైఫ్ సంస్థ మంచిరేవుల మెట్ల బావిని దత్తత తీసుకుంది. ⇒ భారత్ బయోటెక్ సంస్థ సాలార్ జంగ్, అమ్మపల్లి బావులను పునరుద్ధరించనున్నది. ⇒ అడిక్‌మెట్ మెట్ల బావిని దొడ్ల డెయిరీ, ఫలక్‌నుమా బావిని ఆరీ్టసీ, రెసిడెన్సీ మెట్ల బావిని కోఠి ఉమెన్స్ కాలేజీ పునరుద్ధరించనుంది. -
బొర్రా గుహలకు మహర్దశ
అనంతగిరి (అల్లూరి సీతారామరాజు జిల్లా): విశ్వఖ్యాతి పొందిన బొర్రా గుహలను అతి సుందరంగా తీర్చిదిద్దాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పించింది. అందుకోసం రూ. 29.88 కోట్లను మంజూరు చేసింది. గురువారం ఈ పనులకు ప్రధాని మోదీ జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్‌నుంచి వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. కాగా, 1807లో విలియం కింగ్ గుర్తించిన ఈ గుహల్లో సున్నపురాయి ఖనిజంతో ఏర్పాటయిన మానవమెదడు, శివలింగం, డైనోసార్, మొసలి, శివపార్వతి, తల్లీబిడ్డ, రుషి, సాయిబాబా, తేనెపట్టులాంటి వివిధ ఆకృతులు చూపరులను కనువిందు చేస్తున్నాయి. 1995 ముందు వరకు స్థానిక గిరిజనులు కాగడాలతో బొర్రాగుహలను నిర్వహించేవారు. తరువాత పర్యాటకశాఖ విద్యుత్ సౌకర్యం కల్పించి, లైట్లను ఏర్పాటు చేసింది. స్థానిక గిరిజనులకు టికెట్‌పై కమిషన్ ఇచ్చి నడిపేవారు. 2000 నుంచి పర్యాటకశాఖ నిర్వహిస్తోంది. వచ్చే ఆదాయంలో కొంతమేర గుహల అభివృద్ధికి కేటాయించింది. మూడు విభాగాల్లో.. కేంద్ర ప్రభుత్వం స్వదేశీ సందర్శన్ పథకంలో భాగంగా మంజూరు చేసిన రూ.29.88 కోట్లతో మూడు విభాగాల్లో అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. మొదటి విభాగంలో రైల్వేస్టేషన్ నుంచి కొండప్రాంతంలోని పార్కింగ్ ప్రదేశం వరకు రోడ్డుమార్గంలోని దారిపొడవునా వీధి లైట్లు ఏర్పాటు చేస్తారు. పార్కింగ్ ప్రదేశాన్ని సుందరంగా అభివృద్ధి చేయడంతో పాటుగా పచ్చదనంతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతారు. రెండో విభాగంలో బొర్రాగుహలు ముఖద్వారం వద్ద తాత్కాలికంగా షాపింగ్ స్ట్రీట్ ఏర్పాటు చేస్తారు. మూడో విభాగంలో బొర్రా ముఖద్వారం వద్ద పర్యాటకుల సౌకర్యార్థం క్యాష్ లెస్ టికెట్ విధానంలో అమలు చేస్తారు. సందర్శన టికెట్లు ఆన్లైన్, పేటీఎం ద్వారా బుక్ చేసుకునే సౌకర్యం ఉంటుంది. ఇప్పటివరకు బొర్రా గుహల్లో 40 వరకు బెల్జియం లైట్లు ఉండగా, మరో 60 అదనంగా ఏర్పాటు చేయనున్నారు. పర్యాటకశాఖ ఈఈ రమణ మాట్లాడుతూ బొర్రాగుహల అభివృద్ధి పనులకు సంబంధించి, టెండర్ పూర్తి కాగానే పనులు మొదలు పెడతామని చెప్పారు. -
ఆలయ దర్శనం.. ఆధ్యాత్మిక పరవశం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఆధ్యాత్మిక పర్యాటకం అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దేవదాయ, పర్యాటక శాఖ సంయుక్తంగా భక్తులకు వ్యయప్రయాసలు లేనివిధంగా ఆలయ దర్శనాలు కల్పించనుంది. ఇందులో భాగంగా తొలి దశలో 20 ప్రముఖ, చారిత్రక ఆలయాలను అనుసంధానం చేస్తూ 18 సర్క్యూట్లను రూపొందించింది. స్పెషల్ దర్శనంతో పాటు భోజన, వసతి, రవాణా సౌకర్యాలతో కూడిన ఒకటి/రెండు రోజుల ప్రత్యేక టూర్ ప్యాకేజీలను అందుబాటులోకి తెస్తోంది. పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా, దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ వేర్వేరుగా ఆధ్యాత్మిక సర్క్యూట్ల ప్రయాణాలను గురువారం లాంఛనంగా ప్రారంభించనున్నారు. నచ్చిన ప్యాకేజీల్లో నిత్య దర్శనం పిల్గ్రిమ్ పాత్‌వేస్‌కు చెందిన ‘బుక్ మై దర్శన్’ వెబ్సైట్ ద్వారా ఏపీటీడీసీ ప్రత్యేక ప్యాకేజీలను నిర్వహించనుంది. గతంలో సీజన్ల వారీగా నడిచే ప్యాకేజీ టూర్లను ఇకపై నిత్యం ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. ఇందులో సాధారణ ప్యాకేజీలో పాటు కో బ్రాండింగ్ ఏజెన్సీ అయిన బుక్ మై దర్శన్ ద్వారా భక్తులు కోరుకున్న (కస్టమైజ్డ్ సర్వీసు) ఆలయాల దర్శనాలకు, పర్యటనలకు, గైడ్, భోజన వసతుల (బ్యాకెండ్ సర్వీసుల)ను కల్పిస్తోంది. ఏపీటీడీసీ బస్సులతో పాటు.. ప్రస్తుతం రాష్ట్రంలో ఏపీటీడీసీకి చెందిన 21 బస్సులు, మరో రెండు వాహనాలు పర్యాటక సేవలు అందిస్తున్నాయి. వీటిలో 15 బస్సులు తిరుపతిలో, మరో 8 వాహనాలు విశాఖపట్నంలో నడుస్తున్నాయి. తాజాగా ఆధ్యాత్మిక సర్క్యూట్లను నిర్వహించేందుకు ట్రాన్స్‌పోర్టు, మార్కెటింగ్ సేవలను ‘బుక్ మై దర్శన్’ అందించేలా అగ్రిమెంట్ చేసుకుంది. ప్రస్తుత ప్యాకేజీల ద్వారా రోజుకు 1,500 నుంచి 2వేల మంది వరకు మాత్రమే పర్యాటకులు నమోదవుతున్నారు. ఈ సంఖ్యను 5వేల వరకు పెంచాలని ఏపీటీడీసీ యోచిస్తోంది. అందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా సర్వీసులను పెంచుతోంది. తొలి దశల్లో 18 సర్క్యూట్లను ప్రతిపాదించగా.. రెండో దశలో మరో 7 సర్క్యూట్లను తీసుకురానుంది. తిరుపతిలో బ్యాక్ ఎండ్ సర్వీసుల కింద ప్రతి పర్యాటకుడికి ఆర్ఎఫ్ఐబీ ట్యాగ్లు వేసి పక్కాగా దర్శనం కల్పించేలా సాంకేతిక వ్యవస్థను వినియోగించనుంది. ఒక రోజు ప్యాకేజీ ధరలు ఇలా (పెద్దలు/చిన్నారులు) ♦ విజయవాడ, అమరావతి, మంగళగిరి, పొన్నూరు, బాపట్ల, సూర్యలంక బీచ్ (రూ.970/రూ.780) ♦ హైదరాబాద్, శ్రీశైలం (రూ.1,960/రూ.1,570) ♦ కర్నూలు, శ్రీశైలం (రూ.1,560/రూ.1,250) ♦ విశాఖపట్నం సిటీ టూర్ (రూ.940/రూ.750) ♦ కర్నూలు, మంత్రాలయం (రూ.1,320/రూ.1,060) ♦ విశాఖపట్నం, అరసవల్లి, శ్రీకాకుళం, రామబాణం (రూ.1,650/రూ.1,320) ♦ విజయవాడ, అమరావతి, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామం, పిఠాపురం (రూ.1,470/రూ.1,180) ♦ విశాఖపట్నం, అరసవల్లి, శ్రీకూర్మం (రూ.1,560/రూ.1,250) ♦ రాజమహేంద్రవరం, ద్రాక్షారామం, పిఠాపురం, అన్నవరం(రూ.1,470/రూ.1,180) ♦ విజయవాడ, ద్వారకా తిరుమల, మద్ది ఆంజనేయస్వామి (రూ.1,610/రూ.1,290) ♦కడప, గండి, కదిరి, లేపాక్షి (రూ.1,840/1,470) 2 రోజుల ప్యాకేజీల ధరలు ఇలా ♦ కర్నూలు, అహోబిలం, మహానంది, శ్రీశైలం (రూ.4,020/రూ.3,220) ♦ విజయవాడ, గుంటూరు, శ్రీశైలం, త్రిపురాంతకం, కోటప్పకొండ (రూ.3,220/రూ.2,560) ♦ కర్నూలు, యాగంటి, మహానంది, శ్రీశైలం (రూ.4,020/రూ.3,220) ♦ విజయవాడ, శ్రీశైలం, యాగంటి, మహానంది (రూ.4,670/రూ.3,740) ♦ విశాఖపట్నం, అరకు (రూ.3,070/రూ.2,460) ♦ కడప, అహోబిలం, మహానంది, శ్రీశైలం (రూ.4,460/రూ.3,570) ♦ కడప, యాగంటి, మహానంది, శ్రీశైలం (రూ.4,520/రూ.3,610) -
నీటిలో ఆటలు.. ‘టూరిజం’ కళ్లకు గంతలు.!
సాక్షి, విశాఖపట్నం :అనుమతులు లేవు. అయినా ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఐదేళ్లగా పైగా సాగరతీరంలో స్పీడ్ బోట్లు నడిపించేశారు. స్కూబా డైవింగ్ చేయించేశారు. అయినా టూరిజం శాఖ అధికారులకు గానీ, సిబ్బందికి గానీ ఈ విషయం తెలీదంట. వాటర్ స్పోర్ట్స్ పేరుతో ప్రభుత్వానికి రూపాయి చెల్లించకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరించారు ఉత్తర ప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తి. ఇప్పటికే స్పీడ్ బోట్ల నిర్వహణ ఒప్పందాన్ని కుదర్చుకున్న ఓ సంస్థ అండతోనే టూరిజం కళ్లుగప్పి నిర్వహించినట్లు తెలుస్తోంది. వాటర్‌స్పోర్ట్స్‌లో నడుస్తున్న దందా గురించి ఆలస్యంగా తెలుసుకున్న టూరిజం శాఖ ఉన్నతాధికారులు క్రిమినల్ కేసు నమోదు చేసేందుకు సిద్ధమవుతున్నారు. వాటర్ స్పోర్ట్స్‌కు కేంద్రబిందువుగా రుషికొండ తీరం మారింది. ప్రతిరోజూ వంద మందికి పైగా పర్యాటకులు స్పీడ్‌బోట్స్, స్కూబా డైవింగ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ వీటి నిర్వహణ బాధ్యతలను ప్రభుత్వం రెండు సంస్థలకు మాత్రమే అప్పగించింది. వీటితో పాటు టూరిజం శాఖకు చెందిన స్పీడ్ బోట్స్ కూడా ఇక్కడ కార్యకలాపాలు నిర్వహిస్తూ.. పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. అయితే ఐదేళ్ల క్రితం ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తి వాటర్‌స్పోర్ట్స్ నిర్వహణ ప్రారంభించాడు. ఎలాంటి అనుమతులు తీసుకోకుండా స్పీడ్ బోట్స్, స్కూబాడైవింగ్ ఇలా ఇష్టం వచ్చినట్లు వాటర్ స్పోర్ట్స్ నిర్వహిస్తూ రూ.లక్షల్లో ఆర్జించాడు. కానీ పర్యాటక శాఖకు ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు. తెలిసినా తెలియనట్లు.. ఈ గుర్తింపు లేని వాటర్‌స్పోర్ట్స్ వ్యవహారాన్ని ఏపీటీడీసీ డివిజనల్ స్థాయి అధికారులు, సిబ్బంది మూడేళ్ల క్రితమే గుర్తించారు. అయినా తమకేమీ తెలీదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. దాదాపు దశాబ్ద కాలం క్రితం ఇక్కడ వాటర్ స్పోర్ట్స్ నిర్వహించేందుకు ఒక సంస్థ పర్యాటక శాఖ నుంచి అనుమతులు తీసుకుంది. సదరు సంస్థకు చెందిన వ్యక్తి ద్వారా రుషికొండ బీచ్‌లోకి ఉత్తర ప్రదేశ్‌కు చెందిన అనుమతిలేని వ్యక్తి ప్రవేశించినట్లు తెలుస్తోంది. చెల్లింపులు సైతం సదరు సంస్థకే అందజేస్తున్నారని వాటిలో కొంత భాగం డివిజనల్ కార్యాలయానికి చెందిన కొందరికి ముడుపులు ఇస్తున్నట్లు సమాచారం. ఆలస్యంగా ఉన్నతాధికారుల దృష్టికి.. ఇటీవల పర్యాటక శాఖ ఉన్నతాధికారులు రుషికొండలో జరుగుతున్న వాటర్‌స్పోర్ట్స్ వ్యవహారాలపై సమీక్ష నిర్వహించారు. మరో సంస్థ స్కూబా డైవింగ్ నిర్వహించేందుకు అనుమతులు కోసం దరఖాస్తు చేసుకున్న సమయంలో ఇవన్నీ బయటపడ్డాయి. దీంతో సదరు యూపీకి చెందిన వ్యక్తిని టూరిజం ఉన్నతాధికారులు ప్రశ్నించగా ఇప్పుడెందుకు అడుగుతున్నారు.? ఎప్పటినుంచో ఉంది కదా అంటూ నిర్లక్ష్యంగా సమాధానమిచ్చినట్లు తెలుస్తోంది. దీంతో వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా నడుపుతున్న సంస్థపై కేసు పెట్టాలని డివిజన్ స్థాయి అధికారులను ఆదేశించినట్లు సమాచారం. అయితే ఇంత జరుగుతున్నా తెర వెనుక ఉండి ప్రోత్సహించి తమ లాభాలే తప్ప పర్యాటక శాఖకు రూపాయి కూడా రాకుండా వ్యవహరించిన టూరిజం శాఖ సిబ్బందిని మాత్రం వెనకేసుకొచ్చేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. -
రుషికొండపై నిర్మాణాల నిలుపుదలకు హైకోర్టు నిరాకరణ
సాక్షి, అమరావతి: విశాఖపట్నం రుషికొండపై జరుగుతున్న పర్యాటక శాఖ రిసార్ట్ పునరుద్ధరణ పనులను, నిర్మాణాలను నిలిపివేసేందుకు హైకోర్టు నిరాకరించింది. ఈ విషయంలో ప్రస్తుతం ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేమని స్పష్టం చేసింది. నిర్మాణాలకు సంబంధించి ఉల్లంఘనలను పరిశీలించేందుకు ఏర్పాటైన కేంద్ర ప్రభుత్వ కమిటీ నివేదిక ఇచ్చిన తరువాత ఏం చేయాలో చూస్తామంది. ఉల్లంఘనలు ఏం ఉన్నాయో తాము కమిటీకి చెబుతామన్న పిటిషనర్ అభ్యర్థనను తోసిపుచ్చింది. కమిటీకి మీరు చెప్పాల్సిన అవసరం లేదని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్‌రావు ధర్మాసనం బుధవారం తేల్చిచెప్పింది. రాజకీయ నేతల వ్యాజ్యాలు.. విశాఖ జిల్లా యండాడ గ్రామం సర్వే నంబర్ 19 పరిధిలోని కోస్టల్ రెగ్యులేషన్ జోన్లో చెట్ల నరికివేత, భూమి తవ్వకాలకు అనుమతులు ఇవ్వడం కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ (ఎంఓఈఎఫ్) నిబంధనలు, విశాఖపట్నం పట్టణ ప్రాంతాభివృద్ధి సంస్థ మాస్టర్ ప్లాన్‌కు విరుద్ధమంటూ జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్, ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ గతంలో వ్యాజ్యాలు దాఖలు చేశారు. ఇదే వ్యవహారంలో ఎంపీ రఘురామకృష్ణరాజు ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై సీజే ధర్మాసనం బుధవారం మరోసారి విచారణ జరిపింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తరఫున న్యాయవాది యజ్ఞదత్ స్పందిస్తూ.. ధర్మాసనం గతంలో ఇచ్చిన ఆదేశాల మేరకు హెచ్‌టూవో ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీస్ సలహాదారు గౌరప్పన్ నేతృత్వంలో ఎంఓఈఎఫ్ కమిటీని ఏర్పాటు చేసిందని తెలిపారు. ఈ కమిటీ డిసెంబర్ మొదటి వారంలో రుషికొండ నిర్మాణాలను పరిశీలించి నివేదిక ఇస్తుందని నివేదించారు. ఈ నివేదిక ఆధారంగా కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ తగిన నిర్ణయం తీసుకుంటుందన్నారు. మూర్తి యాదవ్ తరఫున సీనియర్ న్యాయవాది కేఎస్ మూర్తి వాదనలు వినిపిస్తూ.. ఉల్లంఘనలను కమిటీకి వివరించేందుకు అనుమతివ్వాలని కోరగా.. ధర్మాసనం నిరాకరించింది. ఏం ఉల్లంఘనలు ఉన్నాయో కమిటీనే చూసుకుంటుందని, మీరు చెప్పాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది. కమిటీ స్వతంత్రంగా వ్యవహరిస్తుందని స్పష్టం చేసింది. ఇచ్చిన అనుమతులు ఏమిటి? నిర్మాణాలు అందుకు అనుగుణంగా ఉన్నాయా? ఉల్లంఘనలు ఏం ఉన్నాయి? తదితర వివరాలను కమిటీ స్వయంగా చూసుకుంటుందని తెలిపింది. నిర్మాణాలను నిలువరించేందుకు తగిన ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషనర్ కోరగా.. ఈ దశలో ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని ధర్మాసనం చెప్పింది. తదుపరి విచారణను డిసెంబర్ 27కి వాయిదా వేసింది. -
మీరు సుద్దులు చెబితే ఎలా!?
సాక్షి, అమరావతి : విశాఖ అభివృద్ధి అంటే రామోజీరావును ఎక్కడలేని ఆవేశం ఆవహిస్తుంది. అంతేకాదు.. ఆందోళన, ఆవేదన.. అక్కసు కూడా. అందుకే ఈ మధ్య తరచూ ఆయన రాష్ట్ర ప్రభుత్వంపై ఈ విషయంలో ఎక్కడలేని విషం కక్కుతున్నారు. విశాఖలో భూ కబ్జాలంటూ నిత్యం అడ్డగోలు రాతలు రాస్తున్నారు. ప్రభుత్వాన్ని, వైఎస్సార్సీపీ నేతలను టార్గెట్ చేసి మరీ నానా రోత రాతలు రాసిపారేస్తున్నారు. ప్రతిరోజూ ఇలా పచ్చి అబద్ధాలు చెబితే ప్రజలు నమ్మేస్తారన్నది అయన గుడ్డి విశ్వాసం. ‘ఈనాడు’ ఆవిర్భావం నుంచి రామోజీరావు ఎంచుకున్న మార్గం కూడా ఇదే. కానీ, ఇప్పుడు ఆయన అనుకుంటున్న రోజులు కావు కదా.. ఆయన ఒకటంటే సోషల్ మీడియా ఆయన్ను పది అంటూ నగ్నంగా నిలబెడుతోంది. అయినా ఇవేవీ పట్టని ఆయన ఉత్తరాంధ్ర బాగుపడకూడదన్న దురుద్దేశంతో.. నిస్సిగ్గుగా విశాఖపై చెలరేగిపోతున్నారు. తాజాగా.. రుషికొండ మీద పర్యాటక శాఖ కట్టడాలపై రామోజీ బాధ వర్ణనాతీతం. తన ఆత్మబంధువు చంద్రబాబు హయాంలో అడ్డగోలుగా కబ్జాలు జరిగితే నోరెత్తని ఆయన.. ఇప్పుడు అన్ని అనుమతులతో రుషికొండలో పర్యాటక శాఖ నిర్మాణాలు చేస్తుంటే పెడబొబ్బలు పెడుతున్నారు. నిజానికి.. విశాఖలో భూకబ్జాలు చేసిందెవరు? ఆ భూముల్ని కబ్జాదారుల నుంచి కాపాడిందెవరు? రుషికొండపై రామోజీ చేస్తున్న రచ్చలో నిజమెంత? ఒకసారి చూద్దాం.. సీఎం వైఎస్ జగన్ పాలనలో రాష్ట్ర సమగ్రాభివృద్ధి చెందడం రామోజీకి అస్సలు నచ్చడంలేదు. అందులోను కొన్ని దశాబ్దాలుగా వెనుకబాటుకు గురైన ఉత్తరాంధ్ర, విశాఖ నగరాభివృద్ధి అంటేనే ఆయన గుండెలు బాదుకుంటున్నారు. దీంతో ప్రజలను తప్పుదోవ పట్టించడానికి తన విషపత్రికలో అడ్డగోలు కథనాల పరంపరను అచ్చేస్తున్నారు. నిజానికి.. వెనుకబడిన ఉత్తరాంధ్ర అభివృద్ధిపై సమీక్షా సమావేశాలు నిర్వహించడానికి, నిశిత పర్యవేక్షణకు ముఖ్యమంత్రి, ఇతర అధికారులకు క్యాంపు కార్యాలయాలు సహా వసతి ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిటీ ప్రభుత్వానికి తన సిఫార్సులను నివేదించింది. విశాఖ నగరంలోని అనేక ప్రభుత్వ, ప్రైవేటు, ఇతరత్రా భవనాలను పరిశీలించి కమిటీ తమ సిఫార్సులను అందజేసింది. ముఖ్యమంత్రికి భద్రత, పరిపాలనా అవసరాలు, క్యాంపు కార్యాలయం, వసతి ఒకే ప్రాంగణంలో ఉండడం, సరిపడా పార్కింగ్, సమీపంలోనే హెలిపాడ్ తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని రుషికొండ వద్ద నిర్మించిన టూరిజం రిసార్టులు సానుకూలంగా ఉన్నాయని కమిటీ తేల్చింది. పైగా.. ముఖ్యమంత్రి రాకపోకల కారణంగా నగర వాసులకు ఇబ్బందులు రాకుండా, ట్రాఫిక్‌కు ఆటంకం లేకుండా ఉండేందుకు ఈ నిర్ణయానికి వచ్చామని కూడా తెలిపింది. ముగ్గురు సీనియర్ అధికారులు సభ్యులుగా ఉన్న కమిటీ ఇలా నివేదిక ఇచ్చిందో లేదోం రామోజీరావు వెంటనే తన పైత్యానికి పదును పెట్టారు. ‘వేదికపై సుద్దులు..ం తీరంలో ఘోరాలు’ అంటూ గురువారం ఈనాడులో గగ్గోలు పెట్టారు. రుషికొండ వద్ద పర్యాటక శాఖ నిర్మించిన భవనాలు అక్రమమని, నిబంధనలకు విరుద్ధమని తీర్పు కూడా ఇచ్చేశారు. అన్ని అనుమతులతో.. ♦ కేంద్ర ప్రభుత్వ పర్యావరణ శాఖ నుంచి సీఆర్‌జెడ్ అనుమతులు తీసుకుంది.. ♦ ఏపీ కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ అథారిటీ సిఫార్సులు తీసుకోవడంతో పాటు.. నిర్మాణంలో భాగంగా, అనుమతి ఉన్న ప్రాంతంలో చెట్లు తొలగించేందుకు, అంతకుమించి పెద్దసంఖ్యలో కొత్తగా మొక్కలు నాటేందుకు అటవీశాఖ అనుమతి నుంచి అనుమతులు సైతం ఉన్నాయి.. ♦ జీవీఎంసీ నుంచి ఫైర్ సేఫ్టీ క్లియరెన్స్ లభించడంతో పాటు, భవనాల డిజైన్లకు ఆమోదం ఉంది.. ..ఇలా ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కన్సెంట్ ఫర్ ఎస్టాబ్లిష్‌మెంట్‌తో పాటు, చట్ట ప్రకారం నిబంధనలను అనుసరించి అన్ని రకాల అనుమతులతో పర్యాటక శాఖ భవనాలను నిర్మించింది. ♦ ఇక రుషికొండ వద్ద ప్రభుత్వ భూమిలో ప్రస్తుతం నడుస్తున్న ప్రాజెక్టు కోసం ప్రతిపాదించింది కేవలం 3 శాతం మాత్రమే. ♦ 61 ఎకరాల్లో నిర్మాణాలకు అనుమతులుంటే, 9.88 ఎకరాల్లోనే ప్రాజెక్టు కోసం ప్రతిపాదించారు. ఇందులో కూడా భవనాలు కట్టింది కేవలం 1.84 ఎకరాల్లో మాత్రమే.. ♦ అలాగే, ఏడు బ్లాకుల నిర్మాణానికి అనుమతులివ్వగా, కట్టింది నాలుగు బ్లాక్లే.. కట్టడాలు ఈరోజు ప్రారంభించినవేం కాదు.. రుషికొండ మీద కట్టడాలు 1984లోనే ప్రారంభమయ్యాయి. 1989 నాటికి క్రమంగా 12 బ్లాకులు నిర్మించారు. అంటే రుషికొండను తొలిచింది, నిర్మాణాల కోసం అక్కడ చెట్లను నరికివేసింది టీడీపీ ప్రభుత్వమే. సముద్రతీరంలో వాతావరణ పరిస్థితులతో సుమారు నాలుగు దశాబ్దాల క్రితం కట్టిన ఈ భవనాలన్నీ దెబ్బతిన్నాయి. అందుకే ఈ ప్రభుత్వం వాటిని తీసివేసి కొత్తగా రిసార్టులను నిర్మించింది. మరి 1984లో కట్టిన నిర్మాణాలతో పర్యావరణానికి ఎలాంటి ఇబ్బంది లేదా? అప్పుడు రుషికొండను తవ్వి, అక్కడున్న చెట్లను నరికి ఈ నిర్మాణాలు చేయలేదా? ఇప్పుడు ప్రశ్నిస్తున్న వాళ్లంతా అప్పుడేమయ్యారు? అంటే టీడీపీ ప్రభుత్వం చేస్తే కరెక్టు, వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేస్తే తప్పు అవుతుందా.. రామోజీ? బాలకృష్ణ వియ్యంకుడి కబ్జాలపై మౌనం.. మరోవైపు.. టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ వియ్యంకుడుగా చంద్రబాబుకు బంధువైన మాజీ ఎంపీ ఎంవీవీఎస్ మూర్తి అడ్డగోలుగా విశాఖలో భూకబ్జాకు పాల్పడితే కనీసం ఒక్క ముక్క వార్త కూడా ఈనాడులో రాయలేదు. ఎందుకంటే ఎంవీవీఎస్ మూర్తి టీడీపీ పెద్దల బంధువు కావడమే. విశాఖ నగరంలో ఎండాడ, రుషికొండ గ్రామాల పరిధిలో అత్యంత విలువైన ప్రాంతంలో ఏకంగా 38.6 ఎకరాల ప్రభుత్వ భూమిని దర్జాగా మూర్తి స్వాహా చేసేశారు. అప్పటి సీఎం చంద్రబాబు సైతం నోరు మెదపలేదు. విశేషం ఏమిటంటే.. ఈ కబ్జా అంతా రుషికొండకు సరిగ్గా ఎదురుగానే.. కానీ, వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఆ కబ్జాలపై ఉక్కుపాదం మోపింది. మొదటి విడతలో 19.39 ఎకరాలను, రెండో విడతలో 4.74 ఎకరాలను స్వాధీనం చేసుకుంది. మొత్తంగా 24.13 ఎకరాలను స్వాధీనం చేసుకుంది. కోర్టు స్టే ఇవ్వడంతో మిగిలిన భూముల స్వాధీన ప్రక్రియకు తాత్కాలికంగా అంతరాయం ఏర్పడింది. ఏ కొండ మీద ఏముంది? ♦ విశాఖ నగరంలో చాలా నిర్మాణాలన్నీ కూడా కొండల మీదే ఉన్నాయి. ఏఏ కొండ మీద ఏమేం ఉన్నాయంటే.. ♦ డాల్ఫిన్ హిల్ మీద పెద్ద సంఖ్యలో నేవీ సిబ్బంది క్వార్టర్లు నిర్మించారు. ఇవి పూర్తిగా కొండవీుదే ఉన్నాయి. ♦ సర్క్యూట్ హౌస్‌గా పిలిచే గవర్నర్ బంగ్లా కూడా కొండ మీదే ఉంది. ♦ ఐటీ హిల్స్ ప్రాంతాన్ని చూస్తే దాదాపు అన్ని భవనాలు కొండల మీదే ఉన్నాయి. మిలీనియం టవర్స్ ఉండేది ఈ కొండవీుదే. ♦ రామానాయుడు స్టూడియోస్ మొత్తం కొండల మీదే ఉంది. ♦ ఇక రుషికొండకు సమీపంలో ఉన్న పెమా వెల్నెస్ సెంటర్ కూడా పూర్తిగా కొండవీుదే నిర్మించారు. రామోజీ.. మీరుండేది కొండ మీదేనని మర్చిపోయారా!? రుషికొండ మీద ఏదో జరిగిపోతోందంటూ గగ్గోలు పెడుతున్న రామోజీరావు నిజానికి ఎక్కడుంటున్నారు? ఆయన కట్టిన ఫిల్‌్మసిటీ ఎక్కడుంది? ఆ ఫిల్మ్ సిటీలో వివిధ నిర్మాణాలు వేటి మీద చేశారు? వీటిని ఒక్కసారి పరిశీలిస్తే గురవింద సామెత గుర్తుకొస్తుంది. రామోజీరావు ఉంటున్న నివాసం పూర్తిగా కొండవీుదే కట్టారు. అవి పర్యావరణ ఉల్లంఘనలు కావా? ఫిల్‌్మసిటీ పేరిట ఈ పెద్ద మనిషి పదుల కొద్దీ అసైన్డ్, సీలింగ్ భూములు కబ్జాచేసిన వ్యవహారాలు మర్చిపోతే ఎలా? ఇక ఫిల్‌్మసిటీ నిర్మాణాలను పరిశీలిస్తే అన్నీ గుట్టల మీద కట్టినవే. కాదంటారా రామోజీ.. రుషికొండలో గీతం కాలేజీ పేరిట చేసిన భూముల కబ్జా ♦ గులాబీరంగులో ఉన్న 19.39 ఎకరాల కబ్జా భూమిని మొదటివిడతగా ఈ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ♦ ఆకుపచ్చ రంగులో 4.74 ఎకరాల కబ్జా భూమిని రెండో విడతగా స్వాధీనం చేసుకుంది. ♦ ఎరుపు రంగు గళ్లతో ఉన్న భూమి ఇంకా కబ్జాలో ఉంది. కబ్జాచేసిన ఈ ప్రభుత్వ భూమిలో నిర్మాణాలను స్పష్టంగా చూడొచ్చు. -
నేడు విశాఖకు గవర్నర్ అబ్దుల్ నజీర్
సాక్షి, విశాఖపట్నం : గవర్నర్ అబ్దుల్ నజీర్ ఐదు రోజుల పర్యటనలో భాగంగా శుక్రవారం విశాఖకు చేరుకోనున్నారు. విశాఖతో పాటు అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు శుక్రవారం సాయంత్రం విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకుని అక్కడి నుంచి నేరుగా పోర్టు గెస్ట్‌హౌస్‌కి వచ్చి రాత్రి బస చేయనున్నారు. శనివారం ఉదయం నోవాటెల్‌లో జరగనున్న సమాచార కమిషనర్ల జాతీయ సమాఖ్య సదస్సులో పాల్గొంటారు. సాయంత్రం ఏయూ స్నాతకోత్సవంలో చాన్సలర్ హోదాలో పాల్గొననున్నారు. ఆదివారం అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యటనలో భాగంగా అరకులోని రైల్వే గెస్ట్ హౌస్‌కు చేరుకోనున్నారు. 11వ తేదీ సాయంత్రం విశాఖలోని తూర్పు నౌకాదళ ప్రధాన స్థావరాన్ని సందర్శిస్తారు. 12న రుషికొండలోని సాయిప్రియా రిసార్ట్‌లో జరిగే జైళ్ల శాఖ జాతీయ సదస్సుకు హాజరుకానున్నారు. మంగళవారం గన్నవరం చేరుకుంటారని రాజ్‌భవన్ వర్గాలు వెల్లడించాయి. -
ఎవరెస్ట్: 53 ఏళ్ల వయసులో విజయవంతంగా 27వసారీ.. తన రికార్డు తానే
కఠ్మాండూ: నేపాల్‌కు చెందిన ప్రఖ్యాత పర్వతారోహకుడు కమీ రీటా షెర్పా మరోమారు ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించి తన గత రికార్డును తానే చెరిపేసి కొత్త రికార్డ్‌ను లిఖించారు. 53 ఏళ్ల రీటా బుధవారం ఉదయం విజయవంతంగా 27వసారీ ఎవరెస్ట్‌ను ఎక్కారని నేపాల్ పర్యాటక శాఖ ప్రకటించింది. దీంతో నూతన ప్రపంచ రికార్డు ఆవిçష్కృతమైంది. గత ఏడాది రీటా 26వసారి ఎవరెస్ట్ పర్వతారోహణ విజయవంతంగా పూర్తిచేసి ప్రపంచ రికార్డును సృష్టించారు. ఆ రికార్డును మూడు రోజుల క్రితం మరో షెర్పా అయిన 46 ఏళ్ల పసంగ్ దవా సమం చేశారు. దీంతో రీటా బుధవారం మరోమారు పర్వతమెక్కి తన పేరిట రికార్డును లిఖించుకున్నారు. ఈయన 1994 మే 13న తొలిసారి ఈ పర్వతశిఖరాన్ని చేరారు. రీటా గతంలోనే ప్రపంచంలోని 8,000 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తున్న పలు శిఖరాలను అధిరోహించారు. సీనియర్ మౌంటేన్ గౌడ్‌గా పనిచేస్తున్నారు. బుధవారంనాటి పర్వతారోహణకు అయిన ఖర్చులను కఠ్మాండూకు చెందిన ఒక వాణిజ్య సాహసయాత్రల నిర్వహణ సంస్థ భరించింది. ఈ స్ప్రింగ్ సీజన్లో ఇప్పటిదాకా మొత్తంగా 478 మందికి ఎవరెస్ట్ ఎక్కేందుకు అనుమతులు వచ్చాయి. -
అలలపై పడవ ప్రయాణం.. సహజ నీరా పానీయం
