Korukkupet
-
గర్ల్‌ఫ్రెండ్ ఫోన్ ఎత్తట్లేదని..
చెన్నై: కరోనా వైరస్ ఆ ప్రేమికుల మధ్య దూరాన్ని పెంచింది. లాక్డౌన్ ఆ దూరాన్ని మరింత అగాధంగా మార్చింది. వారు కలుసుకునే మార్గం లేకపోవడంతో కేవలం ఫోన్లలో మాట్లాడుకుంటూ, చాట్ చేసుకుంటూ ఉండేవారు. ఆ తర్వాత అమ్మాయి ఫోన్ ఎత్తడం కూడా మానేసింది. ఎన్నిసార్లు ఫోన్ చేసినా పట్టించుకోకపోవడంతో మానసిక క్షోభ అనుభవించిన ఆ ప్రియుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. తమిళనాడులోని చెన్నైలో చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చెన్నైలోని కొరక్కుమ్లో నివసిస్తున్న 22 ఏళ్ల దురాయ్ అనే యువకుడు ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన ఓ అమ్మాయిని గాఢంగా ప్రేమిస్తున్నాడు. (చదవండి: ఇద్దరితో ప్రేమాయణమే శ్రావణి కొంప ముంచిందా?) కరోనా వైపరీత్యానికి ముందు వరకు ఆ ఇద్దరూ బాగానే ఉన్నారు. అయితే లాక్డౌన్ విధించిన నాటి నుంచి వీళ్లు ఒక్కసారి కూడా కలుసుకోలేదు. ఫోన్లు మాట్లాడుకుంటూ, చాట్లు చేసుకునేవారు. ఏమైందో ఏమో కానీ కొన్నాళ్లుగా ఆమె దురాయ్ను పట్టించుకోవడం మానేసింది. ఎన్నిసార్లు ఫోన్లు చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో అతడు మనోవేదనకు లోనయ్యాడు. ఈ క్రమంలో గురువారం అతను నివసిస్తున్న భవనం మూడో అంతస్థు నుంచి దూకేశాడు. కాళ్లు విరిగి బాధతో గిలగిలా కొట్టుకుంటున్న అతడిని గమనించిన స్థానికులు వెంటనే జీఎస్ఎమ్సీహెచ్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం అతడు కోమాలో ఉన్నట్లు ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. కాగా ఈ ఘటనపై ఆర్కే నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: ఆత్మహత్యకు ముందు వీడియో తీసి..) -
ఘనంగా ఫ్రెషర్స్ డే
కొరుక్కుపేట: కళాశాల స్థాయిలో ర్యాగింగ్ సంప్రదాయానికి చరమాంకం పలికే విధంగా శ్రీ కన్యకా పరమేశ్వరి ఆర్ట్స్ అండ్ సైన్స్ మహిళా కళాశాల విద్యార్థినులు కొత్త ఒర వడికి నాంది పలికారు. ఈ మేరకు సీనియర్ విద్యార్థినులు ఫ్రెషర్స్‌కు ఘన స్వాగతం పలికారు. చెన్నై, ప్యారీస్‌లోని శ్రీ కన్యకా పరమేశ్వరి మహిళా కళాశాలలో కొత్తగా చేరిన డిగ్రీ విద్యార్థినులకు స్వాగతం పలికే విధంగా బుధవారం ప్రత్యేక కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కళాశాల వాతావరణంలోనికి అడుగుపెడుతున్న విద్యార్థినులకు అంతా శుభం జరగాలని కోరుతూ సీనియర్లు శ్రీ కన్యకాపరమేశ్వరి ఆలయంలోకి కొత్తగా చేరిన విద్యార్థినులను తీసుకెళ్లి అమ్మవారి దర్శనం చేయించారు. అనంతరం విద్యార్థినులను కళాశాల ఆవరణలో ప్రిన్సిపాల్ డాక్టర్ టి.మోహనశ్రీ, వైస్ ప్రిన్సిపాల్ పి.బి.