medical camp
-
ఫ్యామిలీ డాక్టర్‌తో అద్భుత ఫలితాలు
నాదెండ్ల: ఫ్యామిలీ డాక్టర్ వైద్య విధానం అద్భుత ఫలితాలు సాధిస్తోందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని కితాబిచ్చారు. ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమం అమలు తీరును పరిశీలించేందుకు సోమవారం ఆమె పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం తూబాడు గ్రామంలో క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. గ్రామానికి చెందిన నాయుడు కోటయ్య, గొల్లలమూడి తేరేజమ్మ, దావల మరియమ్మ తదితరులు తీవ్ర అనారోగ్యంతో చికిత్స పొందుతుండగా.. మంత్రి రజని వారిళ్లకు వెళ్లారు. వారికి అందుతున్న వైద్యసేవపై ఆరా తీశారు. ఫ్యామిలీ డాక్టర్ మీ ఇళ్లకే వచ్చి వైద్యం చేస్తున్నారా, కావాల్సిన మందులిస్తున్నారా, నెలలో ఎన్నిసార్లు వస్తున్నారు, ఏం పరీక్షలు చేస్తున్నారు అంటూ ప్రశ్నించారు. ‘ప్రతినెలా రెండుసార్లు వస్తున్నారు’ వైద్యులు ప్రతినెలా రెండుసార్లు తమ ఇళ్లకే వచ్చి వైద్యం అందిస్తున్నారని నాయుడు కోటయ్య, గొల్లలమూడి తేరేజమ్మ, దావల మరియమ్మ, వారి కుటుంబ సభ్యులు మంత్రి రజనికి వివరించారు. బీపీ, ఇతర అవసరమైన పరీక్షలు చేస్తున్నారన్నారు. గతంలో ఇలా ఎప్పుడూ లేదని, ప్రభుత్వ వైద్యుడే తమ ఇళ్లకు వచ్చి వైద్యం చేయడాన్ని నమ్మలేకపోతున్నామని ఆనందం వ్యక్తం చేశారు. ఎంఎల్ హెచ్‌పీ, ఏఎన్ఎంలు కూడా నిరంతరం రోగులను పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. రికార్డులు పక్కాగా నిర్వహించండి రోగులకు అందిస్తున్న వైద్యానికి సంబంధించి రికార్డులు పక్కాగా నిర్వహించాలని మంత్రి రజని వైద్య సిబ్బందిని ఆదేశించారు. ఓపీ సమయంలో ప్రతి రోగి ఆరోగ్య వివరాలు ఈహెచ్‌ఆర్‌లో నమోదయ్యేలా చొరవ చూపాలన్నారు. ఇళ్లకు, స్కూళ్లకు వెళ్లి ఆరోగ్య సేవలందించే సమయంలో రోగులు, పిల్లలతో ఆప్యాయంగా ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తూబాడు గ్రామంలో ఈ ఒక్కరోజే ఫ్యామిలీ డాక్టర్ విధానం ద్వారా ఏకంగా 266 మందికి ఓపీ సేవలు అందించామని చెప్పారు. ఈ స్థాయిలో గ్రామస్తులకు వైద్య సేవలు గతంలో ఎప్పుడూ అందలేదన్నారు. జగనన్న పరిపాలనలో తీసుకొచ్చిన గొప్ప సంస్కరణల్లో ఫ్యామిలీ డాక్టర్ విధానం ఒకటని ప్రశంసించారు. మంత్రి స్థానిక వైఎస్సార్ హెల్త్ క్లినిక్‌కు వెళ్లి 104 వాహనం ద్వారా అందిస్తున్న వైద్య సేవలను కూడా పరిశీలించారు. అందుతున్న వైద్య సేవలపై ప్రజల స్పందనను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అంగన్వాడీ కేంద్రంలో వైద్య సిబ్బంది అందిస్తున్న సేవలను కూడా మంత్రి పరిశీలించారు. చిన్నారులకు నిర్వహిస్తున్న పరీక్షలను పరిశీలించారు. ప్రజా స్పందన అద్భుతం ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. ఫ్యామిలీ డాక్టర్ వైద్య విధానంపై పూర్తిస్థాయిలో ఆరా తీశానని చెప్పారు. వైద్యులు అందిస్తున్న సేవలపై ప్రజల్లో అద్భుతమైన స్పందన కనిపిస్తోందని చెప్పారు. ఇప్పటివరకు ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 1.20 కోట్ల మందికి వైద్య సేవలు అందించామని చెప్పారు. వీరిలో సగానికిపైగా బీపీ, షుగర్ లాంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారేనని వివరించారు. ఫ్యామిలీ డాక్టర్ విధానం ద్వారా ప్రభుత్వ సిబ్బంది గ్రామాలకే వెళ్లి ప్రాథమిక ఆరోగ్య సేవలు అందిస్తారని.. ఎవరికైనా మెరుగైన వైద్యసేవలు అవసరమైతే పీహెచ్‌సీకి సిఫారసు చేస్తారని తెలిపారు. అవసరమైతే సీహెచ్‌సీ, ఏరియా ఆస్పత్రులు, జిల్లా ఆస్పత్రులకు కూడా పంపిస్తారని వివరించారు. అక్కడ కూడా లొంగని జబ్బు అయితే బోధనాస్పత్రులకు రిఫర్ చేస్తారన్నారు. ఇదంతా ఒక క్రమపద్ధతిలో జరుగుతుందన్నారు. అందుకు సంబంధించి ఆస్పత్రులను అనుసంధానించామని చెప్పారు. -
8న ‘ఆరోగ్య మహిళ’
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ‘ఆరోగ్య మహిళ‘ పేరిట సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నట్లు రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి టి.హరీశ్‌రావు వెల్లడించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశానుసారం రాష్ట్ర మహిళలకు బహుమతిగా ఈ నెల 8న ప్రారంభిస్తున్న కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. శనివారం బీఆర్కేఆర్ భవన్లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారితో కలసి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ మహిళలు ప్రధానంగా ఎదుర్కొనే 8 రకాల ఆరోగ్య సమస్యలకు వైద్యం అందించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు. ప్రతి మహిళా ఆరోగ్యంతో ఉండాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని తలపెట్టినట్లు తెలిపారు. దశలవారీగా విస్తరణ.. మొదటి దశలో వంద ఆరోగ్య కేంద్రాల్లో నిర్వహించి ఆపై 1,200 కేంద్రాలకు విస్తరించాలని యోచిస్తున్నట్లు మంత్రి హరీశ్‌రావు తెలిపారు. అన్ని రకాల వైద్య పరీక్షలు ఉచితంగా నిర్వహించి ప్రత్యేక యాప్ ద్వారా పర్యవేక్షిస్తామని వివరించారు. మహిళకు పూర్తిగా నయం అయ్యే దాకా వైద్య సేవలు కొనసాగుతాయన్నారు. రెఫరల్ ఆసుపత్రుల్లో మహిళలు సేవలు పొందేందుకు వీలుగా ప్రత్యేక హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. మార్చి 8న ప్రారంభించే ఈ కార్యక్రమాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొనాలని, ఇందుకు జిల్లా కలెక్టర్లు, డీఎంహెచ్వోలు చొరవ తీసుకోవాలన్నారు. సీపీఆర్‌పై విస్తృత ప్రచారం గుండెపోట్లు, కార్డియాక్ అరెస్ట్‌లకు గురైన వారిని సత్వరమే కాపాడటంలో దోహదపడే ప్రాథమిక చికిత్స కార్డియోపల్మనరీ రిససిటేషన్ (సీపీఆర్)పై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని మంత్రి హరీశ్‌రావు అధికారులకు సూచించారు. కరోనా తర్వాత సడెన్ కార్డియాక్ అరెస్ట్ కేసులు పెరిగినట్లు వైద్య నిపుణులు, పలు అధ్యయనాలు చెబుతున్నాయన్నారు. ఇలా అరెస్ట్అయిన ప్రతి 10 మందిలో ఒకరు మాత్రమే బతుకుతున్నారని, అయితే సీపీఆర్ చేస్తే కనీసం ఐదుగురిని బతికించవచ్చన్నారు. కార్డియాక్ అరెస్ట్‌కు గురయ్యేవారికి చికిత్సలో భాగంగా ఉపయోగించే ఆటోమేటెడ్ ఎక్స్టర్నల్ డీఫిబ్రిలేటర్ (ఏఈడీ)ల కోసం మొదటి దశలో రూ.18 కోట్లతో 1,200 పరికరాలు కొనుగోలు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. వాటిని పీహెచ్‌సీలు, యూపీహెచ్‌సీలు, బస్తీ దవాఖానాల్లో అందుబాటులోకి తెస్తామన్నారు. ‘కంటివెలుగు’ అందరికీ చేరాలి కంటివెలుగు పథకంలో భాగంగా అందిస్తున్న కంటి పరీక్షలు అందరికీ చేరాలని మంత్రి హరీశ్‌రావు చెప్పారు. ఇప్పటివరకు 63.82 లక్షల మందికి పరీక్షలు నిర్వహించామన్నారు. సమావేశంలో వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్, పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, కుటుంబ సంక్షేమ కమిషనర్ శ్వేత మహంతి, సీఎం ఓఎస్డీ గంగాధర్ పాల్గొన్నారు. మహిళలకు నిర్వహించే 8 పరీక్షలివే.. 1.మధుమేహం, రక్తపోటు, రక్తహీనత, ఇతర సాధారణ పరీక్షలు. 2. ఓరల్, సర్వ్యకిల్, రొమ్ము కేన్సర్ల స్క్రీనింగ్. 3. థైరాయిడ్ పరీక్ష, సూక్ష్మ పోషక లోపాల గుర్తింపు, అయోడిన్ సమస్య, ఫోలిక్ యాసిడ్, ఐరన్ లోపం, విటమిన్ బీ12, విటమిన్ డీ పరీక్షలు, చికిత్స, మందులు. 4.మూత్రకోశ సంబంధిత ఇన్ఫెక్షన్లు,పెల్విక్ ఇన్ఫ్లమేటరీ వ్యాధుల పరీక్షలు. 5.మెనోపాజ్ దశకు సంబంధించిన పరీక్షలు, అవసరమైన వారికి హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ, కౌన్సెలింగ్. 6. నెలసరి సమస్యలపై పరీక్షలు, సంతాన సమస్యలపై ప్రత్యేక పరీక్షలు, అవసరమైనవారికి అ్రల్టాసౌండ్ టెస్టులు. 7.సెక్స్ సంబంధిత అంటువ్యాధుల పరీక్షలు, అవగాహన. 8.బరువు నియంత్రణ, యోగా, వ్యాయామంపై అవగాహన -
సాక్షి బతుకు చిత్రం : ANM ఆరోగ్య కార్యకర్తలపై ప్రత్యేక కథనం
-
మెడికల్ టూరిజంతో ఎకానమీకి ఊతం..
న్యూఢిల్లీ: భవిష్యత్‌లో అందుబాటు ధరల్లో వైద్య సేవలందించే మెడికల్ టూరిజం కేంద్రంగా భారత్ ఎదగనుందని, దేశ ఎకానమీకి ఈ విభాగం తోడ్పాటు గణనీయంగా ఉండబోతోందని అపోలో హాస్పిటల్స్ గ్రూప్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సంగీతా రెడ్డి చెప్పారు. ఈ నేపథ్యంలో తమ పోర్ట్‌ఫోలియోలో ఇది కూడా కీలకం కానుందని ఆమె తెలిపారు. శరవేగంగా వృద్ధి చెందుతున్న ఈ విభాగంలో అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ప్రత్యేకంగా అంతర్జాతీయ పేషంట్ల విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు ఆమె చెప్పారు. గత ఆర్థిక సంవత్సరంలో దీని ద్వారా దాదాపు 2 లక్షల మంది రోగులకు చికిత్స అందించినట్లు వివరించారు. ఎక్కువ మంది ప్రధానంగా క్యాన్సర్, అవయవ మార్పిడి, ఆర్థోపెడిక్స్, న్యూరోసర్జరీ, హృద్రోగాలు మొదలైన సమస్యల చికిత్స కోసం వస్తున్న వారు ఉంటున్నారని సంగీతా రెడ్డి చెప్పారు. ముఖ్యంగా నేపాల్, శ్రీలంక, అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్, ఇరాక్, కెన్యా, నైజీరియా, ఇథియోపియా, ఒమన్, యెమెన్, ఉజ్బెకిస్తాన్, మయన్మార్ తదితర దేశాల నుంచి అంతర్జాతీయ పేషంట్లు వస్తున్నారని ఆమె తెలిపారు. -
ఫస్ట్‌ఎయిడ్ ఏబీసీడీలు
చాలా సందర్భాల్లో ఫస్ట్ ఎయిడ్ వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి. అది ఎన్నో ప్రాణాలను కాపాడగలుగుతుంది. ఫస్ట్ ఎయిడ్ మీద మనమందరమూ అవగాహన కలిగి ఉండటం ఎంతో మంచిది. అందుకు ఉపకరించేదే ఈ కథనం. ఏదైనా ఓ అనుకోని సంఘటనతోనో, అకస్మాత్తుగా రుగ్మతతోనో రోగికి చికిత్స అవసరమైనప్పుడు వైద్య శిక్షణ అంతగా లేని మామూలు వ్యక్తులు చేసే తొలి ఆరోగ్య సేవను ప్రథవు చికిత్సగా చెబుతారు. ఆ క్షణాన అవసరమైన సేవ అందించడం ద్వారా రోగి పరిస్థితి వురింత విషమించకుండా చేయడం ఇందులో సాధ్యమవుతుంది. అలాగే ఆ సమయానికి అందించిన ఆ తొలి చికిత్సే ప్రాణాలు కాపాడటంలో కీలక భూమిక పోషిస్తుంది. ప్రథవు చికిత్స ఏబీసీడీలు... ఏదైనా ప్రక్రియలో ఏబీసీడీలు అంటే... ప్రాథమిక అంశాలని అర్థం. కాని ఫస్ట్ ఎయిడ్‌లో ఏ,బీ,సీ,డీలను గుర్తుంచుకుంటే చికిత్స చాలా సులువవుతుంది. తద్వారా మామూలు వ్యక్తులు కూడా చికిత్స ప్రాధాన్యాన్ని గుర్తుపెట్టుకోవడానికి వీలవుతుంది. అలాగే దాన్ని అందించడమూ సులువవుతుంది. ఇక్కడి ఏ, బీ, సీ లు ప్రథమ చికిత్సలోని కొన్ని ఇంగ్లిషు మాటలకు సంక్షిప్త రూపాలు. అవి... ►ఏ అంటే... ఎయిర్ వే గాలి పీల్చే వూర్గంలో అవాంతరం లేకుండా చూడటం ►బీ అంటే... బ్రీతింగ్... శ్వాస సరిగ్గా తీసుకునేలా చూడటం ►సీ అంటే... సర్క్యులేషన్... అంటే రక్తస్రావం అవ#తుంటే ఆపి... రక్త ప్రవాహ వ్యవస్థ (సర్క్యులేషన్) సక్రవుంగా సరిగ్గా జరిగేలా చూడటం. డీ అంటే ..డెడ్లీ బ్లీడింగ్ / డీఫైబ్రిలేషన్ ఉదాహరణకు... ఓ వ్యక్తి స్పృహ తప్పి పడిపోయి ఉన్నట్లు అనిపించింది. సాధారణంగా స్పృహ తప్పిన వ్యక్తుల నాలుక వెనక్కువెళ్లవచ్చు. దాంతో అది శ్వాసతీసుకునే వూర్గాన్ని అడ్డుకుంటుంది. అందుకే పడుకున్న భంగివులోనే ఉన్న రోగి గదవును ఎత్తుగా ఉండేలా... తలను కాస్తంత పైకెత్తినట్లుగా పడుకోబెడితే శ్వాస తీసుకునే వూర్గానికి ఎలాంటి అడ్డు లేకుండా ఉంటుంది. ఇదే... మొదటి ఏ. అంటే ఎయిర్వేలో అంతరాయం లేకుండా చూడటం. అలా చేశాక... రోగికి శ్వాస అందేట్లు చేయడం, తగినంత గాలి ఆడేలా చూడటం ప్రధానం. దీన్ని బ్రీతింగ్లోని మొదటి అక్షరం ‘బి’తో సూచిస్తారు. ఇక రక్తస్రావం అవతుంటే ఆపడం... అంటే సర్క్యులేషన్ సక్రవుంగా జరిగేలా చూడటం ఆ తర్వాతి ప్రాధాన్య అంశం. దీన్నే ఇంగ్లిష్ అక్షరమైన ‘సి’తో సూచిస్తారు. ఇక వురికొందరు ‘డి’ అనే అక్షరాన్ని కూడా చేర్చి– డెడ్లీ బ్లీడింగ్ లేదా డీఫైబ్రిలేషన్ అని కూడా అంటారు. అయితే వురికొందరు ఏబీసీలు చాలనీ... డి అనే ఆ వూట ‘సి’– సర్క్యులేషన్లోనే భాగవుని అంటారు. ఇంకొందరు ప్రథవు చికిత్స ప్రిన్సిపుల్స్ చెబుతూ ఈ ప్రక్రియలో వుూడు ‘బి’లపై దృష్టినిలపాలని చెబుతుంటారు. అవి... బ్రీతింగ్ (శ్వాస), బ్లీడింగ్ (రక్తస్రావం), బోన్స్ (ఎవుుకలు). అంటే... శ్వాసక్రియ చక్కగా జరిగేలా చూడటం, రక్తస్రావాన్ని అరికట్టడం, ఎవుుకలకు ఏదైనా ప్రవూదం జరిగిందేమో చూడటం... ఈ మూడూ ∙ప్రథవు చికిత్సలోని ప్రాథమిక ప్రాణరక్షణ (బేసిక్ లైఫ్ సపోర్ట్) అంశాలని చెబుతారు. ఫస్ట్ ఎయిడ్ ఎలా చేసుకోవచ్చు/చేయవచ్చు... ►కాళ్లు వుడతపడటం/మెలికపడటం వల వాస్తే... వాచిన చోట ఐస్ పెట్టాలి. స్ప్రెయిన్ అయిన కాలిని వీలైనంతగా కదిలించకుండా రెస్ట్ ఇవ్వాలి. ►ముక్కు నుంచి రక్తస్రావం అవ#తుంటే... చూపుడువేలు, బొటనవేలు సాయంతో వుుక్కుపై కాస్తంత ఒత్తిడి పెట్టి ఓ పదినిమిషాలు గట్టిగా పట్టుకోవాలి. దీని వల్ల రక్తస్రావం ఆగిపోతుంది. ►చెవిలో ఏదైనా దూరితే... చెవిలోకి టార్చిలైట్ వేయాలి. కాంతికి ఆకర్షితం కావడం కీటకాలకు ఉండే సహజమైన ఇన్స్టింక్ట్. అలా అది ఆ వెలుగుకు ఆకర్షితమై బయటకు వచ్చే అవకాశాలుంటాయి. అలాగే చెవిని శుభ్రమైన నీటితో (ప్లెయిన్వాటర్తో) కడగాలి. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. చెవిలో కొబ్బరినూనె వంటి జిడ్డుగా ఉండే పదార్థాలు వూత్రం అస్సలు వేయకూడదు. అది చెవి ఇన్ఫెక్షన్కు దారితీసి, మరింత ప్రమాదం తెచ్చిపెడుతుంది. ►వాంతులు, విరేచనాలు అవ#తుంటే శరీరం ద్రవపదార్థాలనూ, లవణాలను కోల్పోకుండా తగినన్ని కాస్తంత ఉప్పూ, చారెడు పంచదార కలిపిన నీళ్లు తాగాలి. కొబ్బరినీళ్లు, పప్పుపై ఉండే పల్చటి తేట తాగడం కూడా బాగానే ఉపకరిస్తుంది. ఇప్పుడు ఈ ప్రక్రియకు బదులు మెడికల్ షాపుల్లో దొరికే ఓఆర్ఎస్నే వాడుతున్నారు. ఎందుకంటే ఒకవేళ మనం ఉప్పు, పంచదార కలిపిన నీళ్లలో ఏవైనా కాలుష్యాలు ఉంటే అది రోగిని మరింత దిగజార్చే అవకాశాలుంటాయి కాబట్టి రెడీమేడ్‌గా దొరికే ఓఆర్ఎస్నే వాడటం మంచిది. ►యాక్సిడెంట్ రోగులైతే... ప్రవూదం వల్ల అవ#తున్న రక్తస్రావాన్ని ఆపేందుకు గుడ్డను అడ్డుగా పెట్టడం. రక్తం పోకుండా చూడటం వుుఖ్యం. ►కుక్క కరచిన సందర్భంలో నీళ్లను ఓ ప్రవాహంలా వదులుతూ సబ్బుతో గాయాన్ని కడగాలి. ►కాలిన గాయాలైతే... వాటిపైనుంచి