ముగిసిన అమ్మ పుట్టినరోజు వేడుకలు
Published Thu, Feb 27 2014 12:57 AM | Last Updated on Sat, Sep 2 2017 4:07 AM
కొరుక్కుపేట, న్యూస్‌లైన్: విప్లవ నాయకి, ముఖ్యమంత్రి జయలలిత 66వ పుట్టిన రోజును పురస్కరించుకుని తమిళనాడు తెలుగు యువశక్తి ఆధ్వర్యంలో ఏడు రోజుల పండుగ పేరుతో పలు సేవా కార్యక్రమాలు, అవార్డుల ప్రదానోత్సవాలు, అన్నదానాలతో ఘనంగా ముగిశాయి. తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షులు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ వేడుకలు బుధవారంతో ముగిసాయి. ఏడు రోజుల పండుగల్లో చివరి రోజైన బుధవారం చెన్నై, ట్రిప్లికేన్‌లోని పార్థసారథి ఆలయం వద్ద అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి టీనగర్ శాసన సభ్యులు సౌత్ చెన్నై అన్నాడీఎంకే విభాగం కార్యదర్శి వీపీ కలైరాజన్ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి నెల్లూరు జిల్లా కావలి శాసన సభ్యుడు బీదా మస్తాన్‌రావు హాజరయ్యారు.
ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జయలలిత నాయకత్వానికి జనం నీరాజనాలు పడుతున్నారని అన్నా రు. ముఖ్యంగా తమిళనాడు తెలుగు యువశక్తి ఆధ్వర్యంలో ఏడు రోజుల పాటు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించి ఆ సంస్థ నిర్వాహకులు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డికి అభినందనలు తెలిపారు. కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి ముగింపు ఉపన్యాసం చేస్తూ తెలుగు ప్రజలందరి అండదండలతో వారం రోజుల పాటు అమ్మ జయలలిత పుట్టిన రోజు వేడుకలు విజ యవంతంగా జరుపుకోవడం ఆనందంగా ఉం దన్నారు. మార్చిలో అన్నాడీఎంకే అభ్యర్థుల విజయం అమ్మమాట బంగారు బాట అనే నినాదంతో రాష్ట్రంలో ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువశక్తి కార్యదర్శి శివశంకర్ రెడ్డి, రాము, బాలశంకర్, కార్యవర్గ సభ్యులు పెంచలయ్య, నాగేశ్వరరావు, సత్యవంతుడు, రాజారెడ్డి, పెద్ద ఎత్తున తెలుగు వారు పాల్గొన్నారు.
Advertisement
Advertisement