స్మశాన వాటికలో పెరిగిన ఓ యువకుడి ప్రేమకథే 'రుద్రంకోట'  | Rudram Kota to hit theatres on September 22 | Sakshi
Sakshi News home page

స్మశాన వాటికలో పెరిగిన ఓ యువకుడి ప్రేమకథే 'రుద్రంకోట' 

Published Fri, Sep 8 2023 1:04 AM | Last Updated on Fri, Sep 8 2023 6:57 AM

Rudram Kota to hit theatres on September 22 - Sakshi

అనిల్, విభీష

అనిల్‌ ఆర్క కండవల్లి హీరోగా నటించి, నిర్మించిన చిత్రం ‘రుద్రంకోట’. నటి జయలలిత ఓ కీలక పాత్రలో నటించి, చిత్ర సమర్పకురాలిగా వ్యవహరించారు. రాము కోన దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విభీష, రియా హీరోయిన్లు. ఏఆర్‌కే విజువల్స్‌ పతాకంపై రూపొందిన ఈ సినిమాని ఈ నెల 22న స్క్రీన్‌ మాక్స్‌ పిక్చర్స్‌ సంస్థ ద్వారా విడుదల చేయనున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు.

హీరో, నిర్మాత అనిల్‌ ఆర్క కండవల్లి మాట్లాడుతూ– ‘‘స్మశాన వాటికలో పెరిగిన ఓ యువకుడి ప్రేమకథా చిత్రమిది.భద్రాచలం దగ్గర రుద్రంకోట అనే ఊరి నేపథ్యంలో కథ నడుస్తుంది. ప్రముఖ సంగీత దర్శకుడు కోటిగారు మా చిత్రానికి అద్భుతమైన నేపథ్య సంగీతం అందించారు’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: ఆదిమల్ల సంజీవ్, సంగీతం: సుభాష్‌ ఆనంద్, నిరంజన్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement