న్యూఢిల్లీ: ఈ ఏడాది రుతుపవనాల కాలంలో ‘లానినా’ తటస్థంగా ఉంటుందనీ, దేశంలో సాధారణ వర్షపాతం నమోదవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుందని భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ కార్యదర్శి రాజీవన్ సోమవారం చెప్పారు. ఎల్ నినో ప్రభావం వల్ల పసిఫిక్ మహా సముద్ర జలాలు వేడెక్కితే, లానినా వల్ల చల్లబడతాయి. సాధారణంగా ఎల్ నినో వల్ల తక్కువ వర్షాలు కురిస్తే, లానినా వల్ల మంచి వానలు పడతాయి. ‘ప్రస్తుతం లానినా ఓ మాదిరిగా ఉంది. రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించే సమయానికల్లా అది తటస్థంగా ఉంటుంది. సముద్రంపై ఉష్ణోగ్రతలకు సంబంధించిన ఇండియన్ ఓషన్ డైపోల్ (ఐవోడీ) ఈసారి ఆశాజనకంగా ఉండే అవకాశం ఉంది’ అని రాజీవన్ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment