త్వరలో మెడికల్ క్యాంప్
త్వరలో మెడికల్ క్యాంప్
Published Tue, Aug 2 2016 12:22 AM | Last Updated on Sat, Jul 6 2019 12:42 PM
ఎన్‌ఆర్‌ఐ రవీంద్రనాథ్‌రెడ్డి
అనుమసముద్రంపేట : శ్రీ సీతారామ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అనుమసముద్రంలో త్వరలో మెడికల్ క్యాంప్ నిర్వహించనున్నట్లు ఎన్‌ఆర్‌ఐ పందిళ్లపల్లి రవీంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. సోమవారం ఆయన గ్రామంలో ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మించిన శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో పూజలుచేశారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో మొక్కలునాటారు. అనంతరం మాట్లాడుతూ ఇప్పటికే మినరల్ వాటర్‌ప్లాంట్ ఏర్పాటుచేసి ప్రజలకు తాగునీరు అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రంమలో ట్రస్ట్ నిర్వాహకులు రామ్ ప్రముఖ్‌రెడ్డి, పందిళ్లపల్లి శకుంతలమ్మ, కొండారెడ్డి, మోహన్‌రెడ్డి, హరి తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement