ప్రపంచవ్యాప్తంగా పర్యాటక ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్‌ను ప్రముఖ స్థానంలో నిలిపేలా చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. పర్యాటకం, పురావస్తు (ఆర్కియాలజీ), యువజన వ్యవహారాల శాఖలపై ముఖ్యమంత్రి శుక్రవారం సమీక్షించారు. ‘భారత్‌లో అడుగుపెట్టే ప్రతి విదేశీ పర్యాటకుడు రాజస్థాన్ రాష్ట్రాన్ని ఎంపిక చేసుకుంటున్నారు. అక్కడ పర్యాటక ప్రాంతాల్లో అంతర్జాతీయ సదుపాయాలు ఉండడమే దీనికి కారణం’ అని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ఏపీలో కూడా ఆ స్థాయిలో అభివృద్ధి చేసేందుకు ఎంపిక చేసిన ప్రాంతాల వివరాలను అందజేయాలని అధికారులను ఆదేశించారు. ‘రాష్ట్రంలో 15 నుంచి 20 పర్యాటక ప్రాంతాలను ఎంపిక చేసి అంతర్జాతీయంగా పేరున్న సంస్థల సహకారంతో అభివృద్ధి చేయాలి.
పర్యాటకరంగం పై సీఎం వైఎస్ జగన్ ఫోకస్
Published Sat, Oct 12 2019 7:56 AM | Last Updated on Thu, Mar 21 2024 11:35 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement