లైట్‌హౌస్‌లో ఫొటోగ్రాఫర్
కొరుక్కుపేట, న్యూస్‌లైన్: లైట్‌హౌస్‌ను సందర్శించేందుకు వచ్చే పర్యాటకుల కోసం ప్రత్యేక ఫొటోగ్రాఫర్‌ను ఏర్పాటు చేసేందుకు డెరైక్టరేట్ జనరల్ ఆఫ్ వైట్‌హౌస్ అండ్ లైట్‌షిప్స్ డీజీఎల్‌ఎల్, పర్యాటక శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. అతి తక్కువ ధరకు లైట్‌హౌస్‌ను సందర్శించే పర్యాటకుల ఫొటోలు తీసి రెడీమేడ్‌గా అందించేలా ఫొటోగ్రాఫర్‌ను త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించింది.
వేసవి కావడంతో సందర్శకుల తాకిడి పెరుగుతుంది. లైట్‌హౌస్‌ను సందర్శించినందుకు గుర్తుగా ఫొటోలు తీసుకోవటంపై సందర్శకులు ఉత్సాహం చూపుతుంటారు. 45.72 మీటర్లు ఎత్తరున లైట్‌హౌస్‌ను అన్ని రోజులు సందర్శకులకు అందుబాటులో ఉంచేలా నిర్ణయించామన్నారు. ఇప్పటివరకు ప్రతి సోమవారం మెయింటెనెన్స్ కోసం లైట్‌హౌస్‌కు సెలవు ఉండేది.
వేసవి కావటంతో వారంలో అన్ని రోజులు లైట్‌హౌస్‌ను సందర్శించే అవకాశాన్ని కల్పించనున్నట్లు డీజీఎల్‌ఎల్ చెన్నై డెరైక్టర్ టి.రామదాస్ తెలిపారు. సందర్శించే పర్యాటకులను, చిన్నారులను అసంతృప్తికి గురి చేయకూడదన్న సదుద్దేశంతో సోమవారం సైతం సందర్శనార్థం ఉంచామని తెలిపారు.
లైట్‌హౌస్‌ను ఉదయం 10 గంటల నుంచి ఒక గంట వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సందర్శకుల కోసం తెరిచే ఉంటుందన్నారు. ప్రస్తుతం 1,400 మంది పెద్దలు, 400 మంది చిన్నారులు వస్తున్నారని, వారాంతపు రోజుల్లో అది మరింతగా పెరుగుతుందని వివరించారు. ప్రస్తుతం సందర్శకులు, పర్యాటకశాఖ సహకారంతో ప్రత్యేక ఫొటోగ్రాఫర్‌ను ఏర్పాటు చేయనున్నామన్నారు.