వనిత, కరస్పాండెంట్ కృష్ణారావు, అధ్యాపకులు, సీనియర్ విద్యార్థినులు ఘనస్వాగతం పలికారు. ర్యాగింగ్‌కు చరమాంకం పలికేలా మనమందరం స్నేహభావంతో మెలగాలనే సందేశాన్ని ఇచ్చే విధంగా నూతన విద్యార్థులకు సీనియర్లు చేసిన హంగామా ఆకట్టుకుంది. నూతన విద్యార్థినులకు రోజా పూలను అందించి తరగతి గదులకు ఆహ్వానించారు. కళాశాల ఆవరణలో కొత్త విద్యార్థినుల చేత మొక్కలను నాటించారు. ప్రిన్సిపాల్ మోహనశ్రీ మాట్లాడుతూ ఈ ఏడాది డిగ్రీ మొదటి సంవత్సరంలో 500 మంది చేరినట్లు తెలిపారు. నూతన విద్యార్థులకు అంతా శుభం జరగాలని, వారి లక్ష్యాలు సఫలం కావాలని ఆకాంక్షించారు. అనంతరం సీనియర్ విద్యార్థినులు వేసిన నృత్యాలు అలరించాయి. కళాశాల అధ్యాపకులు డాక్టర్ మైథిలీ, అధ్యాపకులు, విద్యార్థినులు పాల్గొన్నారు. -
లైట్‌హౌస్‌లో ఫొటోగ్రాఫర్
కొరుక్కుపేట, న్యూస్‌లైన్: లైట్‌హౌస్‌ను సందర్శించేందుకు వచ్చే పర్యాటకుల కోసం ప్రత్యేక ఫొటోగ్రాఫర్‌ను ఏర్పాటు చేసేందుకు డెరైక్టరేట్ జనరల్ ఆఫ్ వైట్‌హౌస్ అండ్ లైట్‌షిప్స్ డీజీఎల్‌ఎల్, పర్యాటక శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. అతి తక్కువ ధరకు లైట్‌హౌస్‌ను సందర్శించే పర్యాటకుల ఫొటోలు తీసి రెడీమేడ్‌గా అందించేలా ఫొటోగ్రాఫర్‌ను త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించింది. వేసవి కావడంతో సందర్శకుల తాకిడి పెరుగుతుంది. లైట్‌హౌస్‌ను సందర్శించినందుకు గుర్తుగా ఫొటోలు తీసుకోవటంపై సందర్శకులు ఉత్సాహం చూపుతుంటారు. 45.72 మీటర్లు ఎత్తరున లైట్‌హౌస్‌ను అన్ని రోజులు సందర్శకులకు అందుబాటులో ఉంచేలా నిర్ణయించామన్నారు. ఇప్పటివరకు ప్రతి సోమవారం మెయింటెనెన్స్ కోసం లైట్హౌస్కు సెలవు ఉండేది. వేసవి కావటంతో వారంలో అన్ని రోజులు లైట్‌హౌస్‌ను సందర్శించే అవకాశాన్ని కల్పించనున్నట్లు డీజీఎల్‌ఎల్ చెన్నై డెరైక్టర్ టి.రామదాస్ తెలిపారు. సందర్శించే పర్యాటకులను, చిన్నారులను అసంతృప్తికి గురి చేయకూడదన్న సదుద్దేశంతో సోమవారం సైతం సందర్శనార్థం ఉంచామని తెలిపారు. లైట్‌హౌస్‌ను ఉదయం 10 గంటల నుంచి ఒక గంట వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సందర్శకుల కోసం తెరిచే ఉంటుందన్నారు. ప్రస్తుతం 1,400 మంది పెద్దలు, 400 మంది చిన్నారులు వస్తున్నారని, వారాంతపు రోజుల్లో అది మరింతగా పెరుగుతుందని వివరించారు. ప్రస్తుతం సందర్శకులు, పర్యాటకశాఖ సహకారంతో ప్రత్యేక ఫొటోగ్రాఫర్‌ను ఏర్పాటు చేయనున్నామన్నారు. -
ముగిసిన అమ్మ పుట్టినరోజు వేడుకలు
కొరుక్కుపేట, న్యూస్‌లైన్: విప్లవ నాయకి, ముఖ్యమంత్రి జయలలిత 66వ పుట్టిన రోజును పురస్కరించుకుని తమిళనాడు తెలుగు యువశక్తి ఆధ్వర్యంలో ఏడు రోజుల పండుగ పేరుతో పలు సేవా కార్యక్రమాలు, అవార్డుల ప్రదానోత్సవాలు, అన్నదానాలతో ఘనంగా ముగిశాయి. తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షులు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ వేడుకలు బుధవారంతో ముగిసాయి. ఏడు రోజుల పండుగల్లో చివరి రోజైన బుధవారం చెన్నై, ట్రిప్లికేన్‌లోని పార్థసారథి ఆలయం వద్ద అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి టీనగర్ శాసన సభ్యులు సౌత్ చెన్నై అన్నాడీఎంకే విభాగం కార్యదర్శి వీపీ కలైరాజన్ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి నెల్లూరు జిల్లా కావలి శాసన సభ్యుడు బీదా మస్తాన్‌రావు హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జయలలిత నాయకత్వానికి జనం నీరాజనాలు పడుతున్నారని అన్నా రు. ముఖ్యంగా తమిళనాడు తెలుగు యువశక్తి ఆధ్వర్యంలో ఏడు రోజుల పాటు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించి ఆ సంస్థ నిర్వాహకులు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డికి అభినందనలు తెలిపారు. కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి ముగింపు ఉపన్యాసం చేస్తూ తెలుగు ప్రజలందరి అండదండలతో వారం రోజుల పాటు అమ్మ జయలలిత పుట్టిన రోజు వేడుకలు విజ యవంతంగా జరుపుకోవడం ఆనందంగా ఉం దన్నారు. మార్చిలో అన్నాడీఎంకే అభ్యర్థుల విజయం అమ్మమాట బంగారు బాట అనే నినాదంతో రాష్ట్రంలో ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువశక్తి కార్యదర్శి శివశంకర్ రెడ్డి, రాము, బాలశంకర్, కార్యవర్గ సభ్యులు పెంచలయ్య, నాగేశ్వరరావు, సత్యవంతుడు, రాజారెడ్డి, పెద్ద ఎత్తున తెలుగు వారు పాల్గొన్నారు. -
వైద్యశిబిరానికి విశేష స్పందన
కొరుక్కుపేట, న్యూస్‌లైన్: నగరంలోని ఎస్వీ బోన్ అండ్ జాయింట్ ఆస్పత్రి నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభిం చింది. చెన్నై కోడంబాక్కంలోని ఎస్. వి.బోన్ అండ్ జాయింట్ ఆస్పత్రి నిర్వాహకులు, చీఫ్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ ఎస్.వి సత్యనారాయణ ఆధ్వర్యంలో ఆదివారం ఆస్పత్రి ఆవరణలో ఉచిత వైద్య చికిత్స శిబిరం జరిగింది. ఈ సందర్భంగా శిబిరంలో పాల్గొన్న వారికి బోన్ మినరల్ డెన్సిటీ (బీఎండీ) పరీక్షలు చేశారు. 40 ఏళ్లు పైబడిన వారికి బీఎండీ వైద్య పరీక్షలు ఉచితంగా నిర్వహించినట్లు సత్యనారాయణ పేర్కొన్నారు. ఉచిత వైద్య శిబిరంలో ఆస్పత్రి వైద్యులు డాక్టర్ సందీప్, డాక్టర్ షాలినీ, డాక్టర్ వంశీకృష్ణ పాల్గొన్నారు. వైద్యశిబిరంలో 80 మందికి బీఎండీ పరీక్షలు చేసినట్లు వైద్యులు పేర్కొన్నారు. ఉచిత వైద్యశిబిరానికి హాజరైన వారికి ఉచిత మందులు కూడా ఉచితంగా అందించినట్లు డాక్టర్ ఎస్.వి.సత్యనారాయణ పేర్కొ న్నారు.