anuma samudram peta
-
భూపరిహారం అందించాలి
ఉత్తర కాలువ పనులను అడ్డుకున్న రైతులు అనుమసముద్రంపేట: సోమశిల ఉత్తర కాలువకు సేకరించిన భూములకు పరిహారం వెంటనే అందజేయాలని ఏఎస్‌పేట మండల రైతులు డిమాండ్ చేశారు. ప్రభుత్వం భూ పరిహారం అందించకుండా ఉత్తర కాలువ పనులు చేపట్టడంపై అక్బరాబాదు, కూనలమ్మపాడు రైతులు బుధవారం ఉత్తర కాలువ పనులను అడ్డుకుని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉత్తర కాలువకు రెండేళ్ల క్రితం భూసేకరణ జరిపినట్లు చెప్పారు. ఇప్పటి వరకు పరిహారం అందజేయలేదని తెలిపారు. పరిహారం అందజేయకుండా పనులు చేపడుతూ ప్రభుత్వం మోసం చేస్తుందని ఆరోపించారు. కలెక్టర్ హామీ ఇస్తేనే పనులు జరగనిస్తామన్నారు. ఈ ఆందోళనలో పార్టీలకు అతీతంగా రైతులు పాల్గొన్నారు. -
త్వరలో మెడికల్ క్యాంప్
ఎన్ఆర్ఐ రవీంద్రనాథ్‌రెడ్డి అనుమసముద్రంపేట : శ్రీ సీతారామ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అనుమసముద్రంలో త్వరలో మెడికల్ క్యాంప్ నిర్వహించనున్నట్లు ఎన్ఆర్ఐ పందిళ్లపల్లి రవీంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. సోమవారం ఆయన గ్రామంలో ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మించిన శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో పూజలుచేశారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో మొక్కలునాటారు. అనంతరం మాట్లాడుతూ ఇప్పటికే మినరల్ వాటర్‌ప్లాంట్ ఏర్పాటుచేసి ప్రజలకు తాగునీరు అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రంమలో ట్రస్ట్ నిర్వాహకులు రామ్ ప్రముఖ్‌రెడ్డి, పందిళ్లపల్లి శకుంతలమ్మ, కొండారెడ్డి, మోహన్‌రెడ్డి, హరి తదితరులు పాల్గొన్నారు. -
నరకప్రాయం గ్రామీణ రహదారులు
అనుమసముద్రంపేట : గ్రామీణ రహదారులు వాహనచోదకులుకు నరకం చూపుతున్నాయి. మండలంలోని 19 పంచాయతీల పరిధిలో ఉన్న రోడ్లు గత కొన్ని సంవత్సరాలుగా మరమ్మతులకు నోచుకోక గుంతలమయమై రాకపోకలు సాగించలేని విధంగా ఉన్నాయి. మండలంలోని సీబీవరం నుంచి ఆత్మకూరు–వింజమూరు రోడ్డు బాగోలేకపోవడంతో ఈ మూడు కిలోమీటర్లున్న ఈ రహదారిపై వెళ్లాలంటే అరగంటకుపైగా సమయం పడుతుంది. దీంతో చాలామంది ప్రత్యామ్నాయంగా పొలాల గుండా వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. అదేవిధంగా కావలియడవల్లి నుంచి సంగం – కలిగిరి రోడ్డు వరకు, వేల్పుల గుంట నుంచి కలిగిరి – సంగం రోడ్డు వరకు ఉన్న రహదారులు రాళ్లు లేచి గుంతలు పడి ప్రయాణికులకు చుక్కలు చూపుతున్నాయి. కావలియడవల్లికి వెళ్లే మార్గంలో ఉన్న రెండు కల్వర్టులు రోడ్డు మధ్యలో కూలిపోయి రంధ్రాలు