సాక్షి, హైదరాబాద్: సాగర తీరం మరో ఆతిథ్యానికి సన్నద్ధమైంది. సహజమైన నీరాతో పాటు తెలంగాణ రుచులను అందజేసే నీరా కేఫ్ ప్రారంబో త్సవానికి సర్వం సన్నద్ధమైంది. పర్యాటక, ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ నేతృత్వంలో రూపుదిద్దుకున్న నీరా కేఫ్‌ను ఈ నెల 3వ తేదీన ప్రారంభించనున్నారు. హుస్సేన్‌సాగర్ ఒడ్డున ఏర్పాటు చేసిన నీరాకేఫ్ నగరవాసులకు సరికొత్త అనుభూతినివ్వనుంది. ఇక్కడి నుంచి సాగర్‌లో విహరించేందుకు పర్యాటకశాఖ బోటు షికారును కూడా అందుబాటులోకి తెచ్చింది. పీపుల్స్‌ప్లాజా వైపు వచ్చే సందర్శకులు నీరా సేవనంతో పాటు పడవ ప్రయాణం కూడా చేయవచ్చు. తాటి, ఈత చెట్ల నుంచి లభించే ప్రకృతి సిద్ధమైన నీరా పానీయాన్ని నగరవాసులకు అందించేందుకు ఎక్సైజ్ శాఖ సుమారు రూ.10 కోట్లతో నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్‌ప్లాజా సమీపంలో ఈ కేఫ్‌ను నిర్మించింది. ఆకర్షణీయంగా భవనం.. నీరాభవనం తాటాకుతో చేసిన రేక ఆకృతిలో ఎంతో ఆకర్షణీయంగా నిర్మించారు. పల్లెల్లో తాటి, ఈత కల్లును తాటాకులతో చేసిన రేకలు, మోదుగాకు డొప్ప(దొన్నె)లలో సేవించడానికి ఇష్టపడతారు. ఇలా ఆకుల్లో తాగడం వల్ల పానీయం సహజత్వం ఏ మాత్రం కోల్పోకుండా ఉంటుంది. అలాంటి తాటాకు రేక కప్పినట్టుగా నీరా భవనాన్ని నిర్మించడం విశేషం. తెలంగాణ పల్లెలను తలపిస్తూ అందమైన మ్యూరల్స్, చేతివృత్తులను ప్రతిబింబించే శిల్పాలతో భవనం ప్రాంగణాన్ని రూపొందించారు. ఈ కేఫ్‌లో మొత్తం ఏడు కౌంటర్లను ఏర్పాటు చేశారు. ఒక కౌంటర్‌ను పూర్తిగా నీరా కోసం కేటాయించగా మిగతా ఆరింటిలో వివిధ రకాల ఆహార పదార్ధాలు, ఐస్‌క్రీమ్‌లు, బిర్యానీలు లభిస్తాయి. హుస్సేన్ సాగర్ జలాలను, పోటెత్తే అలలను వీక్షిస్తూ నచ్చిన రుచులను ఆస్వాదించవచ్చు. ఇందుకనుగుణంగా సీటింగ్ సదుపాయం ఉంటుందని పర్యాటకాభివృద్ధి సంస్థ అధికారి ఒకరు తెలిపారు. భవనం మొదటి అంతస్థులో ఉన్న విశాలమైన హాల్లో పుట్టినరోజు, పెళ్లిరోజు వంటి వేడుకలు నిర్వహించుకోవచ్చు. విందులు ఏర్పాటు చేసుకొనే సదుపాయం కూడా ఉంటుంది. ఆరోగ్య ప్రదాయిని.... తాటి, ఈత చెట్ల నుంచి తెల్లవారుజామునే సేకరించే నీరాలోని సహజమైన పోషకవిలువలు ఏ మాత్రం పోకుండా శీతలీకరణ పద్ధతిలో నిల్వ చేసి విక్రయిస్తారు. ఇందుకోసం నీరా భవనంలో ప్రత్యేక శీతలీకరణ యంత్రాలను ఏర్పాటు చేశారు. భువనగిరి సమీపంలోని నందనం, కడ్తాల్ సమీపంలోని ముది్వన్లో ఏర్పాటు చేసిన తాటివనాల్లో నీరా కోసమే ప్రత్యేకంగా పెంచిన తాటి, ఈత చెట్ల నుంచి నీరా సేకరిస్తారు. దాంతోనే అనుబంధ ఉత్పత్తులను కూడా తయారు చేస్తున్నారు. ‘పానీయంలోని స్వచ్ఛతకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా ఉండేందుకు.. తాటి చెట్ల నుంచి నీరాను సేకరించడం మొదలు.. దానిని వినియోగదారులకు చేర్చడంవరకు పూర్తిగా శాస్త్రీయమైన పద్ధతిని పాటిస్తున్నాం’అని నిర్వాహకులు తెలిపారు. నీరాలో శరీరానికి అవసరమైన ప్రోటీన్, ఐరన్, పొటాషియం, కాల్షియం, విటమిన్లు, మినరల్స్ లభిస్తాయి. నీరాతో పాటు తాటి, ఈత చెట్ల నుంచి సేకరించిన నీరా ద్వారా తయారు చేసిన వివిధ రకాల ఉత్పత్తులను కూడా విక్రయించనున్నారు. ఆడ, మగ(పోద్దాడు, పరుపుదాడు) తాటి చెట్ల నుంచి సేకరించే రెండు రకాల తాటి బెల్లం కూడా ఇక్కడ లభించనుంది. ఆహార ఉత్పత్తులు ధర (సుమారుగా) 300 ఎంఎల్ తాటి నీరా రూ. 90 200 ఎంఎల్ తాటి నీరా రూ. 60 తాటిబెల్లం (కిలో) రూ.1000 తాటి చక్కెర (కిలో) రూ. 1050 తాటి బూస్ట్ రూ. 1100 తాటి తేనె (లీటర్) రూ.1200 ఈత బెల్లం (కిలో) రూ.900 ఈత తెనె (లీటర్) రూ.1000 -
భీమిలిలో ఒబెరాయ్ గ్రూపునకు 40 ఎకరాలు కేటాయింపు
తగరపువలస: విశాఖ జిల్లా భీమునిపట్నం మండలం అన్నవరం గ్రామ పంచాయతీ వద్ద రాష్ట్ర పర్యాటక శాఖకు చెందిన 40 ఎకరాల స్థలాన్ని ఒబెరాయ్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి లీజ్ కమ్ రెంట్ ప్రాతిపదికన రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఈ సందర్భంగా ఆ స్థలాన్ని ఆదివారం గ్రూప్ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ) విక్రమ్ ఒబెరాయ్, సంస్థ కార్పొరేట్ వ్యవహారాల ప్రెసిడెంట్ రాజారామన్ శంకర్, ముఖ్య ఆర్థిక నిర్వహణాధికారి కల్లోల్ కుందులతో కలిసి కలెక్టర్ సందర్శించారు. రాబోయే రోజుల్లో విశాఖలో జరగనున్న పలు ప్రభుత్వ ప్రాజెక్టుల గురించి కలెక్టర్ డాక్టర్ ఎ. మల్లికార్జున వారికి వివరించారు. కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక శాఖ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మల్రెడ్డి, విశాఖ పర్యాటక శాఖ రీజినల్ డైరెక్టర్ శ్రీనివాస్ పాణి, భీమిలి ఆర్డీఓ భాస్కరరెడ్డి, తహసీల్దార్ వేణుగోపాల్, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
పర్యాటకంలో సంక్రాంతి సందడి
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా పర్యాటక ప్రాంతాల్లో సంక్రాంతి సందడి నెలకొంది. ఈ ఏడాది పర్యాటక ప్రదేశాలు, శిల్పారామాల్లో సంక్రాంతి సంబరాలకు ఏపీ శిల్పారామం, ఏపీటీడీసీ ఏర్పాట్లు చేశాయి. విశాఖపట్నం, విజయనగరం, కాకినాడ, తిరుపతి, కడప, పులివెందుల, అనంతపురం, పుట్టపర్తి శిల్పారామాల్లో 14 నుంచి 16వ తేదీ వరకు మూడు రోజులపాటు ప్రత్యేకంగా వేడుకలు నిర్వహించనున్నారు. సందర్శకులను అలరించేలా ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రత్యేక కార్యక్రమాలను ప్రదర్శించనున్నారు. మహిళలకు ముగ్గుల పోటీలు, ‘సంక్రాంతి లక్ష్మి’ పేరుతో సంప్రదాయ వస్త్రధారణ పోటీలు నిర్వహించి బహుమతులు అందించనున్నారు. తెలుగు సంస్కృతికి అద్దం పట్టేలా హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల ఆటలు, జానపద, సంప్రదాయ కళారీతుల ప్రదర్శనకు సర్వం సిద్ధంచేశారు. బుల్లితెర హాస్యనటులతో హాస్యవల్లరి, భోజనప్రియులకు నోరూరించేలా పల్లె రుచులతో ఫుడ్ కోర్టులను ఏర్పాటుచేస్తున్నారు. నేటి నుంచి భవానీ ద్వీపంలో.. దేశంలోనే అతిపెద్ద నదీ ద్వీపమైన విజయవాడ భవానీ ఐలాండ్‌లో బుధవారం నుంచి సోమవారం వరకు ఆరు రోజులపాటు ‘సంక్రాంతి ఫెస్ట్’ నిర్వహించనున్నారు. పల్లెటూరి సంప్రదాయ జీవనాన్ని ప్రతిబింబించేలా ఈ ఫెస్ట్‌లో వినూత్న కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. చేతివృత్తి కళాకారుల స్టాల్స్, ఎగ్జిబిషన్‌తోపాటు మహిళలు, చిన్నారులకు ముగ్గులు, వంటల పోటీలు, సంప్రదాయ వస్త్రధారణ, జానపద గీతాలు, డ్రాయింగ్, గాలిపటాల తయారీ పోటీలు నిర్వహించనున్నారు. చిన్నారులకు మన సంస్కృతిలోని సైన్స్ గొప్పదనాన్ని చాటిచెప్పేలా థీమ్స్‌ను రూపొందించారు. పాపికొండల యాత్రకు ఫుల్ డిమాండ్... సంక్రాంతి సందర్భంగా పర్యాటకులు పాపికొండల బోటింగ్‌కు క్యూకడుతున్నారు. ప్రస్తుతం భద్రాచలం వైపున పోచవరం, దేవీపట్నంలోని గండిపోచమ్మ బోటింగ్ పాయింట్ల నుంచి 29 బోట్లు రాకపోకలు సాగిస్తున్నాయి. ఇప్పటికే చాలాబోట్లలో అడ్వాన్స్ బుకింగ్‌లు ఊపందుకున్నాయి. ఆదివారం, సోమవారాల్లో పర్యాటక శాఖ బోట్లు ముందస్తు బుకింగ్‌లతో నిండిపోయాయి. పోచవరం నుంచి పెద్దలకు రూ.950, చిన్నారులకు రూ.750, గండిపోచమ్మ నుంచి పెద్దలకు రూ.1,250, చిన్నారులకు రూ.1,050గా టికెట్ ధర ఉంది. ఇక పర్యాటక శాఖ హోటళ్లు, రిసార్టులు సైతం నిండిపోయాయి. పాపికొండల అందాలు -
జల పర్యాటకం, రవాణాకు పెద్దపీట
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో జల పర్యాటకాన్ని ప్రోత్సహించడంతోపాటు జలరవాణా అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ప్రస్తుతం బోటింగ్ టూరిజాన్ని మెరుగుపరుస్తూనే కొత్త జలవనరుల అన్వేషణకు శ్రీకారం చుట్టింది. ఈ ప్రాజెక్టులో ఆంధ్రప్రదేశ్ పర్యాటక సంస్థ, ఇన్‌ల్యాండ్ వాటర్‌వేస్ అథారిటీ సంయుక్తంగా పనిచేయనున్నాయి. ఇందుకోసం ప్రభుత్వం ప్రత్యేక టాస్క్ఫోర్సు కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ రాష్ట్రవ్యాప్తంగా నీటివనరులు, బీచ్‌లను పరిశీలించి పర్యాటక అభివృద్ధికి అనుకూలమైన ప్రాంతాలను గుర్తిస్తుంది. కొత్త నదీమార్గాల అన్వేషణ రాజమహేంద్రవరం, విజయవాడ, నాగార్జునసాగర్, శ్రీశైలంలో పర్యాటకశాఖ ఎక్కువగా బోటింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. వీటితోపాటు ఇతర ప్రాంతాల్లోను అంతర్గత బోట్ల సామర్థ్యాన్ని పర్యవేక్షిస్తూ బోటింగ్ రక్షణకు పెద్దపీట వేయనుంది. మరోవైపు చిన్నచిన్న బోట్ల దగ్గర నుంచి హౌస్ బోట్లు, క్రూయిజ్లను సైతం నడిపేలా, తీర్థస్థలాలు, వారసత్వ ప్రదేశాలను కలుపుతూ ఉండే నదీమార్గాలను అన్వేషిస్తోంది. 974 కిలోమీటర్ల సుదీర్ఘ తీరప్రాంతం కలిగిన ఏపీలో బీచ్‌లను ప్రముఖ పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దనుంది. ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ కమిటీ ఇలా.. ఈ కమిటీకి ఏపీటీడీసీ ఎండీ చైర్మన్‌గా, ఇన్‌ల్యాండ్ వాటర్‌వేస్ ఈడీ కో–చైర్మన్‌గా, ఏడుగురు సభ్యులతో ప్రభుత్వం ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో ఏపీ టూరిజం అథారిటీ డిప్యూటీ సీఈవో, ఏపీటీడీసీ ఈడీ (ప్రాజెక్ట్స్), జలవనరులశాఖ చీఫ్ ఇంజినీర్, దేవదాయశాఖ జాయింట్ కమిషనర్, ఏపీటీడీసీ వాటర్ ఫ్లీట్ జీఎంలతో పాటు ఏపీటీడీసీ, ఇన్‌ల్యాండ్ వాటర్‌వేస్ నుంచి ఒక్కో నామినేటెడ్ వ్యక్తి సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ ఇతర రాష్ట్రాలతో పాటు బెల్జియం, నెదర్లాండ్స్ వంటి దేశాల్లో పర్యటించి అక్కడి జల పర్యాటకం, రవాణా సౌకర్యాలను పరిశీలిస్తుంది. సమగ్ర నివేదిక ప్రభుత్వానికి సమర్పిస్తుంది. గోదావరి, కృష్ణాలోను.. జలమార్గం చౌకైన రవాణా కావడంతో కేంద్రప్రభుత్వం జలమార్గాల అభివృద్ధిపై దృష్టి సారించింది. దేశంలో 50.1 శాతం రోడ్డు, 36 శాతం రైల్వే, 6 శాతం సముద్ర, 7.5 శాతం పైప్‌లైన్ రవాణా వ్యవస్థలున్నాయి. జలమార్గ రవాణా 0.4 శాతం మాత్రమే ఉంది. దేశవ్యాప్తంగా 680 మైళ్ల పొడవైన జలమార్గం జాతీయ రహదారులను కలుపుతోంది. ఇది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి మీదుగా ప్రయాణిస్తోంది. కోరమాండల్ తీరం వెంబడి కాకినాడ, ఏలూరు, కొమ్మమూరు, బకింగ్‌హామ్ కాలువలున్నాయి. ఏపీలో కృష్ణా, గోదావరి నదులు ఇందులో భాగంగా ఉన్నాయి. ఈ క్రమంలో జల పర్యాటకం, రవాణా ప్రోత్సాహకానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషిచేస్తున్నాయి. -
పర్యాటక ఏపీ.. దేశీయ పర్యాటకులను ఆకర్షించడంలో మూడో ర్యాంకు
సాక్షి, అమరావతి: దేశీయ పర్యాటకులను ఆకర్షించడంలో ఆంధ్రప్రదేశ్ మూడో స్థానం సాధించింది. గత ఏడాది (2021) 9.32 కోట్లకు పైగా దేశీయ పర్యాటకులు రాష్ట్రాన్ని సందర్శించినట్లు కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దేశీయ పర్యాటకులను ఆకర్షించడంలో తమిళనాడు రాష్ట్రం ప్రథమ స్థానంలో నిలిచింది. 2021లో 11.53 కోట్ల మంది తమిళనాడును సందర్శించినట్లు ఆ శాఖ తెలిపింది. ఉత్తరప్రదేశ్ రెండో ర్యాంకులో ఉండగా, కర్ణాటక నాలుగో ర్యాంకు, మహారాష్ట్ర ఐదో ర్యాంకులో ఉన్నాయి. దేశం మొత్తం మీద దేశీయ పర్యాటకుల సందర్శనలో దాదాపు 65.41 శాతం ఈ ఐదు రాష్ట్రాల్లోనే ఉన్నట్లు గణాంకాలు వెల్లడించాయి. దేశీయ పర్యాటకుల్లో తమిళనాడును 17.02 శాతం, ఉత్తరప్రదేశ్‌ను 16.19 శాతం, ఆంధ్రప్రదేశ్‌ను 13.77 శాతం, కర్ణాటకను 12 శాతం, మహారాష్ట్రను 6.43 శాతం మంది సందర్శించినట్లు తెలిపాయి. 2021లో దేశీయ పర్యాటకుల వృద్ధి ఆంధ్రప్రదేశ్‌లో 31.69 శాతంగా గణాంకాలు వెల్లడించాయి. దేశం మొత్తం మీద దేశీయ పర్యాటకుల వృద్ధి 11.05 శాతమే ఉంది. తెలంగాణ రాష్ట్రాన్ని సందర్శించిన వారి సంఖ్య క్షీణించినట్లు నివేదిక స్పష్టం చేసింది. తెలంగాణలో 2021లో దేశీయ పర్యాటకుల్లో వృద్ధి –19.99 శాతంగా ఉందని నివేదిక పేర్కొంది. దేశీయ పర్యాటకులను ఆకర్షిస్తున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ 2019లో కూడా మూడో ర్యాంకులో ఉంది. అయితే 2020లో కోవిడ్ మహమ్మారి కారణంగా నాలుగో ర్యాంకు పొందింది. 2021లో మళ్లీ పుంజుకొని మూడో ర్యాంకులోకి వచ్చింది. 2019 నుంచి 2021 వరకు టాప్ ఐదు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఉంటోంది. 2019లో ఆంధ్రప్రదేశ్‌ను 23.70 కోట్ల మంది దేశీయ పర్యాటకులు సందర్శించారు. కోవిడ్ ఆంక్షలు కారణంగా 2020లో 7.08 కోట్ల మందే వచ్చారు. కోవిడ్ ఆంక్షల కారణంగా దేశవ్యాప్తంగా విదేశీ పర్యాటకుల సంఖ్య 2021లో గణనీయంగా తగ్గిపోయినట్లు పర్యాటక శాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 2020లో దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కలిపి మొత్తం విదేశీ పర్యాటకుల సంఖ్య 7.17 మిలియన్లు ఉండగా 2021లో 1.05 మిలియన్లకు తగ్గిపోయింది. 2020తో పోల్చి చూస్తే 2021లో దేశం మొత్తం మీద విదేశీ పర్యాటకుల సంఖ్య 85.29 శాతం క్షీణించింది. 2019లో ఏపీలో విదేశీ పర్యాటకుల సంఖ్య 0.89 శాతం వృద్ధి ఉండగా కోవిడ్ కారణంగా 2020లో ఏపీలో 70.12 శాతం మేర, 2021లో 59.24 శాతం మేర క్షీణించింది. -
68 ప్రాంతాల్లో పర్యాటక ప్రాజెక్టులు
సాక్షి, విశాఖపట్నం: ప్రకృతి అందాలతో అలరారే రాష్ట్రంలోని ప్రతి ప్రాంతంలో పర్యాటకరంగం కొత్తపుంతలు తొక్కేలా సరికొత్త ఆలోచనలతో పర్యాటకశాఖ ముందుకెళ్తోంది. పెట్టుబడుల రాకకు ప్రధాన అవరోధాలుగా ఉన్న నియమ నిబంధనలు మార్చి కొత్తదారుల్ని అన్వేషించింది. రాష్ట్రవ్యాప్తంగా 68 ప్రాంతాల్లో వాటర్ స్పోర్ట్స్, ట్రెక్కింగ్, అడ్వెంచర్ స్పోర్ట్స్ ప్రాజెక్టులకు ప్రాధాన్యమిచ్చేందుకు నిబంధనల్ని మరింత సరళతరం చేసింది. కొత్తగా రాబోతున్న ప్రాజెక్టులకు కనిష్టంగా రూ.20 లక్షల నుంచి గరిష్టంగా రూ.70 లక్షల వరకు మాత్రమే పెట్టుబడులుగా నిర్దేశించింది. వాటర్ స్పోర్ట్స్‌లో బిడ్ వేయాలంటే ఐదేళ్ల అనుభవం ఉండాలనే నిబంధన ఉంది. దీన్ని ఏడాదికి తగ్గించింది. ఒకవేళ ఆసక్తి ఉండి అనుభవం లేని ఎవరైనా పాల్గొనాలని భావిస్తే కన్సోటియం తీసుకున్నా సరిపోతుంది. టూరిజం ప్రాజెక్టులకు బిడ్ ఫీజును రూ.లక్ష నుంచి రూ.10 వేలకు తగ్గించింది. దీంతోపాటు టెండర్లలో కనీస ఆదాయం వాటా వాటర్ స్పోర్ట్స్‌కు 15 శాతం, అడ్వెంచర్ స్పోర్ట్స్‌కు 25 శాతం, ట్రెక్కింగ్‌కు 10 శాతంగా నిర్ణయించింది. ఇందులో ఎవరు ఎక్కువగా టెండర్లలో కోట్‌చేస్తే వారికి అవకాశం కల్పించేలా నిబంధనల్ని మార్చింది. ఈ నేపథ్యంలో సోమవారం విజయవాడలో ప్రీ బిడ్డింగ్ సమావేశం నిర్వహిస్తోంది. టూరిజం ఎండీ కన్నబాబు ఆధ్వర్యంలో పర్యాటకశాఖ కార్యాలయంలో జరిగే ఈ సమావేశంలో కొత్త ప్రాజెక్టులకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. -
పాపికొండలు పోదాం పద!
గోదారమ్మ పరవళ్లు..ప్రకృతి అందాలు..ఎత్తయిన కొండలు..పున్నమి వెన్నెల్లో ఇసుక తిన్నెలు..నైట్ హాల్ట్‌లు.. ఇలా పాపికొండలు విహారయాత్ర ఇచ్చే మజాయే వేరంటారు పర్యాటకులు. అలాంటి మధురానుభూతి జీవితంలో ఒక్కసారైనా పొందాలనుకుంటారు సందర్శకులు. ఈ ప్రకృతి అందాలను తిలకించేందుకు ఇతర రాష్ట్రాల నుంచి కూడా తరలివస్తుంటారు. ఈ విహార యాత్రకు ప్రభుత్వం అనుమతులు మంజూరు చేయడంతో ఆదివారం నుంచి బోట్లు బయలుదేరనున్నాయి. రంపచోడవరం (అల్లూరి సీతారామరాజు జిల్లా): పాపికొండలు విహారయాత్రకు ప్రభుత్వం అనుమతులు మంజూరు చేయడంతో పర్యాటకులు, ప్రకృతి ప్రేమికులు, బోట్ల యజమానుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. దీనిపై ఆధారపడి ప్రత్యక్షంగా, పరోక్షంగా వందలాది కుటుంబాలు ఆధారపడ్డాయి. గోదావరికి వరదలు రావడంతో గత నాలుగు నెలలుగా పాపికొండలు పర్యాటకం నిలిచిపోయింది. ఈనేపథ్యంలో నీటిమట్టం అనుకూలంగా ఉండటంతో ప్రభుత్వం పాపికొండలు విహారయాత్ర బోట్లకు శనివారం అనుమతి ఇచ్చింది. దీంతో పర్యాటకశాఖ అధికారులు పాపికొండలు విహార యాత్రకు ట్రయల్ రన్ నిర్వహించారు. తొలి రోజు ఒక్క బోటు మాత్రమే.. పాపికొండల విహారయాత్రకు తొలి రోజు ఆదివారం ఒక్క బోటుమాత్రమే వెళ్లే అవకాశం ఉంది. ఈ పర్యటనకు సంబంధించి ఏపీ టూరిజం, ప్రైవేట్ టూరిజం శనివారం నుంచి టికెట్లను అందుబాటులోకి తెచ్చాయి. విహారయాత్రకు బోట్లు బయలుదేరేలా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. దీనిలో భాగంగా పోశమ్మగండి వద్ద బోట్ పాయింట్, కంట్రోల్ రూమ్‌లో రెవెన్యూ, పోలీసు, పర్యాటక, ఇరిగేషన్ శాఖ అధికారులు, సిబ్బంది విధుల్లో నిమగ్నమయ్యారు. బోట్ పాయింట్ వద్ద ఉన్న అన్ని బోట్లలో భద్రతా చర్యలను వారు పరిశీలించారు. పర్యాటకుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం గతంలో జరిగిన సంఘటనలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం పర్యాటకుల భద్రతకు అత్యంత ప్రాధాన్యమిస్తూ అనుమతులు మంజూరు చేసింది. పోశమ్మగండి బోట్ పాయింట్ నుంచి పర్యాటకులతో టూరిజం బోటు బయలుదేరడానికి ముందే పైలెట్ బోట్ వెళ్తుంది. ఇందులో శాటిలైట్ ఫోన్‌తోపాటు పర్యాటక సిబ్బంది ఒకరు, గజ ఈతగాడు ఉంటారు. వీరి వద్ద కూడా వాకీ టాకీ ఉంటుంది. పైలెట్ బోటు.. టూరిజం బోటు కంటే ముందుగా వెళ్తూ గోదావరిలో పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తుంది. ఎటువంటి ఇబ్బందికర పరిస్థితి ఉన్నా వెంటనే కంట్రోల్ రూమ్‌తోపాటు వెనుక వస్తున్న బోటుకు వాకీ టాకీలో సమాచారం అందిస్తారు. ఇలా చేరుకోవాలి: ముందుగా ఏపీ పర్యాటక శాఖ వెబ్సైట్.. https:// tourism.ap.gov.in/లో పాపికొండలు విహారయాత్రకు టికెట్లు బుక్ చేసుకోవాలి. రూ.1,250 టికెట్ బుక్ చేసుకున్నవారు నేరుగా రాజమండ్రి చేరుకోవాలి. అక్కడ గోదావరి గట్టున ఉన్న పర్యాటక శాఖ కేంద్రానికి వెళ్లాలి. అక్కడ నుంచి బస్సులో పోశమ్మ గండి బోట్ పాయింట్ వరకు పర్యాటక శాఖ సిబ్బంది తీసుకొస్తారు. యాత్ర ముగిశాక మళ్లీ రాజమండ్రికి తీసుకొచ్చి వదిలిపెడతారు. ఇక రూ.1000 టికెట్ తీసుకున్నవారు నేరుగా బోట్లు బయలుదేరే అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్నం మండలం పోశమ్మ గండికి చేరుకోవాల్సి ఉంటుంది. రెండు బోట్ పాయింట్ల వద్ద ఏర్పాట్లు పోశమ్మ గండి బోట్ పాయింట్ వద్ద మొత్తం 15 బోట్లు ఉండగా, వీటిలో ఎనిమిది బోట్లకు అనుమతి మంజూరు చేశారు. మరో ఏడు బోట్లకు ఫిట్నెస్ పరిశీలించి అనుమతి ఇవ్వాల్సి ఉందని అధికారవర్గాలు తెలిపాయి. వీఆర్ పురం మండలం పోచవరం బోట్ పాయింట్ వద్ద 17 బోట్లు ఉండగా వీటిలో 13 బోట్లకు ఫిట్నెస్ అనుమతి ఇచ్చారు. మరో నాలుగు బోట్లకు అనుమతి రావాల్సి ఉంది. -
త్వరలో ఐదు రూట్లలో టెంపుల్ టూరిజం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పలు పర్యాటక కేంద్రాలను, వివిధ ఆలయాలను కలుపుతూ ఐదు సర్క్యూట్లలో(రూట్లలో) టెంపుల్ టూరిజంను ప్రారంభించనున్నట్టు ఉప ముఖ్యమంత్రి (దేవదాయ శాఖ) కొట్టు సత్యనారాయణ, చెప్పారు. బుధవారం సచివాలయంలో మంత్రి ఆర్కే రోజాతో కలిసి దేవదాయ, పర్యాటక శాఖల అధికారులతో టెంపుల్ టూరిజం అభివృద్దిపై సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం ఇరువురు మంత్రులు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పలు ఆలయాలను ఆధ్యాత్మికంగా, పర్యాటకపరంగానూ ఆకర్షించే రీతిలో అభివృద్ధి చేసేందుకు రెండు శాఖలు చర్యలు తీసుకుంటున్నట్టు కొట్టు సత్యనారాయణ చెప్పారు. మొత్తం 16 సర్క్యూట్లకు ఆన్లైన్లో అభిప్రాయాలు సేకరించినట్టు తెలిపారు. విజయవాడ– పంచారామ యాత్ర, విజయవాడ – అష్టశక్తి యాత్ర, విజయవాడ – త్రిలింగ యాత్ర, తిరుపతి – కష్ణదేవరాయ యాత్ర, తిరుపతి– గోల్డెన్ ట్రయాంగిల్ యాత్ర సర్క్యూట్లకు అత్యధిక రేంటింగులు వచ్చాయని తెలిపారు. ఈ ఐదు సర్క్యూట్లలో తొలి విడతగా టెంపుల్ టూరిజంను అభివృద్ది చేస్తామన్నారు. మంత్రి రోజా మాట్లాడుతూ.. టెంపుల్ టూరిజం సర్క్యూట్లతో యాత్రికులు ఒకే సమయంలో ఆలయాలు, ఆ ప్రాంతంలోని పర్యాటక ప్రాంతాలను సందర్శించవచ్చన్నారు. దేశ విదేశీ పర్యాటకులను ఆకట్టుకునేలా సౌకర్యాలు కల్పిస్తున్నట్టు చెప్పారు. -
సింహగిరి నుంచి తిరునగరి వరకు..
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఆధ్యాత్మిక పర్యాటకం(టెంపుల్ టూరిజం) అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సారూప్యత కలిగిన దేవాలయాలను అనుసంధానం చేస్తూ యాత్రలకు శ్రీకారం చుడుతోంది. అలాగే పర్యాటకులు ప్రముఖ దేవాలయాలతో పాటు చిన్నచిన్న పుణ్యక్షేత్రాలు కూడా సందర్శించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా సుమారు 100 దేవాలయాలతో జాబితా రూపొందించింది. వీటిని 16 సర్క్యూట్లుగా విభజించి.. ఒక్కో సర్క్యూట్లో 3 నుంచి పదికి పైగా ఆలయాల దర్శనాన్ని కల్పించనుంది. దీనిని పైలట్ ప్రాజెక్టు కింద తొలుత 5 సర్క్యూట్లలో అమలు చేయనుంది. ఈ సర్క్యూట్ల ఎంపికపై ప్రజాభిప్రాయాన్ని కూడా సేకరిస్తోంది. ప్రజలకు భగవంతుడిని మరింత చేరువ చేసేలా .. రాష్ట్రంలో ఎంతో చరిత్ర కలిగిన దేవాలయాలున్నాయి. వీటిని పర్యాటకంగా ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ప్రభుత్వం రెలిజియస్ టూరిజం కింద ప్యాకేజీలను అందుబాటులోకి తెస్తోంది. రాష్ట్రవ్యాప్త సర్క్యూట్లతో పాటు జిల్లాల పరిధిలోనూ దర్శనీయ స్థలాలను చుట్టివచ్చేలా వీలు కల్పించనుంది. ఒకటి నుంచి మూడు రోజుల పాటు యాత్ర కొనసాగేలా ప్యాకేజీలను రూపొందిస్తోంది. రవాణా, వసతి సౌకర్యాలతో పాటు భగవంతుడి దర్శనం కల్పించేలా ఏర్పాట్లు చేస్తోంది. దేశ, విదేశీ పర్యాటకులను ఆకర్షించేలా సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం కల్పించేందుకు.. ఆలయాల వారీగా ప్రత్యేక వెబ్‌పోర్టల్స్, మొబైల్ అప్లికేషన్లను పర్యాటక శాఖ వినియోగించనుంది. భక్తులు, పర్యాటకులకు సమగ్ర సమాచారం ఇచ్చేందుకు ఎంపిక చేసిన ఆలయాల వద్ద రిలీజియస్ టూరిజం ఇన్ఫర్మేషన్ సెంటర్లను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. సుమారు 500 నుంచి 1,000 చదరపు అడుగుల్లో భక్తులు విశ్రాంతి తీసుకోవడానికి వీలుగా వీటిని నిరి్మంచనుంది. ఇందులో ప్రత్యేక డిస్ప్లేలు, కియోస్‌్కల ద్వారా రాష్ట్రంతో పాటు దేశవ్యాప్త ఆలయాల సమాచారం అందుబాటులో ఉంచుతారు. ఆలయాల విశిష్టతను వివరించేందుకు గైడ్లు కూడా ఉంటారు. భక్తులు ఆహ్లాదంగా, ఆనందంగా గడిపేలా.. మన రాష్ట్రంలో ఎన్నో విశిష్ట దేవాలయాలున్నాయి. వీటికి పర్యాటక ప్రాంతాలను అనుసంధానించి.. మన రాష్ట్రంతో పాటు దేశ, విదేశీ పర్యాటకులను ఆకర్షించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నాం. దైవ దర్శనానికి వచ్చే భక్తులు ఆహ్లాదంగా, ఆనందంగా గడిపే వాతావరణాన్ని అందించనున్నాం. ఇందులో భాగంగా రెలిజియస్ టూరిజాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాం. ప్రజల అభీష్టానికి అనుగుణంగా దేవాలయాల సందర్శన యాత్రల ప్యాకేజీలను తీసుకొస్తాం. – ఆర్కే రోజా, పర్యాటక శాఖ మంత్రి -
‘కృష్ణా’లో బోటింగ్ బంద్
భవానీపురం(విజయవాడ పశ్చిమ): ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో టూరిజం శాఖ బోటింగ్ కార్యకలాపాలు మళ్లీ బంద్ అయ్యాయి. ఈ నెల 10వ తేదీ నుంచి నాలుగైదు రోజుల పాటు బోటింగ్ రాకపోకలను నిలిపివేసిన అధికారులు ఎగువ నుంచి వచ్చే వరద నీటి ఉధృతి తగ్గటంతో తిరిగి ప్రారంభించారు. శనివారం శ్రీశైలం ప్రాజెక్ట్ గేట్లు ఎత్తివేయడం, శుక్రవారం రాత్రి నుంచి 48 గంటల పాటు పశ్చిమ కనుమల్లో ప్రధానంగా కృష్ణా బేసిన్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయనే అంచనాల కారణంగా ఇరిగేషన్ అధికారులు అప్రమత్తమయ్యారు. ముందస్తు జాగ్రత్తగా కృష్ణా నదిలో బోటింగ్ కార్యకలాపాలన్నింటినీ నిలిపివేయాలని ఏపీటీడీసీ అధికారులను ఆదేశించారు. దీంతో భవానీపురంలో ఉన్న హరిత బరంపార్క్‌లోని బోటింగ్ పాయింట్ వద్ద బోట్లను నిలుపుదల చేశారు. భవానీ ద్వీపంలో కాటేజీల్లో ఇప్పటికే ఉన్న పర్యాటకుల రాకపోకలకు, అక్కడ విధులు నిర్వహిస్తున్న సిబ్బంది కోసం బోట్లను పరిమితంగా నడుపుతున్నారు. జలవనరుల శాఖ అధికారులు తిరిగి ఆదేశాలు ఇచ్చిన తరువాతే బోటింగ్ కార్యకలాపాలను ప్రారంభిస్తామని ఏపీ టూరిజం అధికారులు వెల్లడించారు. -
ఒంపు సొంపుల ఏరులో.. మడ అడవుల మధ్యలో
చుట్టూ మనసులను కట్టిపడేసే ప్రకృతి సిద్ధ మడ అడవులు.. వంపుసొంపులతో హొయలు పోతూ..వడివడిగా పరవళ్లు తొక్కే కాలువ..చల్లగా తాకే చిరుగాలికి లయబద్ధంగా రాగాలు పోతున్నట్లు వినసొంపైన పక్షుల కిలకిలారావాలు.. వీటన్నింటి మధ్య లాహిరిలాహిరిలా హిరిలో.. అంటూ సాగే పడవ ప్రయాణం.. చదువుతుంటేనే మది అలలపై తేలి ఆడుతున్నట్లు ఉప్పొంగుతోంది కదూ.. ఈ మధురానుభూతులు ఆస్వాదించాలంటే నాగాయలంక మండలంలోని తీర ప్రాంతాన్ని సందర్శించాల్సిందే! నాగాయలంక (అవనిగడ్డ): కృష్ణా జిల్లా నాగాయలంక మండల పరిధిలోని గుల్లలమోద నుంచి సముద్ర ప్రాంతం వరకూ మడ అడవులు విస్తరించి ఉన్నాయి. ఈ ప్రాంతంలో తెల్లమడ, నల్లమడ, పొన్న, దుడ్డుపొన్న వంటి రకాల మొక్కలున్నాయి. వీటిలో మడ అడవులు ఎక్కువగా విస్తరించి ఉన్నాయి. నీటిలో వేర్లు, మొదళ్ళు కనబడుతూ పైన పచ్చని మొక్కలతో ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి. మడ అడవుల నడుమ, నదీపాయలు, సింకుల్లో ప్రయాణిస్తూ సాగే ప్రయాణం సుందర్బన్ అడవుల అందాలను తలపిస్తుంది. రాష్ట్రంలో మరెక్కడా లేనివిధంగా సహజ సిద్ధ ప్రకృతి సోయగాలకు నెలవు ఈ తీర ప్రాంతం. ప్రత్యేకమైన ఈ ప్రయాణం ప్రకృతి ప్రేమికులకు మరుపురాని అనుభూతినిస్తుంది. ఈ మడ అడవుల అందాలను తిలకించాలంటే నాగాయలంక, గుల్లలమోద, ఎదురుమొండి, సంగమేశ్వరం నుంచి ప్రత్యేక పడవల్లో వెళ్ళాల్సి ఉంటుంది.. రవాణా సదుపాయం కల్పిస్తే మరింతగా టూరిజం అభివృద్ధి ప్రస్తుతం ప్రత్యేక బోట్లను ఏర్పాటు చేసుకుని టూరిస్టులు ఈ లైట్‌హౌస్ సందర్శిస్తున్నారు. ఈ ప్రయాణం రిస్కుతో కూడుకోవడం, ఖర్చులు ఎక్కువ అవడం వల్ల లైట్‌హౌస్‌ని సందర్శించాలనే ఆసక్తి ఉన్నప్పటికీ చాలామంది ఈ ప్రాంతాన్ని సందర్శించలేక పోతున్నారు. దీనికితోడు లైట్‌హౌస్ ప్రాంతంలో ఏమీ దొరక్క పోవడం పర్యాటకులకు నిరాశే మిగులుతుంది. ఈ ప్రాంతానికి వెళ్లేందుకు పర్యాటకశాఖ ప్రత్యేక లాంచీలు, బోట్లను ఏర్పాటు చేస్తే ఈ ప్రాంతం పర్యాటకంగా ఎంతో అభివృద్ధి సాధించే అవకాశం ఉంది. లైట్‌హౌస్ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు ఆ శాఖ ప్రత్యేక చర్యలు తీసుకోవాలని దివిసీమ ప్రజలు కోరుతున్నారు. ప్రత్యేక ఆకర్షణగా లైట్‌హౌస్ ఓ వైపు పచ్చని మడ అడవులు, మరో వైపు కృష్ణా నది, ఇంకోవైపు బంగాళాఖాతం మధ్య ఉండే మడ అడవుల నడుమ ఉండే గుల్లలమోద లైట్‌హౌస్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. నాగాయలంక నుంచి 25 కి.మీ దూరంలో లైట్ హౌస్ ఉంది. బ్రిటీష్ కాలంలో నిర్మించిన ఈ లైట్‌హౌస్‌ని 1972లో ఆధునీకరించారు. దీని ఎత్తు 135 అడుగులు. 9 అంతస్తులు కలిగి ఉంది. 1977 ఉప్పెనకు ఈ లైట్‌హౌస్ 5వ అంతస్తు వరకూ వరద నీరు వచ్చినట్లు రికార్డులో నమోదైంది. రాష్ట్రంలో మరెక్కడా లేనివిధంగా పచ్చని మడ అడవులు, నదీపాయల నడుమ ఉండటం ఈ లైట్‌హౌస్ ప్రత్యేకత. (క్లిక్: ఎంత తిన్నా.. మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది..) -
