ఫస్ట్‌ఎయిడ్‌ ఏబీసీడీలు | First Aid Has Many Benefits Some Times | Sakshi
Sakshi News home page

ఫస్ట్‌ఎయిడ్‌ ఏబీసీడీలు

Published Mon, Nov 11 2019 1:40 AM | Last Updated on Mon, Nov 11 2019 1:40 AM

First Aid Has Many Benefits Some Times - Sakshi

చాలా సందర్భాల్లో ఫస్ట్‌ ఎయిడ్‌ వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి. అది ఎన్నో ప్రాణాలను కాపాడగలుగుతుంది. ఫస్ట్‌ ఎయిడ్‌ మీద మనమందరమూ అవగాహన కలిగి ఉండటం ఎంతో మంచిది.  అందుకు ఉపకరించేదే ఈ కథనం.

ఏదైనా ఓ అనుకోని సంఘటనతోనో, అకస్మాత్తుగా రుగ్మతతోనో రోగికి చికిత్స అవసరమైనప్పుడు వైద్య శిక్షణ అంతగా లేని మామూలు వ్యక్తులు చేసే తొలి ఆరోగ్య సేవను ప్రథవు చికిత్సగా చెబుతారు. ఆ క్షణాన అవసరమైన సేవ అందించడం ద్వారా రోగి పరిస్థితి వురింత విషమించకుండా చేయడం ఇందులో సాధ్యమవుతుంది. అలాగే ఆ సమయానికి అందించిన ఆ తొలి చికిత్సే ప్రాణాలు కాపాడటంలో కీలక భూమిక పోషిస్తుంది.

ప్రథవు చికిత్స ఏబీసీడీలు...
ఏదైనా ప్రక్రియలో ఏబీసీడీలు అంటే... ప్రాథమిక అంశాలని అర్థం. కాని ఫస్ట్‌ ఎయిడ్‌లో ఏ,బీ,సీ,డీలను గుర్తుంచుకుంటే చికిత్స చాలా సులువవుతుంది. తద్వారా మామూలు వ్యక్తులు కూడా చికిత్స ప్రాధాన్యాన్ని గుర్తుపెట్టుకోవడానికి వీలవుతుంది. అలాగే దాన్ని అందించడమూ సులువవుతుంది. ఇక్కడి ఏ, బీ, సీ లు ప్రథమ చికిత్సలోని కొన్ని ఇంగ్లిషు మాటలకు సంక్షిప్త రూపాలు. అవి...

►ఏ  అంటే... ఎయిర్‌ వే   గాలి పీల్చే వూర్గంలో అవాంతరం లేకుండా చూడటం
►బీ  అంటే... బ్రీతింగ్‌... శ్వాస సరిగ్గా తీసుకునేలా చూడటం
►సీ  అంటే... సర్క్యులేషన్‌... అంటే రక్తస్రావం అవ#తుంటే ఆపి... రక్త ప్రవాహ వ్యవస్థ (సర్క్యులేషన్‌) సక్రవుంగా సరిగ్గా జరిగేలా చూడటం.

డీ అంటే ..డెడ్లీ బ్లీడింగ్‌ / డీఫైబ్రిలేషన్‌ ఉదాహరణకు... ఓ వ్యక్తి స్పృహ తప్పి పడిపోయి ఉన్నట్లు అనిపించింది. సాధారణంగా స్పృహ తప్పిన వ్యక్తుల నాలుక వెనక్కువెళ్లవచ్చు. దాంతో అది  శ్వాసతీసుకునే వూర్గాన్ని అడ్డుకుంటుంది. అందుకే పడుకున్న భంగివులోనే ఉన్న రోగి గదవును ఎత్తుగా ఉండేలా... తలను కాస్తంత పైకెత్తినట్లుగా పడుకోబెడితే శ్వాస తీసుకునే వూర్గానికి ఎలాంటి అడ్డు లేకుండా ఉంటుంది. ఇదే... మొదటి ఏ. అంటే ఎయిర్‌వేలో అంతరాయం లేకుండా చూడటం.

