వైద్యశిబిరానికి విశేష స్పందన
Published Mon, Dec 16 2013 1:05 AM | Last Updated on Sat, Sep 2 2017 1:39 AM
కొరుక్కుపేట, న్యూస్‌లైన్: నగరంలోని ఎస్‌వీ బోన్ అండ్ జాయింట్ ఆస్పత్రి నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభిం చింది. చెన్నై కోడంబాక్కంలోని ఎస్. వి.బోన్ అండ్ జాయింట్ ఆస్పత్రి నిర్వాహకులు, చీఫ్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ ఎస్.వి సత్యనారాయణ ఆధ్వర్యంలో ఆదివారం ఆస్పత్రి ఆవరణలో ఉచిత వైద్య చికిత్స శిబిరం జరిగింది. ఈ సందర్భంగా శిబిరంలో పాల్గొన్న వారికి బోన్ మినరల్ డెన్సిటీ (బీఎండీ) పరీక్షలు చేశారు. 40 ఏళ్లు పైబడిన వారికి బీఎండీ వైద్య పరీక్షలు ఉచితంగా నిర్వహించినట్లు సత్యనారాయణ పేర్కొన్నారు. ఉచిత వైద్య శిబిరంలో ఆస్పత్రి వైద్యులు డాక్టర్ సందీప్, డాక్టర్ షాలినీ, డాక్టర్ వంశీకృష్ణ పాల్గొన్నారు. వైద్యశిబిరంలో 80 మందికి బీఎండీ పరీక్షలు చేసినట్లు వైద్యులు పేర్కొన్నారు. ఉచిత వైద్యశిబిరానికి హాజరైన వారికి ఉచిత మందులు కూడా ఉచితంగా అందించినట్లు డాక్టర్ ఎస్.వి.సత్యనారాయణ పేర్కొ న్నారు.
Advertisement
Advertisement