good response
-
జగనన్న నాకు ఇచ్చిన గొప్ప వరం..!
-
జీఎస్టీ మండలి నిర్ణయాలపై పరిశ్రమ వర్గాల హర్షం
న్యూఢిల్లీ: జీఎస్టీ కౌన్సిల్ 23 రకాల వస్తు, సేవలపై పన్ను రేటును తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయంపై పారిశ్రామిక సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. 32 అంగుళాల టీవీలు, కంప్యూటర్ మానిటర్లు, వీడియోగేమ్స్, లిథియం అయాన్ పవర్ బ్యాంకులు, రీట్రేడెడ్ టైర్లు, వీల్ చైర్లు, సినిమా టికెట్లు సహా 17 రకాల వస్తువులు, ఆరు సేవలపై పన్ను శ్లాబులను కౌన్సిల్ మార్చింది. 28 శాతం నుంచి 18 శాతానికి, కొన్ని 18 శాతం నుంచి 12, 5 శాతానికి మార్చిన విషయం గమనార్హం. ‘‘రేట్లను గణనీయంగా తగ్గించడం ద్వారా జీఎస్టీ కౌన్సిల్ ఆచరణాత్మక విధానాన్ని అనుసరించింది. ఈ నిర్ణయాలు జీఎస్టీ విధానాన్ని మరింత బలోపేతం, స్థిరపడేలా చేస్తాయి’’అని ఫిక్కీ తన ప్రకటనలో పేర్కొంది. ‘‘బలమైన వినియోగం వృద్ధిని వేగవంతం చేస్తుంది. వివిధ తరగతి ప్రజలు వినియోగించే వస్తువులపై పన్ను రేట్ల తగ్గింపుతో ఆ ర్థిక రంగానికి అవసరమైన ఊతం లభిస్తుంది’’ అని సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ పేర్కొన్నారు. పరోక్ష పన్ను వసూళ్లలో స్థిరమైన వృద్ధికి తోడు అధిక జీఎస్టీ రేట్లను తగ్గించడం అనేవి... పన్ను చెల్లించే పరిధి పెరిగిందని, ఆర్థిక కార్యకలాపాలు విస్తరిస్తున్నాయని తెలుస్తోందని పీహెచ్డీ చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ రాజీవ్ తల్వార్ పేర్కొన్నారు. -
రుతుపవనం లో తటస్థంగా లానినా
న్యూఢిల్లీ: ఈ ఏడాది రుతుపవనాల కాలంలో ‘లానినా’ తటస్థంగా ఉంటుందనీ, దేశంలో సాధారణ వర్షపాతం నమోదవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుందని భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ కార్యదర్శి రాజీవన్ సోమవారం చెప్పారు. ఎల్ నినో ప్రభావం వల్ల పసిఫిక్ మహా సముద్ర జలాలు వేడెక్కితే, లానినా వల్ల చల్లబడతాయి. సాధారణంగా ఎల్ నినో వల్ల తక్కువ వర్షాలు కురిస్తే, లానినా వల్ల మంచి వానలు పడతాయి. ‘ప్రస్తుతం లానినా ఓ మాదిరిగా ఉంది. రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించే సమయానికల్లా అది తటస్థంగా ఉంటుంది. సముద్రంపై ఉష్ణోగ్రతలకు సంబంధించిన ఇండియన్ ఓషన్ డైపోల్ (ఐవోడీ) ఈసారి ఆశాజనకంగా ఉండే అవకాశం ఉంది’ అని రాజీవన్ వెల్లడించారు. -
జాబ్ మేళాకు విశేష స్పందన
వెంకటగిరి: డీఆర్డీఏ ఆధ్వర్యంలో స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన జాబ్‌మేళాకు నిరుద్యోగుల నుంచి విశేష స్పందన లభించింది. నాయుడుపేట మండలం హిందూస్థాన్ గ్లాస్ ఫ్యాక్టరీ, గ్రీన్‌టెక్, తడ మండలం శ్రీసిటీలోని సెల్కంపెనీ, తిరుపతిలోని అమరారాజా బ్యాటరీస్ పరిశ్రమల్లోని ఉద్యోగాలకు నిర్వహించిన ఇంటర్వ్యూలకు 385 మంది నిరుద్యోగులు హాజరైనట్లు మండల పరిషత్ సూపరింటెండెంట్ కోటీశ్వరరావు తెలిపారు. కంపెనీ ప్రతినిధులు ఇంటర్వ్యూలు నిర్వహించి 175 మందిని ఎంపిక చేసినట్లు వివరించారు. జాబ్‌మేళాలో డీఆర్డీఏ ప్రతినిధులు నవీన్, శైలజ, తదితరులు పాల్గొన్నారు. -