నీళ్లు ధారగా వెళ్లేలా 10 నిమిషాల పాటు చూడాలి. అలా నీళ్లు ప్రవాహంలా వెళ్లేలా చూస్తే కణజాలం (టిష్యూలు) వురింతగా చెడకుండా ఉంటాయి. అంతేకాదు... బొబ్బలను ఏవూత్రం చిదపకూడదు. ►జ్వరంతో ఒళ్లు కాలిపోతుంటే... నుదుటిపై తడిగుడ్డతో అద్దుతూ ఉండాలి. ఒంట్లోని ఉష్ణోగ్రతను గ్రహించి, ఆ తడిగుడ్డలోని నీరు ఆవిరవుతూ ఉండటం వల్ల దేహ ఉష్ణోగ్రత క్రమంగా తగ్గేందుకు అవకాశం ఉంది. ►పాము కరచిన సందర్భంలో రోగికి తొలిసాయంగా ఆత్మస్థైర్యం కలిగించడం వుుఖ్యం. ఇక పావుు కాటేసిన ఆ కాలు లేదా చేతిని వీలైనంతగా కదపకుండా చూడటం వుుఖ్యం. కదలికలు ఎంత ఎక్కువగా ఉంటే విషం రక్తంలో కలిసే వేగం కూడా పెరుగుతుంది. కాబట్టి వీలైనంతగా ప్రశాంతంగా, కదలికలు లేకుండా చూడటం వుుఖ్యం. వీలైనంత త్వరగా ఆసుపత్రికి తరలించాలి. అంతేతప్ప సినిమాల్లో చూపినట్లుగా పాముకరచిన చోట గాటుపెట్టి రక్తం బయటకు పీల్చి ఉమ్మేయడం వంటి టెక్నిక్లను అనుసరించకూడదు. ఇక గుండెపోటు వచ్చి గుండె ఆగిన సందర్భాల్లో కార్డియో పల్మునరీ రీసుసీయేషన్ (సీపీఆర్) అనే ప్రథమచికిత్స చేసి రోగి ప్రాణాలు కాపాడవచ్చు. అయితే దీనికి కొద్దిపాటి శిక్షణ అవసరమవుతుంది. అలాంటి శిక్షణ పొందినవారు ఎవరైనా ఉంటే రోగికి సీపీఆర్ చేస్తూ ఆసుపత్రికి తరలించాలి. లేదా అంబులెన్స్‌లో పీసీఆర్ చేస్తూనే ఆసుపత్రికి తీసుకురావాలి. ఇలా సీపీఆర్‌తో కూడా చాలా ప్రాణాలను కాపాడేందుకు అవకాశం ఉంది. ఇది చాలా సింపుల్ టెక్నిక్ కాబట్టి ఆసక్తి ఉన్నవారు కొద్దిపాటి శిక్షణతో దీన్ని చేయవచ్చు. అన్ని చోట్లా ఫస్ట్ ఎయిడ్ పనిచేయదు... ఏదైనా ప్రవూదమో, అత్యవసర పరిస్థితో ఏర్పడినప్పుడు మెుదటి అరగంటను ప్లాటినం క్షణాలనీ, రెండో అరగంటను బంగారు క్షణాలనీ (గోల్డెన్ మెుమెంట్స్), ఆ తర్వాతి గంటను (సిల్వర్ మొమెంట్స్) అని అంటారు. అంతే... రోగికి ఎంత త్వరగా చికిత్స అందితే దాన్ని బట్టే అతడు కోలుకునే సవుయంలో వచ్చే (రికవరీ) సవుస్యలు అంతగా తగ్గుతాయి. గుండెపోటు వచ్చిన సందర్భాల్లో కొందరు అది గ్యాస్ వల్ల కావచ్చు అనుకొని నిర్లక్ష్యం చేసి సవుయం దాటిపోయాక ఆసుపత్రికి తీసుకొస్తే పరిస్థితి వురింత జటిలం కావచ్చు. అందుకే అది గ్యాస్ వల్ల వచ్చిన సవుస్యా లేక నిజంగానే హార్ట్ ప్రాబ్లవూ అన్నది డాక్టర్ నిర్ణయిస్తారు. ఇది డాక్టర్ మాత్రమే తీసుకునే నిర్ణయమని గుర్తుంచుకోవాలి. అదే పక్షవాతం (స్ట్రోక్) విషయంలో కూడా వర్తిస్తుంది. ఓ నిర్ణీతమైన సవుయంలోనే మెదడులో గడ్డకట్టిన రక్తాన్ని తొలగించే ఇంజెక్షన్ ఇస్తేనే అది సత్ఫలితం ఇస్తుంది. అందుకే అలాంటి సంక్లిష్టసవుయాల్లో అన్ని వసతులు ఉన్న ఆసుపత్రులకు వెళ్లడం వుంచిది. అదే సౌకర్యాలు లేని చోటికి వెళ్తే... ఒక డాక్టర్ నుంచి వురో డాక్టర్ వద్దకూ ఓ ఆసుపత్రి నుంచి వురో ఆసుపత్రికీ తిరుగుతూ విలువైన ఆ సవుయాన్ని కాస్తా అలా తిరగడంలోనే వృథా చేస్తే అవుూల్యమైన కాలం కాస్తా గడిచిపోయి పరిస్థితి వురింత విషమించే అవకాశం ఉంటుంది. డా. శివనారాయణరెడ్డి వెన్నపూస సీనియర్ పీడియాట్రీషియన్ అండ్ నియోనేటాలజిస్ట్ రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్స్, సికింద్రాబాద్ -
మావోలకు వెరవని గిరిజన యువతి
రాయ్‌పూర్ : మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సదుపాయాలు అంతంతమాత్రంగానే ఉంటాయి. పైగా అక్కడి ప్రభుత్వానికి కూడా అధికారాలు తక్కువ. మావోల ప్రభావం కలిగిన ఛత్తీస్‌గఢ్‌లోని అబూజాబాద్ ప్రాంతంలో కీర్టా డోప్రా అనే గిరిజన యువతి మెడికల్ స్టోర్‌ను ప్రారంభించింది. ఈ ప్రాంతంలో ఎక్కువగా గిరిజనులు ఉంటారు. వీరికి ప్రాథమిక సదుపాయాలు, రోడ్డు మార్గాలు లేవు. రోజు మొత్తమ్మీద నాలుగు బస్సులు మాత్రమే ఇక్కడికి వస్తాయి. ప్రతి బుధవారం ఇక్కడ కూరగాయల సంత జరుగుతుంది. మావోయిస్టుల తిరుగుబాటు నేపథ్యంలో జన్ ఔషధీ కేంద్రం మాత్రమే ఔషధాలను అందజేస్తోంది. ఇక్కడ ఈ వెసులుబాటు లేకపోతే ఔషధాలకోసం 70 కిలో మీటర్లు వెళ్లక తప్పదు. ఆర్ధిక పరిస్థితుల కారణంగా మరియా తెగకు చెందిన కీర్టా చదువు ఇంటర్‌తోనే ఆగిపోయింది. ఒక రోజు ఈ గ్రామంలో యూనిసెఫ్ సంస్థ పోషకాహారలోపంపై కార్యక్రమం నిర్వహించగా కీర్టా అందులో పాల్గొని అందరికీ అవగాహన కల్పించింది. ఆ సమయంలోనే ఈ ప్రాంత సమస్యలను యూనిసెఫ్ సంస్థ దృష్టికి తీసుకుపోయింది. వారి సహకారంతో మలేరియా, డయేరియాతోపాటు అన్నిరకాల మందులను గ్రామస్థులకు అందుబాటులో ఉంచుతోంది. అలా ఆమె రోజుకు 12 గంటలు పనిచేసి నెలకు రూ.2,000పైగా సంపాదిస్తోంది. కీర్టా తెగువను గుర్తించిన యూనిసెఫ్ సంస్థ 2014లో సాహసి అవార్డుతో సన్మానించింది. ఈ విషయమై జిల్లా వైద్యాధికారి మాట్లాడుతూ‘‘ మావోయిస్టులు ఏ క్షణంలోనైనా ఆ షాపుపై దాడి చేయవచ్చు. ధ్వంసం కూడా చేయొచ్చు. అయితే కీర్టా అవేవీ పట్టించుకోలేదు. ఆమె ధైర్యం అందరికీ ఆదర్శం. ఇటువంటివారి వల్ల సమాజానికి ఎంతో మేలు జరుగుతుంది’’ అని అన్నారు. -
అయ్యో.. బంగారుకొండ
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ వైద్య సిబ్బంది నిర్లక్ష్యం ఓ పసిప్రాణాన్ని బలి తీసుకుంది. పదుల సంఖ్యలో నవజాత శిశువులను తీవ్ర అస్వస్థతకు గురి చేసింది. మరో 24 గంటలు గడిస్తే కానీ వారి పరిస్థితి ఏమవుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. టీకాలు వేశాక ఒక మందుకు బదులు మరో మందు ఇవ్వడమే పిల్లల ప్రాణాల మీదకు తెచ్చిందని తేలింది. ఎలా జరిగింది? జాతీయ వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమంలో భాగంగా బుధవారం నాంపల్లి ఏరియా ఆస్పత్రిలో శిశువులకు వాక్సినేషన్ వేశారు. ఒకటిన్నర నెలల నుంచి మూడున్నర నెలలలోపు ఉన్న 92 మంది శిశువులకు పెంటావాలంట్ వాక్సిన్ ఇచ్చారు. సాధారణంగా టీకాలు వేశాక శిశువులకు జ్వరం వచ్చే అవకాశం ఉంటుంది. దీంతో వాక్సినేషన్లో పాల్గొన్న సిబ్బంది జ్వరాన్ని తగ్గించేందుకు ‘పారాసిటమాల్’టాబ్లెట్ ఇవ్వాల్సి ఉండగా అందుకు విరుద్ధంగా నొప్పుల నివారణకు వాడే ‘ట్రెమడాల్’(300 ఎంజీ) పెయిన్‌కిల్లర్ టాబ్లెట్‌ను ఇచ్చారు. సాధారణంగా ఈ మాత్రలను పిల్లలకు రికమెండ్ చేయరు. ఆస్పత్రి వైద్య సిబ్బంది వాటిని పరిశీలించకుండానే పంపిణీ చేయడంతో ఇది తెలియని తల్లిదండ్రులు ఆ మాత్రలను పిల్లలకు వేశారు. దీంతో టాబ్లెట్ వేసిన కొద్దిసేపటికే అవి వికటించి పిల్లలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. డోస్ ఎక్కువై..ఊపిరాడక, అపస్మారక స్థితిలోకి చేరుకున్నారు. దీంతో బుధవారం సాయంత్రం చికిత్స కోసం చిన్నారులను నిలోఫర్ ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో కిషన్‌బాగ్‌కు చెందిన రెండున్నర నెలల ఫైజాన్ అనే బాలుడు మార్గమధ్యలోనే మృతిచెందగా కొన ఊపిరితో కొట్టుమిట్టాడు తూ అపస్మారక స్థితిలో ఆస్పత్రికి చేరుకున్న మ రో ముగ్గురు (సయ్యద్ ముస్తఫా, హీనా బేగం, అబూఅజ్మల్)శిశువులను వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. మరో 24 గంట లు గడిస్తే కానీ ఏమీ చెప్పలేమని వైద్యులు తెలిపారు. మిగిలిన వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు చెప్పారు. గురువారం మధ్యాహ్నం వరకు 22 మంది చిన్నారులను నిలోఫర్‌కు తరలించగా సాయంత్రానికి ఈ బాధితుల సంఖ్య 27కు చేరుకుంది. కళ్లు మూసుకుని మందులు పంచారు.. నాంపల్లి ఏరియా ఆస్పత్రిలో వాక్సినేషన్‌తోపాటు ప్రసవాలు, ఆర్థోపెడిక్ వంటి స్పెషాలిటీ సేవలు కూడా అందిస్తున్నారు. సర్జరీల తర్వాత నొప్పిని నివారించేందుకు ఆ టాబ్లెట్లను వాడుతుంటారు. వీటిని పెద్దలకే ఇస్తారు. ఫార్మసీ సిబ్బంది ఓపీ సేవలకు ముందే తమ వద్దకు వచ్చిన మెడికల్ స్ట్రిప్‌లను (రెండు టాబ్లెట్ల చొప్పున) ఐదు భాగాలుగా కట్ చేసుకొని బాక్సుల్లో పెట్టుకుంటారు. మందులు నిల్వ చేసిన బాక్సులు సహా ఆ రెండు టాబ్లెట్ల కవర్లు చూడ్డానికి ఒకేలా ఉండటం, సిబ్బంది వాటిపై ముద్రించిన పేర్లు కూడా చూడకుండానే పంచడం, విషయం తెలియక తల్లిదండ్రులూ వేయడం చిన్నారుల అస్వస్థతకు కారణమైంది. ఫార్మసిస్ట్‌లే మందులు ఇవ్వాల్సి ఉండగా నాంపల్లి ఏరియా ఆస్పత్రిలో ఏఎన్ఎంలతో పంపిణీ చేయించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఏఎన్ఎంలుగా పని చేస్తున్న వారిలో చాలా మందికి చికిత్సలపై అవగాహన లేకపోవడమే ఇలాంటి ఘటనలకు కారణమని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. గతేడాది రాజన్న సిరిసిల్ల జిల్లాలోనూ ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. త్వరలోనే కోలుకుంటారు.. చిన్నారులంతా త్వరలోనే కోలుకుంటారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. – నిలోఫర్ ఆసుపత్రి సూపరింటెండెంట్ -
ఐరన్ లేడీ
ఉక్కు సంకల్పంతో పాలన విధుల్ని నిర్వహిస్తున్న కలెక్టర్.. శ్వేతా మహంతి. అంతేకాదు, బాలికలలో రక్తహీనతను తగ్గించేందుకు ఆమె కృషి చేస్తున్నారు.అందుకే ఆమె.. ఐరన్ లేడీ! ఖిలా ఘన్పూర్... పేరులోనే ఉంది కోట. ఆ కోటకు ట్రెక్కింగ్ చేస్తోంది ఓ చురుకైన అమ్మాయి. పేరు శ్వేతా మహంతి. కాకతీయుల సామంత రాజు గోన గణపారెడ్డి 13వ శతాబ్దంలో కట్టిన కోట అది. ఒకప్పటి మహబూబ్‌నగర్ జిల్లా, ఇప్పుడు వనపర్తి జిల్లా. జిల్లాలో టూరిజాన్ని అభివృద్ధి చేయడానికి ‘క్లైంబ్ ఆన్ ప్రోగ్రామ్’ పెట్టి తాను స్వయంగా ఆరు కిలోమీటర్ల దూరం ట్రెకింగ్‌కి సిద్ధమయ్యారు ఆ జిల్లా కలెక్టర్. ఇంతకీ బృందంలో కలెక్టర్ ఎవరై ఉంటారని చూస్తే... అందరిలోకి చురుగ్గా కనిపిస్తున్న అమ్మాయే ఆ కలెక్టర్. ‘ఇది చక్కటి టూరిస్ట్ ప్లేస్ అని, ఓవర్ నైట్ ట్రిప్‌కి అనువైన ప్రదేశం అని, రాక్ క్లైంబింగ్, రాపెలింగ్, జెయింట్ స్వింగ్ వంటి అడ్వెంచర్ స్పోర్ట్స్‌కి ఖిలా ఘన్పూర్ (ఘన్పూర్ ఫోర్ట్) మంచి ఎంపిక’ అని ఆమె చెప్పిన మాటలు మరుసటి రోజు పతాక శీర్షికగా వార్తల్లో వచ్చాయి. ఇంకా ఆమె... ‘‘ఐఏఎస్ ట్రైనింగ్‌లో ట్రెక్కింగ్ కూడా ఉంటుంది. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కొండలెక్కాలి, పర్వతాలను అధిరోహించాలి. మాకు ప్రతివారం హిమాలయాల్లో ట్రెక్కింగ్ ఉండేది’’ అని కూడా చెప్పారు నవ్వుతూ. కలెక్టర్ ఇంత డైనమిక్‌గా ఉంటే జిల్లాలో పాలన కూడా ఈవెంట్‌ఫుల్‌గా ఉంటుందనే ఆశ చిగురించింది ఆ జిల్లా ప్రజల్లో. మహిళల ఆరోగ్యంపై దృష్టి కలెక్టర్‌గా బాధ్యతలు తీసుకున్న తర్వాత.. ‘కలెక్టర్‌గా రొటీన్ అడ్మినిస్ట్రేషన్‌కి పరిమితం అయి పోకూడదు. ఏదైనా చేయాలి. ఐఏఎస్ చేసి కలెక్టర్‌గా పోస్టింగ్ అందుకున్న జిల్లాకు తన వంతుగా ఏదైనా చేయాలి’ అనుకున్నారు శ్వేతా మహంతి. గ్రౌండ్ రియాలిటీ తెలుసుకోవాలి, క్షేత్రస్థాయిలో చేయాల్సిన మార్పులు చేయాలి అనుకున్న తర్వాత జిల్లాలో పర్యటించారు. ఆ పర్యటనల్లో మహిళలు, యువతులు, బాలికలలో ఎక్కువ మంది బలహీనంగా ఉండటాన్ని ఆమె గమనించారు. పాలనా విధులే కాకుండా.. తను చేయాల్సిన పనులు చాలానే ఉన్నాయి అనుకున్నారు. జిల్లాలో ఆరోగ్య సేవలు ఎలా నడుస్తున్నాయో స్వయంగా పరిశీలించారు. నూటికి నలభై మంది మహిళలు (బాలికలు, యువతులు కలిపి) తీవ్రమైన రక్తహీనతతో బాధపడుతున్నారు. రక్తహీనత ఇంత తీవ్రంగా ఉండటం ఏమిటి? ఆమె మనసును తొలిచే ప్రశ్న అయింది. రక్తహీనతకు అనుబంధంగా తోడయ్యే అనేక ఆరోగ్య సమస్యలు కూడా కళ్ల ముందు మెదిలాయి. గర్భిణికి ఐరన్ ట్యాబ్లెట్లు, విటమిన్ మందులివ్వడంతో పరిష్కారమయ్యే సమస్య కాదిది అనుకున్నారామె. వ్యాధి లక్షణానికి కాదు వ్యాధి కారకానికి మందు వెయ్యాలి అని కూడా అనుకున్నారు. ‘సమత’ ఆవిర్భవించింది! శ్వేత ఆదేశాలపై జిల్లాలోని 110 ప్రభుత్వ పాఠశాలకు మెడికల్ టీమ్ లు వెళ్లాయి. మొత్తం ఎనిమిది వేల మంది అమ్మాయిలకు రక్తపరీక్షలు జరిగాయి. ఇందుకోసం స్కూలు టీచర్లకు ప్రత్యేక ఓరియెంటేషన్ ఇచ్చి, పిల్లలకు పీరియడ్ క్యాలెండర్ రికార్డు చేయించారు మహంతి. పీరియడ్స్‌లో ఎదురయ్యే అపసవ్యతలను తేదీల వారీగా నోట్‌బుక్‌లో రాయడం పిల్లలకు నేర్పించారు. వ్యక్తిగత పరిశుభ్రత, రుతుస్రావంలో పాటించాల్సిన జాగ్రత్తలు చెప్పించి బయోడిగ్రేడబుల్ (నేలలో కలిసిపోయేవి) సానిటరీ నాప్కిన్స్ ఇప్పించారు. ప్రతి నెలా విజిటింగ్ మెడికల్ టీమ్ స్కూలుకు వస్తుంది, అమ్మాయిలు నోట్‌బుక్‌లో నమోదు చేసిన వివరాలను అధ్యయనం చేసి మందులిస్తుంది. ఏడాది క్రితం మొదలైన ఈ మొత్తం ప్రోగ్రామ్‌కి ‘సమత’ అనే పేరు పెట్టారు శ్వేతా మహంతి. ఆరు నెలలకు ఆమె ప్రయత్నం మంచి ఫలితాలనిచ్చింది. స్కూలు పిల్లల్లో రక్తహీనత తగ్గుముఖం పట్టింది. స్కూళ్లకు వాలంటీర్లు వనపర్తి జిల్లాలో ఎక్కువగా గ్రామాలే. ప్రభుత్వ పాఠశాలల్లో కంప్యూటర్లు ఉన్నాయి. పిల్లలకు కంప్యూటర్ ఎడ్యుకేషన్ ఇస్తున్నట్లు గణాంకాల్లో రికార్డ్ అయింది. స్కూలుకి వెళ్లి చూస్తే... పిల్లలకు తెలిసింది అది ఒక కంప్యూటర్ అని మాత్రమే. కీ బోర్డు, సీపీయు, మౌస్ అని పైకి కనిపించే విడిభాగాల పేర్లు చెప్పి సరిపెడుతున్న సంగతి కూడా శ్వేత దృష్టికి వచ్చింది. ప్రపంచం కంప్యూటర్ చుట్టూ తిరుగుతున్న రోజుల్లో కంప్యూటర్ లిటరసీ లేకపోతే ఎంత పెద్ద చదువులు చదువుకున్నా నిరక్షరాస్యులుగా ఉండిపోవాల్సి వస్తుంది. అందుకే గవర్నమెంట్ స్కూళ్లలో చదువుకుంటున్న పిల్లలందరికీ కంప్యూటర్ పరిజ్ఞానంతోపాటు ఇంటర్నెట్లో సమాచారాన్ని తెలుసుకోవడం కూడా నేర్పించాలని ఆదేశించారామె. ఇందుకోసం వాలంటీర్ల బృందం ఇప్పుడు స్కూళ్లకు ల్యాప్‌టాప్‌లతో వస్తోంది. గూగుల్‌లో తమకు కావాల్సిన సమాచారాన్ని ఎలా రాబట్టుకోవడం, ఈ మెయిల్స్ పంపించడం వంటివన్నీ పిల్లలకు నేర్పిస్తోంది. సత్తువ లేకపోవడం ఏమిటి! వనపర్తి జిల్లాలో వేరుశనగ పంట విరివిగా పండిస్తారు. ఇంత విస్తృతంగా వేరుశనగ పండించే గ్రామాల్లో మహిళలకు ఐరన్ లోపం, రక్తహీనత ఉండడం ఏమిటి అని శ్వేతామహంతికి మొదటే సందేహం కలిగింది. ‘సమత’ కార్యక్రమాన్ని కొనసాగిస్తూనే, ఐరన్ లోపాన్ని తగ్గించేందుకు ఊళ్లకు కుటీర పరిశ్రమలు తెప్పించారు. ‘‘వనపర్తి జిల్లాలో వేరుశనగ బాగా పండుతుంది. రైతులంతా గిట్టుబాటు చూసుకుని పంట దిగుబడిని అలాగే అమ్మేస్తున్నారు తప్ప ఆ ముడిసరుకు ఆధారంగా నడిచే పరిశ్రమల మీద దృష్టి పెట్టడం లేదు. ఆ పని స్వయం సహాయక బృందాల చేత చేయించడంతో మంచి లాభాలను చూస్తున్నారిప్పుడు. శ్వేత చొరవతో ప్రయోగాత్మకంగా మొదట దత్తాయిపల్లిలో వేరుశనగ గింజలను ప్రాసెస్ చేసే యూనిట్ ప్రారంభమైంది. ఒకప్పుడు మధ్య దళారులు, పెద్ద వ్యాపారులకు అందుతూ వచ్చిన లాభాలు ఇప్పుడు గ్రామీణ మహిళలకే అందుతున్నాయి. వేరుశనగ పప్పు– బెల్లంతో చేసే చిక్కీకి మంచి డిమాండ్ ఉంది. రాష్ట్ర కో ఆపరేటివ్ డిపార్ట్మెంట్ నుంచి భారీ ఆర్డర్లు రావడంతో ఆ యూనిట్ నెలలోనే కమర్షియల్‌గా నిలదొక్కుకున్నది. ఈ పరిశ్రమలు నడుపుతున్న మహిళలు చదువుకున్న వాళ్లు కూడా కాదు. ఒక్కో కుటుంబానికి ఎంత మేరకు ఆదాయం పెరిగిందనే అంచనాకు రావాలంటే మరికొన్ని నెలలు పడుతుంది. అయితే ఇది మహిళల స్వయం శక్తికి, సాధికారతకు, మహిళ ఆరోగ్యానికీ సోపానం అవుతుందని మాత్రం కచ్చితంగా చెప్పగలను’’ అన్నారామె దృఢ విశ్వాసంతో. గడచిన అసెంబ్లీ ఎన్నికల్లో దివ్యాంగుల చేత ఓటు వేయించడానికి స్పెషల్ డ్రైవ్ ఏర్పాటు చేశారామె. ఇప్పుడు మహిళలకు ఫోర్ వీలర్ డ్రైవింగ్ నేర్పించే ప్రోగ్రామ్‌కి రూపకల్పన చేశారు. పరిపాలన అంటే తాయిలంతో బుజ్జగించడం కాదు, ప్రజలు తమ కాళ్ల మీద తాము నిలబడడానికి అనువైన వాతావరణాన్ని రూపొందించడం. శ్వేతా మహంతి అదే పని చేస్తున్నారు. పిల్లల్లో న్యూనత తలెత్తకూడదు గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న పిల్లలకు ప్రతి సౌకర్యమూ చేరాలనేది నా ఆకాంక్ష. ఐఏఎస్‌గా నాకు జిల్లా పరిపాలనకు సంబంధించిన విస్తృత అధికారం ఉంది. ఆ అధికారాన్ని ఉపయోగించి గ్రామాల్లో పిల్లలకు ఎంత చేయగలనో అంతా చేయాలనిపించింది. నా పిల్లలకు నేర్చుకోవడానికి ఎన్ని అవకాశాలున్నాయో ఆర్థిక పరిస్థితి అంతగా సహకరించని పిల్లలకు కూడా ఆ అవకాశాలన్నీ అందుబాటులోకి రావాలి. వాళ్లు పెద్దయ్యాక... ‘మేము గ్రామాల్లో పుట్టాం, తెలుగు మీడియంలో చదువుకున్నాం, కంప్యూటర్ తెలియకపోవడంతో మిగిలిన వాళ్లతో పోల్చినప్పుడు వెనుకపడిపోతున్నాం’ అనే న్యూనత ఆ పిల్లల్లో ఎప్పటికీ తలెత్తకూడదు. – శ్వేతా మహంతి, జిల్లా కలెక్టర్, వనపర్తి జిల్లా, తెలంగాణ క్లాసికల్ డాన్స్ ఇష్టం శ్వేతా మహంతి తండ్రి ప్రసన్న కుమార్ మహంతి. ప్రభుత్వానికి చీఫ్ సెక్రటరీ బాధ్యతలు నిర్వర్తించి, ప్రస్తుతం కేంద్ర విధుల్లో ఉన్నారాయన. భర్త రజత్ కుమార్ సైనీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్. తండ్రిలా ఐఏఎస్ కావాలనే కలను నిజం చేసుకోవడానికి తనకు ఎంతో ఇష్టమైన క్లాసికల్ డాన్స్ ప్రాక్టీస్‌కు దూరమయ్యారు శ్వేత. ఆమెకు ఇద్దరు కూతుళ్లు. శ్వేత తండ్రి అడుగు జాడల్లో నడిచినట్లే ఆమె పిల్లలు కూడా నడుస్తారేమో. ఒక పాపకు ఎనిమిదేళ్లు, ఒక పాపకు నాలుగు. వాళ్ల కలల నిర్మాణం ఎలా ఉంటుందో చూడాలి. -
ఫైట్ ‘అనిమియా’
సాక్షి, ఆదిలాబాద్‌టౌన్: రక్తహీనత సమస్యను అధిగమించడానికి వైద్య, ఆరోగ్య శాఖ చర్యలు చేపడుతోంది. ఫైట్ అనిమియా పేరుతో పిల్లల్లో, గర్భిణుల్లో రక్తహీనతను తగ్గించేందుకు కార్యక్రమ రూపకల్పన చేస్తోంది. జిల్లాలో ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా హిమోగ్లోబిన్ తక్కువగా ఉండడంతో అనిమియాకు గురై మత్యువాత పడుతున్న సంఘటనలు అనేకం. చిన్నారులు పౌష్టికాహార లోపం కారణంగా వచ్చే అనిమియాతో ఆస్పత్రుల పాలవుతున్నారు. పౌష్టికాహార కేంద్రాలు ఏర్పాటు చేసినా పూర్తిస్థాయిలో సమస్య పరిష్కారానికి నోచుకోవడం లేదు. ఈ నేపథ్యంలో అనిమియాను తరమికొట్టేందుకు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు. విద్యార్థులకు వైద్య పరీక్షలు.. జిల్లాలోని 300 ప్రభుత్వ యాజమాన్య పాఠశాలలు, వసతిగృహాల్లో 6వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులకు మాత్రమే వైద్య పరీక్షలు చేసి రక్తహీనత విషయాన్ని నిర్ధారిస్తారు. జిల్లా వ్యాప్తంగా 110 యూపీఎస్, 190 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటిలో ఎయిడెడ్ పాఠశాల 1, బీసీ వసతి గృహాలు 2, ప్రభుత్వ యాజమాన్య పాఠశాలలు 22, కేజీబీవీలు 17, లోకల్‌బాడి పాఠశాలలు 187, సోషల్ వెల్ఫేర్ 3, మోడల్ స్కూళ్లు 6, ట్రైబల్ వెల్ఫేర్ 53, యూఆర్ఎస్ 1, రెసిడెన్షియల్ పాఠశాలలు 6 ఉన్నాయి. ఈ పాఠశాలల్లో కలిపి 43,991 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. వీరందరికి వైద్య పరీక్షలు చేయనున్నారు. ఈనెల 12 నుంచి మొదలు.. ఈనెల 12వ తేదీ నుంచి పాఠశాలల్లో అనిమియా వైద్య పరీక్షలు చేయనున్నారు. ఇందుకోసం వైద్య ఆరోగ్య శాఖ 8 బృందాలను ఏర్పాటు చేసింది. ఒక్కో బృందంలో ముగ్గురు ఏఎన్ఎంలు, ఒక వైద్యాధికారి, ఒక ఫార్మాసిస్ట్ ఉంటారు. వైద్య పరీక్షలు చేసిన తర్వాత హెమోగ్లోబిన్ శాతం 8 గ్రాములు ఉంటే రోజుకు రెండు ఐరన్ మాత్రలు, 8 నుంచి 11 శాతం ఉంటే రోజు ఒక మాత్ర చొప్పున మూడు నెలల పాటు అందిస్తారు. పాఠశాలల్లో ఎంత మంది విద్యార్థులు రక్తహీనతతో బాధపడుతున్నారో లెక్కించి వారికి చికిత్స కోసం చర్యలు తీసుకుంటారు. ఉపాధ్యాయులు మధ్యాహ్న భోజనం అనంతరం ఈ మాత్రలు వారికి ఇవ్వనున్నారు. పౌష్టికాహారం లోపమే సమస్య.. పౌష్టికాహార లోపమే అనిమియా రావడానికి ప్రధాన కారణం. ప్రొటీన్లు, విటమిన్లు, ఆకుకూరలు, కూరగాయల భోజనం చేయకపోవడంతో ఈ సమస్య తలెత్తుతోంది. అనిమియాతో విద్యార్థుల్లో అలసట రావడం, తల తిరగడం, ఛాతినొప్పి రావడం, పెరుగుదల లేకపోవడం, ఆకలి ఉండకపోవడం, తదితర వాటితో బాధపడుతుంటారు. దీంతో విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టలేకపోతున్నారు. ఈ విషయాన్ని గమనించిన ప్రభుత్వం పైలెట్ ప్రాజెక్టుగా రాష్ట్ర వ్యాప్తంగా ఏడు జిల్లాలను ఎంపిక చేయగా, అందులో ఆదిలాబాద్ జిల్లా ఉంది. జిల్లాలో దాదాపు 30 శాతం మంది వరకూ విద్యార్థులు రక్తహీనతతో బాధపడుతున్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. పాఠశాల విద్యార్థులకు వైద్య పరీక్షలు ఫైట్ అనిమియా పేరుతో రక్తహీనతతో బాధపడుతున్న 6 నుంచి 10వ తరగతి విద్యార్థులను గుర్తించి వారికి వైద్య పరీక్షలు చేయిస్తాం. రక్తహీనతతో బాధపడుతున్న వారికి మాత్రలు అందిస్తాం. జిల్లా వ్యాప్తంగా 43,991 మంది విద్యార్థులు ఉండగా వారందరికి పరీక్షలు చేస్తాం. అనిమియాతో బాధపడుతున్న వారికి మూడు నెలల పాటు మాత్రలు అందిస్తాం. – రాజీవ్‌రాజ్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి, ఆదిలాబాద్ -
త్వరలో మెడికల్ క్యాంప్
ఎన్ఆర్ఐ రవీంద్రనాథ్‌రెడ్డి అనుమసముద్రంపేట : శ్రీ సీతారామ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అనుమసముద్రంలో త్వరలో మెడికల్ క్యాంప్ నిర్వహించనున్నట్లు ఎన్ఆర్ఐ పందిళ్లపల్లి రవీంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. సోమవారం ఆయన గ్రామంలో ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మించిన శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో పూజలుచేశారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో మొక్కలునాటారు. అనంతరం మాట్లాడుతూ ఇప్పటికే మినరల్ వాటర్‌ప్లాంట్ ఏర్పాటుచేసి ప్రజలకు తాగునీరు అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రంమలో ట్రస్ట్ నిర్వాహకులు రామ్ ప్రముఖ్‌రెడ్డి, పందిళ్లపల్లి శకుంతలమ్మ, కొండారెడ్డి, మోహన్‌రెడ్డి, హరి తదితరులు పాల్గొన్నారు. -
ఏకొల్లులో అదుపులోకి జ్వరాలు
దొరవారిసత్రం: ఏకొల్లు ఎస్సీ కాలనీలో ఎట్టకేలకు జ్వరాలు అదుపులోకి వచ్చాయి. మంగళవారం పీఓడీటీ(ప్రోగామ్ ఆఫీసర్ ఆఫ్ డిస్ట్రిక్ట్ ట్రైనింగ్) రమాదేవి వైద్యాధికారులతో కలిసి ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో పర్యటించారు. ప్రజల ఆరోగ్యంపై ఆరా తీశారు. జ్వరాలు పూర్తిగా అదుపులోకి వచ్చినట్లు ఆమె తెలిపారు. ఇకపై ప్రజలు స్థానికులు నిర్లక్ష్యంగా వ్యవహరించుకుండా ఇళ్లతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. పౌష్టికాహారాన్ని మాత్రమే తినాలన్నారు. వారంలో రెండు రోజులు డ్రైడే పాటిస్తే ఎవరూ అనారోగ్యానికి గురికారని అవగాహన కల్పించారు. కాలనీల్లో దోమలను అరికట్టేందుకు తీసుకుంటున్న చర్యలను స్థానికులకు వివరించారు. మొత్తం 113 మంది జ్వరాల బారిన పడ్డారని, వీరిలో ముగ్గురికి డెంగీగా నిర్ధారణ అయిందన్నారు. ప్రస్తుతం అందరూ కోలుకున్నారని రమాదేవి చెప్పారు. ఆమె వెంట వైద్యాధికారులు భాస్కర్‌రెడ్డి, వికాస్, సిబ్బంది ఉన్నారు. -
వైద్యశిబిరానికి విశేష స్పందన
కొరుక్కుపేట, న్యూస్‌లైన్: నగరంలోని ఎస్వీ బోన్ అండ్ జాయింట్ ఆస్పత్రి నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభిం చింది. చెన్నై కోడంబాక్కంలోని ఎస్. వి.బోన్ అండ్ జాయింట్ ఆస్పత్రి నిర్వాహకులు, చీఫ్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ ఎస్.వి సత్యనారాయణ ఆధ్వర్యంలో ఆదివారం ఆస్పత్రి ఆవరణలో ఉచిత వైద్య చికిత్స శిబిరం జరిగింది. ఈ సందర్భంగా శిబిరంలో పాల్గొన్న వారికి బోన్ మినరల్ డెన్సిటీ (బీఎండీ) పరీక్షలు చేశారు. 40 ఏళ్లు పైబడిన వారికి బీఎండీ వైద్య పరీక్షలు ఉచితంగా నిర్వహించినట్లు సత్యనారాయణ పేర్కొన్నారు. ఉచిత వైద్య శిబిరంలో ఆస్పత్రి వైద్యులు డాక్టర్ సందీప్, డాక్టర్ షాలినీ, డాక్టర్ వంశీకృష్ణ పాల్గొన్నారు. వైద్యశిబిరంలో 80 మందికి బీఎండీ పరీక్షలు చేసినట్లు వైద్యులు పేర్కొన్నారు. ఉచిత వైద్యశిబిరానికి హాజరైన వారికి ఉచిత మందులు కూడా ఉచితంగా అందించినట్లు డాక్టర్ ఎస్.వి.సత్యనారాయణ పేర్కొ న్నారు.