ఇంటర్వ్యూలకు భారీ స్పందన
Published Thu, Aug 8 2013 3:11 AM | Last Updated on Mon, Aug 20 2018 6:18 PM
మిర్యాలగూడ టౌన్, న్యూస్‌లైన్ :పట్టణ పేదరిక నిర్మూలన పథకం (మెప్మా) ఉమ్మడి కార్యాచరణ ద్వారా చేపట్టిన లబ్ధిదారుల ఎంపికకు నిరుద్యోగ యువత భా రీగా తరలివచ్చింది. బుధవారం పట్టణంలోని ఎన్‌ఎస్పీ క్యాంపులో ఉన్న మేరెడ్డి రామచంద్రారెడ్డి స్మారక గ్రంథాలయంలో బ్యాంకు అధికారులతో నిర్వహించిన శిబిరానికి పట్టణం నుంచి నిరుద్యోగ యువతీ, యువకులు భారీ గా వచ్చారు. బ్యాంకు అధికారులతోపాటు మున్సిపల్ కార్యాలయ, మెప్మా సిబ్బంది వారిని వారించడంలో కొంత ఇబ్బందులు పడ్డారు.
రాజీవ్ యువశక్తి పథకానికి 186 దరఖాస్తులు, అభ్యుదయ యోజనకు 383 దరఖాస్తులు, మెప్మాకు 162, ఎస్సీ కార్పొరేషన్‌కు 411, ఎస్టీ కార్పొరేషన్(మాడా)కు 81, ముస్లిం మైనార్టీ కార్పొరేషన్‌కు 120 ఇలా మొత్తం 1343 దరఖాస్తులు అందాయి. ఈ సందర్భం గా మున్సిపల్ కమిషనర్ వడ్డే సురేందర్ మా ట్లాడుతూ 2013-14 సంవత్సరానికిగాను రాజీవ్ యువశక్తి, రాజీవ్ అభ్యుదయ యోజన పథకంతోపాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, పట్టణ స్వయం ఉపాధి పథకం కింద దరఖాస్తులు చేసుకున్న వారిని బ్యాంకు అధికారులు రుణాల కోసం లబ్ధిదారులను గుర్తిస్తున్నట్లు చెప్పారు.
నిరుద్యోగ యువతీ, యువకులకు రాయితీతో కూడిన రుణాలను వివిధ సంక్షేమ శాఖల ద్వారా మంజూరు చేస్తున్నట్లు వెల్లడిం చారు. అర్హులైన లబ్ధిదారులకు రుణాలు అం దించాలనే లక్ష్యంతో ప్రభుత్వం వివిధ పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. కార్యక్రమంలో మె ప్మా పీఆర్‌పీ రమేష్‌నాయక్, వివిధ బ్యాంకుల అధికారులు నాగభూషణరావు, గోపాలకృష్ణ, మధుసూదన్‌రెడ్డి, విష్ణుమోహన్, సాయికుమారి, వీవీఎస్ మూర్తి, రవికిశోర్, ఎస్. రాం బాబు, అశోక్‌కుమార్, మెప్మా సీవోలు ఎం. శ్రీనివాసాచారి, సైదానాయక్, వెంకటేశ్వర్లు, సీఎల్‌ఆర్‌పీ పి పార్వతి పాల్గొన్నారు.
Advertisement