పడ్డాయి. దీంతో కొత్తగా ఆ ప్రాంతంలో తిరిగేవారు ప్రమాదాలకు గురవుతున్నారు. మాటలకే పరిమితం : గుంపర్లపాడు, అగ్బరాబాదు, కుప్పురుపాడు, కొండమీదకొండూరు గ్రామాలకు వెళ్లే రహదారులు గుంతలమయంగా ఉన్నాయి. గత సంవత్సరం నవంబరులో వచ్చిన తుపానుకు ముందు అరకొరగా ఉన్న గుంతలు తుపాను అనంతరం మరింత పెద్దవిగా మారాయి. ఏఎస్‌పేట నుంచి పందిపాడుకు వెళ్లే నాలుగు కిలోమీటర్ల రోడ్డు ఆ సమయంలో తీవ్రంగా దెబ్బతింది. తుపాను అనంతరం రోడ్లకు మరమ్మతులు చేయిస్తామని చెప్పిన టీడీపీ నాయకులు పట్టించుకోలేదనే విమర్శలున్నాయి. అధికారులు సైతం నిధులు లేవనే సాకు చూపుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి రోడ్లకు మరమ్మతులు చేయించాలని వాహనచోదకులు కోరుతున్నారు. ప్రతిపాదనలు పంపాం : శ్రీనివాసులు, ఏఈఈ, పీఆర్, ఏఎస్‌పేట మండలంలోని గ్రామీణ రోడ్లు గత కొంతకాలంగా మరమ్మతులకు నోచుకోని విషయం వాస్తవమే. పలు పర్యాయాలు నివేదికలు పంపించాం. ఇటీవల రూ.1.8 కోట్లతో ప్రతిపాదనలు పంపించాం. నిధులు విడుదలైతే పనులు చేపడుతాం. -
జిల్లాలో రూ.240 కోట్ల విద్యుత్ బకాయిలు
అనుమసముద్రంపేట, న్యూస్‌లైన్: జిల్లాలో రూ.240 కోట్ల విద్యుత్ బకాయిలు ఉన్నాయని ట్రాన్స్‌కో ఎస్ఈ నాగశయనరావు తెలిపారు. సోమవారం ఆయన ఏఎస్‌పేటలోని 33/11 విద్యుత్ సబ్‌స్టేషన్‌ను పరిశీలించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో ప్రభుత్వరంగంలో రూ.190 కోట్లు, ప్రైవేట్ సంస్థలు, కాలనీలు, గృహాలకు సంబంధించిన రూ.50 కోట్ల బకాయిలు పేరుకుపోయాయన్నారు. ఎస్సీ, ఎస్టీకాలనీల్లోని దళితులు వారి కులం సర్టిఫికెట్లను ఇవ్వాలని కోరారు. అందువల్ల ప్రభుత్వం ఇచ్చే 50 యూనిట్ల రాయతీ వారికి వర్తిస్తుందని తెలిపారు . రైతులు ఏడు గంటల పాటు విద్యుత్ అందజేసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. అందుకుగానూ ప్రతి బుధవారం ఫ్యాక్టరీలకు పవర్ హాలిడే ఇస్తున్నామన్నారు. జిల్లాకు 11 మిలియన్ యూనిట్ల అవసరం ఉందని, 9.48 మిలియన్ యూనిట్ల మాత్రమే అందుతుందన్నారు. దీంతో కోతలు అనివార్యమయ్యాయన్నారు. ఏఎస్‌పేటలోని దర్గాకు ప్రతి శుక్రవారం వేలాది మంది భక్తులు వస్తుంటారని, విద్యుత్ కోతలతో నీటికి ఇబ్బందులు పడతారని, శుక్రవారం విద్యుత్ కోతలు లేకుండా చూడాలని స్థానికులు ఆయన దృష్టికి తేవడంతో అందుకు ఆయన స్పందించారు. నీటి కొరత లేకుండా అదనంగా విద్యుత్ ఇవ్వాలని డీఈని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు డీఈ ఆదిశేషయ్య, ఏడీఈ బాలాజీ, ఏఈ గుమ్మా శ్రీనివాసులు, లైన్ ఇన్స్పెక్టర్ ధనుంజయ, లైన్మెన్లు, జేఎల్ఎంలు పాల్గొన్నారు.