Lanina
-
భారత్కు గుడ్న్యూస్.. త్వరలో ‘ఎల్నినో’ మాయం!
న్యూఢిల్లీ: దేశంలోని రైతులకు వాతావరణ సైంటిస్టులు గుడ్న్యూస్ చెబుతున్నారు. గత ఏడాదిలా కాకుండా ఈ ఏడాది దేశంలో సమృద్ధిగా వర్షాలు పడతాయని వారు అంచనా వేస్తున్నారు. 2023లో దేశంలో అధిక ఉష్ణోగ్రతలు, వర్షాభావానికి కారణమైన ఎల్నినో పరిస్థితులు నైరుతి రుతుపవనాలు వచ్చే సమయానికి మారిపోతాయని అమెరికాతో పాటు భారత్కు చెందిన వాతావరణ సైంటిస్టులు వెల్లడిస్తున్నారు. పసిఫిక్ మహాసముద్రం వేడెక్కడంతో ఏర్పడిన ఎల్నినో(వర్షాభావ పరిస్థితి) జూన్ నాటికి బలహీనపడి లా నినా ఏర్పడుతుందని అమెరికాకు చెందిన క్లైమేట్ ప్రెడిక్షన్ సెంటర్, నేషనల్ వెదర్ సర్వీస్ ప్రకటించాయి. ఎల్నినో తొలుత ఏప్రిల్-జూన్ మధ్య ఈఎన్ఎస్ఓ(తటస్థ స్థితి)కి రావడానికి 83 శాతం, ఆ తర్వాత ఇది జూన్-ఆగస్టు మధ్య లానినాగా మారడానికి 62 శాతం అవకాశం ఉందని వెల్లడించాయి. లా నినా పరిస్థితులు ఏర్పడితే గనుక ఈ ఏడాది నైరుతి రుతుపవనాల సమయంలో దేశంలో సాధారణవర్షపాతం నమోదవుతుందని భారత వాతావరణ సైంటిస్టులు చెబుతున్నారు. ఒక వేళ లానినా ఏర్పడకపోయినా తటస్థ(ఈఎస్ఎన్ఓ) పరిస్థితులు ఏర్పడినా భారత్లో ఈ ఏడాది వర్షాలకు ఢోకా ఉండదని ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖ మాజీ సెక్రటరీ మాధవన్ రాజీవన్ తెలిపారు. భారత్లో 70 శాతం వార్షిక వర్షపాతం నైరుతి రుతుపవనాల వల్లే నమోదవుతుంది. జీడీపీలో 14 శాతం వాటా కలిగిన వ్యవసాయరంగానికి ఈ రుతుపవనాలే కీలకంగా ఉండటం గమనార్హం. ఇదీ చదవండి.. రైతుల ఉద్యమం మరింత ఉధృతం -
రుతుపవనం లో తటస్థంగా లానినా
న్యూఢిల్లీ: ఈ ఏడాది రుతుపవనాల కాలంలో ‘లానినా’ తటస్థంగా ఉంటుందనీ, దేశంలో సాధారణ వర్షపాతం నమోదవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుందని భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ కార్యదర్శి రాజీవన్ సోమవారం చెప్పారు. ఎల్ నినో ప్రభావం వల్ల పసిఫిక్ మహా సముద్ర జలాలు వేడెక్కితే, లానినా వల్ల చల్లబడతాయి. సాధారణంగా ఎల్ నినో వల్ల తక్కువ వర్షాలు కురిస్తే, లానినా వల్ల మంచి వానలు పడతాయి. ‘ప్రస్తుతం లానినా ఓ మాదిరిగా ఉంది. రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించే సమయానికల్లా అది తటస్థంగా ఉంటుంది. సముద్రంపై ఉష్ణోగ్రతలకు సంబంధించిన ఇండియన్ ఓషన్ డైపోల్ (ఐవోడీ) ఈసారి ఆశాజనకంగా ఉండే అవకాశం ఉంది’ అని రాజీవన్ వెల్లడించారు. -
ఈసారి ఆశించిన వర్షాలు పడవా ?
-
మళ్లీ ఎండాకాలం!
