Yuva Shakti
-
ఘనంగా ముగిసిన యువ సంగమం
హైదరాబాద్: వివిధ రాష్ట్రాలలోని సంస్కృతి, సంప్రదాయాలను యవతకు తెలియబరిచేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. తాజాగా ప్రభుత్వ భాగస్వామ్యంతో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ (ఐఐటీహెచ్), బనారస్ హిందూ యూనివర్శిటీ (బీహెచ్‌యూ)లు.. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్(ఐఆర్టీసీటీసీ) సహకారంతో యువసంగమం కార్యక్రమాన్ని నిర్వహించాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన విభిన్న నేపథ్యాల యువతకు ఆతిథ్యం అందించారు. ఈ యువసంగమం ఫేజ్-3లో తెలంగాణకు చెందిన స్థానిక వంటకాలు, జీవనశైలి, హస్తకళలు, సంస్కృతి, సాంకేతికత, ఆవిష్కరణలు తెలంగాణలోని ఇతర అంశాలపై ఉత్తరప్రదేశ్ విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమం కింద భారత ప్రభుత్వం వివిధ రాష్ట్రాల యువత మధ్య బంధాలను బలోపేతం చేయడం కోసం ఈ కార్యక్రమం నిర్వహిస్తోంది. దేశంలోని యువతలో ఐక్యత, అవగాహనను పెంపొందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం సాగింది. యువ సంగమం ఫేజ్-3లో ఉత్తరప్రదేశ్, తెలంగాణల మధ్య ఒక వారం రోజుల పాటు సాంస్కృతిక మార్పిడి సాగింది. ముగింపు ఉత్సవంలో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌తో ప్రత్యేక ఆన్లైన్ ఇంటరాక్టివ్ సెషన్ జరిగింది. యువ సంగమం ప్రధాన లక్ష్యం.. పర్యాటకం, సంప్రదాయాలు, అభివృద్ధి, పరస్పర అనుసంధానం, టెక్నాలజీలపై యువతకు అవగాహన కల్పించడం. తెలంగాణ వారసత్వంలోని విభిన్న కోణాలను ప్రదర్శిస్తూ, రోజు వారీగా ప్రణాళికాబద్ధంగా ఈ సాంస్కృతిక ప్రయాణం సాగింది. ముందుగా వారణాసి నుంచి వచ్చిన ప్రతినిధులకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద ఘనంగా స్వాగతం పలికారు. తరువాత అంతర్జాతీయ అతిథి గృహంలో వారికి వసతి కల్పించారు. అనంతరం సమగ్ర క్యాంపస్ పర్యటన, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ కాంప్లెక్స్‌లను సందర్శించారు. తెలంగాణ పర్యాటకానికి ఆనవాళ్లయి చార్మినార్, చౌమహల్లా ప్యాలెస్, సాలార్ జంగ్ మ్యూజియం మొదలైనవాటిని ప్రతినిధులు సందర్శించారు. అలాగే ఐఐటీహెచ్ క్యాంపస్‌లో ఎఐసిటిఇ ఛైర్మన్ ప్రొఫెసర్ టిజి సీతారాము, ఐఐటిహెచ్ డైరెక్టర్ ప్రొఫెసర్ బిఎస్ మూర్తిల సహకారంతో గోల్కొండ కోట చారిత్రక వైభవాన్ని పరిశీలించారు. తరువాత బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. ముగింపు కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మాట్లాడుతూ వివిధ రాష్ట్రాలలో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం వలన విద్యార్థులకు, యువతకు వివిధ అంశాలపై అవగాహన కలుగుతుందన్నారు. ప్రొఫెసర్ బి ఎస్ మూర్తి మాట్లాడుతూ యువ సంగమం పేరుతో తమకు ఇటువంటి అవకాశాన్ని కల్పించినందుకు విద్యా మంత్రిత్వ శాఖకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఇటువంటి కార్యక్రమాల వలన యువత వివిధ రాష్ట్రాల సంస్కృతి సంప్రదాయాలను తెలుసుకోగలుగుతుందన్నారు. -
యువశక్తే చోదక శక్తి: ప్రధాని నరేంద్ర మోదీ
కొచ్చి: దేశ అభివృద్ధి ప్రయాణానికి యువ శక్తే చోదక శక్తి అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ప్రపంచంలో అత్యంత వేగంగా ఎదుగుతున్న ఆర్థిక శక్తిగా భారత్ మారడం వెనుక యువత భాగస్వామ్యం ఉందని ప్రశంసించారు. భారత్ ఒకప్పుడు అభివృద్ధిలో వెనుకబడి ఉండేదని గుర్తుచేశారు. ఇప్పుడు మన దేశం వేగంగా అభివృద్ధి చెందుతోందని, బలమైన ఆర్థిక శక్తిగా ఆవిర్భవిస్తోందని హర్షం వ్యక్తం చేశారు. ఇదంతా యువత కృషి వల్ల సాధ్యమవుతోందని పేర్కొన్నారు. వారిపై తనకు ఎంతో విశ్వాసం ఉందన్నారు. కేరళలోని కొచ్చిలో సోమవారం ‘యువం–2023’ సదస్సులో ప్రధాని మోదీ ప్రసంగించారు. 21వ శతాబ్దం భారతదేశ శతాబ్దమని ప్రపంచమంతటా అందరూ చెబుతున్నారని, యువ శక్తి మన దేశానికి ఒక పెన్నిధి అని వివరించారు. తాము సంస్కరణలు తీసుకొస్తున్నామని, యువత వాటి ఫలితాలను తీసుకొస్తోందని పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు అవినీతిగా మారుపేరుగా ఉండేవని, బీజేపీ ప్రభుత్వం యువత కోసం నూతన అవకాశాలను సృష్టిస్తోందని నరేంద్ర మోదీ చెప్పారు. స్వయం సమృద్ధ సమాజాన్ని సృష్టించాలన్నదే తమ లక్ష్యమని వెల్లడించారు. యువత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని పని చేస్తున్నామని తెలిపారు. కేంద్ర సాయుధ పోలీసు దళాల్లో కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి 13 ప్రాంతీయ భాషల్లోనూ పరీక్ష నిర్వహించాలని కేంద్రం ఇటీవల నిర్ణయం తీసుకుందని గుర్తుచేశారు. భారత్ ఎప్పటికీ మారబోదని గతంలో ప్రజలు భావించేవారని, ఇప్పుడు ప్రపంచాన్ని మార్చగలిగే శక్తి భారత్‌కు ఉందని మోదీ వ్యాఖ్యానించారు. నేటి ఆత్మనిర్భర్ భారత్ డిజిటల్ ఇండియా గురించి మాట్లాడుతోందని అన్నారు. మోదీకి ఘన స్వాగతం మోదీకి సోమవారం సాయంత్రం కేరళలోని కొచ్చిలో ఘన స్వాగతం లభించింది. ఐఎన్ఎస్ గరుడ నావల్ ఎయిర్ స్టేషన్ నుంచి యువం సదస్సు వేదిక దాకా రెండు కిలోమీటర్ల మేర రోడ్డు షోలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేరళ సంప్రదాయ దుస్తులను ధరించారు. కాసేపు నడిచి, తర్వాత వాహనం నుంచి అభివాదం చేశారు. కాంగ్రెస్ పాలనలో పల్లెలపై సవతి తల్లి ప్రేమ రేవా: గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు పల్లెలపై సవతి తల్లి ప్రేమ చూపాయని ప్రధాని మోదీ దుయ్యబట్టారు. బీజేపీ ప్రభుత్వం ఆ పరిస్థితిని పూర్తిగా మార్చివేసిందని, గ్రామ సీమల అభివృద్ధికి భారీగా నిధులు కేటాయించిందని జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా సోమవారం మధ్యప్రదేశ్‌లోని రేవాలో బహిరంగ సభలో ఆయన అన్నారు. పంచాయతీరాజ్ సంస్థలకు నిధుల్లో కోత పెట్టి, ఎన్నికలను వాయిదా వేస్తోంది బీజేపీ ప్రభుత్వమేనంటూ కాంగ్రెస్ ఘాటుగా స్పందించింది. -
యువ శక్తి రాజమండ్రి
-
యువశక్తి - కాకినాడ
-
యువశక్తి: మాకు యువసారథి కావాలి
-
ఇంటర్వ్యూలకు భారీ స్పందన
మిర్యాలగూడ టౌన్, న్యూస్‌లైన్ :పట్టణ పేదరిక నిర్మూలన పథకం (మెప్మా) ఉమ్మడి కార్యాచరణ ద్వారా చేపట్టిన లబ్ధిదారుల ఎంపికకు నిరుద్యోగ యువత భా రీగా తరలివచ్చింది. బుధవారం పట్టణంలోని ఎన్ఎస్పీ క్యాంపులో ఉన్న మేరెడ్డి రామచంద్రారెడ్డి స్మారక గ్రంథాలయంలో బ్యాంకు అధికారులతో నిర్వహించిన శిబిరానికి పట్టణం నుంచి నిరుద్యోగ యువతీ, యువకులు భారీ గా వచ్చారు. బ్యాంకు అధికారులతోపాటు మున్సిపల్ కార్యాలయ, మెప్మా సిబ్బంది వారిని వారించడంలో కొంత ఇబ్బందులు పడ్డారు. రాజీవ్ యువశక్తి పథకానికి 186 దరఖాస్తులు, అభ్యుదయ యోజనకు 383 దరఖాస్తులు, మెప్మాకు 162, ఎస్సీ కార్పొరేషన్‌కు 411, ఎస్టీ కార్పొరేషన్(మాడా)కు 81, ముస్లిం మైనార్టీ కార్పొరేషన్‌కు 120 ఇలా మొత్తం 1343 దరఖాస్తులు అందాయి. ఈ సందర్భం గా మున్సిపల్ కమిషనర్ వడ్డే సురేందర్ మా ట్లాడుతూ 2013-14 సంవత్సరానికిగాను రాజీవ్ యువశక్తి, రాజీవ్ అభ్యుదయ యోజన పథకంతోపాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, పట్టణ స్వయం ఉపాధి పథకం కింద దరఖాస్తులు చేసుకున్న వారిని బ్యాంకు అధికారులు రుణాల కోసం లబ్ధిదారులను గుర్తిస్తున్నట్లు చెప్పారు. నిరుద్యోగ యువతీ, యువకులకు రాయితీతో కూడిన రుణాలను వివిధ సంక్షేమ శాఖల ద్వారా మంజూరు చేస్తున్నట్లు వెల్లడిం చారు. అర్హులైన లబ్ధిదారులకు రుణాలు అం దించాలనే లక్ష్యంతో ప్రభుత్వం వివిధ పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. కార్యక్రమంలో మె ప్మా పీఆర్పీ రమేష్‌నాయక్, వివిధ బ్యాంకుల అధికారులు నాగభూషణరావు, గోపాలకృష్ణ, మధుసూదన్‌రెడ్డి, విష్ణుమోహన్, సాయికుమారి, వీవీఎస్ మూర్తి, రవికిశోర్, ఎస్. రాం బాబు, అశోక్‌కుమార్, మెప్మా సీవోలు ఎం. శ్రీనివాసాచారి, సైదానాయక్, వెంకటేశ్వర్లు, సీఎల్ఆర్పీ పి పార్వతి పాల్గొన్నారు.