విహార ప్రేమికుల కోసం విశాఖ నుంచి కార్డీలియా షిప్ ఫోటోలు చూస్తే వావ్ అంటారు
-
విశాఖలో క్రేజీ క్రూయిజ్
బీచ్‌రోడ్డు (విశాఖ తూర్పు): కార్డీలియా క్రూయిజ్ షిప్ ప్రారంభంతో విశాఖ ప్రజల కోరికే కాకుండా రాష్ట్ర ప్రజల కోరికా నేరవేరిందని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి రోజా అన్నారు. విశాఖ పోర్టు నుంచి పాండిచ్చేరి మీదుగా చెన్నైకి బయలుదేరిన మొదటి క్రూయిజ్ షిప్‌ను బుధవారం ఆమె ప్రారంభించారు. కోవిడ్ తర్వాత విహార యాత్ర కోసం ఎదురు చూస్తున్న రాష్ట్ర ప్రజలకు ఇదో మంచి అవకాశమన్నారు. నౌక లోపల చూస్తే అలలపై ఇంద్రభవనంలా ఉందన్నారు. నౌకలో ప్రయాణికులతో మాట్లాడుతున్న మంత్రి రోజా ఈ షిప్ మొదటి ట్రిప్‌నకు 1200 మంది బుక్ చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. 786 క్యాబిన్స్ కలిగిన ఈ షిప్లో 600 మంది పనిచేస్తున్నారని, వారిలో 92 శాతం భారతీయులేనన్నారు. 900 సీట్లు కలిగిన పెద్ద థియేటర్, స్విమ్మింగ్ పూల్స్ చాలా బాగున్నాయన్నారు. రుషికొండను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయాలని ప్రభుత్వం చూస్తుంటే తెలుగుదేశం పార్టీ కోర్టులకు వెళ్లి స్టేల ద్వారా అడ్డుకుంటోందని మంత్రి రోజా విమర్శించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ వరుద కల్యాణి, పోర్ట్ ట్రస్ట్ చైర్మన్ రామ్మోహన్రావు తదితరులు పాల్గొన్నారు. కుటుంబంతో వెళ్తున్నా.. నా కుటుంబం మొత్తం 9 మంది ఈ నౌకలో విహార యాత్రకు వెళ్తున్నాం. ఎప్పుడు లోపలకు వెళ్తామా అని ఆత్రుతగా ఉంది. కుటుంబం మొత్తానికి రూ.1.8 లక్షలు వెచ్చించాం. – కాశీ, విశాఖ వాసి అన్ని సౌకర్యాలు ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించాం. అత్యవసర సమయంలో వైద్యులు కూడా అందుబాటులో ఉన్నారు. ఈ నెల 22 మినహా సెప్టెంబర్ వరకూ ప్రతి బుధవారం విశాఖ నుంచి షిప్ బయలుదేరుతుంది. – అల్థాఫ్, నిర్వాహకుడు -
తెలంగాణకే తలమానికం.. సాగర్ తీరంలో బౌద్ధవనం
సాక్షి, నాగార్జునసాగర్: తెలంగాణకే తలమానికమైన సాగర్ తీరంలో బౌద్ధవనం సిద్ధమైంది. ఈనెల 14వ తేదీన రాష్ట్ర మంత్రుల చేతుల మీదుగా ప్రారంభించేందుకు ముహూర్తం ఖరారు చేశారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు. బుద్ధవనం ప్రారంభమైతే సాగర్‌కు పర్యాటకుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంటుంది. దీంతో పర్యాటకశాఖకు ఆదాయం రావడంతో పాటు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఏర్పడనున్నాయి. 2003లో పనులు ప్రారంభం 2003–04లో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు పనులు 2011వరకు నత్తనడకన సాగాయి. 2015లో 2559వ బుద్ధజయంతి ఉత్సవాలు నాగార్జునసాగర్‌లో నిర్వహించారు. వాటికి సీఎం కేసీఆర్ హాజరయ్యారు. బుద్ధవనంలో బోధివక్షం నాటారు. దీనిని అభివృద్ధి చేసే బాధ్యతను మల్లేపల్లి లక్ష్మయ్యకు అప్పగించి బుద్ధవనం ప్రత్యేకాధికారిగా నియమించారు. ఆనాటి నుంచి ఈ ప్రాజెక్టు పనులు ఊపందుకున్నాయి. మొత్తం రూ.65.14 కోట్లు ఖర్చు చేసి ఐదు సెగ్మెంట్లు పూర్తిచేశారు. మరో మూడింటి సెగ్మెంట్ల పనులు మొదలే కాలేదు. ఈ ప్రాజెక్టు మొత్తం పూర్తయ్యేందుకు సుమారుగా రూ.500 కోట్లు ఖర్చవుతుందని అంచనా. చదవండి: (కేసీఆర్ మాపై కక్షగట్టారు) బౌద్ధమత సంస్కృతికి ప్రతిబింబం నాగార్జునసాగర్ జలాశయతీరంలో 274.28 ఎకరాల్లో నిర్మితమైన బుద్ధవనం ప్రపంచ బౌద్ధమత సంస్కృతికి ప్రతిబింబం కానుంది. బుద్ధుడి జననం నుంచి నిర్యాణం వరకు అన్ని అంశాలు ఉట్టిపడేలా ఇక్కడ శిల్పాలను ఏర్పాటు చేశారు. 70 అడుగుల ఎత్తు,140 అడుగుల వెడల్పుతో నిర్మించారు. పైన గుమ్మటం తరహాలో నిర్మాణం ఉంటుంది. ప్రధాన మందిరం లోపలి వైపు నిలబడి పైకి ఆకాశం ప్రతిబింబించేలా ప్రత్యేక తీర్చిదిద్దారు. జాతక పార్కులో జాతక కథల రూపంలో కళ్లకు కట్టేలా పర్యాటకులను ఆకట్టుకునే విధంగా శిల్పాలు ఏర్పాటు చేశారు. ఒకదానినుంచి మరొకటి వరుస క్రమంలో వీటిని పూర్తిగా చూసేందుకు రెండున్నర కిలోమీటర్లు నడవాల్సి ఉంటుంది. అభివృద్ధికి ముందుకొస్తున్న సంస్థలు బుద్ధవనం అభివృద్ధికి పలు సంస్థలు ముందుకొస్తున్నాయి. డీఎక్స్ఎన్ (మలేషియా) ప్లాన్ వారు బుద్ధి ష్ట్ యూనివర్శిటీ నిర్మాణానికి గాను రూ.200 కోట్లు పెట్టుబడి పెట్టడానికి ముందుకొచ్చారు. ఫోగౌంగ్షాన్ కల్చరల్ అండ్ ఎడ్యుకేషన్ సెంటర్ వారు బుద్ధి స్ట్ మోనాస్టిక్ ఎడ్యుకేషన్ సెంటర్‌కు రూ.64.10 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించారు. మహా బోధి సొసైటీ(బెంగళూరు) వారు మోనస్టరీమాంక్స్ సెట్టింగ్‌కు రూ.20.49 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తిగా ఉన్నారు. లోటస్ నిక్కో హోటల్స్ (న్యూఢిల్లీ) వారు హోటల్స్ ఏర్పాటుకు రూ.42 కోట్లు పెట్టబడి పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. -
టూరిజంకు సీఎం జగన్ పెద్దపీట వేస్తున్నారు: ఆర్కే రోజా
సాక్షి, విజయవాడ: కృష్ణానదిలో బోధిసిరి బోటును పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. బోధిసిరి బోట్ మరోసారి లాంచింగ్ చేశాము. 2004లో వైఎస్సార్ చేతుల మీదుగా ప్రారంభించిన బోధిసిరిని తిరిగి నేను ప్రారంభించడం ఆనందంగా ఉంది. టూరిస్ట్‌లకు మెరుగైన వసతులు కల్పించేలా చర్యలు తీసుకుంటాం. టూరిజంకు సీఎం జగన్ పెద్దపీట వేస్తున్నారు. టెంపుల్ టూరిజం అభివృద్ధి చేస్తాం. బోటు ప్రమాదాలు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. రాష్ట్రంలో ఏపీ టూరిజం నుంచి 45, ప్రైవేట్‌గా 25 బోట్లు అందుబాటులో ఉన్నాయి. 9 ప్రాంతాల్లో కంట్రోల్ రూమ్ ద్వారా బోట్స్ మానిటర్ చేస్తున్నాం. దేశ విదేశాలకు చెందిన టూరిస్ట్‌లకు అనుకూలంగా ఉండేలా టూరిజం అభివృద్ధి చేస్తాం. కోవిడ్ వల్ల టూరిజం ఆదాయం తగ్గింది. పీపీఈ మోడ్‌లో టూరిజంను డెవలప్మెంట్ చేస్తున్నాం. స్టేక్ హోల్డర్స్‌తో చర్చలు జరుపుతున్నాం' అని పర్యాటకశాఖ మంత్రి ఆర్కే రోజా అన్నారు. ఈ కార్యక్రమానికి టూరిజం శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్ భార్గవ మాట్లాడుతూ.. సీఎం ఆదేశాల మేరకు టూరిజం అభివృద్ధి చేస్తాం. రోప్ వేస్ ప్రాజెక్టుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. రెండు రోప్ వేస్ పనులను త్వరలోనే ప్రారంభిస్తాం. విజయవాడ బరం పార్కులో 1, శ్రీశైలంలో 1 రోప్ వే ప్రాజెక్టు త్వరలోనే ప్రారంభం కాబోతున్నాయి అని రజత్ భార్గవ తెలిపారు. చదవండి: (మాజీ మంత్రి అనిల్‌తో మంత్రి కాకాని గోవర్ధన్‌రెడ్డి భేటీ) -
నిబంధనలమేరకే ‘రుషికొండ’ నిర్మాణాలు
సాక్షి, అమరావతి: విశాఖపట్నంలోని రుషికొండ పర్యాటక ప్రాజెక్టును ‘కోస్టల్ రెగ్యులేషన్ జోన్ (సీఆర్‌జెడ్) నిబంధనలకు అనుగుణంగానే నిర్మిస్తున్నామని పర్యాటకశాఖ స్పష్టం చేసింది. కేంద్ర అటవీ, పర్యావరణశాఖ నుంచి పూర్తి అనుమతులు పొంది ఆమేరకే నిర్మాణ పనులు చేపడుతున్నామని పేర్కొంది. సీఆర్‌జెడ్ నిబంధనలకు విరుద్ధంగా రుషికొండ పర్యాటక ప్రాజెక్టు నిర్మిస్తున్నారని ‘ఈనాడు’ పత్రిక ప్రచురించిన కథనం పూర్తిగా వాస్తవ విరుద్ధంగా ఉందని పర్యాటకశాఖ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. రూ.240 కోట్లతో చేపట్టిన ఈ ప్రాజెక్టు కోసం రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) ముందుగానే అన్ని అనుమతులు తీసుకుని నిర్మాణ పనులు చేపట్టిందని పేర్కొంది. 9.88 ఎకరాల్లో చేపట్టిన ఈ ప్రాజెక్టులో 5.18 ఎకరాల్లో నిర్మాణాలు చేపడుతుండగా 4.70 ఎకరాలు సుందరీకరణకు కేటాయించినట్టు తెలిపింది. ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ అథారిటీ అనుమతించిన 139 చెట్లనే తొలగించామని, మిగిలినవి పొదలేనని పేర్కొంది. నిబంధనలకు విరుద్ధంగా వందలాది చెట్లను తొలగించినట్టు ‘ఈనాడు’ పత్రిక తన కథనంలో పేర్కొనడం అవాస్తవమని తెలిపింది. తొలగించిన చెట్లకు బదులుగా అంతకు రెండింతలకుపైగా మొక్కలు నాటేందుకు ఇప్పటికే నిర్ణయించామని, భవన నిర్మాణాలు పూర్తికాగానే మొక్కలు నాటతామని తెలిపింది. నిర్మాణ వ్యర్థాలు, కంకరను తీరప్రాంతంలో 10 కిలోమీటర్ల మేర పారబోస్తున్నట్టు చేసిన ఆరోపణలు కూడా సత్యదూరమని స్పష్టం చేసింది. విశాఖపట్నం జిల్లా యంత్రాంగం అనుమతించిన 287, 288 సర్వే నంబర్లతో ఉన్న ప్రభుత్వ భూమిలోనే డంప్ చేస్తున్నామని, ఆ మట్టిని భవిష్యత్‌లో లోతట్టు ప్రాంతాలను ఎత్తుచేసేందుకు జిల్లా యంత్రాంగం వినియోగిస్తుందని తెలిపింది. తీరప్రాంతంలో తాబేళ్లు, ఇతర సముద్ర జీవుల ఉనికికి ఎలాంటి ముప్పువాటిల్లడం లేదని స్పష్టం చేసింది. విశాఖపట్నం మెట్రో రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ మాస్టర్ ప్లాన్ నిబంధనలను ఉల్లంఘిస్తున్నట్టు ‘ఈనాడు’ తన కథనంలో చేసిన ఆరోపణ పూర్తిగా అవాస్తవమని తెలిపింది. ప్రాజెక్టు నిర్మిస్తున్న ప్రాంతం వీఎంఆర్డీఏ మాస్టర్‌ప్లాన్ మిక్స్డ్ యూజ్ జోన్–3 పరిధిలోకి వస్తుందంది. అంటే ఈ ప్రాంతంలో ఆతిథ్య రంగంలో ప్రాజెక్టులు నిర్మించేందుకు వీఎంఆర్డీఏ మాస్టర్‌ప్లాన్ అనుమతిస్తోందని వెల్లడించింది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నియమించిన నలుగురు సభ్యుల కమిటీ ఈ ప్రాజెక్టును పరిశీలించి నిబంధనల మేరకు నిర్మాణాలు చేపడుతున్నట్టుగా నివేదిక ఇచ్చిందని గుర్తుచేసింది. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు రుషికొండ ప్రాజెక్టును పూర్తిచేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొంది. సీఆర్‌జెడ్, వీఎంఆర్డీఏ నిబంధనలను అనుసరిస్తూ ఎన్జీటీ అనుమతుల మేరకు ప్రాజెక్టును సకాలంలో పూర్తిచేస్తామని తెలిపింది. -
బొర్రా అందాలు అమోఘం
అనంతగిరి/అరకులోయ రూరల్: ప్రముఖ పర్యాటక కేంద్రమైన బొర్రాగుహల అందాలు అమోఘంగా ఉన్నాయని కమిటీ ఆఫ్ స్టడీ ఆన్ పబ్లిక్ సెక్టార్‌పై పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ చైర్మన్ సంతోష్‌కుమార్ గన్వర్ చెప్పారు. ఆదివారం ఆయన, కమిటీ సభ్యులు జనార్దన్‌మిశ్రా, ఓంప్రకాష్ మాతుర్, పార్లమెంట్ సెషన్స్ సెక్రటరీ త్రిపాఠి బొర్రా గుహలు, అరకులోయను సందర్శించారు. సహజసిద్ధంగా ఏర్పడిన గుహలు అద్భుతంగా ఉన్నాయని చెప్పారు. గైడ్లను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అరకులో గిరిజన సంప్రదాయ థింసా నృత్యాల నడుమ కమిటీకి ఘనస్వాగతం పలికారు. అనంతరం వారు గిరిజన మ్యూజియం, కాఫీ మ్యూజియం తిలకించారు. పర్యాటకశాఖ నుంచి బొర్రా పంచాయతీకి రావాల్సిన బకాయిలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ కమిటీకి బొర్రా సర్పంచ్ అప్పారావు వినతిపత్రం అందజేశారు. బొర్రా నుంచి పెద్దూరు గ్రామానికి వెళ్లే మార్గంలో రైల్వేట్రాక్ వల్ల ఇబ్బందిగా ఉందని తెలిపారు. ఈ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు. కమిటీ పర్యటన సందర్భంగా అరకులోయ సీఐ దేముడుబాబు నేతృత్వంలో అనంతగిరి, అరకులోయ ఎస్ఐలు రాము, నజీర్ బందోబస్తు నిర్వహించారు. తహసీల్దారులు వెంకటవరప్రసాద్, వేణుగోపాల్, ఎంపీడీవోలు నగేష్, రాంబాబు, ఏరియా సూపరింటెండెంట్ హరి, అనంతగిరి పీహెచ్సీ వైద్యాధికారి అనూషారావు తదితరులు పాల్గొన్నారు. -
అలా.. జల విహారం!
సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా జల విహారానికి (బోటింగ్) ఆదరణ పెరుగుతోంది. పర్యాటక శాఖతో పాటు ప్రైవేటు బోట్లు టూరిస్టులతో నిత్యం కళకళలాడుతున్నాయి. ఫలితంగా ఏటా ఆదాయం రెట్టింపు అవుతుండడంతో పాటు ఒక్క బోటింగ్ నుంచే కార్పొరేషన్‌కు ఎక్కువ రాబడి వస్తుండడం విశేషం. ఈ క్రమంలో పర్యాటక శాఖ కొత్త బోట్ల కొనుగోలుకు కసరత్తు చేస్తోంది. తొలిదశలో భాగంగా విజయవాడ (భవానీ ద్వీపం), నాగార్జున సాగర్, విశాఖ ఫిషింగ్ హార్బర్లో అత్యాధునిక సౌకర్యాలతో 40 మంది ప్రయాణ సామర్థ్యం కలిగిన స్టీల్ బోట్లను అందుబాటులోకి తేనుంది. వీటి కోసం సుమారు రూ.7 కోట్ల అంచనాతో ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. తర్వాతి దశలో రాజమండ్రి, శ్రీశైలంలోనూ కొత్తవి తీసుకురానున్నారు. గతంతో పోలిస్తే రెట్టింపు ఆదాయం.. రాష్ట్రంలో ప్రస్తుతం 45 పర్యాటక శాఖ బోట్లు ఉండగా వాటిలో 40 బోట్లు నిత్యం నడుస్తున్నాయి. మరో 72 ప్రైవేటు బోట్లు పర్యాటకులకు సేవలందిస్తున్నాయి. గతంలో కరోనా కారణంగా ఎక్కడికక్కడ బోటింగ్ నిలిచిపోవడంతో ఆదాయం ఒక్కసారిగా పడిపోయింది. అయితే ప్రస్తుతం వస్తున్న రాబడి కరోనా ముందు నాటి సాధారణ పరిస్థితులను తలపిస్తుండటం విశేషం. కరోనా మొదటి వేవ్‌లో సుదీర్ఘ విరామం తర్వాత బోటింగ్ ప్రారంభమవగా సెప్టెంబర్ 2020 నుంచి ఏప్రిల్ 2021 (17వ తేదీ) వరకు రూ.2.79 కోట్ల ఆదాయం వచ్చింది. సెకండ్ వేవ్ విరామం అనంతరం సెప్టెంబర్ 2021 నుంచి ఏప్రిల్ 2022 (17వ తేదీ) వరకు రూ.4.72 కోట్ల రాబడి నమోదైంది. ఇటువంటి తరుణంలో ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలను కల్పించేందుకు పర్యాటకశాఖ చర్యలు చేపడుతోంది. బోటింగ్‌కు ప్రాధాన్యం పెరుగుతోంది! పర్యాటకులు జల విహారానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ క్రమంలోనే బోటింగ్ ద్వారా రాబడి కూడా గణనీయంగా పెరుగుతోంది. డిమాండ్, అవసరాన్ని బట్టి కొత్త ప్రదేశాల్లోనూ బోటింగ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఆలోచిస్తున్నాం. – ఆరిమండ వరప్రసాద్ రెడ్డి, ఏపీటీడీసీ చైర్మన్ -
మదిని దోచే .. మన్యం సొగసు
మనసుదోచే ప్రకృతి అందాలు.. పరవళ్లుతొక్కే గోదావరి సోయగాలు.. ఎటు చూసినా పచ్చని అడవులు.. ఎత్తైన కొండలు, గుట్టలు.. రారమ్మని పిలిచే చిరు గాలులు.. మధురానుభూతి కలిగించే పడవ ప్రయాణం. ఇలాంటి అందమైన లొకేషన్‌కు వెళ్లాలంటే ఏ గోవానో, ఏ మాల్దీవులకో వెళ్లాల్సిన అవసరం లేదు. రంపచోడవరం వెళితే.. ఈ అనుభూతులన్నీ ఆస్వాదించవచ్చు. అలుపెరగకుండా ప్రయాణం సాగిస్తున్న గోదావరికి ఇరువైపులా ఉన్న పాపికొండల అందాలు అదరహో అనిపిస్తాయి. నదీ తీరంలో దృశ్యాలు అత్యద్భుతంగా కనిపిస్తాయి. మారేడుమిల్లి మండలంలోని జలపాతాల సోయగాలు ఎంత సేపు చూసిన తనివితీరవు. తూర్పు కనుమల్లోని పచ్చని గడ్డి కొండల్లో (గ్రాస్ ల్యాండ్) గుడిసె ప్రాంతం ఇక్కడ మరో ఆకర్షణ. ఇలా కనుచూపు మేర ప్రకృతి రమణీయ దృశ్యాలు మరెన్నో ఉన్నాయి. వీటిని తిలకించేందుకు పెద్ద సంఖ్యలో పర్యాటకులు ఇక్కడకు తరలివస్తారు. రాత్రి సమయాల్లో ఇక్కడే బస చేసి.. ప్రకృతి ఒడిలో సేదతీరుతుంటారు. – రంపచోడవరం మరుపురాని మధుర ప్రయాణం దేవీపట్నం–వీఆర్‌పురం మండలాల మధ్య పాపికొండలు విస్తరించి ఉన్నాయి. పాపికొండలు అందాలు తిలకించేందుకు పర్యాటకులకు రెండు ప్రాంతాల్లో బోట్ పాయింట్లను పర్యాటక శాఖ ఏర్పాటు చేసింది. దేవీపట్నం మండలం పోశమ్మ గండి వద్ద ఒకటి, వీఆర్‌పురం మండలం పోచవరం వద్ద మరో బోట్ పాయింట్ ఉంది. ముందుగా ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకున్న పర్యాటకులు రాజమహేంద్రవరం నుంచి పోశమ్మ గండికి చేరుకుంటారు. అక్కడ నుంచి బోట్లు పర్యాటకులతో బయలుదేరుతాయి. సుమారు నాలుగు గంటల పాటు బోట్‌పై ప్రయాణం చేసి పాపికొండలు చేరుకుంటారు. పాపికొండలు మధ్య బోట్లో పర్యాటకుల ప్రయాణం ఎత్తైన కొండల మధ్య గోదావరిపై నుంచి వచ్చే చల్లని గాలులు మధ్య బోట్లో ప్రయాణం పర్యాటకులకు ఆహ్లాదం పంచుతుంది. పోలవరం ప్రాజెక్ట్ కారణంగా ముంపునకు గురైన గిరిజన గ్రామాలను దాటుకుంటూ బోట్లు ముందుకెళ్తాయి. ఈ ప్రయాణంలో పోలవరం ప్రాజెక్ట్ డ్యామ్‌ను చూడవచ్చు. వివిధ రాష్ట్రాల నుంచి పర్యాటకులు పాపికొండలు అందాలు చూసేందుకు వస్తుంటారు. పోచవరం బోట్ పాయింట్ నుంచి తెలంగాణ ప్రాంతం నుంచి పర్యాటకులు పాపికొండల విహారయాత్ర చేస్తారు. వీఆర్‌పురం మీదుగా వాహనాల్లో పోచవరం చేరుకుని బోట్లో పాపికొండలకు వెళతారు. కొల్లూరులో రాత్రి బస చేసేందుకు వీలుగా నైట్‌హాల్ట్ హట్స్(వెదురు కుటీరాలు) ఉన్నాయి. మారేడుమిల్లి సమీపంలో జలతరంగిణి ప్రకృతి గుడి.. సందడి మారేడుమిల్లి మండలానికి ఓ ప్రత్యేకత ఉంది. రాజమండ్రికి 87 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రసిద్ధ పర్యాటక ప్రాంతం విలక్షణమైన గిరిజన జీవనశైలి, విభిన్నమైన ప్రకృతి అందాలకు నిలయం. సముద్ర మట్టానికి ఎత్తుగా ఉండడంతో ఈ ప్రాంతం ఎల్లప్పుడూ చల్లగా ఉంటుంది. వివిధ రకాల పంటలకు అనుకూలమైన ప్రాంతం ఇది. పుల్లంగి పంచాయతీలో గుడిసె ప్రాంతం ఉంది. మారేడుమిల్లికి 40 కిలోమీటర్లు దూరంలో ఈ ప్రాంతం ఉంటుంది. ఆకాశాన్ని హత్తుకునేలా ఎత్తయిన కొండలు.. పచ్చని గడ్డితో విశాలంగా ఉంటాయి. సూర్యోదయం వేళ గుడిసె అందాలు తిలకించేందుకు పర్యాటకులు రాత్రికే అక్కడకు చేరుకుని క్యాంపెన్ టెంటుల్లో బస చేస్తారు. ఎత్తయిన కొండలను తాకుతూ వెళ్లే మబ్బులు పర్యాటకులను అబ్బురపరుస్తున్నాయి. మారేడుమిల్లి చింతూరు ఘాట్‌రోడ్ గుడిసె ప్రాంతాన్ని చూసేందుకు పర్యాటకులు వేలాదిగా తరలివస్తున్నారు. కొంత మంది మారేడుమిల్లిలో బస చేసి తెల్లవారుజామున గుడిసెకు వాహనాల్లో చేరుకుంటారు. మారేడుమిల్లిలో పర్యాటకశాఖకు చెందిన త్రీస్టార్ వసతులతో ఉడ్ రిసార్ట్స్, ఎకో టూరిజమ్ ఆధ్వర్యంలో అతిథి గృహాలు పర్యాటకులకు వసతి కల్పిస్తున్నాయి. ఇక్కడ సుమారు 300 వరకు అతిథి గృహాలు ఉన్నాయి. మారేడుమిల్లి నుంచి భద్రాచలం వైపు ఘాట్‌రోడ్డులో 15 కిలోమీటర్లు ప్రయాణిస్తే.. జలతరంగణి జలపాతం, వ్యూ పాయింట్, అమృతధార జలపాతం వస్తాయి. ఇక్కడే పాములేరు వద్ద జంగిల్ స్టార్ ఎకో రిసార్ట్స్ కూడా ఉన్నాయి. చింతూరు నుంచి 20 కిలోమీటర్లు ప్రయాణిస్తే పొల్లూరు జలపాతం వస్తుంది. ఇక్కడకు ఏడాది పొడవున పర్యాటకులు వస్తారు. ఎత్తైన కొండల నుంచి జాలువారే నీటిధారలు మైమరిపిస్తాయి. పురాతన ఆలయం రంప శివాలయం రెడ్డిరాజుల కాలం నాటి పురాతన శివాలయం రంపలో ఉంది. రంపచోడవరానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది. రాతితో ఆలయాన్ని నిర్మించారు. ఆలయానికి అనుకుని ఉన్న కొండపై రంప జలపాతం ఉంది. ఏడాది పొడవున జలపాతం ప్రహిస్తునే ఉంటుంది. రంపచోడవరంలో పర్యాటకులు బస చేసేందుకు పర్యాటక శాఖకు చెందిన అతిథి గృహాలు ఉన్నాయి. -
పొలమే పర్యాటక స్థలం
సాక్షి, అమరావతి: వ్యవసాయం పర్యాటక సొబగులను అద్దుకోనుంది. సాగు క్షేత్రమే సందర్శనీయ స్థలంగా మారనుంది. వ్యవసాయాన్ని ప్రోత్స హించడంతో పాటు రైతులకు అదనపు ఆదాయ వనరుగా అగ్రి టూరిజం అభివృద్ధి చెందుతోంది. దేశంలోని ఆర్థిక వనరులను నగరాల నుంచి గ్రామాలకు పంపిణీ చేయడంలో కీలక భూమిక పోషిస్తోంది. దేశంలో ఇప్పటికే పలుచోట్ల సందర్శకులు పొలం గట్లపై నడిచేలా.. పొలం దున్నేలా.. పంట కోస్తూ ప్రకృతి ఒడిలో సేదతీరేలా వ్యవసాయ క్షేత్రాలు రూపుదిద్దుకున్నాయి. వ్యవసాయ విజ్ఞానాన్ని, వినోదాన్ని పర్యాటకులకు ఒకేచోట అందిస్తున్నాయి. ‘గెస్ట్–హోస్ట్’ ప్రాతిపదికన దేశంలో అగ్రి టూరిజం గెస్ట్–హోస్ట్ ప్రాతిపదికన కొనసాగుతోంది. ఈ విధానంలో పొలం యజమానులే పర్యాటకులకు వ్యవసాయ క్షేత్రంలో భోజన వసతి కల్పిస్తారు. వ్యవసాయ క్షేత్రాలకు వెళ్లే సందర్శకులు రైతుల దైనందిన కార్యకలాపాల్లో పాలుపంచుకోవచ్చు. స్వయంగా సాగు విధానాలు తెలుసుకోవచ్చు. పొలం గట్లపై భోజనం చేస్తూ ఆహ్లాదాన్ని పొందొచ్చు. తద్వారా పర్యాటకులు స్థానిక ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలు, పండుగలు, ప్రకృతి పరిశీలన చేయడంతోపాటు చేపల వేట వంటి వ్యవసాయ ఆధారిత, అనుబంధ రంగాల్లోనూ ప్రావీణ్యం సంపాదించొచ్చు. ప్రకృతి ఒడిలో ‘ఆదరణ’ అనంతపురం జిల్లా రాప్తాడు మండలం హంపా పురం గ్రామంలో ‘ఆదరణ’ పేరుతో అగ్రి టూరిజం సెంటర్ నడుస్తోంది. అక్కడ పూర్తిగా ప్రకృతి వ్యవ సాయం చేస్తున్నారు. ఇక్కడే నేచురల్ ఫార్మింగ్‌కు సంబంధించి పాలిటెక్నిక్ కళాశాల కూడా ఉంది. ప్రత్యేక ప్యాకేజీతో పర్యాటకులు, పాఠశాల విద్యార్థులకు సంపూర్ణ వ్యవసాయ విధానాల్లో భాగస్వామ్యం కల్పిస్తున్నారు. ఎడ్లబండి నడపటం, మేకల పెంపకం, జీవామృతాల తయారీ, తిరగలి పిండి విసరడం, రోకలి దంచడం, వెన్న చిలకడం వంటి వ్యవసాయ, గ్రామీణ పనులతోపాటు గ్రామీణ క్రీడలతో ఆహ్లాదాన్ని పంచుతున్నారు. అగ్రి టూరిజాన్ని విస్తరిస్తాం.. రాష్ట్రంలో అగ్రి టూరిజాన్ని ప్రోత్సహించేందు కు ఏర్పాట్లు చేస్తున్నాం. ఇప్పటికే పాడేరు ప్రాంతాల్లో ఇలాంటి విధానమే ఉంది. త్వరలో జంగారెడ్డిగూడెం ప్రాంతంలో వ్యవసాయ పర్యాటకాన్ని తీసుకొచ్చేందుకు చర్యలు చేపడుతున్నాం. – ముత్తంశెట్టి శ్రీనివాసరావు, పర్యాటక శాఖ మంత్రి సాగు అనుభూతి పట్టణాల్లోని ప్రజలు, ఉద్యోగులు వారాంతాల్లో వినోదాన్ని, ఆహ్లాదాన్ని కోరుకుంటున్నారు. అటువంటి వారిని దృష్టిలో పెట్టుకుని అగ్రి టూరిజం విధానాన్ని అభివృద్ధి చేస్తున్నాం. వీకెండ్ వ్యవసాయం చేయాలనుకునే సాఫ్ట్వేర్ ఉద్యోగులకు ఇది కచ్చితంగా నచ్చుతుంది. – వరప్రసాద్‌రెడ్డి, చైర్మన్, ఏపీ టీడీసీ -
‘పర్యాటక’ పరవళ్లు
పిచ్చాటూరు: చిత్తూరు జిల్లాలో ఉన్న అరణియార్ పర్యాటకానికి మహర్దశ కలగనుంది. ప్రాజెక్టు సుందరీకరణ, అభివృద్ధికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందుకు అవసరమైన నిధులు సమకూర్చడానికి తుడాతో పాటు పర్యాటక శాఖకు గత ఏడాది ప్రతిపాదనలు అందాయి. అంతే వేగంగా స్పందించిన తుడా రూ.1.5 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు జనవరి 3న తుడా వీసీ హరికృష్ణ అరణియార్‌ను సందర్శించి నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. పర్యాటక శాఖకు రూ.5 కోట్లతో ప్రతిపాదనలు పంపించారు. అరణియార్ అభివృద్ధి, సుందరీకరణ పనులకు 20 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తున్నట్లు నీటిపారుదల శాఖ అధికారులు వెల్లడించారు. ఈ ప్రాజెక్టు వద్ద జైకా నిధులు రూ.35 కోట్లతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. ఈ నిధుల మంజూరులో తిరుపతి ఎంపీ గురుమూర్తి సహకారంతో స్థానిక ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం చేసిన కృషి, చొరవ ప్రశంసనీయమైనది. అరణియార్ వద్ద చేపట్టనున్న పనులు తుడా అందించే నిధులతో అరణియార్ అందాలన్నీ తిలకించేలా ప్రాజెక్టు వద్ద వ్యూ టవర్ నిర్మించనున్నారు. నదిపై సరదాగా ప్రయాణించేందుకు బోటింగ్ ఏర్పాటు చేయనున్నారు. పర్యాటకులకు అనువుగా కాటేజీలు అందుబాటులోకి రానున్నాయి. పర్యాటల శాఖ అందించే నిధులతో అదనంగా మరో బోటింగ్, రిసార్టులు, చిల్డ్రన్స్ పార్క్, ఉద్యానవనాల అభివృద్ధి, సినిమా, టీవీ సీరియళ్ల షూటింగ్‌కు అనువుగా పచ్చిక మైదానాలు నిర్మించనున్నారు. పిచ్చాటూరు అరణియార్ ప్రాజెక్టు గతంలో షూటింగ్ స్పాట్‌గా పేరొందింది. ఇక్కడ సుమారు 20 సినిమాలకు పైగా చిత్రీకరణ సాగింది. అందులో ప్రధానంగా జానకిరాముడు, ప్రేమదేశం, అన్నకిళి, టూటౌన్ రౌడీ సినిమాలు సూపర్ హిట్ అందుకున్నాయి. దీంతోపాటు వందలాది సినిమాల్లో పాటల చిత్రీకరణ ఇక్కడే సాగింది. తెలుగు, తమిళం సినిమాల్లోని పాటల చిత్రీకరణకు ఇది చాలా అనువైన ప్రదేశంగా నిలిచింది. టీవీ సీరియళ్లు ఎక్కువ కాలం పాటు చిత్రీకరించేవారు. నాగమ్మ టీవీ సీరియల్ 80 శాతం ఇక్కడే రూపుదిద్దుకుంది. బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, రాజేంద్రప్రసాద్, విజయశాంతి, రాధ వంటి మన తెలుగు హీరో, హీరోయిన్లు ఎందరో ఇక్కడ చిత్రీకరణలో సందడి చేసినవారే. అతి సుందరమైన ప్రదేశం పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతి, మహా నగరమైన చెన్నై జాతీయ రహదారి పక్కనే కొలువైన అతిపెద్ద జలాశయం బహుసుందరంగా ఉంటుంది. ఇక్కడి నుంచి తిరుపతి, చెన్నై నగరాలకు 60 నుంచి 70 కిలోమీటర్ల దూరం ఉంటుంది. చెన్నై నుంచి తిరుమలకు వెళ్లే యాత్రికులకు అరణియార్ వద్ద సేద తీరేవారు. ఇక్కడ ప్రకతి అందాలు సైతం ఆహ్లాదకరంగా ఉంటాయి. ఇక్కడ ఆకట్టుకునే ఉద్యానవనం ఉండడంతో వెండితెర, బుల్లితెర దర్శకులు తరలివచ్చేవారు. అయితే 20 ఏళ్ల క్రితం పర్యాటక నిర్వహణకు నిధులు నిలిపివేయడంతో పార్కులన్నీ వెలవెలబోయాయి. ఇన్నేళ్లకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం అరణియార్ సుందరీకరణకు శ్రీకారం చుట్టడంతో స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అరణియార్ ప్రాజెక్టుకు పూర్వ వైభవం తీసుకురావడానికి ఎమ్మెల్యే ఆదిమూలం తీవ్రంగా కృషి చేస్తున్నారు. అధికారుల సహకారంతో ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి అందజేశారు. ఎంపీని కలిసి నిధుల మంజూరుకు చొరవ చూపాలని విన్నవించారు. -
20 సినిమాలకు పైగా షూటింగ్.. జానకిరాముడు, ప్రేమదేశం తీసింది అక్కడే..
పిచ్చాటూరు(చిత్తూరు జిల్లా): జిల్లాలోనే అతిపెద్ద జలాశయం అరణియార్ బహుసుందరంగా మారనుంది. బోటింగ్ సరదా తీర్చనుంది. సినిమా షూటింగులకు అనువుగా తయారుకానుంది. రిసార్టులు కొలువుదీరేందుకు ప్రణాళిక సిద్ధమైంది. చిల్ర్టన్స్ పార్క్, ఉద్యానవనం, పచ్చిక బయళ్లు, వ్యూ టవర్ వంటి నిర్మాణాలతో ముస్తాబు కానుంది. తిరుమల– చెన్నై మార్గంలో పర్యాటక కేంద్రంగా రూపు దిద్దుకోనుంది. ఇందుకోసం ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. అధికార యంత్రాంగం అరణియార్ ప్రాజెక్టు సుందరీకరణకు శ్రీకారం చుట్టింది. అరణియార్ పర్యాటకానికి మహర్దశ కలగనుంది. ప్రాజెక్టు సుందరీకరణ, అభివృద్ధికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందుకు అవసరమైన నిధులు సమకూర్చడానికి తుడాతో పాటు పర్యాటక శాఖకు గత ఏడాది ప్రతిపాదనలు అందాయి. అంతే వేగంగా స్పందించిన తుడా రూ.1.5 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు జనవరి 3న తుడా వీసీ హరికృష్ణ అరణియార్‌ను సందర్శించి నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. పర్యాటక శాఖకు రూ.5 కోట్లతో ప్రతిపాదనలు పంపించారు. అరణియార్ అభివృద్ధి, సుందరీకరణ పనులకు 20 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తున్నట్లు నీటిపారుదల శాఖ అధికారులు వెల్లడించారు. ఈ ప్రాజెక్టు వద్ద జైకా నిధులు రూ.35 కోట్లతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. పిచ్చాటూరు అరణియార్ గేట్ల వద్ద ప్రకృతి అందాలు అరణియార్ వద్ద చేపట్టనున్న పనులు తుడా అందించే నిధులతో అరణియార్ అందాలన్నీ తిలకించేలా ప్రాజెక్టు వద్ద వ్యూ టవర్ నిర్మించను న్నారు. నదిపై సరదాగా ప్రయాణించేందుకు బోటింగ్ ఏర్పాటు చేయనున్నారు. పర్యాటకులకు అనువుగా కాటేజీలు అందుబాటులోకి రానున్నాయి. అదే విధంగా పర్యాటక శాఖ అందించే నిధులతో అదనంగా మరో బోటింగ్, రిసార్టులు, చిల్డ్రన్ పార్క్, ఉద్యానవనాల అభివృద్ధి, సినిమా, టీవీ సీరియళ్ల షూటింగ్‌కు అనువుగా పచ్చిక మైదానాలు నిర్మించనున్నారు. అతి సుందరమైన ప్రదేశం పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతి, మహా నగరమైన చెన్నై జాతీయ రహదారి పక్కనే కొలువైన అతిపెద్ద జలాశయం బహుసుందరంగా ఉంటుంది. ఇక్కడి నుంచి తిరుపతి, చెన్నై నగరాలకు 60 నుంచి 70 కిలోమీటర్ల దూరం ఉంటుంది. చెన్నై నుంచి తిరుమలకు వెళ్లే యాత్రికులకు అరణియార్ వద్ద సేద తీరేవారు. ప్రకృతి అందాలు సైతం ఆహ్లాదకరంగా ఉంటాయి. ఇక్కడ ఆకట్టుకునే ఉద్యానవనం ఉండడంతో వెండితెర, బుల్లితెర దర్శకులు తరలివచ్చేవారు. అయితే 20 ఏళ్ల క్రితం పర్యాటక నిర్వహణకు నిధులు నిలిపివేయడంతో పార్కులన్నీ వెలవెలబోయాయి. ఇన్నేళ్లకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం అరణియార్ సుందరీకరణకు శ్రీకారం చుట్టడంతో స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అరణియార్ ప్రాజెక్టుకు పూర్వ వైభవం తీసుకురావడానికి ఎమ్మెల్యే ఆదిమూలం తీవ్రంగా కృషి చేస్తున్నారు. అధికారుల సహకారంతో ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి అందజేశారు. పర్యాటక శాఖ, నీటి పారుదల శాఖ అధికారుల సమన్వయంతో అభివృద్ధి పనులను వేగితరం చేస్తున్నారు. గతంలో షూటింగ్ స్పాట్ ఇదే పిచ్చాటూరు అరణియార్ ప్రాజెక్టు గతంలో షూటింగ్ స్పాట్‌గా పేరొందింది. ఇక్కడ సుమారు 20 సినిమాలకు పైగా చిత్రీకరించారు. అందులో ప్రధానంగా జానకిరాముడు, ప్రేమదేశం, అన్నకిళి, టూటౌన్ రౌడీ సినిమాలు సూపర్ హిట్ అందుకున్నాయి. దీంతోపాటు వందలాది సినిమాల్లో పాటల చిత్రీకరణ ఇక్కడే సాగింది. తెలుగు, తమిళం సినిమాల్లోని పాటల చిత్రీకరణకు ఇది చాలా అనువైన ప్రదేశంగా నిలిచింది. టీవీ సీరియళ్లు ఎక్కువ కాలం పాటు చిత్రీకరించేవారు. నాగమ్మ టీవీ సీరియల్ 80 శాతం ఇక్కడే రూపుదిద్దుకుంది. బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, రాజేంద్రప్రసాద్, విజయశాంతి, రాధ వంటి తారలు ఇక్కడ సందడి చేసినవారే. సంతోషంగా ఉంది గతంలో ఈ ప్రాంతంలో ఉన్న ఉద్యానవనం, రకరకాల జంతువుల బొమ్మలతో పిల్లలను ఎంతో ఆహ్లాదపరిచేది. నిత్యం పర్యాటకులతో సందడిగా ఉండేది. మళ్లీ ఇక్కడ పర్యాటక అభివృద్ధికి ప్రభుత్వం శ్రీకారం చుట్టడం సంతోషంగా ఉంది. సుందరీకరణను వేగవంతం చేయాలి. – తిరుమల, టూటౌన్, పిచ్చాటూరు అందుబాటులో ఆహ్లాదం అరణియార్ ప్రాజెక్టును పర్యాటక ప్రదేశంగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. గతంలోలాగా పర్యాటకులు, సినీ తారలు, దర్శకు లు తరలి రావాలి. ఈ జలాశయం షూటింగ్ స్పాట్‌గా సందడి చేయాలి. దీని వల్ల ప్రభుత్వానికి ఆదాయం చేకూరడంతోపాటు స్థానికులకు కాస్త ఆహ్లాదం అందుబాటులో ఉంటుంది. –గంగాధరం రెడ్డి, రిటైర్డ్ టీచర్, పిచ్చాటూరు మరిన్ని నిధులు తెప్పిస్తా పర్యాటక అభివృద్ధికి అవసరమైన మరిన్ని నిధులు తేవడానికి నా వంతు కృషి చేస్తా. గతంలో ఈ అరణియార్ వైభవాన్ని స్వయంగా చూశాను. కాబట్టే మళ్లీ ఆ స్థితికి రావాలని ప్రయతి్నస్తున్నా. తిరుపతి ఎంపీ గురుమూర్తి సహకారం తీసుకుని, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో నిధులు మంజూరు చేస్తున్నారు. –కోనేటి ఆదిమూలం, ఎమ్మెల్యే, సత్యవేడు -
త్వరలో టూరిజం యాప్
విశాఖ తూర్పు/భవానీపురం (విజయవాడ పశ్చిమ): రాష్ట్రంలోని పర్యాటక కేంద్రాల వివరాలతో త్వరలోనే ఆంధ్రప్రదేశ్ టూరిజం యాప్‌ను ప్రారంభిస్తున్నట్లు పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు చెప్పారు. జాతీయ పర్యాటక దినోత్సవ రాష్ట్రస్థాయి వేడుకలను మంగళవారం విశాఖలో ఘనంగా నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ.. సీఎం జగన్ అనుమతితో విశాఖ నుంచి రాయలసీమ వరకు టూరిజం సర్క్యూట్‌కు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో అందమైన ప్రాంతాలు పురాతన, చారిత్రాత్మక ప్రాంతాలతోపాటు ఆలయాలు, సాహస క్రీడల పర్యాటకానికి అపార అవకాశాలున్నాయని తెలిపారు. అంతర్జాతీయ ప్రాముఖ్యత వచ్చేలా విశాఖ నుంచి గోదావరి, కృష్ణలంక, గండికోట మొదలైన ప్రాంతాలను సర్క్యూట్‌గా తీర్చిదిద్దితే పర్యాటకం గణనీయంగా అభివృద్ది చెందుతుందన్నారు. కార్యక్రమంలో అరకు ఎంపీ మాధవి, ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వరప్రసాదరెడ్డి, కలెక్టర్ మల్లికార్జున పాల్గొన్నారు. సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు కృషి భారతదేశ ప్రాచీన సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు ఏపీ పర్యాటక అభివృద్ధి సంస్థ కృషి చేస్తోందని ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఏఎల్ మల్రెడ్డి చెప్పారు. జాతీయ పర్యాటక దినోత్సవం సందర్భంగా ఏపీటీడీసీ ఆధ్వర్యంలో విజయవాడ భవానీపురంలోని హరిత బెరంపార్క్‌లో మంగళవారం వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కాగా, యోగా నిపుణుడు కేవీఎస్‌కే మూర్తి 12 నిమిషాల్లో 12 సూర్య నమస్కారాలను 108 సార్లు ప్రదర్శించి ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డు దక్కించుకున్నారు. అవార్డును ఆ సంస్థ డైరెక్టర్ డాక్టర్ జివీఎన్‌ఆర్‌ఎస్‌ఎస్‌ఎస్ వరప్రసాద్ ప్రదానం చేశారు. -
పర్యాటక ప్యాకేజీలతో ఆదాయం పరుగు
సాక్షి, అమరావతి: రాష్ట్ర పర్యాటకశాఖ ప్రకటిస్తున్న ప్యాకేజీల కారణంగా ఆ శాఖ ఆదాయం గణనీయంగా పెరుగుతోంది. రాష్ట్రంలో గతేడాది ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు రూ.24.05 కోట్లు ఆర్జించింది. ఇందులో తిరుపతి ప్యాకేజీల నుంచే అత్యధికంగా రూ.18 కోట్లు రావడం విశేషం. ఒక్క డిసెంబర్లోనే రూ.4 కోట్ల వరకు ఆదాయం వచ్చింది. ఆ తర్వాత విశాఖ లోకల్‌టూర్లకు ఎక్కువ ఆదరణ లభిస్తోంది. మరోవైపు కార్తీకమాసంలో శైవక్షేత్రాలు, శక్తిపీఠాల ప్యాకేజీలు కొంతమేరకు ఆదాయవృద్ధికి దోహదపడ్డాయి. ప్రస్తుతం పర్యాటక శాఖ 35 టూర్ ప్యాకేజీలను నడుపుతూ.. 30 సొంత బస్సుల్లో ప్రయాణికులకు మెరుగైన సేవలందిస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్, ముంబయి వంటి మెట్రో నగరాల నుంచి తిరుపతికి విమాన ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చింది. గ్రాండ్ కేనియన్ ఆఫ్ ఇండియాగా పిలిచే గండికోటకు బెంగళూరు, హైదరాబాద్ నుంచి పర్యాటకుల రాకను ప్రోత్సహిస్తున్నారు. కోవిడ్ ప్రారంభమైన తర్వాత పడిపోయిన పర్యాటకశాఖ ఆదాయం ప్యాకేజీలతో తిరిగి పుంజుకుంటుంది. తిరుపతికి ఇలా.. రవాణాతో పాటు వసతి, స్వామివారి దర్శనం కల్పిస్తుండడంతో తిరుపతి టూర్ ప్యాకేజీలకు మంచి ఆదరణ లభిస్తున్నది. ప్రస్తుతం కర్నూలు, ఒంగోలు, ప్రొద్దుటూరు, విజయవాడ, హైదరాబాద్, చెన్నై, విశాఖపట్నం, బెంగళూరు నుంచి తిరుపతికి పర్యాటక శాఖ బస్సులు నడుపుతోంది. మరోవైపు చెన్నై–వళ్లూరు–తిరుపతి, తిరుపతి–శ్రీశైలం, తిరుపతి–కాణిపాకం–స్వర్ణ దేవాలయం, అరుణాచలం తదితర లోకల్ ప్యాకేజీలను అందిస్తోంది. లోకల్ టూరిజం.. స్థానిక పర్యాటకాన్ని ప్రోత్సహించేలా విశాఖపట్నం–లంబసింగి, విశాఖపట్నం–అరసవిల్లి దేవాలయం, రాజమండ్రి–మారేడుమిల్లి, కర్నూలు–శ్రీకాకుళం–నంద్యాల, శ్రీకాకుళంలో అరసవిల్లి–శ్రీకూర్మం–శాలిహుండం–కళింగపట్నంకు ఒక్కరోజులో చుట్టివచ్చే అవకాశాన్ని కల్పిస్తోంది. అలాగే సర్క్యూట్ టూరిజంలో భాగంగా కొత్తగా అనంతపురం–కదిరి–వేమనగారి జన్మస్థలం ప్రాంతం–గండి ఆంజనేయస్వామి దేవాలయం, గండికోట, బెలూం గుహలు, తాడిపత్రి వెంకటేశ్వరస్వామి దేవాలయంతో కలిపి రెండు రోజుల ప్యాకేజీని రూపొందించింది. ఈ ప్యాకేజీల ద్వారా పర్యాటక శాఖ సిబ్బంది జీతాలు, రవాణా ఖర్చులు అన్నీ పోనూ నికరంగా సుమారు రూ.6 కోట్లకు పైగా ఆదాయం లభించింది. పర్యాటకానికి కొత్త ఉత్సాహం రాష్ట్ర వ్యాప్తంగా సర్క్యూట్ టూరిజాన్ని ప్రోత్సహిస్తున్నాం. కొత్తగా హైదరాబాద్, ముంబయి నుంచి విమాన ప్యాకేజీని ప్రవేశపెట్టాం. దేశంలోని ప్రధాన నగరాల్లోనూ ఏపీ టూరిజం కేంద్రాలను ఏర్పాటు చేయనున్నాం. – ముత్తంశెట్టి శ్రీనివాసరావు, రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి సొంత బస్సుల్లో సురక్షితంగా.. కోవిడ్ నిబంధనలు అనుసరిస్తూనే పర్యాటక ప్యాకేజీలను నడుపుతున్నాం. కోవిడ్ కారణంగా రెండేళ్లలో ఎన్నడూ లేనంత వృద్ధి కేవలం ఆరు నెలల్లో సాధించాం. సొంత బస్సుల్లో సురక్షితంగా పర్యాటకులను తీసుకెళ్లి తీసుకొస్తుండడంతో ఎక్కువ ఆదరణ లభిస్తోంది. – ఎస్. సత్యనారాయణ, ఏపీటీడీసీ ఎండీ -
పాపికొండల సోయగాలు.. నదీ విహారం
సాక్షి, అమరావతి: గోదావరిలో పాపికొండల సోయగాలు.. గోదావరి ఇసుక తిన్నెల్లో వెన్నెల రాత్రులు.. పోచవరం నుంచి భద్రాచలానికి హాయిహాయిగా ప్రయాణం.. కృష్ణా నదిలో భవానీ ద్వీపంలో ఆట పాటలు.. నాగార్జున సాగర్‌లో చల్ల గాలుల మధ్య విహారం.. ఇలా ఎన్నో ప్రకృతి అందాల మధ్య ప్రపంచాన్ని మరిచి ప్రయాణం చేస్తారా.. అందుకు మీరు సిద్ధమేనా అంటోంది రాష్ట్ర పర్యాటక శాఖ. రాష్ట్రంలో జల పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు ఆధునిక బోట్లను అందుబాటులోకి తెస్తోంది. కరోనా తర్వాత ఇప్పుడిప్పుడే పర్యాటకం ఊపందుకుంటుండంతో డిమాండ్‌కు అనుగుణంగా ఆధునిక బోట్ల సంఖ్యను పెంచుతోంది. నిలిచిపోయిన బోట్లకు యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపడుతోంది. ప్రస్తుతం పాపికొండలకు వారాంతంలో 45 మంది ప్రయాణికుల సామర్థ్యంతో పర్యాటక శాఖ బోటు నడుపుతుండగా 95 మంది సామర్థ్యంతో మరో హరిత బోటును అందుబాటులోకి తేనుంది. పోచవరం నుంచి భద్రాచలానికి కూడా బోటును తిప్పేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మరోవైపు సాగర్–శ్రీశైలం ప్రయాణానికి సంతశ్రీ బోటును రూ.35 లక్షలతో మరమ్మతులు చేపట్టి సంక్రాంతి నాటికి తీసుకురానుంది. చాలా కాలం తర్వాత విజయవాడలోని భవానీ ద్వీపంలో బోధిశ్రీ బోటు సేవలకు సిద్ధమైంది. రాబడి పెంచుకునేందుకు యత్నాలు ప్రస్తుతం పరిస్థితులు అనుకూలంగా ఉండటంతో పాపికొండలకు నిత్యం రెండు బోట్లు (ప్రైవేటు) తిరుగుతున్నాయి. వారాంతాల్లో పర్యాటక శాఖ బోట్లతో కలిపి ఐదు సేవలందిస్తున్నాయి. సగటున రోజుకు 300 మంది ప్రయాణిస్తున్నారు. భవానీ ద్వీపంలో బోటింగ్ ద్వారా రోజుకు సగటున రూ.40 వేలు, వారాంతాల్లో రూ.2.50 లక్షల ఆదాయం వస్తుండటం విశేషం. ఇక్కడ వారాంతంలో సుమారు 1,500 మంది బోట్లలో ప్రయాణిస్తున్నారు. రాష్ట్రం మొత్తంగా 12 ప్రదేశాల్లో పర్యాటక శాఖకు చెందిన 48 బోట్లు, వందకు పైగా ప్రైవేటు బోట్లు సేవలందిస్తున్నాయి. గతంలో కేవలం బోటింగ్ ద్వారా రూ.7 కోట్లకు పైగా ఆదాయం రాగా ప్రస్తుతం అది రూ.కోటికి పడిపోయింది. డిసెంబర్ నుంచి మార్చి వరకు సమయం ఉండటంతో రాబడి పెంచుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. పాపికొండల నైట్ ప్యాకేజీలు ఇలా.. పర్యాటక శాఖ పాపికొండలకు రెండు రోజుల (నైట్) ప్యాకేజీలను అందిస్తోంది. గండిపోచమ్మ – పేరంటాళ్లపల్లి ప్రయాణానికి చార్జి సాధారణ రోజుల్లో (సోమవారం నుంచి గురువారం వరకు) పెద్దలకు రూ.3,200, పిల్లలకు 2,300, వారాంతాల్లో (శుక్రవారం నుంచి ఆదివారం) పెద్దలకు రూ.3,500, పిల్లలకు రూ.2,500గా నిర్ణయించారు. రాజమండ్రి–గండిపోచమ్మ– పేరంటాళ్లపల్లి ప్యాకేజీలో సాధారణ రోజుల్లో పెద్దలకు రూ.4,000, పిల్లలకు రూ.3,000, వారాంతాల్లో పెద్దలకు రూ.4,300, పిల్లలకు రూ.3,300 టికెట్ ధర ఖరారు చేశారు. ఇందులో రాజమండ్రి నుంచి పర్యాటక శాఖ బస్సులో ప్రయాణికులను బోటింగ్ పాయింట్‌కు తరలిస్తారు. ఉదయం 8 గంటలకు ప్రయాణం మొదలై మరుసటి రోజు రాత్రి 8.30 గంటలకు ముగుస్తుంది. పేరంటాళ్లపల్లి నుంచి తిరుగు ప్రయాణంలో కొల్లూరు, కొరుటూరులోని గిరిజన సంప్రదాయ తరహా బ్యాంబూ హట్స్‌లో (వెదురుతో చేసిన గుడిసెలు) రాత్రి బసను ఏర్పాటు చేస్తారు. సందర్శకులకు ఆటవిడుపుగా వాలీబాల్, కబడ్డీ, ట్రెక్కింగ్, జంగిల్ వాక్ సౌకర్యాలను మెరుగుపరిచారు. బోట్ల సంఖ్యను పెంచుతున్నాం రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా అనేక కారణాలతో బోట్లు చాలా కాలంపాటు నిలిచిపోయాయి. పర్యాటకుల సంఖ్య పెరుగుతుండటంతో వాటిని వాడుకలోకి తెచ్చేందుకు మరమ్మతులు చేయిస్తున్నాం. పోచవరం నుంచి భద్రాచలానికి కూడా బోటు తిప్పేందుకు ఆలోచిస్తున్నాం. పోలవరానికి ప్రత్యేక నైట్ ప్యాకేజీలను అందుబాటులోకి తెచ్చాం. – ఎస్.సత్యనారాయణ, ఎండీ, ఏపీ టూరిజం కార్పొరేషన్ రాబడి పెంపుపై దృష్టి రాష్ట్రంలో జల పర్యాటకానికి చాలా ప్రాముఖ్యత ఉంది. పర్యాటకుల డిమాండ్‌కు అనుగుణంగా బోట్ల సంఖ్యను పెంచి రాబడి పెంచేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాం. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా బోట్లకు మరమ్మతులు చేపడుతున్నాం. త్వరలోనే పోర్టు అధికారుల నుంచి అనుమతి తీసుకుని వాటిని నీటిలోకి ప్రవేశపెడతాం. – ఆరిమండ వరప్రసాద్‌రెడ్డి, చైర్మన్, ఏపీ టూరిజం కార్పొరేషన్ -
Tourism: భద్రాచలం, పాపికొండలు చూసొద్దాం రండి..
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ నుంచి భద్రాచలం.. అక్కడి నుంచి పాపికొండలకు కొత్త ప్యాకేజీని ప్రారంభించనున్నట్లు తెలంగాణ పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా తెలిపారు. ఈ ప్యాకేజీకి ప్రభుత్వం నుంచి శనివారమే అనుమతి లభించిందన్నారు. వచ్చేవారం నుంచి పర్యటన ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. ఈ పర్యటన ప్యాకేజీ పెద్దలకు రూ.4,999, పిల్లలకు రూ.3,999 చొప్పున ఉంటుంది. చదవండి: Medak CSI Church: మెతుకు పంచిన కోవెల.. ప్రత్యేకతలకు నిలయం.. పర్యటన ఇలా... మొదటి రోజు సాయంత్రం 7 గంటలకు పర్యాటక భవన్ నుంచి రాత్రి 8 గంటలకు బషీర్‌బాగ్ లోని పర్యాటక కార్యాలయం నుంచి బస్సు బయలుదేరుతుంది. రెండో రోజు ఉదయం 5 గంటలకు భద్రాచలంలోని హరిత హోటల్‌కు, 7.30కు పోచారం బోటింగ్ పాయింట్‌కు చేరుకుంటారు. 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పాపికొండలు, పేరంటాళ్లపల్లికి బోటింగ్. ఈ సమయంలోనే భోజనం, స్నాక్స్ అందజేస్తారు. సాయంత్రం 5 గంటలకు బయలుదేరి భద్రాచలం చేరుకుంటారు. మూడో రోజు ఉదయం 7 నుంచి 8 గంటల వరకు ఆలయ దర్శనం. 11.30 గంటల వరకు పర్ణశాల సందర్శన, అనంతరం తిరిగి హరిత హోటల్‌కు చేరుకుంటారు, మధ్యాహ్నం భోజనం అనంతరం 2.30 గంటలకు భద్రాచలం నుంచి బయలుదేరి రాత్రి 10.30 గంటలకు హైదరాబాద్ చేరుకుంటారు. -
వైజాగ్‌లో లండన్ ఐ!
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఒకవైపు సముద్ర అలల తాకిడి... మరోవైపు కొండగాలి పలకరింపులు.. రెండింటి మధ్య విశాఖ అందాలను 360 డిగ్రీల కోణంలో 125 మీటర్ల ఎత్తు నుంచి చూస్తూ రాత్రి డిన్నర్ చేస్తే ఎలా ఉంటుంది. ఆహా ఊహ అద్భుతంగా ఉంది కదూ.. ఇప్పుడు ఆ ఊహ కాస్తా నిజం కానుంది. విశాఖపట్నంలో ‘లండన్ ఐ’ తరహాలో 125 మీటర్ల ఎత్తు ఉన్న మెగా వీల్‌ను బీచ్ రోడ్డులో నిర్మించేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తోంది. పర్యాటకశాఖ ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నది. మొత్తం 15 ఎకరాల్లో రూ.250 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఈ మెగావీల్ ప్రపంచ మెగావీల్ టాప్–10లో ఒకటిగా నిలిచిపోనుంది. లండన్ ఐ తరహాలో.. లండన్ ఐ.. మిలీనియం వీల్.. అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించే ప్రదేశం. థేమ్స్ నది ఒడ్డున ఏకంగా 130 మీటర్ల ఎత్తులోనున్న జెయింట్ వీల్ నుంచి లండన్ నగరాన్ని చూసే వీలుంది. ఇప్పుడు అదే తరహాలో సముద్రం ఒడ్డున వైజాగ్ అందాలను ఒకేసారి వీక్షించేందుకు అనుగుణంగా మెగావీల్ను నిర్మించనున్నారు. అంతేకాదు రాత్రి సమయంలో అటు సముద్రం.. ఇటు నగర అందాలను వీక్షిస్తూ 125 మీటర్ల ఎత్తులో భోజనం కూడా చేసే ఏర్పాట్లు చేయాలని పర్యాటకశాఖ నిర్ణయించింది. ఇప్పటికే ఈ మెగావీల్ నిర్మాణానికి అవసరమైన 15 ఎకరాల భూమిని అధికారులు పరిశీలిస్తున్నారు. బీచ్ రోడ్డులో 4 ప్రదేశాలను పర్యాటకశాఖ అధికారులు పరిశీలించినట్లు తెలుస్తోంది. అంతిమంగా భీమిలికి వెళుతున్న బీచ్‌రోడ్డుకు ఇటువైపుగా రూ. 250 కోట్ల మేర వ్యయంతో ఈ మెగావీల్ ఏర్పాటు చేసేందుకు సమాయత్తమవుతున్నట్లు సమాచారం. ఇందులో 44 కేబిన్లు ఉంటాయి. ఒక్కో కేబిన్‌లో 10 మంది చొప్పున ఒకేసారి 440 మంది ప్రయాణించే వీలుంటుంది. 15 ఎకరాల్లో ఈ మెగావీల్తో పాటు షాపింగ్ కాంప్లెక్స్, పార్కింగ్, ఇతర రిక్రియేషన్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. మొత్తం గ్లాసుతో నిర్మించనున్న కేబిన్ల ద్వారా చుట్టూ ఉన్న ప్రకృతి అందాలను చూసే వీలు కలగనుంది. అంతేకాకుండా 125 మీటర్ల ఎత్తుకు వెళ్లిన తర్వాత కేబిన్ ఫ్లోరింగ్ కూడా గ్లాసుతో నిర్మించనుండడంతో కిందకు కూడా చూసే వీలుంటుంది. ► కేబిన్‌లో పూర్తిస్థాయి ఏసీ సదుపాయం. వైఫై, ఆడియో, వీడియో సదుపాయంతో పాటు పబ్లిక్ అనౌన్స్మెంట్ సిస్టమ్ ఏర్పాటు. ► ఆటోమేటిక్ ఫొటోగ్రఫీ సదుపాయం. ► తుపాన్లతోపాటు 8.3 భూకంప తీవ్రతస్థాయిని తట్టుకునేలా వీల్ నిర్మాణం. ► అత్యధిక ఉష్ణోగ్రతలనూ తట్టుకుంటుంది. ► వీల్ మొత్తం ఒకసారి రొటేషన్ అయ్యేందుకు 20 నిమిషాల సమయం పడుతుంది. అంటే గంటకు 1,320 మంది పర్యాటకులు ప్రయాణించేందుకు వీలు. పర్యాటక అభివృద్ధికి అన్ని చర్యలు విశాఖ నగరాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు తయారు చేస్తున్నాం. అటు బీచ్‌ల అభివృద్ధితో పాటు పలు హోటల్స్, రిసార్టుల నిర్మాణం జరుగుతోంది. మెగా వీల్ నిర్మాణంతో విశాఖ పర్యాటకంగా మరింత పరుగులు పెట్టనుంది. పలు ప్రైవేటు సంస్థలు కూడా ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి. – ముత్తంశెట్టి శ్రీనివాస్, పర్యాటక శాఖ మంత్రి 4 ప్రాంతాలను పరిశీలిస్తున్నాం.. విశాఖపట్నానికి ఈ మెగావీల్ తలమానికం కానుంది. ఈ మెగావీల్ నిర్మాణానికి 15 ఎకరాల స్థలం అవసరం. ఇందుకోసం నాలుగు ప్రాంతాలను పరిశీలిస్తున్నాం. నగరాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు అన్ని చర్యలూ తీసుకుంటున్నాం. – ప్రసాద్ రెడ్డి, ఏపీటీడీసీ చైర్మన్ -
నైపుణ్య పోటీల్లో సత్తా చాటిన ఏపీ
మహారాణిపేట (విశాఖ దక్షిణ): దక్షిణ భారత రాష్ట్రాల నైపుణ్య పోటీల్లో ఆంధ్రప్రదేశ్ సత్తా చాటింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఎక్కువ అవార్డులను సొంతం చేసుకుంది. జాతీయ నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఎన్ఎస్డీసీ), ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్ఎస్డీసీ) ఆధ్వర్యంలో విశాఖలో ఈనెల 1 నుంచి 4వ తేదీ వరకు నిర్వహించిన దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ నైపుణ్య పోటీలు ఘనంగా ముగిశాయి. ఏయూ కన్వెన్షన్ సెంటర్లో ముగింపు వేడుకలు జరిగాయి. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు విజేతలకు అవార్డులు ప్రదానం చేశారు. మొబైల్ రోబోటిక్స్, ఐటీ ఎలక్ట్రానిక్స్, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్, డిజిటల్ కన్స్ట్రక్షన్ వంటి నైపుణ్య విభాగాల్లో రాష్ట్ర యువత పురస్కారాలు దక్కించుకుంది. 2018లో జరిగిన నైపుణ్య పోటీల్లో మన రాష్ట్రానికి 8 అవార్డులు దక్కగా, ఈసారి 20 అవార్డులు వచ్చాయి. అందులో 12 బంగారు, 8 సిల్వర్ మెడల్స్ ఉన్నాయి. దక్షిణాది రాష్ట్రాల నైపుణ్య పోటీల్లో విజేతలుగా నిలిచిన వీరంతా జనవరి 6 నుంచి పదో తేదీ వరకు బెంగళూరులో జరిగే జాతీయ స్థాయి నైపుణ్య పోటీల్లో పాల్గొంటారు. జాతీయ స్థాయి నైపుణ్య పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారు 2022 అక్టోబర్‌లో చైనాలో జరిగే ప్రపంచ స్థాయి నైపుణ్య పోటీలకు ప్రాతినిధ్యం వహించే అవకాశం దక్కుతుంది. ఈ సందర్భంగా మంత్రి ముత్తంశెట్టి మాట్లాడుతూ ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని యువతకు పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (నైపుణ్యాభివృద్ధి శిక్షణ) చల్లా మధుసూదనరెడ్డి మాట్లాడుతూ అంతర్జాతీయ స్థాయి నైపుణ్యాలు మన రాష్ట్రంలోని యువతకు అందించాలని సీఎం వైఎస్ జగన్ లక్ష్యమన్నారు. ఈ పోటీల్లో మొత్తం 51 టెక్నికల్ ట్రేడ్‌లో మొదటి, రెండో స్థానాల్లో నిలిచిన 124 మందిని నైపుణ్య పోటీల్లో విజేతలుగా జ్యూరీ సభ్యులు ఎంపిక చేశారు. -
ఘంటసాల కుటుంబ సభ్యులకు అండగా ప్రభుత్వం
మహారాణిపేట (విశాఖ దక్షిణ): అమర గాయకుడు పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు సరస్వతీ పుత్రుడని, తన అమృత గానంతో శ్రోతలను మంత్రముగ్ధులను చేశారని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు కొనియాడారు. ఘంటసాల కుటుంబ సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. ఘంటసాల శత జయంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం తరఫున వీఎంఆర్డీఎ చిల్డ్రన్స్ ఎరీనాలో శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా తపాలా శాఖ పోస్టల్ కవర్ విడుదల చేయగా.. మంత్రి ఆవిష్కరించారు. ఘంటసాలపై రచించిన రెండు పుస్తకాలను కూడా ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గుడివాడ అమర్నాథ్, తిప్పల నాగిరెడ్డి, నెడ్‌క్యాప్ చైర్మన్ కె.కె.రాజు, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మల్లికార్జున, మేయర్ గొలగాని హరి వెంకటకుమారి, జిల్లా పరిషత్ చైరపర్సన్ జె.సుభద్ర, రాష్ట్ర సృజనాత్మక, సాంస్కృతిక సమితి చైర్పర్సన్ వంగపండు ఉష తదితరులు పాల్గొన్నారు. -
కాలం మారింది.. ఇక మీ టేబుల్ వద్దకు వెయిటర్స్ రారు, అంతా మీ చేతుల్లోనే!
తరాలు మారుతున్న కొద్దీ ప్రజల్లో అనాదిగా వస్తున్న ఆచారాలు, సంప్రదాయాలు, అభిరుచులు ఆలోచనా విధానాల్లో విప్లవాత్మక మార్పులొస్తున్నాయి. తదనుగుణంగా ఆధునిక జీవనశైలి అలవర్చుకుంటున్నారు. ప్రస్తుతం ప్రపంచం డిజిటల్ వైపు పరుగులు తీస్తోంది. అందుకు హోటళ్లు, రెస్టారెంట్ పరిశ్రమలు సైతం మినహాయింపు కాదు. ఈ నేపథ్యంలో ఆయా రంగాలు.. సాధారణ ముద్రిత మెనూల స్థానంలో ‘డిజిటల్ మెనూ’ను ప్రవేశపెడుతున్నాయి. వెయిటర్స్‌తో సంబంధం లేకుండా కూర్చున్న చోటు నుంచే వినియోగదారులు ఆహారాన్ని ఆర్డర్ చేయడానికి, బిల్లు చెల్లింపులు చేసేందుకు ‘నో టచ్ ఆర్డరింగ్’ పేరుతో క్యూఆర్ కోడ్ సాయంతో డిజిటల్ మెనూను తీసుకొస్తున్నాయి. – సాక్షి, అమరావతి నో వెయిటింగ్.. ఈజీ ఆర్డర్ టేబుల్‌పై ఉంచిన ప్రత్యేక క్యూఆర్ కోడ్‌లో రెస్టారెంట్లో లభించే పదార్థాల వివరాలను పొందుపరుస్తారు. దానికే సంబంధిత బ్యాంకు ఖాతాను జత చేస్తారు. వినియోగదారులు స్మార్ట్ ఫోన్‌తో కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా డిజిటల్ మెనూను వీక్షించవచ్చు. నచ్చిన ఆహారాన్ని వెయిటర్ సాయం లేకుండానే ఆర్డర్ చేయొచ్చు. ఇక్కడ ‘కిచెన్ టు టేబుల్’ (కేవోటీ)విధానంలో కోరిన ఆహారం జాప్యం లేకుండానే అందుతుంది. ఎలా తయారు చేస్తున్నారో చూడొచ్చు.. అన్య దేశాలకు చెందిన సంస్థల్లో ప్రత్యేకమైన డిజిటల్ మెనూ అందుబాటులో ఉంది. వాటిలో ట్యాబ్‌లను డిజిటల్ మెనూలుగా డైనింగ్ టేబుళ్లకు జోడిస్తున్నారు. మరోవైపు ‘సెల్ఫ్ ఆర్డరింగ్ కియోస్క్’లో మనం ఆర్డర్ చేసే పదార్థాన్ని 3డీ రూపంలో ముందుగానే చూపిస్తున్నారు. ఇక ఇంటరాక్టివ్ డిస్ప్లే టేబుల్స్ ద్వారా ఆర్డర్ చేసిన వస్తువు వచ్చేలోగా కిచెన్‌లో అది తయారు చేసే విధానాన్ని వీక్షించవచ్చు. టెక్నాలజీ వైపు.. కోవిడ్ తర్వాత భారతదేశంలోని దాదాపు మూడింట ఒకవంతు రెస్టారెంట్లు క్యూఆర్ కోడ్ ఆర్డరింగ్ టెక్నాలజీని చురుకుగా ఉపయోగిస్తున్నట్టు పలు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. 2021 చివరి నాటికి దేశంలోని 80 శాతం రెస్టారెంట్లు క్యూఆర్ కోడ్లు, ఇతర ఆన్లైన్ ఆర్డరింగ్ టెక్నాలజీలోకి వస్తాయని అంచనా వేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కొన్ని లగ్జరీ హోటళ్లు, రెస్టారెంట్లలో మాత్రమే డిజిటల్ మెనూ అమలవుతోంది. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోని హరిత హోటళ్లు, రిసార్టులు, రెస్టారెంట్లలో డిజిటల్ మెనూ విధానాన్ని ప్రవేశపెట్టేందుకు పర్యాటక శాఖ చర్యలు చేపడుతోంది. పైలట్ ప్రాజెక్టు కింద తొలుత 14 చోట్ల అందుబాటులోకి తేనున్నామని ఏపీటీడీసీ ఎండీ సత్యనారాయణ చెప్పారు. శ్రామిక శక్తి సామర్థ్యం పెంపు రద్దీగా ఉండే హోటళ్లలో వెయిటర్‌కు ఆర్డర్ ఇచ్చేందుకు గంటల పాటు ఎదురు చూసే అవస్థలు తప్పుతాయి. ముఖ్యంగా శ్రామిక శక్తి కొరతను, పని భారాన్ని అధిగమించొచ్చు.ఈ డిజిటల్ మెనూలను బహుళ భాషల్లో సులభంగా సృష్టించవచ్చు. -
ఒక్క రోజులో.. అదిరిపోయే టూర్లు!