రాష్ట్రంలో మండుతున్న ఎండలు ► సాధారణం కంటే ఐదారు డిగ్రీలు అధికం ► ఎల్నినో పోయినా.. లానినా రాని పరిస్థితి ► వర్షాల్లేక విలవిల్లాడుతున్న రైతులు ► ఎండిపోయే దశకు చేరుకుంటున్న పంటలు ► వచ్చే నెలలో వర్షాలు పడే అవకాశం: వాతావరణ శాఖ హైదరాబాద్: రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. సాధారణం కన్నా ఐదారు డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. దీంతో రాష్ట్రంలో అనేకచోట్ల ఉక్కపోత వాతావరణం కనిపిస్తోంది. ఖమ్మంలో సాధారణంగా గరిష్ట ఉష్ణోగత్ర 31 డిగ్రీలు ఉండాల్సి ఉండగా, గడిచిన 24 గంటల్లో 37 డిగ్రీలు నమోదైంది. ఏకంగా ఇక్కడ 6 డిగ్రీలు అధికంగా నమోదు కావడం గమనార్హం. హైదరాబాద్లో సాధారణం కన్నా 5 డిగ్రీలు ఎక్కువగా 35 డిగ్రీలు నమోదైంది. మెదక్లో కూడా సాధారణం కన్నా 5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. భద్రాచలం, హకీంపేట్, హన్మకొండ, నల్లగొండ, నిజామాబాద్, రామగుండంలలో 4 డిగ్రీల చొప్పున అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పంటలకు భారీ నష్టం రాష్ట్రంలో పది రోజులకు పైగా చుక్క వర్షం కురవకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయి. కీలకమైన పూత, కాత దశలో వానలు లేకపోవడం, ఎండలు మండిపోతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వర్షాలు ముఖం చాటేయడంతో రాష్ట్రంలో వేసిన 13.90 లక్షల ఎకరాల మొక్కజొన్న పరిస్థితి అగమ్య గోచరంగా మారిందని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ పరిస్థితుల వల్ల అన్నింటి కన్నా కూడా మొక్క జొన్న పంటే భారీగా నష్టపోతుందని పేర్కొంటున్నారు. కాగా, 7.36 లక్షల ఎకరాల్లో వేసిన సోయాబీన్ ప్రస్తుతం పూత, కాత దశలో ఉంది. ఇప్పుడు ఈ పంటకు కూడా వర్షం చాలా అవసరం. నల్లరేగడి భూముల్లో పత్తి పంట వేస్తారు కాబట్టి ప్రస్తుతానికి ఎటువంటి ప్రమాదం లేకున్నా.. ఇంకో వారం రోజుల పాటు ఇలాగే ఉంటే పరిస్థితులు దారుణంగా ఉంటాయని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. 3.68 లక్షల ఎకరాల్లో వేసిన పెసర ఎండిపోయే దశకు చేరుకుం టోంది. మరోవైపు పశ్చిమబెంగాల్, గ్యాంగ్టక్ వైపు అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావం వచ్చే మూడు రోజుల తర్వాత రాష్ట్రంపై ఉంటుంది. కానీ సాధార ణం కన్నా తక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. లానినా జాడేదీ? పరస్పర విరుద్ధ చర్యలు కలిగించే ఎల్నినో, లానినాలు వాతావరణ పరిస్థితులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. అధిక ఎండలకు కారణమయ్యే ఎల్నినో ప్రభావం పూర్తిగా తగ్గింది. కానీ అధిక వర్షాలకు కారణమయ్యే లానినా మాత్రం ఇంకా ఏర్పడలేదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ వై.కె.రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. ప్రస్తుతం ఎల్నినో, లానినాల ప్రభావం లేదని రెండింటికి మధ్య తటస్థ స్థితి కొనసాగుతోందని పేర్కొన్నారు. వచ్చే నెలలో లానినా ప్రభావం పెరిగే అవకాశం ఉందని, అప్పుడు సాధారణం కన్నా ఎక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ముందుగా వాతావరణ శాఖ అంచనా ప్రకారం జూన్, జూలై, ఆగస్టు నాటికి ఎల్నినో 16 శాతం నుంచి 6 శాతానికి పడిపోవాలి. లానినా 26 శాతం నుంచి 52 శాతానికి చేరుకోవాలి. ఆగస్టు, సెప్టెంబర్ మధ్యలో లానినా 67 శాతానికి, ఎల్నినో 4 శాతానికి చేరుకోవాలి. అక్టోబర్ చివరకు లానినా ప్రభావం 71 శాతానికి పెరగాలి. అయితే ఎల్నినో ప్రభావం ముగిసినప్పటికీ అనుకున్న ప్రకారం లానినా మాత్రం ప్రవేశించలేదు. -
ఎల్నినో ఎల్లిపాయె.. లానినా రాకపాయె!
తటస్థ స్థితిలో వాతావరణం ఉపరితల ఆవర్తనం ఏర్పడితేనే రుతుపవనాలకు ఊపు: శాస్త్రవేత్తలు సాక్షి, హైదరాబాద్: తీవ్రమైన ఎండలతో హోరెత్తించిన ఎల్నినో కనుమరుగైంది. వాన లతో ముంచెత్తాల్సిన లానినా రాకకు మాత్రం ఇంకాస్త సమయం పడుతుందంటున్నారు వాతావరణ నిపుణులు! ప్రస్తుతం లానినా దశలోకి వెళ్లడానికి అనువైన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇప్పుడు ఎల్నినో కానీ లానినా కానీ లేదని... తటస్థ స్థితి మాత్రమే ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇప్పటికే లానినా రావాల్సి ఉన్నా.. తటస్థ స్థితి నుంచి నెల రోజుల్లో లానినా ఏర్పడుతుందని తెలిపింది. రుతుపవనాలపై ఎల్నినో, లానినాల ప్రభావం ఉంటుంది. రుతుపవనాలు వచ్చాక అవి వేగంగా ముందుకు కదలడానికి, వర్షాలు కురవడానికి లానినా ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. లానినా ఏర్పడ్డాక జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంటున్నారు. జూలై, ఆగస్టు నాటికి లానినా 26% నుంచి 52%నికి చేరుకోనుంది. ఆగస్టు, సెప్టెంబర్ మధ్యలో లానినా 67%నికి, అక్టోబర్ చివరకు 71%నికి చేరుకోనుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆవర్తనం లేకే ఆలస్యం.. నైరుతి రుతుపవనాలు కేరళను తాకి వారం రోజులు కావస్తున్నా ఇంకా తెలంగాణలోకి ప్రవేశించలేదు. ఈ నెల 15 నాటికే రాష్ట్రానికి రావాల్సి ఉంది. ఏపీని రుతుపవనాలు తాకినా బలహీనపడడంతో అక్కడ కూడా వర్షాలు కురవడం లేదు. కేరళ, కర్ణాటకలోని కోస్తా ప్రాంతాలు, ఈశాన్య రాష్ట్రాల్లో రుతుపవనాల కారణంగా విసృ్తతంగా వానలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడకపోవడంతో తెలుగు రాష్ట్రాల్లో రుతుపవనాలు ఊపందుకోలేదు. ఉపరితల ఆవర్తనం ఏర్పడితేనే తప్ప రుతుపవనాలు రావని హైదరాబాద్ వాతావరణశాఖ డెరైక్టర్ వై.కె.రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. ఈ నెల 17-18 తేదీల్లో బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని ఆయన చెప్పారు. ఫలితంగా నాలుగైదు రోజుల్లో తెలంగాణలోకి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని ఆయన తెలిపారు. మరో 4 రోజులు వర్షాలు మరో నాలుగు రోజులపాటు తెలంగాణలో అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణశాఖ వెల్లడించింది. బుధవారం రామగుండంలో 41 డిగ్రీల అధిక ఉష్ణోగ్రత నమోదైంది. ఆదిలాబాద్లో 40.3, హన్మకొండ 39.7, నల్లగొండ 39.4, నిజామాబాద్ 39.3, ఖమ్మం 39.2, భద్రాచలంలో 39.0, హైదరాబాద్ 37.3, మెదక్ 37.2 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.