వైద్యశిబిరానికి విశేష స్పందన
కొరుక్కుపేట, న్యూస్‌లైన్: నగరంలోని ఎస్వీ బోన్ అండ్ జాయింట్ ఆస్పత్రి నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభిం చింది. చెన్నై కోడంబాక్కంలోని ఎస్. వి.బోన్ అండ్ జాయింట్ ఆస్పత్రి నిర్వాహకులు, చీఫ్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ ఎస్.వి సత్యనారాయణ ఆధ్వర్యంలో ఆదివారం ఆస్పత్రి ఆవరణలో ఉచిత వైద్య చికిత్స శిబిరం జరిగింది. ఈ సందర్భంగా శిబిరంలో పాల్గొన్న వారికి బోన్ మినరల్ డెన్సిటీ (బీఎండీ) పరీక్షలు చేశారు. 40 ఏళ్లు పైబడిన వారికి బీఎండీ వైద్య పరీక్షలు ఉచితంగా నిర్వహించినట్లు సత్యనారాయణ పేర్కొన్నారు. ఉచిత వైద్య శిబిరంలో ఆస్పత్రి వైద్యులు డాక్టర్ సందీప్, డాక్టర్ షాలినీ, డాక్టర్ వంశీకృష్ణ పాల్గొన్నారు. వైద్యశిబిరంలో 80 మందికి బీఎండీ పరీక్షలు చేసినట్లు వైద్యులు పేర్కొన్నారు. ఉచిత వైద్యశిబిరానికి హాజరైన వారికి ఉచిత మందులు కూడా ఉచితంగా అందించినట్లు డాక్టర్ ఎస్.వి.సత్యనారాయణ పేర్కొ న్నారు. -
ఇంటర్వ్యూలకు భారీ స్పందన
మిర్యాలగూడ టౌన్, న్యూస్‌లైన్ :పట్టణ పేదరిక నిర్మూలన పథకం (మెప్మా) ఉమ్మడి కార్యాచరణ ద్వారా చేపట్టిన లబ్ధిదారుల ఎంపికకు నిరుద్యోగ యువత భా రీగా తరలివచ్చింది. బుధవారం పట్టణంలోని ఎన్ఎస్పీ క్యాంపులో ఉన్న మేరెడ్డి రామచంద్రారెడ్డి స్మారక గ్రంథాలయంలో బ్యాంకు అధికారులతో నిర్వహించిన శిబిరానికి పట్టణం నుంచి నిరుద్యోగ యువతీ, యువకులు భారీ గా వచ్చారు. బ్యాంకు అధికారులతోపాటు మున్సిపల్ కార్యాలయ, మెప్మా సిబ్బంది వారిని వారించడంలో కొంత ఇబ్బందులు పడ్డారు. రాజీవ్ యువశక్తి పథకానికి 186 దరఖాస్తులు, అభ్యుదయ యోజనకు 383 దరఖాస్తులు, మెప్మాకు 162, ఎస్సీ కార్పొరేషన్‌కు 411, ఎస్టీ కార్పొరేషన్(మాడా)కు 81, ముస్లిం మైనార్టీ కార్పొరేషన్‌కు 120 ఇలా మొత్తం 1343 దరఖాస్తులు అందాయి. ఈ సందర్భం గా మున్సిపల్ కమిషనర్ వడ్డే సురేందర్ మా ట్లాడుతూ 2013-14 సంవత్సరానికిగాను రాజీవ్ యువశక్తి, రాజీవ్ అభ్యుదయ యోజన పథకంతోపాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, పట్టణ స్వయం ఉపాధి పథకం కింద దరఖాస్తులు చేసుకున్న వారిని బ్యాంకు అధికారులు రుణాల కోసం లబ్ధిదారులను గుర్తిస్తున్నట్లు చెప్పారు. నిరుద్యోగ యువతీ, యువకులకు రాయితీతో కూడిన రుణాలను వివిధ సంక్షేమ శాఖల ద్వారా మంజూరు చేస్తున్నట్లు వెల్లడిం చారు. అర్హులైన లబ్ధిదారులకు రుణాలు అం దించాలనే లక్ష్యంతో ప్రభుత్వం వివిధ పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. కార్యక్రమంలో మె ప్మా పీఆర్పీ రమేష్‌నాయక్, వివిధ బ్యాంకుల అధికారులు నాగభూషణరావు, గోపాలకృష్ణ, మధుసూదన్‌రెడ్డి, విష్ణుమోహన్, సాయికుమారి, వీవీఎస్ మూర్తి, రవికిశోర్, ఎస్. రాం బాబు, అశోక్‌కుమార్, మెప్మా సీవోలు ఎం. శ్రీనివాసాచారి, సైదానాయక్, వెంకటేశ్వర్లు, సీఎల్ఆర్పీ పి పార్వతి పాల్గొన్నారు.