సాక్షి, అమరావతి: కార్తీక మాసంలో ఆధ్యాత్మికతో పాటు ఆహ్లాదాన్ని పంచేలా ‘వన్డే’, ప్రత్యేక టూర్లకు రాష్ట్ర పర్యాటక శాఖ ప్రణాళికలు రూపొందించింది. హైదరాబాద్ నుంచి ఒక్క రోజులో వచ్చి, వెళ్లేలా కూడా ప్యాకేజీలను అందుబాటులోకి తెస్తోంది. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల నుంచి సర్క్యూట్ల వారీగా దేవాలయాలు, సందర్శనీయ ప్రాంతాలను కలుపుతూ షెడ్యూల్ తయారు చేసింది. ప్రస్తుతం విశాఖ నుంచి ప్రతి సోమవారం పంచారామాలైన అమరావతి, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామం, సామర్లకోట శైవక్షేత్రాలను సందర్శించేందుకు పెద్దలకు రూ.1,685, పిల్లలకు రూ.1,350 టికెట్ ధరలతో ప్రయాణ సౌకర్యాన్ని కల్పించింది. అలాగే విజయవాడ నుంచి కూడా ప్రతి సోమవారం పంచారామాలను దర్శించుకునేందుకు పెద్దలకు రూ.1,430, పిల్లలకు రూ.1,190 ధరలతో పర్యాటక శాఖ టూర్ ఏర్పాటు చేసింది. తిరుపతి నుంచి కాణిపాకం, గోల్డెన్ టెంపుల్, అరుణాచలం, కంచి, తిరుత్తణిని సందర్శించేందుకు పెద్దలకు రూ.2,040, రూ.2,330, రూ.3,130, పిల్లలకు రూ.1,635, రూ.1,865, రూ.2,505 టికెట్ రేట్లతో(రెండు రాత్రులు, ఒక పగలు) యాత్రలకు రూపకల్పన చేసింది. ప్యాకేజీలకు అనుగుణంగా రవాణాతో పాటు భోజన, వసతి సౌకర్యాలు కూడా కల్పిస్తోంది. రాయలసీమ సర్క్యూట్లో ఇలా.. ఒక్క రోజు యాత్ర: తిరుపతిలోని టీటీడీ శ్రీనివాసం నుంచి ప్రతి సోమవారం తలకోన సిద్ధేశ్వరాలయం, గుడిమల్లం పరుశురామేశ్వరాలయం, కపిలేశ్వరస్వామి ఆలయం, తొండవాడ అగస్తేశ్వరస్వామి ఆలయాన్ని సందర్శించవచ్చు. వీటికి టికెట్ ధరను రూ.500గా నిర్ణయించింది. అలాగే ప్రతి రోజూ తిరుపతి సమీపంలోని ఆలయాలకు గైడ్ సౌకర్యంతో రూ.175, రూ.375 టికెట్ రేట్లతో ప్రయాణ సౌకర్యం కల్పిస్తోంది. శ్రీకాళహస్తి, కాణిపాకం, తలకోనకు విడివిడిగా స్థానిక ఆలయాలను కూడా సందర్శించేలా రూ.375తో ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చింది. రెండు రోజుల యాత్ర: శ్రీశైలం, మహానందికి ప్రతి మంగళవారం టీటీడీ శ్రీనివాసం నుంచి రెండు రోజుల యాత్ర ప్రారంభమవుతుంది. శ్రీశైలం, మహానంది, నందవరం, యాగంటి, బెలూం గుహలు, అల్లాడుపల్లి దేవాలయాలను సందర్శించవచ్చు. పెద్దలకు టికెట్ ధర రూ.3,960, పిల్లలకు రూ.3,165గా నిర్ణయించింది. ఉత్తరాంధ్రను చుట్టేసేలా.. విశాఖ నుంచి లంబసింగి, కొత్తపల్లి వాటర్‌ఫాల్స్, మత్స్యగుండం, మోదుకొండమ్మ ఆలయాన్ని దర్శించేందుకుగాను పెద్దలకు రూ.1,970, రూ.1,850, పిల్లలకు రూ.1,575, రూ.1,480గా టికెట్ ధరలను పర్యాటక శాఖ నిర్ణయించింది. శక్తిపీఠాలైన పిఠాపురం, ద్రాక్షారామంతో పాటు అన్నవరం సందర్శనకు పెద్దలకు రూ.1,180, రూ.1,200, రూ.1,375, రూ.1,200, పిల్లలకు రూ.945, రూ.960 టికెట్ రేట్లతో వివిధ ప్యాకేజీలు ప్రకటించింది. గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా జిల్లాలోని ఆధ్యాత్మిక కేంద్రాల సందర్శనలో భాగంగా(రెండు రాత్రులు, ఒక పగలు) అన్నవరం, పిఠాపురం, సామర్లకోట, ద్రాక్షారామం, దిండి, అంతర్వేది, ద్వారకా తిరుమల, విజయవాడ సందర్శనకు పెద్దలకు రూ.4,425, రూ.5,025, పిల్లలకు రూ.3,540, రూ.4,020 టికెట్ ధరగా నిర్ణయించింది. బెంగళూరు నుంచి కూడా.. పర్యాటక శాఖ విజయవాడ, హైదరాబాద్, బెంగళూరు నుంచి కూడా ప్రత్యేక ప్యాకేజీలు రూపొందిస్తోంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖ నుంచి శ్రీశైలానికి(రాత్రి, పగలు/రెండు రాత్రులు, రెండు పగళ్లు) వివిధ ప్యాకేజీల్లో మల్లికార్జున స్వామి దర్శనంతో పాటు రోప్‌వే, సందర్శన స్థలాల వీక్షణం, హరిత హోటల్లో భోజన వసతి సౌకర్యాలు కల్పించనుంది. హైదరాబాద్ నుంచి తిరుపతికి (రెండు రాత్రులు, ఒక పగలు)శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనంతో కూడిన ప్యాకేజీ కూడా తీసుకొస్తోంది. విజయవాడ, బెంగళూరు నుంచి గండికోట(రెండు రోజులు), విజయవాడ నుంచి సూర్యలంక(రాత్రి బస, పగలు వీక్షణం), విజయవాడ నుంచి తూర్పుగోదావరిలోని పిచ్చుకలంకకు ఉదయం బయలుదేరి సాయంత్రానికి చేరుకునేలా.. వేదాద్రి నరసింహస్వామి, ముక్త్యాల ముక్తేశ్వరస్వామి, ముక్త్యాల కోట, తిరుమలగిరి వేంకటేశ్వరస్వామి, పెనుగంచిప్రోలు తిరుపతమ్మ దర్శనాలతో కూడిన ప్యాకేజీలను అందుబాటులోకి తెస్తోంది. ఏపీటీడీసీ వెబ్సైట్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ఆధ్యాత్మిక పర్యాటకాన్ని పెంపొందించేలా.. రాష్ట్రంలో సామాన్యులకు అందుబాటులో ఉండేలా ఆధ్యాత్మిక కేంద్రాలను కలుపుతూ ప్రత్యేక యాత్రలు నిర్వహిస్తున్నాం. హైదరాబాద్, బెంగళూరు నుంచి కూడా పర్యాటకులు వచ్చి వెళ్లేలా ‘వన్డే’ టూర్ ప్లాన్ చేస్తున్నాం. – ఎస్.సత్యనారాయణ, ఏపీటీడీసీ ఎండీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.. పర్యాటకులు రాష్ట్రంలోని శైవక్షేత్రాలు, దేవాలయాలు, సందర్శనీయ స్థలాలను తక్కువ సమయంలో చుట్టివచ్చేలా పర్యాటక ప్యాకేజీలు తీసుకొచ్చాం. అందరూ వీటిని సద్వినియోగం చేసుకోవాలి. – ఆరిమండ వరప్రసాద్‌రెడ్డి, చైర్మన్, ఏపీటీడీసీ -
ఇదేనా బాబూ.. మీ క్రమశిక్షణ?
సాక్షి ప్రతినిధి, తిరుపతి/కుప్పం: టీడీపీ శ్రేణుల క్రమశిక్షణ ఏపాటిదో తనలాంటి వాళ్లకు ఇప్పుడు బాగా తెలిసొచ్చిందని పర్యాటక శాఖ అసిస్టెంట్ మేనేజర్ మోహన్ అన్నారు. తనను చంద్రబాబు ఎదుటే చచ్చేటట్టు కొడుతుంటే ఆయన కనీసంగా స్పందించి అడ్డుకోవాల్సింది పోయి.. వారిని ప్రోత్సహించడం చాలా బాధేసిందని చెప్పారు. శుక్రవారం కుప్పంలో చంద్రబాబును కలవడానికి వచ్చిన ఇతన్ని బాంబులేయడానికి వచ్చాడని టీడీపీ శ్రేణులు చితక్కొట్టిన విషయం తెలిసిందే. పోలీసుల జోక్యంతో కుప్పం ఆస్పత్రిలో చేరిన ఆయన శనివారం సాయంత్రం మెరుగైన వైద్యం కోసం తిరుపతికి వచ్చారు. ‘సాక్షి’తో మాట్లాడుతూ.. ‘నన్ను కళ్ల ముందు టీడీపీ నేతలు, కార్యకర్తలు కొడుతున్నా బాబు నిలువరించే యత్నం చేయలేదు. నేను ఎంత చెబుతున్నా వినకుండా దారుణంగా కొట్టారు. మెడలో నా బంగారు గొలుసును బలవంతంగా లాగేసుకున్నారు. మెడపై గాయమైంది. చిన్నప్పటి నుంచి సెంటిమెంట్‌గా చెవికి పెట్టుకున్న దిద్దులను కోసేశారు. దాంతో చెవులు తెగి రక్తస్రావమైంది. అప్పుడు పోలీసులు రాకుంటే నన్ను చంపేసేవారు. ‘సాక్షి’ లేకుంటే నన్ను ఓ ఉగ్రవాదిగా ప్రొజెక్ట్ చేసేవాళ్లు’ అని చెప్పుకొచ్చారు. హత్యాయత్నం కేసు తన తండ్రిపై హత్యాయత్నం జరిగిందంటూ మోహన్ కుమారుడు ప్రవీణ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కుప్పం టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు చంపేందుకు యత్నించారంటూ పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్టు ఎస్ఐ ఉమామహేశ్వరరెడ్డి తెలిపారు. ఈ ఘటనపై శనివారం పర్యాటక శాఖ తిరుపతి డివిజనల్ మేనేజర్ టి.గిరిధర్‌రెడ్డి విచారణ జరిపి బాధితుడు నుంచి వివరాలు సేకరించారు. ఉన్నతాధికారులకు నివేదిక పంపుతున్నట్లు తెలిపారు. -
సాంస్కృతిక కార్యక్రమాలకు ప్రాధాన్యం
సాక్షి, హైదరాబాద్: సమగ్ర పర్యాటకాభివృద్ధితోపాటు సాంస్కృతిక కార్యక్రమాలకు సీఎం కేసీఆర్ ఎంతో ప్రాధాన్యమిస్తున్నారని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖల మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖల ఆధ్వర్యంలో బెంగుళూరులో జరుగుతున్న దక్షిణాది రాష్ట్రాల పర్యాటక, సాంస్కృతిక శాఖల మంత్రుల సమావేశంలో రెండోరోజు శ్రీనివాస్‌గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర పర్యాటక శాఖ అదనపు డైరెక్టర్ జనరల్ రూపేందర్ బ్రార్‌తో సమావేశమై దక్షిణ తెలంగాణలోని మన్యంకొండ లక్ష్మీవెంకటేశ్వరస్వామి ఆలయ అభివృద్ధిపై ప్రత్యేకంగా చర్చించారు. సమావేశంలో మన్యంకొండ ఆలయం అభివృద్ధి ఆవశ్యకతను పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. తెలంగాణతోపాటు కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి పెద్దఎత్తున భక్తులు, పర్యాటకులు ఇక్కడికి తరలివస్తున్నారని, వారిని మరింత ఆకట్టుకునేవిధంగా రోప్ వే, లేక్ ఫ్రంట్, మౌలిక సదుపాయాల కల్పనకు రూ.50 కోట్లు కేటాయించాలని కోరారు. ఈ మేరకు మంత్రి సమర్పించిన ప్రతిపాదనలపై కేంద్ర ఉన్నతాధికారులు సానుకూలంగా స్పందించారు. దేశంలోని పర్యాటక ప్రదేశాల విశిష్టత, ప్రాముఖ్యతతోపాటు తగిన సమాచారాన్ని పర్యాటకులకు అందించేందుకు డిజిటల్ యాప్‌ను అన్ని భాషల్లో రూపొందించాలని మంత్రి సూచించారు. పర్యాటక శాఖలోని టూరిస్ట్ గైడ్లకు స్కిల్ డెవలప్మెంట్పై శిక్షణ ఇచ్చి గుర్తింపుకార్డులను జారీచేయాలని విజ్ఞప్తి చేశారు. పర్యాటకశాఖ అనుబంధ రంగాలైన టూర్స్ ఆపరేటర్లు, ట్రావెల్ ఏజెంట్లు, హోటల్ నిర్వాహకులకు ప్రత్యేక మినహాయింపులు ఇచ్చి పర్యాటక రంగానికి మరింత ప్రోత్సాహకం అందించాలన్నారు. కార్యక్రమంలో కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖల మంత్రి ఎ.కిషన్‌రెడ్డి, ఆ శాఖల దక్షిణాది రాష్ట్రాల మంత్రులు పాల్గొన్నారు. -
పర్యాటకులకు ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్
సాక్షి, అమరావతి: పాపికొండలు బోటు విహార యాత్రను వచ్చే నెల 7 నుంచి ప్రారంభిస్తున్నట్టు రాష్ట్ర పర్యాటక మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. బోటు ఆపరేటర్లతో బుధవారం సచివాలయంలో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముత్తంశెట్టి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక రంగం అభివృద్ధితో పాటు పర్యాటకుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తోందన్నారు. బోటు ఆపరేటర్లు తమ జీవనోపాధిపై మాత్రమే కాకుండా పర్యాటకుల భద్రతపైనా ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని స్పష్టం చేశారు. రాజమండ్రి నుంచి పాపికొండలు వెళ్లే ఒక్కో ప్రయాణికుడి టికెట్ ధరను రూ.1,250 (రవాణా, భోజన వసతి)గా నిర్ణయించినట్టు పేర్కొన్నారు. భవిష్యత్‌లో పోలవరం ప్రాజెక్టు ప్రాంతాన్ని ప్రముఖ టూరిస్ట్ హబ్‌గా అభివృద్ధి చేస్తామన్నారు. గత ఏడాది గోదావరిలో బోటు ప్రమాదం తర్వాత ప్రభుత్వం పటిష్టమైన చర్యలు చేపట్టిందని వివరించారు. గోదావరి, కృష్ణా నదుల పర్యాటక బోటింగ్ ప్రాంతాల్లో 9 కమాండ్ కంట్రోల్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. బోటు ఆపరేటర్లు మాట్లాడుతూ.. పశ్చిమ గోదావరి జిల్లా వైపు నుంచి కూడా పాపికొండలుకు బోట్లును నడపాలని కోరారు. -
ప్రాంతాలవారీ పర్యాటక పండుగలు
సాక్షి, అమరావతి: పర్యాటకులను ఆకర్షించేందుకు ప్రాంతాల వారీగా పర్యాటక పండుగలు (టూరిజం ఫెస్టివల్స్) నిర్వహించాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజనశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు సూచించారు. ఆయన మంగళవారం సచివాలయంలో పర్యాటకశాఖ ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హరిత హోటళ్లలో నూరుశాతం ఆక్యుపెన్సీ సాధించేలా అధికారులు దృష్టి పెట్టాలని సూచించారు. నిత్యం హరిత హోటళ్లు, రిసార్ట్‌లను పర్యవేక్షిస్తూ నెలరోజుల్లో మెరుగైన సౌకర్యాలతో తీర్చిదిద్దాలని ఆదేశించారు. కొత్త సంవత్సరంలో టూరిజం యాప్‌ను అందుబాటులోకి తేవాలన్నారు. ప్రైవేట్ ఆపరేటర్లతో చర్చించి బోటింగ్ సేవలను ప్రారంభించాలని చెప్పారు. సీఎం కప్ టోర్నీకి అపూర్వ స్పందన అనంతరం క్రీడాశాఖాధికారుల సమీక్షలో మంత్రి ముత్తంశెట్టి మాట్లాడుతూ సీఎం కప్ టోర్నీకి అపూర్వ స్పందన వస్తోందని చెప్పారు. వచ్చేనెల 6వ తేదీన విజయనగరం, అనంతరం పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి జిల్లాల్లో కూడా టోర్నీ నిర్వహణకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. తెనాలి, బాపట్లలోని క్రీడా వికాసకేంద్రాలను నవంబర్ 1వ తేదీన ప్రారంభించనున్నట్టు తెలిపారు. ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌భార్గవ, ఆంధ్రప్రదేశ్ పర్యాటకసంస్థ సీఈవో సత్యనారాయణ, సాంస్కృతికశాఖ సీఈవో మల్లిఖార్జున, క్రీడాప్రాధికార సంస్థ ఎండీ ఎన్.ప్రభాకరరెడ్డి పాల్గొన్నారు. -
పర్యాటక హబ్‌గా రాయలసీమ
తిరుపతి అర్బన్(చిత్తూరు జిల్లా): రాయలసీమను పర్యాటక హబ్‌గా తీర్చిదిద్దుతామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు తెలిపారు. చిత్తూరు జిల్లా తిరుపతి ఆర్డీవో కార్యాలయంలో హెలి టూరిజాన్ని వర్చువల్ పద్ధతిలో ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ టూరిజం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోందన్నారు. భక్తుల సౌకర్యార్థం తిరుపతితో పాటు అవసరమైన ప్రధాన కేంద్రాల్లో స్టార్ హోటళ్లను నిర్మించేందుకు కసరత్తు చేస్తున్నట్టు చెప్పారు. హైదరాబాద్ నుంచి చిత్తూరు జిల్లాలోని తిరుపతి, శ్రీకాళహస్తి, కాణిపాకం వంటి ఆలయాల సందర్శనకు వచ్చే పర్యాటకుల కోసం ప్రత్యేక ప్యాకేజీని ప్రకటిస్తామన్నారు. అవసరాన్ని బట్టి రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాలున్న పట్టణాలకూ ఇదే పద్ధతిని అవలంభిస్తామని చెప్పారు. కరోనా కారణంగా తగ్గిన ఆదాయం.. ప్రస్తుతం పెరుగుతోందన్నారు. ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుపతి నగరానికి దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి పర్యాటకులు వస్తుంటారని, తిరుపతితో పాటు విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల్లోని అన్ని ఆలయాలనూ పర్యాటకంగా అభివృద్ధి చేస్తామన్నారు. ప్రత్యేకంగా 20కి పైగా టూరిజం బస్సులు నడుపుతున్నట్టు తెలిపారు. రాయలసీమ జిల్లాల్లోని ప్రముఖ పర్యాటక, ఆధ్యాత్మిక కేంద్రాలను హబ్‌గా మార్చి, మెరుగైన వసతులు కల్పించి.. పర్యాటకులను ఆకర్షించేలా పలు సంస్కరణలు చేపట్టనున్నట్టు మంత్రి అవంతి వెల్లడించారు. -
సాగర తీరం.. సుందర దృశ్యం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని బీచ్‌లలో ఆరోగ్యకరమైన, సురక్షితమైన వాతావరణాన్ని పెంపొందించి పర్యాటకులకు సమున్నతమైన ఆహ్లాదాన్ని పెంపొందించేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. తద్వారా విదేశీ పర్యాటకులను సైతం ఆకర్షించేలా ప్రతిష్టాత్మక ‘బ్లూ ఫ్లాగ్’ సర్టిఫికేషన్ సాధించే లక్ష్యంతో ముందుకెళ్తోంది. ఇప్పటికే విశాఖలోని రిషికొండ బీచ్ ‘బ్లూ ఫ్లాగ్’ సర్టిఫికేషన్ పొంది అంతర్జాతీయ గుర్తింపు దక్కించుకోగా.. అదే జాబితాలో మరిన్ని బీచ్‌లను చేర్చేలా ప్రణాళికలు రూపొందించింది. ఇందులో భాగంగా రాష్ట్ర పర్యాటక శాఖ 21 బీచ్‌లను క్షుణ్ణంగా పరిశీలించి అందులో బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్‌కు అనుగుణంగా అభివృద్ధి చేసే వీలుగా ఉన్న తొమ్మిదింటిని గుర్తించింది. బ్లూ ఫ్లాగ్ అంటే..? స్వచ్ఛమైన నీరు, సురక్షితమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని బ్లూ ఫ్లాగ్ బీచ్‌లలో పొందవచ్చు. డెన్మార్క్‌కు చెందిన అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థ ‘ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్’ 1987 నుంచి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికెట్స్ ఇస్తోంది. ఈ సర్టిఫికెట్ పొందిన బీచ్‌లు ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైనవిగా భావిస్తారు. వాటిలో అంతర్జాతీయ గుర్తింపునకు చిహ్నంగా నీలం రంగు జెండాను ఎగురవేస్తారు. పర్యాటకుల భద్రత, కాలుష్యరహిత పరిసరాలు, సముద్ర నీటి నాణ్యత, తీరంలోని ఇసుక వంటి 33 అంశాలు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉంటే బ్లూ ఫ్లాగ్ సర్టిఫికెట్ లభిస్తుంది. ముఖ్యంగా పారిశ్రామిక వ్యర్థాలు, మురుగు నీటిని బీచ్‌లో కలవకుండా ఉండాలి. బీచ్‌లో సహజ శిలలు కూడా ఉండకూడదు. అలా ఉంటే పర్యాటకులు స్నానాలు చేసే సమయంలో గాయపడే అవకాశం ఉంటుంది. ఎన్నో సౌకర్యాలు బీచ్‌లకు బ్లూ ఫ్లాగ్ సర్టిఫికెట్ రావాలంటే.. వాటిలో వ్యాయామశాల, క్రీడా ప్రాంగణాలు, సౌర విద్యుత్, పర్యావరణ విద్య, పర్యాటకులు విశ్రాంతి తీసుకోవడానికి బెంచీలు, స్నానం చేయడానికి వీలుగా షవర్స్, బయో టాయిలెట్స్, గ్రే వాటర్ ట్రీట్మెంట్, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్, తాగునీటి ఆర్వో ప్లాంట్ వంటి సౌకర్యాలు అందుబాటులో ఉండాలి. సముద్ర తీరాలను ఆ మేరకు అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నడుం బిగించింది. పర్యావరణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని సొసైటీ ఫర్ ఇంటిగ్రేటెడ్ కోస్టల్ జోన్ మేనేజ్మెంట్(ఐసీజెడ్‌ఎం)కు బాధ్యతలు అప్పగించింది. ఇందులోని పర్యావరణ వేత్తలు, శాస్త్రవేత్తలు ఎంపిక చేసిన బీచ్‌లను పరిశీలించి బ్లూ ఫ్లాగ్‌కు అనుగుణంగా వాటిని కేంద్రానికి సిఫారసు చేస్తారు. అనంతరం ప్రపంచ బ్యాంకు నిధులతో వాటిని అభివృద్ధి చేస్తారు. అనంతరం వాటిని కేంద్రం అంతర్జాతీయ జ్యూరీకి ప్రతిపాదిస్తే.. ప్రత్యేక బృందం వచ్చి పరిశీలిస్తుంది. అక్కడి పరిస్థితులు, సౌకర్యాలు ప్రమాణాల మేరకు ఉంటేనే బ్లూ ఫ్లాగ్ సర్టిఫికెట్ జారీ చేస్తుంది. ఎంపిక చేసిన బీచ్‌లు ఇవీ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ కోసం కోసం విశాఖపట్నం జిల్లాలోని ఎర్రమట్టి దిబ్బలు, గుంటూరు జిల్లాలోని సూర్యలంక, తూర్పు గోదావరి జిల్లాలోని కాకినాడ, చింతలమోరి, పశ్చిమ గోదావరి జిల్లాలోని పేరుపాలెం, మోళ్లపర్రు, కృష్ణా జిల్లాలోని మంగినపూడి, ప్రకాశం జిల్లాలోని రామాపురం, నెల్లూరు జిల్లాలోని మైపాడు బీచ్‌ల సుందరీకరణకు ప్రభుత్వం ప్రతిపాదించింది. మొదటి దశలో భాగంగా కేంద్ర బృందం ఈ బీచ్‌లలో పరిసరాలు, రవాణా సౌకర్యం, మౌలిక వసతులను పరిశీలించింది. రెండో దశలో రెండేసి బీచ్‌లలో నీటి నాణ్యతను పరీక్షించనున్నారు. ఇప్పటికే సూర్యలంక, రామాపురంలో ఈ ప్రక్రియ పూర్తయింది. ప్రణాళిక ప్రకారం అభివృద్ధి.. విదేశీ పర్యాటకులను ఆకర్షించేలా రాష్ట్రంలోని బీచ్‌లను సుందరీకరిస్తున్నాం. బ్లూ ఫ్లాగ్ నిబంధనలకు అనుగుణంగా ఉన్న వాటిని గుర్తించి కేంద్రానికి ప్రతిపాదనలు పంపాం. కేంద్ర బృందం పరిశీలన చేపడుతోంది. రాష్ట్రంలో 974 కిలోమీటర్ల తీర ప్రాంతాన్ని ప్రణాళిక ప్రకారం అభివృద్ధి చేసే ఆలోచనలో ఉన్నాం. – ఎస్.సత్యనారాయణ, ఎండీ, ఏపీ పర్యాటక అభివృద్ధి సంస్థ -
పాపికొండలు పర్యాటకానికి పచ్చజెండా
బుట్టాయగూడెం: గోదావరి నదికి ఇరువైపులా కొండల మధ్య పచ్చదనం పరుచుకున్న ప్రకృతి కాంత కనువిందు చేస్తోంది. పర్యాటకులకు మధురానుభూతినిచ్చే పాపికొండలు బోటు సర్వీసులను తిరిగి ప్రారంభించేందుకు పర్యాటక శాఖ ఏర్పాట్లు చేస్తోంది. వాస్తవానికి గత నెలలోనే బోటు ప్రయాణాలను ప్రారంభించేలా అధికారులు ఏప్రిల్ 15న బోటు ట్రయల్ రన్ నిర్వహించారు. కోవిడ్ రెండో దశ విజృంభించడంతో బోటు ప్రయాణాలకు బ్రేక్ పడింది. ప్రస్తుతం కోవిడ్ ఉధృతి తగ్గుముఖం పడుతుండటంతో జూన్ నెలాఖరు నుంచి బోటు సర్వీసులు నడిపేందుకు పర్యాటక శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కోవిడ్ సెకండ్ వేవ్ పూర్తిగా తగ్గుముఖం పడితే.. కచ్చులూరు వద్ద బోటు ప్రమాదం తర్వాత సుమారు 19 నెలల పాటు ఆగిపోయిన బోటు సర్వీసులు తిరిగి మొదలవుతాయి. ప్రయాణం ఇక భద్రం కచ్చులూరు బోటు ప్రమాదం తర్వాత ప్రభుత్వం కఠిన నిబంధనలు విధించింది. బోటు ప్రయాణాలు భద్రంగా సాగేలా పోలవరం మండలం సింగన్నపల్లి, వేలేరుపాడు మండలం పేరంటాలపల్లి వద్ద రాష్ట్ర ప్రభుత్వం కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసింది. ఒక్కొక్క కంట్రోల్ రూమ్‌కు రూ.22 లక్షల నిధులను కేటాయించారు. బోటు ప్రయాణాలను పర్యవేక్షించేలా పోలీస్, రెవెన్యూ, ఇరిగేషన్ శాఖలకు చెందిన సిబ్బందిని నియమించింది. ప్రయాణికులకు లైఫ్ జాకెట్లు సమకూర్చడంతో పాటు ప్రయాణ అనుకూల పరిస్థితి, బోటు కండిషన్ తదితర అంశాలను వారు ఎప్పటికప్పుడు పర్యవేక్షించేలా ఏర్పాట్లు చేసింది. గోదావరి నదిపై ప్రయాణించే బోట్లకు విధిగా సీసీ కెమెరాలు ఉండేలా చర్యలు తీసుకుంది. బోటు ప్రయాణించే లొకేషన్‌ను ఎప్పటికప్పుడు కంట్రోల్ రూమ్ ద్వారా తెలుసుకునేలా జీపీఎస్ అమర్చే ఏర్పాట్లు చేసింది. ఏర్పాట్లు చేస్తున్నాం కోవిడ్ తగ్గుముఖం పట్టిన తర్వాత ఈ నెలాఖరుకు పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ చేతుల మీదుగా బోటు సర్వీసులను ప్రారంభించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నాం. – ఏఎల్ మల్రెడ్డి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ఏపీ టూరిజం -
‘సాగర’ తోరణాలు
సాక్షి, విశాఖపట్నం: సహజ అందాలకు నెలవైన విశాఖ సాగర తీరం దేశ, విదేశీ పర్యాటకులను కట్టిపడేస్తుంటుంది. తూర్పు కనుమలు ఓవైపు.. అలల సయ్యాటలు మరోవైపు.. ఇసుక తిన్నెలపై కనువిందు చేసే రాతి దిబ్బల రమణీయత ఇంకొకవైపు.. ఎల్లప్పుడూ సందర్శకుల్ని ఆహ్వానిస్తుంటాయి. ఈ అందాలకు అదనపు ఆకర్షణగా సాగర తీరంలో ఏర్పడిన సహజ శిలా తోరణం.. ప్రతి ఒక్కర్నీ మంత్రముగ్ధుల్ని చేస్తుంటుంది. ఇప్పుడు అదే విశాఖకు మరో అద్భుతం తోడైంది. సాగర గర్భంలో మరొక శిలా తోరణం బయటపడింది. సరికొత్త అనుభూతి.. రాతి శిలా సంపదతో సరికొత్త అనుభూతిని అందించే తొట్లకొండ బీచ్‌కు పర్యాటకులు పెద్ద ఎత్తున వస్తుంటారు. ఈ ప్రాంతంలో ఉన్న సహజ శిలా తోరణం మధ్య నుంచి ఎగసిపడే అలల్ని సందర్శకులు ఆస్వాదిస్తుంటారు. విశాఖ సాగర గర్భంలో ఇటీవల మరో సహజ శిలా తోరణం బయటపడింది. రుషికొండ తీరంలో సాహస క్రీడలు నిర్వహిస్తూ.. స్కూబా డైవింగ్ చేసే లివిన్ అడ్వెంచర్ సంస్థ ప్రతినిధులు దీన్ని కనిపెట్టారు. తీరం నుంచి సాగర గర్భంలోకి 2 కిలోమీటర్ల దూరంలో.. 30 అడుగుల లోతులో.. ఈ రాతి అందం దర్శనమిచ్చింది. ఒక మీటరు ఎత్తు, 150 సెంటీమీటర్ల వెడల్పుతో ఈ శిలా తోరణం ఉన్నట్లు లివిన్ అడ్వెంచర్స్ ప్రతినిధి బలరాంనాయుడు తెలిపారు. వేల సంవత్సరాల పాటు అలల తాకిడికి రాళ్లు కరిగి ఈ సహజ అందం ఏర్పడిందని భావిస్తున్నారు. దీన్ని తిలకించేందుకు స్కూబా డైవర్లకు అవకాశం కల్పించాల్సిన అవసరముందన్నారు. దీనిపై పర్యాటక శాఖ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపారు. సహజ అందాలకు పొంచి ఉన్న ముప్పు.. తొట్లకొండ శిలాతోరణం.. తన సహజత్వాన్ని కోల్పోయే పరిస్థితి వచ్చింది. యువతీ, యువకులు ఈ శిలా తోరణంపైన చిందులు వేస్తున్నారు. కొందరు ఫొటోలు దిగుతుండగా, మరికొందరు ఏకంగా ద్విచక్ర వాహనాల్ని ఎక్కించేసి ఫొటో షూట్లు చేస్తున్నారు. అలల తాకిడికి రాయి కరిగి తోరణంగా ఏర్పడింది. బలహీనంగా ఉండే దీనిపై నిలబడి ఇష్టానుసారంగా వ్యవహరిస్తే విరిగిపోయే ప్రమాదముందని ప్రకృతి ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీన్ని సంరక్షించేందుకు అధికారులు తగిన చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు. వాహనాలు వెళ్లకుండా చర్యలు సహజ శిలా తోరణాన్ని కాపాడేందుకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నాం. హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశాం. స్థానికంగా అక్కడ ఉండే వారిని సంరక్షకులుగా నియమించాం. శిలాతోరణం వద్దకు వాహనాలు వెళ్లకుండా.. రోడ్డు వద్దే నిలిపివేసేలా చర్యలు తీసుకుంటాం. ప్రకృతి సిద్ధమైన అందాల్ని పరిరక్షించేందుకు అవసరమైన అన్ని చర్యలూ చేపడుతున్నాం. – పూర్ణిమాదేవి, జిల్లా పర్యాటక శాఖ అధికారి సాగర గర్భంలో అద్భుతంగా ఉంది రుషికొండ తీరంలో స్కూబా డైవింగ్ చేస్తున్న సమయంలో శిలాతోరణం బయటపడింది. దగ్గరకు వెళ్లి చూసి సంభ్రమాశ్చర్యాలకు గురయ్యాం. తొట్లకొండలో ఎలా ఉంటుందో అచ్చం అలాగే ఉంది. 45 నిమిషాల పాటు ఈ శిలాతోరణం పరిసరాల్ని రికార్డు చేశాం. స్కూబా డైవర్లకు ఇది గొప్ప అనుభూతిని అందిస్తుంది. – బలరాంనాయుడు, లివిన్ అడ్వెంచర్స్ ఎండీ -
ఇక తనివి తీరా... పాపికొండల అందాల వీక్షణ
రాజమహేంద్రవరం సిటీ: దాదాపు పద్దెనిమిది నెలల విరామం అనంతరం గోదావరి నది పాపికొండల అందాలను వీక్షించే అవకాశం లభించనుండడంతో పర్యాటక ప్రేమికుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. 2019 సెప్టెంబర్ 15న తూర్పు గోదావరిజిల్లా కచ్చులూరు వద్ద ఘోర లాంచీ ప్రమాదం చోటు చేసుకుని ప్రాణనష్టం సంభవించడంతో.. గోదావరి నదిలో తిరిగే అన్ని రకాల మోటార్ బోట్లపై రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించిన విషయం విదితమే. అయితే పర్యాటక ప్రేమికుల కోరిక మేరకు పాపికొండల అందాలను వీక్షించే భాగ్యాన్ని కల్పిస్తూ.. ఇటీవల ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. ఈ నెల 15వ తేదీ నుంచి పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఏసీ లగ్జరీ బోటు నడపనున్నారు. కాగా, రాజమహేంద్ర వరానికి చెందిన 23 ఏసీ లగ్జరీ బోట్లు, 5 లాంచీలు గతంలో నడిచేవి. అలాగే భధ్రాచలం వైపు నుంచి 32 లాంచీలు, 4 ఏసీ లగ్జరీ బోట్లు పర్యాటకులను పాపికొండల విహారానికి తీసుకొచ్చేవి. అయితే కచ్చులూరు ప్రమాద ఘటన జరిగిన వెంటనే గోదావరిలో నడిచే అన్ని రకాల బోట్లకు ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించాలని కాకినాడ పోర్ట్ అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. తగిన ప్రమాణాలు పాటించిన ఏసీ లగ్జరీ బోట్లను మాత్రమే.. అదికూడా ఫిట్నెస్ సర్టిఫికెట్లు పొందిన అనంతరమే విహారానికి అనుమతించాలని సూచించింది. అయితే పోర్టు అధికారులు నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా ప్రైవేటు లగ్జరీ బోట్లు లేకపోవడంతో ఇప్పటి వరకు ఒక్కదానికి కూడా ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. తాజాగా ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో హరిత ఏసీ లగ్జరీ బోటుకు పూర్తిస్థాయి అనుమతులు లభించాయి. దీంతో 18 నెలల విరామం అనంతరం పటిష్టమైన ప్రణాళిక, రక్షణ చర్యల మధ్య పాపికొండల విహారానికి పర్యాటక అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 15వ తేదీ నుంచి పాపికొండల విహారానికి పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం సమీపంలోని సింగన్నపల్లి రేవు నుంచి లగ్జరీ బోటు నడిపేందుకు సన్నాహాలు పూర్తయ్యాయని టూరిజం శాఖ అధికారి టి.వీరనారాయణ ‘సాక్షి’కి చెప్పారు. పెద్దలకు రూ.1,000, పిల్లలకు రూ.750 చార్జీగా నిర్ణయించాలని యోచిస్తున్నామన్నారు. కేవలం ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మాత్రమే ఒక బోటు నడుస్తుందని, ప్రైవేట్ ఆపరేటర్ల బోట్లకు ఇంకా అనుమతులు మంజూరు చేయలేదని ఆయన స్పష్టం చేశారు. ‘ఏపీటీడీసీ’ వెబ్సైట్లోకెళ్లి ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకోవాలని సూచించారు. -
విశాఖలో షిప్ రెస్టారెంట్
సాక్షి, అమరావతి: విశాఖపట్నంలో షిప్ రెస్టారెంట్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్టు రాష్ట్ర పర్యాటక, క్రీడలు, యువజన శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు (అవంతి శ్రీనివాస్) వెల్లడించారు. విశాఖలోని రుషికొండ రిసార్ట్ పునర్నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.92 కోట్లు విడుదల చేసిందని చెప్పారు. విజయవాడ, తిరుపతిలో జలవిహార్ తరహాలో ప్రాజెక్టులు చేపట్టనున్నట్టు తెలిపారు. రాష్ట్ర సచివాలయంలోని తన కార్యాలయంలో పర్యాటక, క్రీడలు, యువజన శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న పలు అభివృద్ధి పథకాల అమలు తీరు తెన్నులపై మంగళవారం ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తిరుపతిలోని పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం రూ.2.25 కోట్లు మంజూరు చేసిందని మంత్రి తెలిపారు. ఖేలో ఇండియాలో భాగంగా స్టేట్ సెంటర్ ఆఫ్ సెంట్రల్ ఎక్స్‌లెన్స్ సెంటర్ కింద కడప జిల్లా పుట్లంపల్లిలోని వైఎస్సార్ స్పోర్ట్స్ పాఠశాలను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసిందన్నారు. క్రీడల్లో శిక్షణ, క్రీడా పరికరాల కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం రూ.3.18 కోట్లను ఇటీవల మంజూరు చేసిందన్నారు. పర్యాటక రంగానికి పెద్దపీట రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక రంగాభివృద్ధికి పెద్దపీట వేస్తోందని, ఇందుకోసం పీపీపీ పద్ధతిలో రిసార్టులు, త్రీ స్టార్, ఫైవ్ స్టార్ హోటళ్ల నిర్మాణానికి పెట్టుబడులు ఆహ్వానిస్తోందని తెలిపారు. ఇందుకోసం బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాద్, ముంబై వంటి నగరాల్లో రోడ్ షోల నిర్వహణకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇందుకోసం వారానికోసారి సమీక్ష నిర్వహించాలని ఆదేశించారు. పాపికొండల్లో బోటు పర్యాటకాన్ని మరో వారం రోజుల్లో ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలన్నారు. విశాఖపట్నంలోని ఆర్కే బీచ్‌తో పాటు భీమిలి, రుషికొండ, మంగమారిపేట బీచ్‌లను గోవా, మెరీనా బీచ్‌ల తరహాలో అభివృద్ధి చేయనున్నట్టు మంత్రి వెల్లడించారు. శ్రీశైలం ఆలయంలో ప్రసాదమ్ పథకం కింద చేపట్టిన పనులను సీఎం జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించాలని నిర్ణయించామని, త్వరగా తేదీపై నిర్ణయం తీసుకోవాలని ఆదేశించారు. సింహాచలంలోనూ ఇదే పథకం కింద చేపట్టే పనులకు శంకుస్థాపన తేదీపై కూడా నిర్ణయం తీసుకోవాలన్నారు. సమావేశంలో పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ, పర్యాటకాభివృద్ధి సంస్థ ఎండీ ప్రవీణ్‌కుమార్ పాల్గొన్నారు. -
సముద్ర తీరాల్లో టూరిజం రిసార్ట్స్
సాక్షి, అమరావతి: శ్రీకాకుళం జిల్లా నుంచి నెల్లూరు వరకు సముద్ర తీరం వెంబడి పెద్దఎత్తున రిసార్ట్స్ నిర్మించేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్టు పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ తెలిపారు. ఆదివారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ.. రిసార్ట్స్ నిర్మాణానికి ప్రభుత్వ భూములను గుర్తించి నివేదిక ఇవ్వాల్సిందిగా ఆయా జిల్లాల కలెక్టర్లను కోరామన్నారు. పర్యాటక రంగానికి మన రాష్ట్రం పర్యాయ పదం కావాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉందని, విదేశీ పర్యాటకులను ఆకర్షించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కొత్త టూరిజం పాలసీ రూపొందించాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారన్నారు. పర్యాటక రంగానికి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి నియంత్రణ లేదని, అందువల్ల ఈ రంగంలో ఉన్న టూర్ ఆపరేటర్లు, హోటళ్లు, వాటిలో అందుబాటులో ఉన్న గదులు, టూరిజం అడ్వెంచర్‌కు సంబంధించిన ప్రదేశాలు, సదుపాయాలు వంటివన్నీ రిజిస్ట్రేషన్ చేస్తున్నామని వివరించారు. 12 ప్రాంతాల్లో స్టార్ సదుపాయాలతో కూడిన రిసార్టులు, హోటళ్లు అభివృద్ధి చేస్తున్నామని, వాటర్ టూరిజం, ఎకో టూరిజం, బీచ్ టూరిజం, టెంపుల్ టూరిజంపై ప్రత్యేక దృష్టి సారించామని పేర్కొన్నారు. తెలుగు వంటకాలకు గుర్తింపు కోసం ఫుడ్ ఫెస్టివల్ తెలుగు వంటకాలకు అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చేందుకు ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించనున్నామని, శాఖాహార, మాంసాహార వంటకాలను ప్రజలకు పరిచయం చేస్తామని చెప్పారు. పర్యాటకుల భద్రత కోసం ప్రభుత్వం తొలిసారిగా రాష్ట్రంలో 9 కంట్రోల్ రూమ్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిందని చెప్పారు. -
మొదలైన పర్యాటకుల 'సందడి'
సాక్షి, అమరావతి: కరోనా కష్టాల నుంచి పర్యాటకశాఖ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. కేంద్ర ప్రభుత్వం ఇటీవలే పర్యాటక ప్రాంతాలకు సందర్శకులను అనుమతించడంతో రాష్ట్రంలో చాలాచోట్ల పర్యాటక ప్రాంతాల్లో సందడి మొదలైంది. పాపికొండలు మినహా మిగిలిన ప్రాంతాల్లో పర్యాటకులను అనుమతిస్తున్నారు. పర్యాటక సందడి మొదలవడంతో రాష్ట్ర వ్యాప్తంగా చిన్నా, పెద్ద హోటళ్లు, రెస్టారెంట్లపై ఆధారపడి జీవిస్తున్న కుటుంబాల్లో ఇక ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కుతామనే నమ్మకం కనిపిస్తోంది. పర్యాటకుల కోసం ఏపీటీడీసీ (ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ) కొన్ని టూర్ ప్యాకేజీలను అందుబాటులోకి తీసుకొచ్చింది. విశాఖపట్నం హెరిటేజ్ టూర్, విశాఖ–అరకు, విశాఖ–అరసవెల్లి, విజయవాడ–శ్రీశైలం టూర్ ప్యాకేజీలు పర్యాటకుల్ని ఆకట్టుకుంటున్నాయి. బస్సు ఉదయం బయలుదేరి అదేరోజు రాత్రికి తిరిగి వచ్చేలా, టిఫిన్, భోజనాలకు కూడా కలిపి తక్కువ ధరకే ఏర్పాటు చేస్తుండటంతో ఈ ప్యాకేజీలను పర్యాటకులు బాగా వినియోగించుకుంటున్నారు. విజయవాడలో సీ ప్లేన్ సేవలకు అవకాశం... విజయవాడ ప్రకాశం బ్యారేజీలో సీ ప్లేన్ సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేసింది. గుజరాత్లో ప్రధాని మోదీ ఇటీవల ప్రారంభించిన సీ ప్లేన్ సర్వీసు విజయవంతం కావడంతో పలు రాష్ట్రాల్లో ఇలాంటి సేవలు అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించారు. దీన్లో భాగంగా ప్రకాశం బ్యారేజీని ఎంపిక చేశారు. సీ ప్లేన్ కోసం నదిలో వాటర్ ఏరోడ్రోమ్ (కాంక్రీట్ కట్టడాన్ని) నిర్మిస్తారు. విదేశీ పర్యాటకులను ఆకర్షించేలా 12 చోట్ల స్టార్ హోటళ్లు విదేశీ పర్యాటకులను ఆకర్షించేందుకు ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) పద్ధతిలో రాష్ట్రంలోని 12 ప్రాంతాల్లో 7 స్టార్, 5 స్టార్ హోటళ్లు నిర్మించనున్నారు. గండికోట (వైఎస్సార్ కడప), కాకినాడ, పిచుకల్లంక (తూర్పు గోదావరి), హార్సలీ హిల్స్ (చిత్తూరు), నాగార్జునసాగర్, సూర్యలంక బీచ్ (గుంటూరు), ఓర్వకల్లు (కర్నూలు), కళింగపట్నం (శ్రీకాకుళం), రుషికొండ (విశాఖపట్నం), భవానీఐల్యాండ్ (కృష్ణా), తిరుపతి–పెరూర్ (చిత్తూరు), పోలవరం (పశ్చిమగోదావరి)లలో ఈ హోటళ్లు నిర్మించనున్నారు. వీటి నిర్మాణానికి జాతీయస్థాయిలో పెట్టుబడులు ఆకర్షించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. టెంపుల్ టూరిజంపై ప్రత్యేక దృష్టి టెంపుల్ టూరిజంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. టెంపుల్ డెవలప్మెంట్ ప్రాజెక్టు కింద శ్రీశైలంలో రూ.47.45 కోట్లు, సింహాచలం ఆలయంలో రూ.53.69 కోట్లలో పనులు చేపట్టనున్నారు. ద్వారకా తిరుమల ఆలయానికి రూ.76 కోట్లు, శ్రీముఖలింగేశ్వర ఆలయానికి రూ.55 కోట్లు, అన్నవరం ఆలయానికి రూ.48.58 కోట్లు మంజూరు చేయాలని ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. భద్రత కోసం కంట్రోల్ రూమ్‌లు పర్యాటకుల భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా కంట్రోల్ రూమ్‌లను అందుబాటులోకి తెచ్చింది. అత్యాధునికమైన కంట్రోల్ రూమ్‌లలో శిక్షణ పొందిన సిబ్బంది కూడా అందుబాటులో ఉంటారు. రక్షణ, భద్రతా ప్రమాణాలను పాటించేలా నిర్దేశిత ప్రొటోకాల్ ఉంటుంది. అనుకోని ఘటన జరిగితే ఏం చేయాలన్న దానిపై విపత్తు నిర్వహణ ప్రొటోకాల్ ఉంటుంది. బోటు కదలాలంటే డిపార్చర్ క్లియరెన్స్ తప్పనిసరి. ప్రయాణికులు, పర్యాటకుల వివరాలు సమగ్రంగా నమోదు చేస్తారు. రుషికొండ బీచ్‌కు అంతర్జాతీయస్థాయి గుర్తింపు విశాఖలోని రుషికొండ బీచ్‌కి ఇటీవల అంతర్జాతీయస్థాయి గుర్తింపు లభించింది. పర్యావరణహిత, ప్రమాదరహిత బీచ్‌లకు ఇచ్చే బ్లూఫాగ్ సర్టిఫికెట్ ఈ బీచ్‌కి దక్కింది. దేశంలో 13 బీచ్‌ల నుంచి ఎనిమిది బీచ్‌లు బ్లూఫ్లాగ్ సర్టిఫికెట్‌కు ఎంపికకాగా వాటిలో రుషికొండ ఒకటి. బ్లూఫ్లాగ్ బీచ్‌లనే విదేశీ పర్యాటకులు ఎంపిక చేసుకుంటారు. టూర్ ప్యాకేజీలు ఏపీటీడీసీ పర్యాటకుల కోసం బ్రేక్పాస్ట్, లంచ్‌తో పాటు సాయంత్రం టీ, స్నాక్స్, మినరల్ వాటర్‌తో కూడిన ప్యాకేజీలను అందుబాటులోకి తెచ్చింది. బస్సు ఉదయం బయలుదేరి రాత్రికి తిరిగి వస్తుంది. విశాఖపట్నం–అరకు: పద్మాపురం గార్డెన్స్, ట్రైబల్ మ్యూజియం, అనంతగిరి కాఫీతోటలు, గాలికొండ వ్యూ పాయింట్, బొర్రాగుహలు చూపిస్తారు. ఆఖరులో ట్రైబల్ ధిమ్సా డ్యాన్స్‌ను తిలకించవచ్చు. టికెట్ ధర పెద్దలకు రూ.1,450, పిల్లలకు రూ.1,160. విశాఖపట్నం హెరిటేజ్ టూర్: కైలాసగిరి, సింహాచలం, తొట్లకొండ, ఫిషింగ్ హార్బర్ బోటింగ్, రుషికొండ బీచ్, విశాఖ సబ్‌మెరిన్ మ్యూజియం, జాతర శిల్పారామం చూడవచ్చు. టికెట్ ధర పెద్దలకు రూ.675, పిల్లలకు రూ.563. విశాఖపట్నం–అరసవల్లి: టికెట్ ధర పెద్దలకు రూ.931, పిల్లలకు రూ.742. -
కొత్తగా 60 బోట్లకు అనుమతులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కొత్తగా 60 పర్యాటక బోట్లకు అనుమతులు మంజూరు చేసినట్టు పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ తెలిపారు. నదీ ప్రాంతాలు, రిజర్వాయర్లలో బోటింగ్ కార్యకలాపాలను వెంటనే పునరుద్ధరిస్తున్నట్టు చెప్పారు. 174 ప్రైవేట్ బోట్లు నడిపేందుకు దరఖాస్తులు రాగా.. ఇప్పటికే 60 బోట్లకు అనుమతులు మంజూరు చేశామన్నారు. కరోనా కారణంగా మూతపడిన పర్యాటక కార్యకలాపాలను త్వరితగతిన పునరుద్ధరించేందుకు తక్షణ చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. సచివాలయంలో పర్యాటక శాఖ ఉన్నతాధికారులతో మంగళవారం సమీక్షించిన మంత్రి అనంతరం మీడియాతో మాట్లాడారు. విశాఖపట్నంతో పాటు తూర్పు గోదావరి జిల్లా దిండి, రాజమహేంద్రవరంలో ఇప్పటికే పర్యాటక బోట్లు ప్రారంభమయ్యాయని చెప్పారు. రాష్ట్రంలో 9 చోట్ల కమాండ్ కంట్రోల్ కేంద్రాలను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు బోట్ల స్థితిగతులు, లైసెన్సులు వంటి కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నామన్నారు. పాపికొండలు ప్రాంతంలో జల వనరుల శాఖ ఆధ్వర్యంలో నావిగేషన్ సర్వే చేయాల్సి ఉన్నందున అక్కడ మినహా అన్నిచోట్లా త్వరితగతిన బోటింగ్ కార్యకలాపాలు ప్రారంభమయ్యేలా చర్యలు చేపట్టామన్నారు. సాగర సంగమం, అంతర్వేది, హంసలదీవిలో పర్యాటక బోట్లు నడపనున్నట్టు తెలిపారు. కొల్లూరు, ఐలేరుల్లో కొత్తగా పర్యాటక పడవలను ఏర్పాటు చేస్తామన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో (పీపీపీ) విధానంలో కొత్తగా పడవల సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. ఉభయ గోదావరి జిల్లాల్లో అంతర్వేది నుంచి నరసాపురం, కృష్ణా జిల్లాలోని హంసలదీవి, నాగార్జున సాగర్, కడప జిల్లా బ్రహ్మంసాగర్, కర్నూలు జిల్లా అవుకు, మంత్రాలయం ప్రాంతాల్లో పీపీపీ విధానంలో కొత్తగా పడవలు కొనుగోలు చేసి నడిపేందుకు చర్యలు చేపడుతున్నట్టు వివరించారు. విజయవాడ, విశాఖలో సీ ప్లేన్ సౌకర్యం విజయవాడతోపాటు విశాఖకు కూడా సీ ప్లేన్ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నట్టు మంత్రి చెప్పారు. రాష్ట్రంలో ఐదు, ఏడు నక్షత్రాల హోటళ్లను ఏర్పాటు చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో క్రీడలు, క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం పెద్దఎత్తున చర్యలు తీసుకుంటోందన్నారు. అందులో భాగంగా గత ఏడాది ఉత్తమ ప్రతిభ కనబర్చి బంగారు, వెండి, రజత పతకాలు సాధించిన క్రీడాకారులకు రూ.5 లక్షలు, రూ.3 లక్షలు, రూ.2 లక్షల నగదు ప్రోత్సాహకాలను అందిస్తామని తెలిపారు. ఖేల్ ఇండియా కింద కడప జిల్లాలోని వైఎస్సార్ క్రీడా పాఠశాల సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌గా ఎంపికైందని, దీనివల్ల ఏడాదికి రూ.3 కోట్లు ఆ కేంద్రానికి రానున్నాయని తెలిపారు. త్వరలో ఏపీ యూత్ సర్వీసెస్ పేరిట యూట్యూబ్ చానల్ ప్రారంభిస్తామని చెప్పారు. -
తిరుపతి శిల్పారామానికి రూ.10 కోట్లు
సాక్షి, అమరావతి: తిరుపతిలోని శిల్పారామాన్ని రూ.10 కోట్లతో అభివృద్ధి చేయడంతోపాటు.. శ్రీకాకుళంలో కొత్తగా శిల్పారామం ఏర్పాటుకు తొలిదశలో రూ.3 కోట్లు కేటాయించినట్టు పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. ఇక రాష్ట్రంలోని శిల్పారామాల్లోకి మంగళవారం నుంచి సందర్శకులను అనుమతిస్తున్నట్టు వెల్లడించారు. కానీ, ఫిల్మ్స్ ప్రదర్శనలు, వినోద క్రీడలకు అనుమతి లేదని ఆయన సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. తిరుపతి శిల్పారామం మాస్టర్‌ప్లాన్‌లో భాగంగా పార్కును రూ.10 కోట్లతో అభివృద్ధి చేస్తామన్నారు. విశాఖపట్నంలో శిల్పారామం అభివృద్ధికి రూ.10.92 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించామని ఆయన తెలిపారు. వాటికి నిధులు కేటాయిస్తూ ఆర్థిక శాఖ త్వరలో ఉత్తర్వులు జారీ చేస్తుందన్నారు. -
పర్యాటకానికి మరింత ఊతం
సాక్షి, అమరావతి: పర్యాటక రంగానికి మరింత వైభవం తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అనుమతులు, ప్రోత్సాహకాలు, రాయితీలు సులభంగా పొందేలా పర్యాటక వాణిజ్యం(రిజిస్ట్రేషన్, సౌకర్యాలు)కు సంబంధించి శనివారం పలు మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ మేరకు ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ ఉత్తర్వులిచ్చారు. ఏపీ టూరిజం చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రూపొందించిన ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు. కేరళ, గోవా, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో అమలు చేస్తున్న విధివిధానాలను అధ్యయనం చేసిన అనంతరం.. రాష్ట్రంలో పర్యాటక వాణిజ్యాన్ని ప్రోత్సహించేందుకు అవసరమైన సులభతరమైన మార్గదర్శకాలను ప్రభుత్వం జారీ చేసింది. పూర్తి వివరాలను www.aptourism.gov.in వెబ్సైట్లో పొందుపరిచారు. అందులోని కొన్ని వివరాలు.. ► టూరు, బోట్ ఆపరేటర్లతో పాటు ట్రావెల్ ఏజెంట్లు, హోటళ్లు, రిసార్ట్సు, వాటర్ స్పోర్ట్స్ తదితర అనుబంధ రంగాల ఆపరేటర్లు రాష్ట్ర పర్యాటక శాఖతో అనుసంధానం. ► టూరు ఆపరేటర్లు, అనుబంధ రంగాలకు చెందిన వారు ప్రభుత్వం అందించే రాయితీలు, ప్రోత్సాహకాలు సులభంగా పొందేలా నిబంధనలు. పర్యాటక కార్యకలాపాలు, రాయితీలు, ప్రోత్సాహకాల కోసం రాష్ట్ర పర్యాటక శాఖలో రిజిస్ట్రేషన్ తప్పనిసరి. ► సేవా రంగానికి పెద్దపీట వేసేందుకు సులభతరమైన విధానాల్లో అనుమతులు. ► కాగా, పర్యాటక రంగానికి సంబంధించిన సంస్థలకు ఇది ఒక మంచి అవకాశమని.. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ, ఏపీటీడీసీ సీఈవో, ఎండీ ప్రవీణ్ కుమార్ కోరారు. పర్యాటక రంగ అభివృద్ధితో యువతకు ఉపాధి.. ఇప్పటి వరకు రాష్ట్రంలో పర్యాటక వాణిజ్య ఆపరేటర్లు నమోదు చేసుకోవడానికి సరైన యంత్రాంగం, విధివిధానాలు అందుబాటులో లేవు. ఈ నేపథ్యంలో మార్గదర్శకాలు తీసుకొచ్చాం. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడం ద్వారా సేవా రంగాన్ని బలోపేతం చేసి స్థానిక యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. సీఎం వైఎస్ జగన్ సూచనల మేరకు విధివిధానాలు రూపొందించాం. – ముత్తంశెట్టి శ్రీనివాసరావు, రాష్ట్ర పర్యాటక మంత్రి -
కైలాసగిరి.. పర్యాటక సిరి
సాక్షి, విశాఖపట్నం: అందాల విశాఖ నగరానికి వచ్చే ప్రతి సందర్శకుడూ కైలాసగిరి వెళ్తాడు. విదేశాల నుంచి వచ్చే 10 మంది పర్యాటకుల్లో 8 మంది కైలాసగిరిని సందర్శిస్తున్నారని పర్యాటక శాఖ లెక్కలు చెబుతున్నాయి. గిరిపై నుంచి సాగర నగరి సొగసులు.. వయ్యారాలు ఒలకబోస్తున్న తీరం సోయగాలు చూసేందుకు ఉవ్విళ్లూరుతారు. కొత్త ప్రాజెక్టులతో కైలాసగిరి మరింత సొబగులద్దుకోనుంది. ఇప్పటికే భారీ శివపార్వతుల విగ్రహం, శంకుచక్రనామాలు, టైటానిక్ వ్యూ, తెలుగు మ్యూజియం, మినీ త్రీడీ థియేటర్, రోప్‌వే.. కొండ చుట్టూ తిరుగుతూ విశాఖ అందాలు చూపించే రైలు బండితో కళకళలాడుతున్న కైలాసగిరిపై రాబోయే రోజుల్లో మరిన్ని పర్యాటక ప్రాజెక్టులకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. మొత్తంగా 380 ఎకరాల్లో అభివృద్ధి పనులకు వీఎంఆర్డీఏ శ్రీకారం చుడుతోంది. సముద్ర మట్టానికి 110 మీటర్ల ఎత్తులో ఉన్న కైలాసగిరిపై నుంచి విశాఖను చూస్తే సుందరంగా కనిపిస్తుంది. అందుకే ఈ పర్యాటక ప్రాంతానికి క్రేజ్ ఉంది. మరిన్ని కొత్త ప్రాజెక్టులతో దేశ, విదేశీ సందర్శకులను ఆకర్షించేలా వీఎంఆర్డీఏ ప్రణాళికలు సిద్ధం చేసింది. రీస్టోరేషన్ అండ్ రీడెవలప్మెంట్ ప్రాజెక్టు కింద రూ.61.93 కోట్లతో 380 ఎకరాల కైలాసగిరి హిల్ టాప్ పార్కును అభివృద్ధి చేయనుంది. ముఖద్వారం మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దనుంది. దీనికి తోడు కియోస్క్‌లు, ఫుడ్‌కోర్టులు, అ«ధునాతన టాయిలెట్స్ ఏర్పాటు చేయనుంది. ల్యాండ్ స్కేప్ వర్క్స్, పాత్‌వేలు, వ్యూపాయింట్స్ అభివృద్ధి చేయనుంది. సరికొత్త విద్యుత్ దీపాలంకరణతో పాటు పర్యాటకులకు పూర్తిస్థాయి భద్రత కల్పించేందుకు ప్రతిచోటా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనుంది. అలాగే కొండపై ఉన్న 7ఎకరాల్లో రూ.37కోట్ల అంచనా వ్యయంతో నిర్మించ తలపెట్టిన 3 ప్లానిటోరియం ప్రాజెక్ట్‌కు సంబంధించి డీపీఆర్ కూడా సిద్ధం చేస్తోంది. మొత్తంగా అన్ని విధాలా కైలాసగిరిని అభివృద్ధి చేసి ప్రస్తుతం వచ్చిన పర్యాటకుల సంఖ్యను రెట్టింపు చేసుకోవాలని వీఎంఆర్డీఏ భావిస్తోంది. రెండో ఘాట్ రోడ్డు నిర్మాణం ఆంధ్రప్రదేశ్ డిజాస్టర్ రికవరీ ప్రాజెక్టు(ఏపీడీఆర్పీ) కింద ప్రపంచ బ్యాంకు అందిస్తున్న నిధులతో కైలాసగిరిని మరింత ఆకర్షణీయంగా అభివృద్ధి చేసేందుకు వీఎంఆర్డీఏ రంగం సిద్ధం చేసింది. ప్రస్తుతం కైలాసగిరికి ఒక ఘాట్‌రోడ్డు ఉంది. దీనికి అనుగుణంగా మరో ఘాట్ రోడ్డుని ఆధునిక సౌకర్యాలతో నిర్మించేందుకు సన్నాహాలు చేస్తోంది. 800 మీటర్ల పొడవుతో ఈ ఘాట్ రోడ్డు నిర్మించనున్నారు. ఏపీడీఆర్పీ నిధుల్లో 8.97 కోట్లతో రెండో ఘాట్ రోడ్డు నిర్మాణంతో పాటు ప్రస్తుతం ఉన్న ఘాట్ రోడ్డును అభివృద్ధి చెయ్యనున్నారు. దీనికి సంబంధించిన డీపీఆర్ కూడా సిద్ధమవుతోంది. మొత్తం మీద మరో ఏడాది కాలంలో కైలాసగిరిని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసేందుకు వీఎంఆర్డీఏ సమగ్ర కార్యచరణతో ముందుకెళ్తోంది. రెండో ఘాట్ రోడ్డు నమూనా పర్యాటకంలో ప్రధానాకర్షణగా... అన్ని హంగులతో కైలాసగిరిని అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశాం. దేశీయ పర్యాటకులతో పాటు విదేశీ సందర్శకుల అభిరుచులకు తగ్గట్లుగా ఫుడ్‌కోర్టులు, ఇతర మౌలిక సదుపాయాలు అందుబాటులోకి తీసుకొస్తున్నాం. ఇప్పటికే దీనికి సంబంధించిన అన్ని రకాల చర్యలకు ఉపక్రమిస్తున్నాం. 3డీ ప్లానిటోరియం ప్రాజెక్ట్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఇవన్నీ పూర్తయితే దేశీయ పర్యాటకంలో కైలాసగిరి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. – పి.కోటేశ్వరరావు, వీఎంఆర్డీఏ కమిషనర్ -
హార్సిలీహిల్స్‌పై అడ్వెంచర్ ఫెస్టివల్
బి.కొత్తకోట(చిత్తూరుజిల్లా): రాష్ట్రంలో అరకు తర్వాత అత్యంత శీతల ప్రదేశంగా పేరుపొందిన హార్సిలీహిల్స్ సాహస ఉత్సవాలకు సంసిద్ధమైంది. సముద్రమట్టానికి 4,141 అడుగుల ఎత్తులో ఉన్న హార్సిలీహిల్స్‌లో చరిత్రలో మొట్టమొదటిసారిగా అడ్వెంచర్ ఫెస్టివల్ నిర్వహించేందుకు రాష్ట్ర పర్యాటక శాఖ ఏర్పాట్లు చేసింది. శని, ఆదివారాల్లో రెండు రోజులపాటు ఈ ఉత్సవాలు కొనసాగనున్నాయి. ఇందులో భాగంగా సాహస క్రీడల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఉత్సవాల నిర్వహణ కోసం జిల్లా అధికారులు వారం రోజులుగా శ్రమించారు. పోటీల నిర్వహణ, సాంస్కృతిక కార్యక్రమాలకు అన్ని ఏర్పాట్లు చేశారు. సందర్శకుల కోసం ప్రత్యేకంగా ఫుడ్ స్టాళ్లు, ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నారు. పిల్లలు, పెద్దలను అలరించేలా ఉత్సాహభరితమైన కార్యక్రమాలు కనువిందు చేయనున్నాయి. సినీ నేపథ్య గాయకులు, హాస్య నటులు కార్యక్రమాలతో అలరించనున్నారు. ఈ నేపథ్యంలో కొండపై పండగ సందడి నెలకొంది. ఉత్సవాల్లో పాల్గొనేందుకు పొరుగు రాష్ట్రాలకు చెందిన పర్యాటకులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. సాహస క్రీడా పోటీలు ఇలా.. ఉత్సవాల్లో భాగంగా వివిధ అంశాల్లో పోటీలు నిర్వహించనున్నారు. 9 కిలోమీటర్ల ఘాట్‌రోడ్డులో 3 కిలోమీటర్ల సైక్లింగ్, 3 కిలోమీటర్ల రన్నింగ్, అడవిలో 3 కిలోమీటర్ల నడక పోటీలు జరుగుతాయి. ఈ పోటీల్లో కర్ణాటక, తమిళనాడు, ఏపీ, తెలంగాణ ప్రాంతాలకు చెందిన వందమందికిపైగా పాల్గొంటారని అంచనా. ఇవికాకుండా కొండపైన హీట్ బెలూన్స్, రోప్ సైకిలింగ్, జిప్ సైకిల్, ఎయిర్ బెలూన్స్, సర్వైవల్ క్యాంప్, ట్రెక్కింగ్, రాక్ క్లైంబింగ్, బైక్ రైడింగ్ పోటీలు కూడా నిర్వహిస్తారు. ఈ పోటీల్లో విజేతలకు బహుమతులు అందిస్తారు. ఉత్సవాలకు హాజరయ్యే క్రీడాకారులు, యాత్రికుల కోసం కొండపై 50 టెంట్లు సిద్ధం చేశారు. నాటి ఏనుగు మల్లమ్మ కొండే నేటి హార్సిలీహిల్స్! ఆహ్లాదకర వాతావరణంతో హార్సిలీహిల్స్ పర్యాటకుల మనస్సు దోస్తూ పర్యాటక ప్రదేశంగా విరాజిల్లుతోంది. దీన్ని బ్రిటీష్ పాలనలో 1850లలో చిత్తూరు–కడప జిల్లాల కలెక్టర్ డబ్ల్యూడీ హార్సిలీ కనుగొన్నారు. దీంతో ఏనుగు మల్లమ్మ కొండగా పిలువబడుతున్న ఈ కొండ హార్సిలీహిల్స్‌గా మారింది. అత్యంత చల్లటి హార్సిలీహిల్స్‌లో 2000 సంవత్సరం నుంచి పర్యాటక శాఖ కార్యకలాపాలు ప్రారంభించడంతో మరింత ప్రాచుర్యంలోకి వచ్చింది. వేసవి విడిదిగా పర్యాటకులను ఆకర్షిస్తూ మంచి ఆదాయం గడిస్తోంది. హార్సిలీహిల్స్‌ను సాహస క్రీడలకు కేంద్రంగా నిలపడం ద్వారా మరింతమంది పర్యాటకులను ఆకర్షించాలని భావించిన పర్యాటక శాఖ ఇందులో భాగంగా తొలిసారిగా అడ్వెంచర్ ఫెస్టివల్ నిర్వహించాలని నిర్ణయించింది. ఉత్సవాల నిర్వహణ కోసం రూ.కోటి నిధులను వినియోగిస్తోంది. -
తెలంగాణ ఊటీగా అనంతగిరి..
వికారాబాద్ అర్బన్: అనంతగిరిని తెలంగాణ ఊటీగా మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు టూరిజం శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, విద్యా శాఖ మంత్రి సబితారెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం మంత్రులు, ఎంపీ రంజిత్‌రెడ్డి, వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్, జెడ్పీ చైర్పర్సన్ సునీతారెడ్డితో కలిసి అనంతగిరి కొండల్లో క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో మంత్రి సబితారెడ్డి అనంతగిరి గుట్టను టూరిజం స్పాట్‌గా అభివృద్ధి చేయాలనే విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకొచ్చారని తెలిపారు. స్పందించిన సీఎం.. ఈ ప్రాంతాన్ని వెంటనే అభివృద్ధి చేయాలని ఆదేశించారని, మంత్రులు స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించి అభివృద్ధి కోసం ప్రణాళికలు, నివేదికలు సమర్పించాలని ఆదేశించారని పేర్కొన్నారు. అనంతగిరిని హాస్పిటల్ టూరిజం, టెంపుల్ టూరిజం, అడ్వెంచర్ టూరిజంలా అభివృద్ధి చేయాలనుకుంటున్నట్లు వివరించారు. అధికారులంతా టీం వర్క్ చేసి 10 రోజుల్లో దీనికి సంబంధించిన ప్రతిపాదనలు రూపొందించాలని సూచించారు. తాము మరోసారి సమావేశమై చర్చించి సీఎం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. తెలంగాణలోనే అనంతగిరిని ఉత్తమ టూరిజం కేంద్రంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. అన్ని వివరాలను అధ్యయనం చేసేందుకు ఒక కమిటీని వేస్తున్నామని తెలిపారు. 10–15 రోజుల్లో వివరాలను వెల్లడిస్తామని తెలిపారు. అనంతరం మంత్రి సబితారెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ అడిగిన వెంటనే ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించినట్లు తెలిపారు. సీఎం ఆదేశాల మేరకే అందరం ఇక్కడికి వచ్చి క్షేత్రస్థాయిలో వివరాలు తెలుసుకుంటున్నామని చెప్పారు. -
పర్యాటకరంగం పై సీఎం వైఎస్ జగన్ ఫోకస్
-
పర్యటకాంధ్ర
సాక్షి, అమరావతి: ప్రపంచవ్యాప్తంగా పర్యాటక ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్‌ను ప్రముఖ స్థానంలో నిలిపేలా చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. పర్యాటకం, పురావస్తు (ఆర్కియాలజీ), యువజన వ్యవహారాల శాఖలపై ముఖ్యమంత్రి శుక్రవారం సమీక్షించారు. ‘భారత్‌లో అడుగుపెట్టే ప్రతి విదేశీ పర్యాటకుడు రాజస్థాన్ రాష్ట్రాన్ని ఎంపిక చేసుకుంటున్నారు. అక్కడ పర్యాటక ప్రాంతాల్లో అంతర్జాతీయ సదుపాయాలు ఉండడమే దీనికి కారణం’ అని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ఏపీలో కూడా ఆ స్థాయిలో అభివృద్ధి చేసేందుకు ఎంపిక చేసిన ప్రాంతాల వివరాలను అందజేయాలని అధికారులను ఆదేశించారు. ‘రాష్ట్రంలో 15 నుంచి 20 పర్యాటక ప్రాంతాలను ఎంపిక చేసి అంతర్జాతీయంగా పేరున్న సంస్థల సహకారంతో అభివృద్ధి చేయాలి. సెవెన్ స్టార్ తరహా సదుపాయాలున్న హోటళ్లు అవసరం. ఆతిథ్యం, పర్యాటక రంగాల్లో పేరు ప్రఖ్యాతలున్న సంస్థలు హోటళ్లను ఏర్పాటు చేసేలా ఉత్తమ సదుపాయాలు కల్పించాలి. దీనివల్ల రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలపై అంతర్జాతీయ స్థాయిలో మంచి ప్రచారం లభిస్తుంది. పర్యాటక ప్రాంతాలను గుర్తించిన తర్వాత మార్కెటింగ్‌పై కూడా దృష్టి సారించాలి’ అని సీఎం సూచించారు. గండికోటలో గాజు వంతెన..! రాష్టŠట్రంలో కళింగపట్నం, విశాఖపట్నం, కాకినాడ, రాజమండ్రి, పోలవరం, సూర్యలంక, హార్సిలీ హిల్స్, ఓర్వకల్లు, గండికోట తదితర ప్రాంతాలను పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దవచ్చని అధికారులు ప్రతిపాదించారు. దీనిపై పూర్తిస్థాయి వివరాలతో సమాచారం సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. గండికోట అడ్వెంచర్ అకాడమీ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని, నదికి అడ్డంగా గాజు వంతెన నిర్మించే యోచన ఉన్నట్లు అధికారులు తెలిపారు. పర్యాటక ప్రాంతాలుగా జలాశయాలు... పర్యాటకులను ఆకర్షించేందుకు పోలవరం, పులిచింతల, నాగార్జునసాగర్, శ్రీశైలం, సోమశిల, కండలేరు తదితర రిజర్వాయర్లు, డ్యాంలతోపాటు అరకు, లంబసింగి, పాడేరు, మారేడుమిల్లి తదితర ప్రాంతాల్లో టూరిజం అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. విశాఖలో మరో మ్యూజియం ఏర్పాటు చేసేందుకు రక్షణశాఖ అధికారులు సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) పలు చోట్ల హోటళ్లు, రిసార్టులను నిర్వహిస్తున్నా నిధుల కొరతతో నిర్వహణ లోపాలు ఎదురవుతున్నట్లు అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు. వెంటనే మరమ్మతులు చేపట్టి నిర్వహణ మెరుగుపరచాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. హస్తకళలను ప్రోత్సహించాలి... రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపునిస్తున్న హస్తకళలు అంతరించిపోకుండా ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. అరుదైన నైపుణ్యం కలిగిన ఏటికొప్పాక, కొండపల్లి, కలంకారీ కళాకారులును ఆదుకునే దిశగా కార్యాచరణ సిద్ధం చేయాలన్నారు. వీటిపై ఆధారపడి జీవించే కుటుంబాలకు సాయం చేసేలా మార్గదర్శకాలు రూపొందించి నివేదిక ఇవ్వాలని సూచించారు. ఆర్కియాలజీ కార్పొరేషన్‌కు గ్రీన్ సిగ్నల్... రాష్ట్రంలో చారిత్రక స్థలాల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, నిర్వహణ కోసం ఆర్కియాలజీ కార్పొరేషన్ ఏర్పాటుకు ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కొండపల్లికి రోడ్డు, లైట్ల సదుపాయం, బాపు మ్యూజియంలో అభివృద్ది కార్యక్రమాలను పూర్తి చేయాలని ఆదేశించారు. శిల్పారామాలను అభివృద్ధి చేయడంతో పాటు పచ్చదనం పెంచాలన్నారు. శిల్పారామాల నిర్వహణకు ఇబ్బంది లేకుండా ఒక విధానాన్ని రూపొందించాలని ఆదేశించారు. ఐదెకరాల్లో సాంస్కృతిక అకాడమీలు... రాష్ట్రవ్యాప్తంగా ప్రతి జిల్లాలో కల్చరల్ అకాడమీ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి జగన్ నిర్ణయించారు. కనీసం 5 ఎకరాల్లో ఈ అకాడమీల నిర్మాణ పనులు చేపట్టి రెండేళ్లలో పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సంగీతం, నాట్యం సహా ఇతర కళల్లో శిక్షణ, బోధన, ప్రదర్శనలకు కల్చరల్ అకాడమీలు వేదిక కావాలని ఆకాంక్షించారు. మన కళలు, సాంస్కృతిక వారసత్వాన్ని నిలబెట్టుకునేందుకు ఇవి వేదికలు కావాలన్నారు. సంగీత, నృత్య కళాశాలలో బోధించే పార్ట్‌టైం, ఫుల్‌టైం సిబ్బంది జీతాలు పెంచాలని సీఎం ఆదేశించారు. జిల్లాకో క్రీడా సముదాయం... ‘ప్రతి జిల్లాలో క్రీడా సముదాయాలు ఉండాలి. ప్రతి స్కూల్లో కూడా క్రీడల కోసం మైదానం అవసరం. ఇప్పటివరకు ఎన్ని స్కూళ్లలో ప్లే గ్రౌండ్స్ ఉన్నాయి? ఇంకా ఎన్నిచోట్ల ఏర్పాటు చేయాలి?’ అనే అంశాలపై నివేదిక ఇవ్వాలని అధికారులను సీఎం ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న ఆటస్థలాల అభివృద్ధికి కార్యాచరణ సిద్ధం చేయాలన్నారు. వ్యాయామ శిక్షకులు తగినంత మంది ఉన్నారా? అనే విషయాన్ని కూడా నివేదికలో పొందుపరచాలని సూచించారు. అంతర్జాతీయ స్థాయిలో క్రీడా స్టేడియంలు... విశాఖపట్నం, రాజమండ్రి / కాకినాడ, అమరావతి, తిరుపతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో క్రీడా స్టేడియంల నిర్మాణాలపై ముఖ్యమంత్రి నిర్వహించిన సమావేశంలో చర్చించారు. అంతర్జాతీయ సదుపాయాలతో స్టేడియంల నిర్మాణానికి సీఎం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. నిర్మాణాల్లో నాణ్యత, అంతర్జాతీయ ప్రమాణాలు ఉండేలా చూడాలని స్పష్టం చేశారు. జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనేందుకు అర్హత సాధించిన రాష్ట్ర క్రీడాకారులను ప్రోత్సహించడం, వారికి అండగా నిలవటంపై ప్రతిపాదనలు తయారు చేయాలని ఆదేశించారు. జాతీయ క్రీడల్లో పతకాలు సాధించిన వారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున నగదు ప్రోత్సాహకాలు ఇచ్చే ఆలోచన గతంలో ఎప్పుడూ చేయలేదని, వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలో రాగానే ఆ కార్యక్రమాన్ని చేపట్టిందని సీఎం చెప్పారు. భద్రతపై సంతృప్తి చెందితేనే బోట్లకు అనుమతి.. పర్యాటకులు, ప్రయాణికులకు సరైన భద్రతా ఏర్పాట్లు చేశారని సంతృప్తి చెందిన తర్వాతే నదిలో బోట్లు తిరిగేందుకు అనుమతి ఇవ్వాలని సీఎం ఆదేశించారు. నదీ తీరాల్లో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటుపై సీఎం ఆరా తీశారు. వీటిపై ఏర్పాటైన కమిటీ నివేదిక రాగానే సిఫార్సులపై చర్చిద్దామని చెప్పారు. సమావేశంలో పర్యాటక, పురావస్తు, యువజన వ్యవహారాలశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి కె.ప్రవీణ్ కుమార్‌తోపాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. శిల్పారామాలను అభివృద్ధి చేస్తాం: మంత్రి శ్రీనివాసరావు మండల, నియోజకవర్గ స్థాయిలో స్టేడియంలు అభివృద్ధి చేయడంపై సమావేశంలో చర్చించినట్లు సమీక్ష అనంతరం మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. క్రీడాకారులకు ప్రోత్సాహకాలు అందిస్తామన్నారు. సాంస్కృతిక వికాస కేంద్రాలు ఏర్పాటు చేసి కళాకారులకు అండగా ఉంటామన్నారు. ఇడుపులపాయలో శిల్పారామం ఏర్పాటు చేయడంతో పాటు రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న శిల్పారామాలను కోటి రూపాయలతో మరమ్మతులు చేపట్టనున్నట్లు వెల్లడించారు. శిల్పారామాలు.. – ఇడుపులపాయలో కొత్తగా ఏర్పాటు.. – మిగతా ప్రాంతాల్లో శిల్పారామాల మరమ్మతులకు నిధులు పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేసేవి –కళింగపట్నం –విశాఖపట్నం –కాకినాడ –రాజమండ్రి –పోలవరం –సూర్యలంక –హార్సిలీ హిల్స్ –ఓర్వకల్లు –గండికోట –పులిచింతల, నాగార్జునసాగర్, శ్రీశైలం, సోమశిల, కండలేరు జలశయాలను టూరిజం ప్రాంతాలుగా తీర్చిదిద్దాలని నిర్ణయం – అరకు, లంబసింగి, పాడేరు, మారేడుమిల్లిలో టూరిజం పెంచేందుకు చర్యలు గండికోట – అడ్వెంచర్ అకాడమీ ఏర్పాటుకు చర్యలు – నదికి అడ్డంగా గాజు వంతెన నిర్మాణం -
యోగా మనదేశ సంపద: శ్రీనివాస్‌గౌడ్
సాక్షి, హైదరాబాద్: యోగా భారత దేశంలో పుట్టిన గొప్ప సంపద అని, నేడు ప్రపంచ వ్యాప్తంగా మేధావులు, విద్యావంతులు సాధన చేయడం గర్వకారణమని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. 5వ ఇంటర్నేషనల్ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇండియా టూరిజం–తెలంగాణ టూరిజం సంయుక్తంగా హుస్సేన్ సాగర్‌లోని బుద్ధ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన యోగా కార్యక్రమంలో శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనిషి జీవనం యాంత్రికంగా మారడంతో మానసికంగా అంతా అలసిపోతున్నారని, శరీరానికి వ్యాయామం ఎంత అవసరమో, మెదడుకు కూడా యోగా ద్వారా వ్యాయామం అవసరమని సూచించారు. మన దేశంలో పుట్టిన యోగా, మెడిటేషన్‌లను ప్రపంచమంతా సాధన చేస్తుండటం గర్వకారణమని కొనియాడారు. కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం తదితరులు పాల్గొన్నారు. -
స్త్రీయేటివిటీ!
స్త్రీలకు సంబంధం లేని వాటికి కూడా స్త్రీలనే పెట్టి పబ్లిసిటీని క్రియేట్ చెయ్యడం అన్నది భూమి మీద మగవాళ్లు ఉన్నప్పట్నుంచీ ఉంది. ఇప్పుడూ ఉంది. అయితే ఇప్పుడు తక్కువగా ఉంది. తక్కువవుతూ ఉంది. ఈ టైమ్‌లో మళ్లీ ఇప్పుడొక అలజడి.. ‘విల్నస్’ టూరిజం యాడ్!! ఈశాన్య ఐరోపాలోని లిథువేనియా రాజధాని ‘విల్నస్’ ప్రత్యేకతలు ఏమిటో ఎవరికీ తెలియదు. ఎవరికైనా తెలుసేమో కానీ, లిథువేనియా పర్యాటక శాఖ తెలియదనే అనుకుంది. మరి తెలియని ప్రదేశం గురించి పరదేశీ టూరిస్టులకు తెలియజేసి, వారిని రప్పించడం ఎలా? పబ్లిసిటీ ఇవ్వాలి. అయితే ఊరికే.. ‘ఈ ప్లేస్ అద్భుతంగా ఉంటుంది.. వచ్చి చూడండి’ అని పబ్లిసిటీ ఇస్తే, ఆ ప్లేస్‌ను చూడటం అటుంచి ముందసలు పబ్లిసిటీ పోస్టర్ పైపే చూడరు. ఎలా మరి! క్రియేటివ్‌గా ఆలోచించి యాడ్ క్రియేట్ చెయ్యాలి. సోషల్ మీడియా వచ్చాక ఎవరికీ తక్కువ క్రియేటివిటీ లేదని తేలిపోయింది. అందుకని యాడ్ పోస్టర్ ‘హైలీ క్రియేటివ్’ గా ఉండాలి. అప్పుడే చూపు పడుతుంది. ఆసక్తి కలుగుతుంది. లిథువేనియా టూరిజం వాళ్లు గత గురువారం ఇటువంటిదే ఒక హైలీ క్రియేటివ్ యాడ్‌ని విడుదల చేశారు. ఐరోపా మ్యాప్ మీద ఒక స్త్రీ వెల్లకిలా పడుకుని ఉంటుంది. అనుభూతి చెందుతున్న స్థితిలో ఆమె తన గుప్పెటతో మ్యాపులో విల్నస్ పట్టణం ఉన్నచోట దుప్పటి లాంటి ఆ మ్యాపును బిగించి పట్టుకుని ఉంటుంది. బిగిసిన నుదురు, విరిసిన జుట్టు, దగ్గరకు చేరిన కనుబొమలు.. అంతవరకే ఆ స్త్రీ ముఖం కనిపిస్తుంది. పైన ‘విల్నస్, ది జి–స్పాట్ ఆఫ్ యూరప్’ అని రాసి ఉంటుంది. ఆ పైన ‘నోబడీ నోస్ వేర్ ఇట్ ఈజ్, బట్ వెన్ యు ఫైండ్ ఇట్.. ఇటీజ్ అమేజింగ్’ అని ఉంటుంది. ‘అదెక్కడుందో ఎవరికీ తెలీదు. అయితే దానిని కనిపెడితే మాత్రం మహాద్భుతంగా ఉంటుంది’ అని భావం. ఈ పోస్టర్ విడుదలయీ అవగానే లిథువేనియాలోని క్యాథలిక్కుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయింది. విల్నస్లోని క్యాథలిక్ చర్చి ఈ దిక్కుమాలిన క్రియేటివిటీ మీద విరుచుకుపడింది. సెప్టెంబర్ 22 నుంచి 25 వరకు బాల్టిక్ దేశాల పర్యటనలో భాగంగా పోప్ ఫ్రాన్సిస్ విల్నస్కి కూడా వస్తున్నారు. చర్చి అధికారుల అసహనానికి అది కూడా ఒక కారణం. సరిగ్గా పోప్ వచ్చే ముందు ఈ దరిద్రం ఏమిటని వారు ప్రధానికి దృష్టికి తీసుకెళ్లారు. ‘పోస్టర్లో హద్దులు మీరినతనమేమీ లేదు కానీ, పోస్టర్ని విడుదల చేసిన సమయమే.. అనుకోకుండా అనుచితం అయిందని నవ్వేశారు ఆయన. అంతే తప్ప పోస్టర్ని కాన్సిల్ చెయ్యమని అనలేదు. ముందుముందు అంటారేమో తెలీదు. స్త్రీలకు సంబంధం లేని వాటికి కూడా స్త్రీలనే పెట్టి పబ్లిసిటీని క్రియేట్ చెయ్యడం అన్నది భూమి మీద మగవాళ్లు ఉన్నప్పట్నుంచీ ఉంది. ఇప్పుడూ ఉంది. అయితే ఇప్పుడు తక్కువగా ఉంది. తక్కువవుతూ ఉంది. క్రమంగా.. స్త్రీలకు సంబంధించినవని మనం అనుకుంటున్న గృహోపకరణాలు వగైరాలకు కూడా ఇప్పుడు మగవాళ్లను మోడల్‌గా పెట్టి యాడ్ పోస్టర్లు, కమర్షియల్ వీడియోలు క్రియేట్ చేస్తున్నారు. దాదాపుగా ‘జెండర్ న్యూట్రల్’ దశ చేరువలోకి వచ్చేసింది లోకం. ఈ టైమ్‌లో ఇప్పుడీ మాలోకం.. జి–స్పాట్ పోస్టర్!! మరో ఐరోపా దేశం ఫ్రాన్స్‌లో ఇప్పుడు లైంగిక హింసను ప్రేరేపించే క్రియేటివిటీకి వ్యతిరేకంగా ఉద్యమం నడుస్తోంది. స్త్రీలను అశ్లీలంగా చూపే సృజనాత్మకత ఎక్కడున్నా.. అక్కడికి పిడికిళ్లు బిగించి వెళ్లిపోతున్నారు మహిళలు. ఫ్రాన్స్ సముద్ర తీర ప్రాంతంలోని రిసార్ట్లు ఎంత రమణీయంగా ఉంటాయో చెప్పడానికి.. బికినీలు ధరించి తీరం వెంబడి నడుస్తున్న యువతుల ఫొటోలను టూరిజం కార్డుల మీద ‘రిస్కే’గా (లైంగిక భావనలు కలిగించేలా) ముద్రించడంపై కొద్ది రోజులుగా అక్కడి స్త్రీవాద సంస్థ ‘ఫెమ్ సోల్జర్స్’ అభ్యంతరం చెబుతోంది. న్యూస్ స్టాండ్లు, టూరిజం స్టాల్స్, సావనీర్ షాపులలోని రిస్కే కార్డులను ఖాళీ చేయిస్తోంది. అలా ఖాళీ చేయించడం పురుషులకు నచ్చడం లేదు. ‘‘ఏళ్లుగా ఉన్నదే కదా. స్త్రీలు లేకుండా అందం, వినోదం ఉంటుందా’’ అని మగాళ్లు అంటుంటే.. ‘‘ఇలాంటి పురుషానందాల వల్లనే కదా స్త్రీలపై ఇంత లైంగిక హింస జరుగుతోంది’’ అని ఫెమ్ సోల్జర్స్ అరోపిస్తున్నారు. తక్షణం ఆకట్టుకోవడానికి సృజనాత్మకంగా చెప్పడం అవసరమే. అయితే మైండ్‌కి టచ్ అవడం, హార్ట్‌కి టచ్ అవడం అని రెండు ఉంటాయి. సృజనాత్మకత మనసును తాకితే ఆహ్లాదంగా ఉంటుంది. మైండ్‌ను తాకితే అలజడిగా ఉంటుంది. స్త్రీ అంశతో యాడ్స్ చేసేటప్పుడు మనసూ, మైండ్ రెండూ కూడా ఆహ్లాదకరంగా లేకుంటే అది క్రియేటివిటీ అవదు. స్త్రీయేటివిటీ అవుతుంది. అది ఎక్కువ కాలం ఉండదు. మైండ్‌కి తప్ప హార్ట్‌కు టచ్ అవదు కాబట్టి. విల్నస్ టూరిజం శాఖ వివాదాస్పద పబ్లిసిటీ పోస్టర్ఈ పోస్టర్ విడుదలయీ అవగానే లిథువేనియాలోని క్యాథలిక్కుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయింది. విల్నస్లోని క్యాథలిక్ చర్చి ఈ దిక్కుమాలిన క్రియేటివిటీ మీద విరుచుకుపడింది. - మాధవ్ శింగరాజు -
రామప్పను సందర్శించిన జర్మనీయులు
వెంకటాపురం(ఎం): మండలంలోని చారిత్రాక రామప్ప దేవాలయాన్ని బుధవారం జర్మనీకి చెందిన ఇద్దరు సందర్శించారు. ఈ సందర్భంగా రామప్ప రామలింగేశ్వరస్వామికి వారు పూజలు నిర్వహించగా ఆలయ పూజారి ఉమాశంకర్ వారికి తీర్థప్రసాదాలు అందించారు. అనంతరం ఆలయ శిల్పకళాసంపద గురించి టూరిజం గైడ్ గోరంట్ల విజయ్‌కుమార్ వారికి వివరించగా శిల్పాకళా అందాలను వారు తమ కెమెరాల్లో బంధించుకొని ముగ్ధులయ్యారు. -
పర్యాటకానికి మొండిచెయ్యి!
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ స్థాయిలో పర్యాటకులను ఆకట్టుకోగలిగే ప్రాంతాలు ఉన్నప్పటికీ... వసతుల కరువు, ప్రచార లేమితో ప్రయోజనం ఉండడం లేదు. అయినా పర్యాటకంపై దృష్టి పెట్టని ప్రభుత్వం.. తాజా బడ్జెట్లో నామమాత్రంగా నిధులు కేటాయించింది. పర్యాటక శాఖకు కేవలం రూ.107 కోట్లతో సరిపెట్టింది. ఇందులోనూ ప్రగతి పద్దు కింద కేటాయించిన నిధులు రూ.80 కోట్లే. కనీసం రూ.500 కోట్లు ఇవ్వాలని పర్యాటక శాఖ విజ్ఞప్తి చేసినా ప్రభుత్వం స్పందించలేదు. వృద్ధ కళాకారుల పింఛన్‌కు రూ.6.75 కోట్లు, సాంస్కతిక అకాడమీలకు సాయంగా రూ.4 కోట్లు, సాంస్కృతిక ఉత్సవాలకు రూ.15 కోట్లు, తెలంగాణ సాంస్కృతిక సారథికి రూ.18 కోట్లు కేటాయించింది. పురావస్తు శాఖకు నామమాత్రమే రాష్ట్రంలో ఎన్నో చారిత్రక విశిష్టతలున్న ప్రాంతాలు, నిర్మాణాలు ఉన్నా.. ఆలనాపాలనా లేక దెబ్బతింటున్నాయి. వాటిని పరిరక్షించాల్సిన పురావస్తు శాఖ నిధులు, సిబ్బంది లేక నిస్తేజంగా మారింది. ఇలాంటి సమయంలోనూ పురావస్తు శాఖను పట్టించుకోని ప్రభుత్వం.. తాజా బడ్జెట్లో నామమాత్రంగా రూ.కోటి మాత్రమే కేటాయించింది. గతేడాది కూడా ఇలాగే తక్కువ నిధులు ఇచ్చినా.. అధికారులు ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేసుకుని అదనంగా నిధులు విడుదల చేయించుకున్నారు. ఆ నిధులతో కొత్త ప్రాంతాల్లో చారిత్రక తవ్వకాలు, మ్యూజియంలలో అభివృద్ధి పనులు నిర్వహిస్తున్నారు. -
గోల్కొండలో ‘షో’ చూపిస్తున్నారు!
‘సౌండ్ అండ్ లైట్ షో’లో చుక్కలు చూపిస్తున్న సిబ్బంది - నష్టాల పేరుతో ఎగ్జిక్యూటివ్ టికెట్లను అంటగడుతున్న వైనం - రూ.80 టికెట్ ఇచ్చేందుకు నిరాకరణ.. రూ.140 టికెట్ కొనాలని ఒత్తిడి సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ పర్యటనకు వచ్చిన బెంగళూరు వరుణ్ కుటుంబం సోమ వారం రాత్రి గోల్కొండ కోటలో సౌండ్ అండ్ లైట్ షోకు వెళ్లింది. సాధారణ కేటగిరీ రూ.80 టికెట్ కావాలని కౌంటర్లో అడగ్గా, ఎగ్జిక్యూ టివ్ కేటగిరీ రూ.140 టికెట్ కొంటేనే అనుమ తిస్తామని సిబ్బంది తెలిపారు. రూ.60 చిన్న పిల్లల టికెట్‌నూ రూ.140కి కొనాల్సిందే నని తేల్చి చెప్పారు. అంత ఖర్చు పెట్టడం ఇష్టం లేక షో చూడకుండానే వారు వెనుదిరిగారు. కొన్ని రోజులుగా సౌండ్ అండ్ లైట్ షోలో జరుగుతున్న తంతు ఇది. దేశంలోనే టాప్ షోగా పేరున్న గోల్కొండ సౌండ్ అండ్ లైట్ షో కీర్తి మసకబారే వ్యవహారమిది. పర్యాటక శాఖ నిర్లక్ష్యం, ప్రభుత్వ పర్యవేక్షణ లేకపోవడంతో కొందరు అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ గోల్కొండకు వచ్చే పర్యాటకులు విస్తుపోయేలా చేస్తున్నారు. గోల్కోండలో రెండు సౌండ్ అండ్ లైట్ షోలు నిర్వహిస్తుండగా నిర్వహణ సరిగా లేక ప్రదర్శనకు వచ్చే సందర్శకుల సంఖ్య తగ్గింది. రెండో ప్రదర్శనకు ప్రేక్షకులు మరీ తక్కువగా ఉంటుండటంతో నిర్వహణ ఖర్చులకు సరిపోవటం లేదంటూ రెండో తరగతి టికెట్లు అమ్మకుండా, ఎగ్జిక్యూటివ్ టికెట్లే కొనాలంటూ సిబ్బంది ఒత్తిడి చేస్తున్నారు. సోమవారం బెంగళూరు నుంచి వచ్చిన సందర్శకులు సిబ్బందిని నిలదీస్తే ‘ఫిర్యాదు చేసుకోండి’ అంటూ దురుసుగా వ్యవహరించారు. సమస్య ఇది.. దేశంలో ప్రస్తుతం 7 చోట్ల సౌండ్ అండ్ లైట్ షోలున్నాయి. వీటిలో తొలుత ఎర్రకోట షో మొదలైనా, రెండో విడతలో అండమాన్ జైలు, మదురై ప్యాలెస్, కోల్‌కతా విక్టోరియా మెమోరియల్‌తో కలిపి 1993లో మొదలైన గోల్కొండ షో టాప్‌గా నిలిచింది. 450 అడుగుల ఎత్తున్న కోటను రంగురంగుల 720 లైట్లతో అద్భుతంగా చూపటంతోపాటు గంటపాటు కొనసాగడం దీని ప్రత్యేకత. నగర సందర్శనకు వచ్చే పర్యాటకులు ప్రత్యేకంగా ఈ షో కోసం క్యూ కడుతుంటారు. కానీ ప్రస్తుతం ఆ లైట్లు, సౌండ్ సిస్టం పాతపడిపోవటంతో తరచూ సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. దీనికి తోడు కొత్త సిబ్బందిని నియమించటంతో వారికి సరైన నైపుణ్యం, అవగాహన లేక సమస్యలు పెరిగాయన్న ఫిర్యాదులున్నాయి. ఇక నిత్యం రాత్రి 7 గంటలకు ఆంగ్లంలో వివరిస్తూ సాగే తొలి షో ఉంటుంది. 8 గంటలకు మొదలయ్యే రెండో ప్రదర్శనలో... వారంలో సోమ, బుధ, శుక్రవారాల్లో తెలుగులో, మిగతా రోజుల్లో హిందీలో షో ఉంటుంది. మొదటి ప్రదర్శనకు సందర్శకులు తాకిడి ఎక్కువగా ఉన్నా రెండో ప్రదర్శన(ముఖ్యంగా తెలుగు) కు జనం తగ్గిపోయారు. సాధారణంగా ఒక ప్రదర్శనకు రూ.2,800 విద్యుత్ ఖర్చవుతుండగా అందులో సగం వసూళ్లు ఉంటేనే షో నిర్వహించే పద్ధతి ఉంది. ఇటీవల సందర్శకుల సంఖ్య తగ్గటంతో అంతమొత్తం వసూలు కాక షో నిర్వహణ డోలాయమానంలో పడింది. దీంతో వచ్చే అరకొర సందర్శకులను కచ్చితంగా రూ.140 ఉండే ఎగ్జిక్యూటివ్ టికెట్లే కొనాలని సిబ్బంది ఒత్తిడి చేస్తున్నారు. చిన్నపిల్లకు రూ.110 వసూలు చేయాల్సి ఉండగా వారికీ ఫుల్ టికెట్ విక్రయిస్తున్నారు. ఇద్దరు ముగ్గురు పర్యాటకులు వస్తే షో లేదని పంపేస్తున్నారు. ఒకేసారి 15 మంది వస్తేనే షో ఉంటుందని సిబ్బంది చెబుతున్నారు. కొసమెరుపు: కనీస నిర్వహణ ఖర్చులకు సరిపడా డబ్బులు రాకుంటే ఎగ్జిక్యూటివ్ టికెట్ కొనాల్సిందేనని పర్యాటక శాఖ వెబ్సైట్లో ఎక్కడా కనిపించదు. అప్పటికప్పుడు సిబ్బంది చెప్పి హడలగొడుతున్నారు. రూ.18 లక్షల నష్టం..? సౌండ్ అండ్ లైట్ షోకు సంవత్సరానికి రూ.కోటి పైనే ఆదాయం ఉంటుంది. ఏటా రూ.10 లక్షల నుంచి రూ.12 లక్షల మధ్య పెరుగుతూ ఉంటుం ది. అయితే 2015–16లో రూ.1.32 కోట్లు వసూలవగా 2016–17లో రూ.1.26 కోట్లే వసూలైంది. పెరగాల్సిన రూ.12 లక్షల ఆదాయం సమకూరకపోగా రూ.6 లక్షల నికర నష్టం వచ్చింది. వెరసి రూ.18 లక్షల మేర నష్టం వాటిల్లింది. దీంతో నష్టం నుంచి బయటపడేందుకు రూ.140 టికెట్లను అంటగట్టి సందర్శ కుల జేబుకు చిల్లు పెడుతున్నారు. -
స్ఫూర్తిదాయకంగా ‘బుద్ధవనం’
ఈ ప్రాజెక్టుపై సీఎం కేసీఆర్‌కు భారీ ప్రణాళికలున్నాయి ► రాష్ట్ర యువజన పర్యాటక శాఖ కార్యదర్శి డి.వెంకటేశం ► నగరంలో ముగిసిన అంతర్జాతీయ బౌద్ధ సదస్సు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బౌద్ధ చరిత్రను ప్రతిబింబించే బుద్ధవనం ప్రాజెక్టును ప్రపంచ దేశాలకు స్ఫూర్తిదాయకంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు భారీ ప్రణాళికలున్నాయని, వాటిని నిజం చేసేందుకు బౌద్ధ దేశాల ప్రతినిధుల తోడ్పాటు అవసరమని రాష్ట్ర యువజన పర్యాటక శాఖ కార్యదర్శి డి.వెంకటేశం చెప్పారు. తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆద్వర్యంలో బుద్ధవనం ప్రాజెక్టు నేతృత్వంలో రెండు రోజులపాటు జరిగిన అంతర్జాతీయ బౌద్ధ సదస్సు ముగింపు కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ బౌద్ధ చరిత్రను వెలుగులోకి తేవడంలో భాగంగానే బుద్ధవనం ప్రాజెక్టును ప్రపంచ దేశాలు గర్వించదగ్గ స్థాయిలో అభివృద్ధి పరిచేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. బౌద్ధ ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 25, 26 తేదీల్లో తెలంగాణ చారిత్రక బౌద్ధ ప్రదేశాల విశిష్టతను చాటేందుకు విదేశీ ప్రతినిధులతో బౌద్ధ క్షేత్రాల్లో పర్యటించి తెలంగాణ బౌద్ధ విలువలను ముందుయుగాలకు అందిస్తామని బుద్ధవనం ప్రాజెక్టు ప్రత్యేకాధికారి మల్లెపల్లి లక్ష్మయ్య వెల్లడించారు. రెండో రోజు సదస్సులో నిర్వహించిన నాలుగు సెషన్లలో యునైటెడ్ కింగ్డమ్, ఇండోనేషియా, థాయ్‌లాండ్, తైవాన్, షికాగో, కెనడా, శ్రీలంక, మయన్మార్ నుంచి వచ్చిన ప్రతినిధులు బౌద్ధంలోని వివిధ కోణాలను వివరించారు. ఆ««దlునిక సమాజంలో వాటి సహేతుకతను పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని వీరు అభిప్రాయపడ్డారు. విద్యాభ్యాసంలో భాగం చేయాలి... మొదటి సెషన్ కు అధ్యక్షత వహించిన సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ డాక్టర్ కె.రామచంద్రమూర్తి మాట్లాడుతూ.. బుద్ధవనం ప్రాజెక్టును ఓ బృహత్తర కార్యక్రమంగా చేపట్టి, దానిని అమలు చేసేందుకు అంబేడ్కర్‌వాది, బౌద్ధ మేధావి మల్లెపల్లి లక్ష్మయ్యను ప్రత్యేక అధికారిగా నియమించడం హర్షణీయమని అన్నా రు. రాష్ట్ర ఉన్నత విద్య కమిషనర్ ప్రొఫెసర్ సంకసాల మల్లేశ్ అధ్యక్షతన నిర్వహించిన రెండో సెషన్ లో మానవీయతను పెంపొం దించే బౌద్ధ విలువలను విద్యావిధానంలో భాగం చేయాల్సిన అవసరాన్ని వక్తలు నొక్కి చెప్పారు. అసమానతలను తరిమేసేందుకు బౌద్ధాన్ని స్వీకరించిన అంబేడ్కర్ వారసత్వం కారణంగానే ఇటువంటి సదస్సులను నిర్వహించగలుగుతున్నామని ఐఏఎస్ అధికారి ఉండ్రు రాజశేఖర్ అభిప్రాయపడ్డారు. దళితులు, అంబేడ్కర్‌వాదులే బౌద్ధ వారసత్వాన్ని ముందుకు తీసుకెళుతున్నారన్నారు. మూడో సెషన్ లో బౌద్ధ క్షేత్రాలను ప్రోత్సహించి, విదేశీ బౌద్ధ పర్యాటకులను ఆకర్షించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై వక్తలు చర్చించారు. నాల్గో సెషన్ లో బౌద్ధం, మయన్మార్‌లో శాంతి, శ్రీలంకలో బౌద్ధ అనుభవాలు తదితర అంశాలపై చర్చించారు. ఈ సెషన్ కు కేవై రత్నం అధ్యక్షత వహించారు. సదస్సు సందర్భంగా బౌద్ధవ్యాప్తికి ప్రపంచ బౌద్ధ భిక్షువులు ప్రతినబూనారు. సదస్సులో ఉస్మానియా ప్రొఫెసర్ చెన్న బసవయ్య, ఉస్మానియా వర్సిటీ ఓఎస్డీ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి, కొరివి వినయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
సంక్రాంతి కానుక... గగన విహారం
నేటి నుంచి మళ్లీ హెలీ టూరిజం 17వ తేదీ వరకు అవకాశం హైదరాబాద్: నగరవాసులకు సంక్రాంతి కానుకగా టూరిజం శాఖ అధికారులు హెలీ టూరిజాన్ని మళ్లీ పునరుద్ధరించారు. హుస్సేన్ సాగర్, నెక్లెస్ రోడ్డు, సాగర్ మధ్యలో ఉండే తథాగతుడిని వీక్షించి అక్కడికి కాస్త దూరంలో ఉండే బిర్లా మందిర్, శాసనసభా ప్రాంగణం, చార్మినార్, మక్కా మసీదు, గోల్కొండ కోట పరిస రాలు... హైటెక్ సిటీ, సైబరాబాద్‌లోని ఐటీ భవనాలన్నింటినీ నిమిషాల్లో వీక్షించాలను కునేవారికి ఇదో అవకాశం. గత ఏడాది మార్చి ఒకటిన నెక్లెస్ రోడ్డు, జలవిహార్ సమీపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రాంతం లో హెలీటూరిజం కార్యక్రమాన్ని అధికారులు ప్రారంభించారు. కొంతకాలం నడిచాక ఉపరాష్ట్ర పతి నగరానికి వచ్చిన నేపథ్యంలో గగనతల ఆంక్షలు విధించి, ఏవియేషన్ అధికారులు అనుమతులు నిరాకరించారు. దానికితోడు బుకింగ్ పొరపాట్ల కారణంగా పర్యాటకులు ఆసక్తి చూపకపోవటంతో గగన విహారానికి బ్రేక్ పడింది. ఈ నేపథ్యంలో అధికారులు ఈసారి కొన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ముందుగానే ఎయిర్‌ట్రాఫిక్ కంట్రోల్, డైరెక్టర్ జనరల్ సివిల్ ఏవియేషన్ అనుమతులను పొందారు. టూరిజం కార్యదర్శి బుర్రా వెంకటేశం తుంబే ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్ వారిని ఒప్పించి హెలీటూరిజం ప్రారంభమయ్యేలా చేశారు. ఐదురోజులే ఈ అవకాశం... ఈ హెలీ టూరిజాన్ని ఐదురోజులకే పరి మితం చేశారు. 13 నుంచి 17 వరకు సాగు తుంది. ఉదయం 10 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 1 గంట వరకు, మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు హెలీకాప్టర్ తిరుగు తుంది. ఒక్కొక్కరికి రూ.3,500 టికెట్ ధర చెల్లించాలి. నలుగురు కుటుంబసభ్యులు కలసి వస్తే ఒక్కొక్కరికి రూ.3 వేలు, 12 మంది కుటుంబసభ్యులు కలసి వస్తే ఒక్కొక్కరికి రూ. 2,500 చెల్లించాలి. మేరా ఈవెంట్స్ డాట్ కామ్‌లో బుకింగ్ చేసుకోవాలి. -
అన్ని వర్గాలతో చర్చించాకే నిర్ణయం
‘బీచ్ లవ్’పై పర్యాటక శాఖ కార్యదర్శి శ్రీకాంత్ వివరణ సాక్షి, విశాఖపట్నం: వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విశాఖపట్నంలో నిర్వహించతలపెట్టిన బీచ్ లవ్ ఫెస్టివల్‌పై అన్ని వర్గాలతో చర్చించాకే నిర్ణయం తీసుకుంటామని రాష్ట్ర పర్యాటక శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్ తెలిపారు. ‘బాబు సర్కారు సమర్పించు బీచ్ లవ్’ శీర్షికతో ‘సాక్షి’లో గురువారం ప్రచురితమైన కథనంపై ఆయన స్పందించారు. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమాలు సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించేవిగానే ఉంటాయని పేర్కొన్నారు. బీచ్ లవ్ ఫెస్టివల్ నిర్వహణకు బాధ్యులైన అధికారులు ఆ కార్యక్రమం ప్రతి దశలోనూ వ్యక్తిగతంగా డిప్యూటీ కలెక్టర్(విశాఖ) నుంచి అనుమతులు తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. అనుమతి లేనిదే ఏ కార్యక్రమాన్నీ అంగీకరించబోమని స్పష్టం చేశారు. ఇక్కడ సంస్కృతి, వారసత్వం, ప్రకృతి అందాలను అంతర్జాతీయంగా పర్యాటకుల దగ్గరకు తీసుకెళ్లాలన్నదే ప్రభుత్వ అభిమతమన్నారు. జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులు అమితంగా ప్రేమించే కేంద్రంగా రాష్ట్రాన్ని మార్చడానికి ప్రయత్నిస్తున్నట్లు వివరించారు. అది ప్రైవేటు కార్యక్రమం: టూరిజం రీజనల్ డెరైక్టర్ విశాఖలో బీచ్ లవ్ ఫెస్టివల్ పూర్తిగా ప్రైవేటు కార్యక్రమమని పర్యాటక శాఖ రీజనల్ డెరైక్టర్(విశాఖ) శ్రీరాములునాయుడు వివరణ ఇచ్చారు. దీనికి ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆర్థిక సాయం అందించడం లేదని స్పష్టం చేశారు. ఉత్సవం పేరుతో సంస్కృతి, సంప్రదాయాలకు విరుద్ధంగా కార్యక్రమాల నిర్వహణను అనుమతించబోమన్నారు. ఈ ఫెస్టివల్లో చేపట్టే కార్యక్రమాలపై కలెక్టర్ ఆధ్వర్యంలోని కమిటీ పరిశీలించాకే అనుమతులు మంజూరు చేస్తామని తెలిపారు. -
బాబు సర్కార్ సమర్పించు..బీచ్ లవ్
-
బాబు సర్కార్ సమర్పించు..బీచ్ లవ్
వేదిక : విశాఖ తీరం సారథ్యం : ఏపీ సర్కార్ ముఖ్య అతిథి : సీఎం చంద్రబాబు - దేశ విదేశాల నుంచి 9 వేల జంటలకు ఆహ్వానం - జంటల కోసం బీచ్‌లో ప్రత్యేకంగా టెంట్ల ఏర్పాటు - అందాల పోటీలు, హాలీవుడ్, బాలీవుడ్ తారల నృత్యాలు - ఫిబ్రవరి 12 నుంచి మూడురోజుల పాటు నిర్వహణ - ఇది విదేశీ విష సంస్కృతికి బీజం - మహిళా, విద్యార్థి, ప్రజా సంఘాల మండిపాటు సాక్షి, విశాఖపట్నం: ఎప్పుడూ విదేశీ భజన చేసే ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఇప్పుడవే విదేశీ పోకడలను రాష్ట్రానికి దిగుమతి చేసేందుకు పూనుకున్నారు. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా విశాఖ తీరంలో బీచ్ లవ్ ఉత్సవాన్ని నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. మందు, విందులతో పాటు గానా బజానాలకు రంగం సిద్ధమవుతోంది. గతంలో గోవా బీచ్‌లో ఇలాంటి ఉత్సవం నిర్వహించారు. ఈ ఏడాది విశాఖపట్నంలో అదే తరహా కార్యక్రమాలకు పూనుకోవడం, పర్యాటకాభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ పేరిట సర్కారు సైతం విశృంఖల పాశ్చాత్య సంస్కృతి వ్యాప్తికి దోహదపడే ప్రదర్శనలు, ఆట పాటలు, నృత్యాల నిర్వహణకు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడం ప్రకంపనలు సృష్టిస్తోంది. నిరసనలు మిన్నంటుతున్నాయి. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు, ఆచార వ్యవహారాలకు గొడ్డలి పెట్టులాంటి ఈ ఉత్సవాన్ని అడ్డుకుని తీరతామని విద్యార్థి, మహిళా, ప్రజా సంఘాలు స్పష్టం చేస్తున్నాయి. పర్యాటకం పేరిట రాష్ట్ర సర్కారు బరితెగించి వ్యవహరిస్తోందని మండిపడుతున్నాయి. ఇప్పటిదాకా దేశంలో ఒక్క గోవాలో తప్ప మరెక్కడా ఇలాంటి లవ్ ఫెస్టివల్ నిర్వహించిన దాఖలా లు లేవు. అయితే గోవా సంస్కృతి సంప్రదాయాలు వేరనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇది యువ తను పెడదారి పట్టించే ప్రమాదం ఉందని అంటున్నారు. ఆడవాళ్లను అందాల ప్రదర్శనకు, మగాళ్లను బల ప్రదర్శనకు పెట్టి ఈ ప్రభుత్వం ఏం చేయాలనుకుంటోందని మహిళా సంఘాల నేతలు మండిపడుతున్నారు. ఈ వివాదాస్పద బీచ్ ఫెస్టివల్‌పై విశాఖలో పర్యాటక శాఖ అధికారులు గానీ, వుడా, జీవీఎంసీ అధికారులు గానీ నోరుమెదపడం లేదు. ప్రభుత్వ నిర్ణయాన్ని అమలు చేయడమే తప్ప తామేమీ చేయలేమని అంటున్నారు. మూడురోజులు ఉత్సవాలు రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ముంబైకి చెందిన పాజిటివ్ గ్లోబల్ సర్వీసెస్ అండ్ కన్సల్టెన్సీ సంస్థ ఈ ప్రేమోత్సవం నిర్వహించనుంది. ఫిబ్రవరి 12 నుంచి ప్రేమికుల దినమైన 14వ తేదీ వరకు మూడురోజుల పాటు బీఎల్ఎఫ్-2017 పేరిట ఉత్సవాలు జరగనున్నాయి. ప్రఖ్యాత పాప్ గాయని, బెల్లీ డ్యాన్సర్ షకీరా ఆటపాటలు, హాలీవుడ్, బాలీవుడ్ తారలు, మోడళ్ల క్యాట్ వాక్‌లు, అందాల పోటీలు ఏర్పాటు చేస్తున్నారు. ఐరోపా, అమెరికా తదితర దేశాల నుంచి ఏకంగా 9వేల జంటలను ఈ ఉత్సవానికి ఆహ్వానిస్తున్నారు. వారికోసం ప్రత్యేకంగా టెంట్లు ఏర్పాటు చేస్తున్నారు. విశాఖ తీరంలో ఎక్కడ ఈ ఫెస్టివల్ నిర్వహించాలన్న దానిపై తర్జన భర్జనలు సాగుతున్నాయి. ప్రసిద్ధ బౌద్ధారామాలున్న తొట్లకొండ, సాగర్‌నగర్ బీచ్, ప్రపంచ ప్రఖ్యాత ఎర్రమట్టి దిబ్బలు అనువైనవిగా ప్రాథమికంగా గుర్తించారు. ఆయా ప్రదేశాల్లో ఎక్కడ ఏర్పాటు చేయాలన్న దానిపై ఇంకా ఓ నిర్ణయానికి రాలేదు. ఉత్సవంలో భాగంగా పెట్టుబడిదారుల సదస్సులతో పాటు మిస్టర్ అండ్ మిసెస్ బీచ్ లవ్ వంటి పలు పోటీలు నిర్వహించి విజేతలకు అవార్డులను అందజేయాలని కూడా యోచిస్తున్నారు. మారథాన్ వంటి పోటీలను మిల్కాసింగ్, పీటీ ఉషలతో ప్రారంభింపజేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. ఈ ఉత్సవంలో పాల్గొనేందుకు ప్రత్యేకంగా టికెట్ ధర కూడా నిర్ణయించనున్నట్టు తెలుస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు సహా పలువురు ప్రముఖులు హాజరుకానున్నట్లు సమాచారం. పర్యాటకాభివృద్ధికి ఇలాంటి ఉత్సవమా?! విశాఖ పేరును దెబ్బతీసే బీచ్ లవ్ ఫెస్టివల్ నిర్వహణ అభ్యంతరకరం. పర్యాటకరంగం అభివృద్ధికి ఇలాంటి ఫెస్టివల్‌ను ఎంచుకోవడం తగదు. వీటివల్ల యువత పెడదోవ పట్టే ప్రమాదం ఉంది. దీనిని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశా. ఆయన అందుబాటులో లేకపోవడంతో సీఎం పేషీ అధికారులతో, టూరిజం శాఖ కార్యదర్శితో మాట్లాడా. ఒకవేళ ఈ ఫెస్టివల్ అనుమతించాల్సి వస్తే కేవలం విదేశీ ప్రతినిధులకే పరిమితం చేయాలి. - పి.విష్ణుకుమార్‌రాజు, బీజేపీ ఎమ్మెల్యే, విశాఖ ఉత్తర నియోజకవర్గం సంస్కృతిని మంటగలుపుతున్నారు ఓ ప్రైవేటు సంస్థ తమ వ్యాపార ప్రయోజనాల కోసం లవ్ ఫెస్టివల్ పేరిట మహిళల శరీరాన్ని ప్రదర్శనకు పెట్టడం, దానికి ప్రభుత్వం ఆమోదముద్ర వేయడం దుర్మార్గం. గోవా బీచ్‌లో విశృంఖల పాశ్చాత్య పోకడలకు వ్యతిరేకంగా ఒకపక్క ఆందోళనలు చేస్తుంటే.. అలాంటి దుష్ట సంస్కృతిని విశాఖలో ప్రవేశపెడితే చూస్తూ ఊరుకోం. పర్యాటకరంగ అభివృద్ధికి ఇలాంటి వాటిని ఎంచుకోవడం దురదృష్టకరం. దీనిని అడ్డుకుంటాం. - ఎం.లక్ష్మి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రగతిశీల మహిళా సంఘం. -
గగన విహారానికి బ్రేక్!
సాక్షి, హైదరాబాద్: గగనతలం నుంచి భాగ్యనగరం అందాలను వీక్షించేందుకు ప్రభుత్వం ప్రారంభించిన హెలీ టూరిజం-జాయ్ రైడ్స్ ప్రాజెక్టు దాదాపుగా అటకెక్కింది. కనీసం ఒక్క బుకింగ్ కూడా రాకపోవటంతో ప్రాజెక్టును పర్యాటక శాఖ తాత్కాలికంగా రద్దు చేసుకుంది. హుస్సేన్‌సాగ ర్ తీరంలో నెక్లెస్‌రోడ్డు వైపు ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌ను మూసేసింది. మరోసారి హెలికాప్టర్ ట్రిప్పుల ను పునరుద్ధరించాలని పర్యాటక శాఖ చేసిన ప్రయత్నాలు ఫలితమివ్వలేదు. ఒక్కరంటే ఒక్క ప్రయాణికుడు కూడా స్పందించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. డోలాయమానంలో సీ ప్లేన్ ప్రాజెక్టు... జాయ్ రైడ్స్ విఫలం కావటంతో దాని ప్రభావం ‘సీ-ప్లేన్’ ప్రాజెక్టుపైనా పడింది. నీళ్లు, భూమి.. రెంటినీ రన్‌వేగా చేసుకొని గాలిలోకి ఎగిరే చిన్నవిమానాల (సీ ప్లేన్)ను కూడా పరిచయం చేయాలని పర్యాటక శాఖ భావించింది. తెలంగాణలో ఒక్క హైదరాబాద్ మినహా మరెక్కడా విమానాశ్రయాలు లేవు. దీంతో ఈ ప్రాంతంలోని పట్టణాలకు తొందరగా వెళ్లాలనుకునేవారికి ఇది ఎంతో సౌలభ్యంగా ఉంటుందని ఆశించింది. హుస్సేన్‌సాగర్ నుంచి గాలిలోకి ఎగిరే సీ ప్లేన్ కరీంనగర్ ఎల్ఎండీ నీళ్లలో, వరంగల్ వడ్డేపల్లి చెరువులో సులభంగా దిగే అవకాశం ఉంటుంది. హైదరాబాద్ నుంచి కరీంనగర్, వరంగల్ పట్టణాలకు వెళ్లేవారు దీనిపై ఆసక్తి చూపుతారని అధికారులు అంచనా వేశారు. ఏర్పాట్లన్నీ చేశాక జాయ్ రైడ్ తరహాలోనే ఇది విఫలమైతే ఏంచేయాలన్న ఆలోచనతో ఈ ప్రాజెక్టునూ తాత్కాలికంగా పక్కనపెట్టారు. టికెట్ ధర ఎక్కువగా ఉందనే... పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసే క్రమంలో హెలిటూరిజానికి పర్యాటక శాఖ రూపకల్పన చేసింది. అయితే కేవలం 10 నిమిషాల పర్యటనకు రూ.3,500 వరకు చెల్లించాల్సి రావటం, కనీసం ఆరుగురు ఉం టేనే ట్రిప్పు ఉండే మెలిక దానికి ఇబ్బందిగా మారింది. అంత ధర పెట్టడం మధ్య, దిగువ తరగతుల వారి కి ఇబ్బందిగా మారింది. ఎగువ తరగతి ప్రజలకు విమాన ప్రయాణాలు సాధారణమే అయినందున హెలి కాప్టర్లో చక్కర్లు కొట్టాల్సిన అవసరం లేదు. ఫలితంగా ప్రాజెక్టు విఫలమైంది. గత ఫిబ్రవరిలో మేడారం జాతర సమయంలో బేగంపేట నుంచి మేడారానికీ సర్వీసు ప్రారంభించారు. ఆరుగురు సభ్యుల ప్యాకేజీ ధర రూ.2.75 లక్షలు ప్లస్ సర్వీసు చార్జీ అదనంగా నిర్ధారించటంతో ఒక్కరూ ముందుకు రాలేదు. -
ఏపీ రాజధాని ప్రాంతంలో జూపార్కు
పర్యాటక శాఖపై సమీక్షలో ఏపీ సీఎం చంద్రబాబు ఆదేశాలు సాక్షి, విజయవాడ బ్యూరో: రాజధాని ప్రాంతంలో జంతు ప్రదర్శన శాఖ(జూపార్కు) ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఆయన మంగళవారం రాత్రి తన క్యాంపు కార్యాలయంలో పర్యాటక శాఖపై సమీక్ష నిర్వహించారు. విశాఖపట్నం, తిరుపతిలో ప్రస్తుతం ఉన్న జూలను అభివృద్ధి చేయడంతోపాటు రాజధానిలో కొత్త జూ ఏర్పాటుచేయడం ద్వారా పర్యాటకులను ఆకర్షించాలని చెప్పారు. రాష్ట్రానికి స్వదేశీ పర్యాటకుల రాక గతేడాది 45 శాతం పెరగ్గా విదేశీ టూరిస్టుల రాక 81 శాతం పెరిగిందని పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి నీరబ్‌కుమార్ ప్రసాద్ సీఎంకు తెలిపారు. విశాఖ జిల్లాలో ఇప్పుడున్న బీచ్‌లు కాకుండా మరో 6 బీచ్‌లను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. విశాఖలోని కంభాలకొండ, కైలాసగిరి ప్రాంతాలను హిల్ స్టేషన్లుగా తీర్చిదిద్దాలని సీఎం సూచించారు. శ్రీశైలంలో టైగర్ సఫారీ, కుప్పంలో ఎలిఫెంట్ సఫారీ ఏర్పాటు చేయాలన్నారు. నేలపట్టు, కొల్లేరు, పులికాట్ ప్రాంతాలను వన్యప్రాణి సంరక్షణ ప్రాంతాలుగా అభివృద్ధి చేయాలని ఆదేశించారు. విజయవాడ, విశాఖపట్నంలో ఈట్ స్ట్రీట్స్ ఏర్పాటు చేయాలన్నారు. విశాఖపట్నం, తిరుపతి, అమరావతి నగరాల్లో బొటానికల్ గార్డెన్లు నెలకొల్పాలని సూచించారు. అన్నవరం క్షేత్రాన్ని వెడ్డింగ్ డెస్టినేషన్ టౌన్‌గా తీర్చిదిద్ది అక్కడ జరిగే సత్యనారాయణస్వామి వ్రతాలకు ఉత్తర భారతదేశంలోనూ ప్రాచుర్యం కల్పించాలన్నారు. కర్నూలులో కొండారెడ్డి బురుజు ప్రాంతాన్ని విద్యుత్ వెలుగులతో సుందరీకరించాలని, చిత్తూరు జిల్లా చంద్రగిరి ఫోర్టులో ప్రత్యేక ఆకర్షణలు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. -
నగరంలో ‘డిస్నీల్యాండ్’!
రూ. 25 వేల కోట్లతో 300 ఎకరాల్లో ఏర్పాటు సాక్షి, హైదరాబాద్: అమెరికాలో చిన్నారుల వింత ప్రపంచం డిస్నీల్యాండ్.. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో త్వరలో కొలువుకానుంది. హాంకాంగ్.. షాంఘై.. తదితర విశ్వనగరాల్లో చిన్నారులకు ఆటవిడుపుగా అద్భుత ప్రపంచం సృష్టించిన అమెరికన్ సంస్థ డిస్నీల్యాండ్ ఆధ్వర్యంలోనే రాజధానిలోనూ డిస్నీల్యాండ్ ఏర్పాటుకు రంగం సిద్ధమయినట్లు విశ్వసనీయంగా తెలిసింది. టూరిజం శాఖ ఇందుకు సంబంధించిన సన్నాహాల రూపకల్పనలో నిమగ్నమైంది. దాదాపు 300 ఏకరాల స్థలంలో రూ. 25 వేల కోట్లతో దీన్ని నిర్మించనున్నారు. ఇందులో ప్రాచీన కట్టడాలు, యూరోపియన్ బిల్డింగ్స్, డ్రాగన్స్, డోనాల్డ్ డక్‌లు పిల్లలకు సంబంధించిన పలు అంశాలు ఏర్పాటు చేస్తారు. డిస్నీల్యాండ్ నిర్వాహకులు వచ్చే వారంలో హైదరాబాద్‌కు వచ్చి రాష్ట్ర ప్రభుత్వంతో ఈ విషయమై చర్చించనున్నారు. -
హెలీ టూరిజానికి అంతరాయం
వెనుదిరిగిన ప్రజలు టికెట్ మొత్తం ఇవ్వకుండా పంపిన నిర్వాహకులు హైదరాబాద్: హెలీ టూరిజానికి ఆదిలోనే అంతరాయం ఎదురైంది. రాష్ట్ర పర్యాటక శాఖ, ఇండ్‌వెల్ ఏవియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో మార్చి ఒకటిన నెక్లెస్ రోడ్డు, జలవిహార్ సమీపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రాంతంలో హెలీ టూరిజం కార్యక్రమం ప్రారంభమైంది. హెలీకాప్టర్‌లో నగరాన్ని వీక్షించాలన్న ఆసక్తితో పలువురు ఆన్లైన్లో టికెట్లు బుక్ చేశారు. కొందరికి ఆదివారం సమయం కేటాయించారు. ఈ నేపథ్యంలో నల్లగొండకు చెందిన డి. ప్రసాద్, మెహిదీపట్నంకు చెందిన జనార్దన్ తదితరులు ఆదివారం ఉదయమే హెలీ టూరిజం నిర్వహించే ప్రదేశానికి వచ్చి తమ టికెట్లు చూపించారు. అక్కడ ఉన్న నిర్వాహకులు మధ్యాహ్నం 3 నుంచి 4 గంటలకు రావాలని చెప్పారు. వారు అక్కడే నిరీక్షించి 4 గంటలకు నిర్వాహకులను ప్రశ్నిస్తే ఈ రోజు హెలీకాప్టర్ ట్రిప్పులు రద్దయ్యాయని మరోసారి సమయం కేటాయిస్తామని, లేకుంటే టికెట్ మొత్తం వెనక్కు తీసుకోవాలని దురుసుగా బదులిచ్చారు. మెహిదీపట్నానికి చెందిన జనార్దన్ మాట్లాడుతూ తాను మూడు రోజుల క్రితం నాలుగు టికెట్లు బుక్ చేశానన్నారు. ఉదయం 4 సార్లు నిర్వాహకులకు ఫోన్ చేసి కుటుంబసభ్యులతో కలసి వచ్చానన్నారు. ఉదయం నుంచి సాయంత్రం 4 గంటల వరకు మమ్మల్ని అక్కడే ఉంచి.. చివర్లో ట్రిప్పులు రద్దు చేస్తున్నట్లు తెలిపారన్నారు. డబ్బులు తిరిగి ఇస్తామని చెప్పి, మరి కొద్ది సేపు ఉంచి అది కూడా ఇవ్వకుండా వెనక్కు పంపారని వాపోయారు. తనతోపాటు పది మంది వెనక్కు వెళ్లారన్నారు. ఈ విషయమై హెలీ టూరిజం నిర్వహణ బాధ్యతలు చూస్తున్న కిట్టును సాక్షి ప్రశ్నిస్తే ఉపరాష్ట్రపతి నగరంలో ఉన్నందున ఏవియేషన్ అధికారులు అనుమతి ఇవ్వటంలో 4 గంటలు ఆలస్యం చేశారన్నారు. దాంతో హెలీ టూరిజం కోసం టికెట్లు కొనుగోలు చేసిన వారిలో కొందరిని వె నక్కు పంపాల్సి వచ్చిందన్నారు. -
సమ్మక్క, సారలమ్మ జాతర ఏర్పాట్లు పూర్తి: చందూలాల్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా జరుగుతున్న మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరను వైభోవోపేతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర గిరిజన సంక్షేమ, పర్యాటకశాఖల మంత్రి అజ్మీరా చందూలాల్ తెలిపారు. ఈ నెల 17-19 తేదీల్లో జరగనున్న జాతరకు 1.2 కోట్ల మంది భక్తులు హాజరుకావచ్చని అంచనా వేస్తున్నామని చెప్పారు. ఈ నెల 19న సీఎం కె.చంద్రశేఖరరావు మేడారం జాతరలో పాల్గొని మొక్కులు తీర్చుకుంటారని చెప్పారు. శనివారం సచివాలయంలోని తన ఛాంబర్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో ప్రతిష్టాత్మకమైన ఈ జాతర నిర్లక్ష్యానికి గురైందని, తెలంగాణ వచ్చాక జాతర నిర్వహణ కోసం సీఎం కేసీఆర్ రూ.175 కోట్లు విడుదల చేశారన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రోడ్లు, మంచినీరు, స్నానఘట్టాలు, టాయిలెట్లు, ఇతర సదుపాయాలను కల్పించామని చెప్పారు. హెలికాప్టర్ ద్వారా మేడారం సందర్శనకు ఏర్పాటు చేస్తున్నామన్నారు. జాతర కోసం ఆర్టీసీ ద్వారా 4 వేల బస్సులు, దక్షిణ మధ్య రైల్వే ద్వారా 16 రైళ్లు ఏర్పాటు చేశారని చెప్పారు. -
కోటి అందాల కోణార్క్
ఒడిషా రాష్ట్ర పర్యాటక శాఖ దేశంలో అన్ని రాష్ట్రాలలోనూ రోడ్ షోలను నిర్వహిస్తుంది. అందులో భాగంగా తెలుగువారికి ఒడిషా గొప్పదనాన్ని తెలియజేస్తూ ఇటీవల హైదరాబాద్‌లో రోడ్ షో కార్యక్రమం నిర్వహించింది. మహోన్నతమైన పర్యాటక ప్రదేశాలు కలిగిన ఒడిషాను బంగారు త్రికోణాకృతితో పోలుస్తుంటారు. వీటిలో భువనేశ్వర్, పూరీ, కోణార్క్‌లు ప్రధానమైనవి. ప్రపంచంలో సూర్యదేవాలయాలకు ఆంధ్రప్రదేశ్‌లోని అరసవిల్లి, ఒరిస్సాలోని కోణార్క్ మందిరాలు అత్యంత పేరుగాంచాయి. సూర్యమాసంగా పిలిచే మాఘమాసంలో ప్రతి యేటా కోణార్క్ ఉత్సవాలు ఘనంగా జరుపుతారు. ఈ సందర్భంగా అక్కడి రాష్ట్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ ఉత్సవాలను నిర్వహిస్తాయి. కోణార్క్ పూరీకి సరిగ్గా 85 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సూర్య రథాన్ని పోలినట్టు నిర్మించిన ఈ ఆలయం 12 చక్రాలతో 7 గుర్రాలతో శిల్పచాతుర్య పటిమతో నిర్మించారు. కోణార్క్ సముద్ర తీరంలో నిర్మించిన ఈ ఆలయం సూర్యగమనానికి అనుగుణంగా నిర్మించినట్టు తెలుస్తోంది. రథానికి అమర్చిన 12 చక్రాలు 12 నెలలు, 12 రాశులకు చిహ్నం. అలాగే సూర్య గమనం ఒక్కొక్క చక్రంలో ద్యోతకమవుతుంటుంది. అతి పురాతనమైన గిరిజన తెగలు బొండా, కోయ, పదజ, సంతాల్ వంటి వాటికి నిలయమైన ఒడిషా సందర్శకులు వీక్షించడానికి ఎన్నో అద్భుతాలను అందిస్తుంది. పచ్చదనం పరుచుకున్న తూర్పు కనుమలు, నీలి సొబగులతో రారమ్మనే బంగాళాఖాతం ఒడిషా అందాలను ద్విగుణీకృతం చేస్తుంటాయి. హైదరాబాద్ నుంచి సుమారు వెయ్యి కిలోమీటర్ల దూరంలో గల ఒడిషాకు రాజధాని భువనేశ్వర్. రాష్ట్రానికి కేంద్రబిందువుగా ఉన్న ఈ ప్రాంతానికి దేశంలోని అన్ని ప్రధాన నగరాల నుంచి రోడ్డు, రైలు, వాయు మార్గాల ద్వారా చేరుకోవచ్చు. మరిన్ని వివరాలకు: www.odishatourism.gov.in online booking: www.visitorissa.org ఇండియా టూరిజమ్, పర్యాటక భవన్, బేగంపేట్, హైదరాబాద్ వారి ఫోన్ నెం. 040-23409199 -
విదేశీయులకు ‘హైదరాబాద్ పాస్’
♦ లండన్ తరహాలో పర్యాటకుల కోసం చవకగా ఓ స్మార్ట్‌కార్డు ♦ మరెక్కడా రుసుము చెల్లించకుండా సేవలన్నీ అందులోనే.. ♦ హోటల్, రైలు, విమాన టికెట్లకు వేరుగా డబ్బు చెల్లించనక్కర లేకుండా ♦ విదేశీ పర్యాటకుల్ని ఆకట్టుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం సాక్షి, హైదరాబాద్: లండన్ పాస్.. ప్రపంచ పర్యాటకులకు సుపరిచితమైన పేరు. లండన్‌లో కాలుమోపిన విదేశీ పర్యాటకులకు అక్కడి అధికారులు తక్కువ ధరకు అందించే స్మార్ట్‌కార్డ్ ఇది. లండన్‌తోపాటు చుట్టుపక్కల ఉన్న పర్యాటక ప్రాంతాలకు వెళ్లినప్పుడు ఎక్కడా సందర్శన టికెట్ కొనాల్సిన అవసరం లేకుండా, క్యూలో నిలబడాల్సిన పనిలేకుండా నేరుగా లోనికి వెళ్లేందుకు ఇది ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఇదే తరహాలో ‘హైదరాబాద్ పాస్’ను అందుబాటులోకి తేవాలని తెలంగాణ సర్కారు నిర్ణయించింది. విదేశీ పర్యాటకులను ఆకట్టుకునేందుకు సరికొత్త ప్రణాళికలు రూపొందిస్తున్న ప్రభుత్వం అందులో భాగంగా హైదరాబాద్ పాస్‌ను ప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది. పర్యాటక స్థలాలతోపాటు హోటల్ గదులు, విమాన, రైలు టికె ట్లు కొనకుండా దీని ద్వారానే అన్నీ పొందేలా రూపకల్పన చేయబోతోంది. తక్కువ ధరకే.. భాగ్యనగరానికి వచ్చే టూరిస్టులకు పర్యాటక శాఖ పక్షాన ‘హైదరాబాద్ పాస్’ను అందజేస్తారు. ఆ పర్యాటకులు సందర్శించే ప్రాంతాలు, నగరంలో ఉండే రోజులు.. తదితరాల ఆధారంగా దీని ధరలను నిర్ధారిస్తారు. విడివిడిగా ఆయా సేవలు పొందేందుకు చెల్లించే మొత్తంతో పోలిస్తే వీటి ధర చాలా తక్కువ. దాన్ని కొన్న పర్యాటకుడు మరెక్కడా ఏ టికెట్ కొనాల్సిన పనిలేకుండా ఉపయోగించుకోవచ్చు. ఆ పాస్‌ను హోటళ్లు, ఎయిర్‌లైన్స్, పర్యాటక ప్రాంతాలతో అనుసంధానిస్తారు. ఇందుకోసం పర్యాటక శాఖ నగరంలోని అన్ని ప్రముఖ హోట ళ్లలో 5% గదులను, కొన్ని విమాన టికెట్లను రిజర్వ్ చేసి ఉంచుతుంది. వాటిని హైదరాబాద్ పాస్‌తో అనుసంధానించి రాయితీ ధరకు పర్యాటకులకు అందజేస్తుంది. ఇందుకు జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, హోటళ్లు, విమానయాన సంస్థలు, రైల్వేతో కలసి పనిచేస్తుంది. విదేశీ పర్యాటకులకు ‘ప్రత్యేక హోదా’ రాష్ట్ర పర్యటనకు వచ్చే విదేశీ పర్యాటకులకు ప్రత్యేక అతిథి హోదా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. వారు ప్రయాణించే కారుపై ప్రత్యేక సింబల్ ఏర్పాటు, వారు రాగానే హోటల్ సిబ్బంది సంప్రదాయ రీతిలో స్వాగతం పలకటం, షాపింగ్ చేస్తే రాయితీ ధరలకు వస్తువులు ఇవ్వడం.. తదితరాలు ఇందులో భాగం. విదేశాల్లో ఉంటున్న తెలంగాణవారు తెలంగాణ పర్యాటకానికి సాయపడే మరో అంశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తోంది. 2020 నాటికి 10 లక్షల పర్యాటకులు లక్ష్యం ప్రస్తుతం తెలంగాణకు వచ్చే వార్షిక పర్యాటకుల సంఖ్య లక్ష లోపే. దాన్ని 2020 నాటికి 10 లక్షలకు పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 2017 నాటికి 3 లక్షలు, 2018 నాటికి 5 లక్షలకు పెంచి తుదకు లక్ష్యాన్ని చేరుకోవాలనేది ప్రణాళిక. అందులో భాగంగానే ఈ కొత్త ప్రణాళికలపై దృష్టి సారించినట్టు పర్యాటకశాఖ కార్యదర్శి వెంకటేశం ‘సాక్షి’తో చెప్పారు. -
రవీంద్రభారతికి నెలరోజుల విరామం..!
పునరుద్ధరణ పనులకు శ్రీకారం సాక్షి,సిటీబ్యూరో : దీర్ఘకాలంగా సమస్యలతో రవీంద్రభారతి కళ తప్పింది. దీంతో ‘సాక్షి’లో ఆగష్టు 30న ‘కళా విహీనం’ శీర్షికన కథనం ప్రచురితమైంది. దీనిపైటూరిజం- సాంస్కృతిక శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం స్పందించారు. టీఎస్‌టీడీసీ విభాగంలో అభివృద్ధి పనులను పరిశీలించే ఎస్ఈతో మాట్లాడి వెంటనే పనులు చేపట్టాలని సూచించారు. ఆ మేరకు గురువారం టీఎస్‌టీడీసీ డీఈ ఆశోక్ కుమార్ రవీంద్రభారతిని పరిశీలించి, సాంస్కృతిక డెరైక్టర్ మామిడి హరికృష్ణతో కలిసి ఎక్కడెక్కడ పునరుద్ధరణ పనులపై అంచనాలు సిద్ధం చేశారు. ఆయా పనులకు సంబంధించి టెండర్ల పని వేగవంతం చేశారు. ఈ పనుల నిమిత్తం అక్టోబర్ ఒకటి నుంచి రవీంద్రభారతిని నెలరోజుల పాటు టీఎస్‌టీడీసీకి అప్పగించనున్నారు. ఈ పనులు పూర్తయ్యే వరకు ఎలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించే అవకాశం ఉండదని టూరిజం శాఖ అధికారులు తెలిపారు. -
ఏజెన్సీ@ టూరిజం సర్క్యూట్
- గట్టమ్మ నుంచి మల్లూరు వరకు విస్తరణ - ప్రతిపాదనలు పంపిన పర్యాటక శాఖ ములుగు: ములుగు ఏజెన్సీ ఇక టూరిజం సర్క్యూట్‌గా ఏర్పాటు కానుంది. కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన స్వదేశ్ దర్శన్ పథకంలో భాగంగా గోదావరి పరివాహక ప్రాంతంలో పలు అభివృద్ధి పనులు చేపట్టేందుకు పర్యాటకశాఖ అధికారులు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు ఓ నివేదిక రూపొందించారు. వచ్చే నెల మొదటి వారంలో హైదరాబాద్‌లో జరిగే టూరిజం అభివృద్ధి సమావేశంలో జిల్లా అధికారుల నివేదికపై చర్చలు జరిగే అవకాశం ఉంది. నివేదికకు గ్రీన్‌సిగ్నల్ లభిస్తే గట్టమ్మ - మంగపేట, మల్లూరు హేమాచల క్షేత్రం టూరిజం సర్క్యూట్‌గా రూపుదిద్దుకోనుంది. ఇది సర్క్యూట్ ప్రస్తుతం గట్టమ్మ ఆలయం సమీపంలో హరిత హోటల్‌తో పాటు కాటేజీలు, మల్లూరు క్షేత్రం సమీపంలో 8 కాటేజీలు , హరిత హోటల్ నిర్మించనున్నట్లు ఇదివరకే ఆ శాఖ మంత్రి అజ్మీర చందూలాల్ వెల్లడించారు. వెంకటాపురం మండలం పాలంపేట రామప్ప, గోవిందరావుపేట మండలంలోని లక్నవరం, తాడ్వాయి మండలంలోని మేడారంలు పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తారుు. ఏటూరునాగారం మండలం కంతనపల్లి, దేవాదుల, జంపన్నవాగు పరిసర ప్రాంతాలైనఊరట్టం, రెడ్డిగూడెం, తాడ్వాయి, ముల్లకట్ట, రామన్నగూడెం ప్రాంతాలను కలుపుతూ నూతనంగా టూరిజం పరంగా అభివృద్ధి చేయాలని శాఖ ప్రతిపాదించింది. పాపికొండలు తరహ బోటింగ్.. పాపికొండలు తరహలో గోదావరి పరివాహక ప్రాంతాల్లోని కంతనపల్లి సమీపంలో సుమారు 25 కిలోమీర్ల మేర బోటింగ్ సౌకర్యం ఏర్పాటు చేసేందుకు నిర్ణరుుంచారు. ఇందుకోసం అధికారులు గోదావరిలో పరిశీలించారు. గోదావరి నది ఒడ్డు ప్రాంతాల్లో ఏర్పాటు చేసే టూరిజం ప్రాంతాలను కలుపుకుంటూ ఆదిలాబాద్ నుంచి వరంగల్ వరకు ప్రత్యేక ప్యాకేజీతో బస్సులు నడిపించి పర్యాటకును ఆకట్టుకునే విధంగా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు సమాచారం. పుష్కరాల సందర్భంగా ఏటూరునాగారం, మంగపేట గోదావరి ప్రాంతాలు, కంతనపల్లి, ముల్లకట్ట, మల్లూరు లాంటి ప్రాంతాలు భక్తులను ఆకర్షించిన కారణంగా ఏకో టూరిజం ప్రణాళికలు సిద్ధం చేసినట్లు శాఖ అధికారి ఒకరు తెలిపారు. ముల్లకట్ట మరింత అందంగా ఏటూరునాగారం మండలం ముల్లకట్ట గ్రామం నుంచి ఖమ్మం జిల్లా పూసురులను కలుపుతూ వారధిగా నిర్మించిన ముల్లుకట్ట బిడ్జి ఇప్పటికే పలువురిని ఆకట్టుకుంది. బ్రిడ్జి ప్రాంతంలో హరిత హోటల్ ఇతర అభివృద్ధి పనులు చేపడితే అటు ఖమ్మం జిల్లాతో పాటు ఇటు మన జిల్లా పర్యాటకులను ఆకర్షించవచ్చని అధికారులు భావిస్తున్నారు. ప్రతిపాదనలు పంపించాం గట్టమ్మ నుంచి రామప్ప, లక్నవరం, మేడారం, కంతనపల్లి, దేవాదుల, మల్లూరు, గోదావరి పరీవాహక ప్రాంతాలను కలుపుతూ టూరిజం సర్క్యూట్‌గా ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధంచేసి అందించాం. సహకరించాలని కలెక్టర్‌ను కోరాం. వచ్చే నెలలో జరిగే శాఖ సమావేశంలో నివేదికపై చర్చలు జరిగే అవకాశం ఉంది. ఆమోదం అందితే పనులు ప్రారంభిస్తాం. గోదావరి పుష్కరాలకు వచ్చిన వారు, మేడారం వచ్చిన భక్తులు ఈ ప్రాంతాలకు తిరగివచ్చేలా చూడాలని భావిస్తున్నాం. - ఎం. శివాజీ, జిల్లా టూరిజం అధికారి -
పుష్కర పాట్లు
♦ నాలుగు గంటల పాటు ప్రయాణికుల నరకయాతన ♦ జేబీఎస్ నుంచి మేడ్చల్ వరకు బారులు తీరిన వాహనాలు ♦ ఉప్పల్ నుంచి ఘట్కేసర్కు కూడా ఇదే పరిస్థితి ♦ ఎల్బీనగర్ రింగ్ రోడ్డులోనూ అవే తిప్పలు సాక్షి, సిటీబ్యూరో : గోదావరి పుష్కరాల కోసం నగరవాసులు భారీసంఖ్యలో క్యూకట్టారు. వరుస సెలవుల నేపథ్యంలో కరీంనగర్‌లోని ధర్మపురి, వరంగల్ జిల్లా ఏటూరునాగారం, మంగపేట, కాళేశ్వరం, ఖమ్మంలోని భద్రచలం ప్రాంతాల్లో గోదావరి పుష్కరాల కోసం రోడ్డెక్కారు. శనివారం ఉదయమే పెద్దసంఖ్యలో వాహనాలు రోడ్లెక్కడంతో నగరశివార్లలో నాలుగు గంటలపాటు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. తార్నాక, సంగీత్ చౌరస్తా మీదుగా సికింద్రాబాద్‌లోని జేబీఎస్‌కు వచ్చేందుకు దాదాపు గంటన్నరకు పైగా పట్టింది. జేబీఎస్, తిరుమలగిరి, బొల్లారం, శామీర్‌పేట్ ప్రాంతాల్లో వాహనాలు ముందుకు వెళ్లే పరిస్థితి కనిపించలేదు. జేబీఎస్, బోయిన్పల్లి, సుచిత్ర, కొంపల్లి, మేడ్చల్ మార్గాల్లోనూ ట్రాఫిక్ స్తంభించింది. మేడ్చల్ ప్రాంతంలో దాదాపు నాలుగు కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి. ఎంపీ మల్లారెడ్డి కూడా ట్రాఫిక్‌లో ఇరుక్కొని మందుకెళ్లలేక మళ్లీ తిరుగు ప్రయాణమయ్యారు. వరంగల్ వెళ్లేందుకు ఉప్పల్ చేరుకున్న నగరవాసులు ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బొడుప్పల్, మేడిపల్లి, నారపల్లి, ఘట్కేసర్ వరకు వాహనాలు ముందుకెళ్లలేని పరిస్థితి కనిపించింది. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రాజమండ్రి, భద్రాచలం వెళ్లే ప్రయాణికులతో ఎల్బీనగర్ రింగురోడ్డు వాహనాల రద్దీతో కనిపించింది. ఎల్బీనగర్ రింగురోడ్డులో తెల్లవారుజాము నుంచి మధ్యాహ్నం వరకు ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు ట్రాఫిక్, సివిల్ పోలీసులు రంగంలోకి దిగినా కిలోమీటర్ల మేర వాహనాలు నిలిపోయాయి. వరంగల్, బాసర, నిజామాబాద్, అదిలాబాద్ వెళ్లే ప్రయాణికుల వాహనాలు ఒక్కసారిగా రోడ్డుపైకి రావడంతో అల్కాపురి, నాగోలు, ఉప్పల్ ప్రాంతంలో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఏపీ టూరిజంకు యమ గిరాకీ - 21వ తేదీ వరకు రిజర్వేషన్లు క్లోజ్ సాక్షి,సిటీబ్యూరో: తెలంగాణ పర్యాటక శాఖ పుష్కరాల సందర్భంగా ప్రకటించిన ట్యూర్ ప్యాకేజీకు విశేషమైన స్పందన లభించినంది. దీంతో ఈ నెల 21 వరకు టికెట్లు రిజర్వయ్యాయి. టూరిజం శాఖ ఆధ్వర్యంలోని హరిత హోటళ్లు కూడా కిటకిటలాడుతున్నాయి. నగరం నుంచి టూరిజం శాఖ ఆధ్వర్యంలో రోజు 17 బస్సులు నడుపుతున్నాయి. ట్యాంక్‌బండ్ సమీపంలోని శాఖ కార్యాలయం వద్ద నగరవాసులు క్యూ కట్టారు. సంస్థ ఆధ్వర్యలో నడుస్తున్న అన్ని బస్సుల టికెట్లు అమ్ముడుపోయాయని, డిమాండ్ మేరకు మరో మూడు బస్సులు అదనంగా నడుపుతున్నామని, సోమవారం తర్వాత మరిన్ని బస్సులు నడి పేందుకు చర్యలు తీసుకుంటామని సంస్థ అధికారులు పేర్కొన్నారు. బస్సులన్నీ ఫుల్ అఫ్జల్‌గంజ్: వరుసగా సెలవులు రావడంతో మహానగరం నుంచి పుష్కరాలకు నగరవాసులు శనివారం పెద్దసంఖ్యలో తరలివెళ్లారు. ఎంజీబీఎస్ (ఇమ్లిబన్), గౌలిగూడ బస్స్టేషన్ల నుంచే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి వెళ్లే బస్సుల్లో భక్తులు పుష్కరాలకు బయలుదేరారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో మహాపుష్కరాలు ఉండటంతో నగరంలో ఉండే రెండు రాష్ట్రాల ప్రజలు గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించడానికి వెళ్లారు. వారాంతం కావడం, రెండు రోజలు సెలవులు రావడంతో శుక్రవారం రాత్రి నుంచే ఎంజీబీఎస్‌లో పుష్కర ప్రయాణికుల రద్దీ పెరిగింది. రాజమండ్రి, నర్సాపురం, మంచిర్యాల, రామగుండం, భద్రాచలం, శ్రీకాకుళం, ధర్మపురి మార్గాల్లో వెళ్లే ప్రయాణికులతో ఎంజీబీఎస్ కిటకిటలాడింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా... ఆర్టీసీ సిటీ రీజియన్ వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతోంది. దీంతోగౌలిగూడ సిటీ బస్టాండ్‌కు బాసరకు వెళ్లే భక్తులు అధిక సంఖ్యతో తరలివచ్చారు. దీంతో పాటు నగరంలోని ఎల్బీనగర్, ఉప్పల్, సంతోష్‌నగర్, మెహిదీపట్నం తదితర ప్రాంతాల నుంచి బాసరకు ప్రత్యేక బస్సులు నడుపుతుండంతో అక్కడి నుంచి కూడా అధిక సంఖ్యలో భక్తులు బాసరకు వెళ్లారని ఆర్టీసీ అధికారులు తెలిపారు. -
ఇక భూంఫట్!
- వుడా పరిధిలోకి పర్యాటక శాఖ - అస్మదీయులకు భూపందేరానికి మార్గం సుగమం - ఇక ప్రైవేటు గుప్పెట్లోకి ఎర్రకొండ, సీతకొండలు! ఇదీ ఉత్తర్వు పర్యాటక శాఖను వుడా పరిధిలోకి ప్రభుత్వం తీసుకువస్తూ ప్రభుత్వం జీవో 146ను మంగళవారం జారీ చేసింది. వుడా వీసీ ఇక నుంచి ప్రాంతీయ పర్యాటక కమిషనర్‌గా వ్యవహరిస్తారు. పర్యాటక శాఖలోని అధికారులు, సిబ్బంది నేరుగా ఆయన నియంత్రణలోకి వస్తారు. ప్రాజెక్టుల రూపకల్పన, అందుకు ల్యాండ్ బ్యాంక్ ఏర్పాటు, డీపీఆర్‌లు రూపొందించడం, భూ కేటాయింపు అన్ని కూడా ఆయన పరిధిలోకి చేర్చింది. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : రాజు తలచుకుంటే... అన్న చందంగా మారింది విశాఖ నగరంలో ప్రభుత్వ భూపందేరం బాగోతం. పర్యాటకాభివృద్ధి ముసుగులో తమ అస్మదీయులకు భారీ భూ సంతర్పరణకు ప్రభుత్వం కార్యరంగాన్ని సిద్ధం చేసింది. నగరంలో ఎర్రకొండ, సీతకొండలతోసహా 2వేల ఎకరాలను తమ అనుయాయులకు కట్టబెట్టేందుకు మార్గం సుగమం చేసింది. పర్యాటక శాఖను ఏకంగా వుడా పరిధిలోకి తీసుకువచ్చింది. వుడా వీసీకి విశేష అధికారాలు కల్పిస్తూ పర్యాటక ప్రాజెక్టులపేరిట తమ అనుయాయులకు భూ పందేరానికి మార్గం సుగమం చేసింది. భూంఫట్!... ఇదీ పన్నాగం భారీ భూపందేరానికి మార్గం సుగమం చేయడానికే ప్రభుత్వం ఈ ఎత్తుగడ వేసింది. పర్యాటక ప్రాజెక్టు పేరిట నగరంలో 1,854 ఎకరాలను తమ అస్మదీయులకు కట్టబెట్టడానికి ప్రభుత్వం నిర్ణయించింది. నగర శివార్లలోని ఎర్రకొండ(893 ఎకరాలు) , సీతకొండ(212 ఎకరాలు), పెద్దగంట్యాడలో నరవ(275 ఎకరాలు), నాగుపూర(446 ఎకరాలు), మధురవాడలో గుడ్లవానిపాలెం(28 ఎకరాలు) భూములపై ప్రభుత్వ పెద్దలు కన్నేశారు. అటవీ భూములుగా ఉన్నవాటిని డీనోటిఫై చేయాలని వుడా కొన్ని రోజుల క్రితమే కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. ఎర్రకొండ, సీతకొండలపై 1,105 ఎకరాల్లో పర్యాటక ప్రాజెక్టుల కోసం డీపీఆర్‌లు రూపొందించాలని టెండర్లు పిలిచింది. కానీ ప్రభుత్వ భూములు, కొండలు వుడా పరిధిలో ఉన్నాయి. పీపీపీ విధానంలో పర్యాటక ప్రాజెక్టుల బాధ్యత పర్యాటక శాఖ చూస్తుంది. వేర్వేరు అధికారిక వ్వవస్థల వల్ల తమ వారికి భూములు కట్టబెట్టడంలో జాప్యం జరిగే అవకాశం ఉందని ప్రభుత్వం భావిచింది. పర్యావరణ, సీఆర్‌జెడ్ చట్టాలు, వుడా మాస్టర్‌ప్లాన్ నిబంధనలను బేఖాతరు చేస్తుండటంతో ఏమైనాఅవరోధాలు తలెత్తవచ్చని కూడా సందేహించింది. ఒకే వ్యవస్థ ఉంటేఅనుకున్న విధంగా పనికానిచ్చేయొచ్చని యోచించింది. పర్యాటక శాఖను పూర్తిగా వుడా పరిధిలోకి తీసుకువచ్చింది. దాంతో ఎర్రకొండ, సీతకొండలతోసహా 1,850ఎకరాల ధారాదత్తానికి మరో అడుగు వేసింది.