అలా చేశాక... రోగికి శ్వాస అందేట్లు చేయడం, తగినంత గాలి ఆడేలా చూడటం ప్రధానం. దీన్ని బ్రీతింగ్‌లోని మొదటి అక్షరం ‘బి’తో సూచిస్తారు. ఇక రక్తస్రావం అవతుంటే ఆపడం... అంటే సర్క్యులేషన్‌ సక్రవుంగా జరిగేలా చూడటం ఆ తర్వాతి ప్రాధాన్య అంశం. దీన్నే ఇంగ్లిష్‌ అక్షరమైన ‘సి’తో సూచిస్తారు. ఇక వురికొందరు ‘డి’ అనే అక్షరాన్ని కూడా చేర్చి– డెడ్లీ బ్లీడింగ్‌ లేదా డీఫైబ్రిలేషన్‌ అని కూడా అంటారు. అయితే వురికొందరు ఏబీసీలు చాలనీ... డి అనే ఆ వూట ‘సి’– సర్క్యులేషన్‌లోనే భాగవుని అంటారు.

ఇంకొందరు ప్రథవు చికిత్స ప్రిన్సిపుల్స్‌ చెబుతూ ఈ ప్రక్రియలో వుూడు ‘బి’లపై దృష్టినిలపాలని చెబుతుంటారు. అవి... బ్రీతింగ్‌ (శ్వాస), బ్లీడింగ్‌ (రక్తస్రావం), బోన్స్‌ (ఎవుుకలు). అంటే... శ్వాసక్రియ చక్కగా జరిగేలా చూడటం, రక్తస్రావాన్ని అరికట్టడం, ఎవుుకలకు ఏదైనా ప్రవూదం జరిగిందేమో చూడటం... ఈ మూడూ ∙ప్రథవు చికిత్సలోని ప్రాథమిక ప్రాణరక్షణ  (బేసిక్‌ లైఫ్‌ సపోర్ట్‌) అంశాలని చెబుతారు.

ఫస్ట్‌ ఎయిడ్‌ ఎలా చేసుకోవచ్చు/చేయవచ్చు...
►కాళ్లు వుడతపడటం/మెలికపడటం వల వాస్తే... వాచిన చోట ఐస్‌ పెట్టాలి. స్ప్రెయిన్‌ అయిన కాలిని వీలైనంతగా కదిలించకుండా రెస్ట్‌ ఇవ్వాలి.
►ముక్కు నుంచి రక్తస్రావం అవ#తుంటే... చూపుడువేలు, బొటనవేలు సాయంతో వుుక్కుపై కాస్తంత ఒత్తిడి పెట్టి ఓ పదినిమిషాలు గట్టిగా పట్టుకోవాలి. దీని వల్ల రక్తస్రావం ఆగిపోతుంది.
►చెవిలో ఏదైనా దూరితే... చెవిలోకి టార్చిలైట్‌ వేయాలి. కాంతికి ఆకర్షితం కావడం కీటకాలకు ఉండే సహజమైన ఇన్‌స్టింక్ట్‌. అలా అది  ఆ వెలుగుకు ఆకర్షితమై బయటకు వచ్చే అవకాశాలుంటాయి. అలాగే చెవిని శుభ్రమైన నీటితో (ప్లెయిన్‌వాటర్‌తో)  కడగాలి. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. చెవిలో కొబ్బరినూనె వంటి జిడ్డుగా ఉండే  పదార్థాలు వూత్రం అస్సలు వేయకూడదు. అది చెవి ఇన్ఫెక్షన్‌కు దారితీసి, మరింత ప్రమాదం తెచ్చిపెడుతుంది.
►వాంతులు, విరేచనాలు అవ#తుంటే శరీరం ద్రవపదార్థాలనూ, లవణాలను కోల్పోకుండా తగినన్ని కాస్తంత ఉప్పూ, చారెడు పంచదార కలిపిన నీళ్లు తాగాలి.  కొబ్బరినీళ్లు, పప్పుపై ఉండే పల్చటి తేట తాగడం కూడా బాగానే ఉపకరిస్తుంది. ఇప్పుడు ఈ ప్రక్రియకు బదులు మెడికల్‌ షాపుల్లో దొరికే ఓఆర్‌ఎస్‌నే వాడుతున్నారు. ఎందుకంటే ఒకవేళ మనం ఉప్పు, పంచదార కలిపిన నీళ్లలో ఏవైనా కాలుష్యాలు ఉంటే అది రోగిని మరింత దిగజార్చే అవకాశాలుంటాయి కాబట్టి రెడీమేడ్‌గా దొరికే ఓఆర్‌ఎస్‌నే వాడటం మంచిది.
►యాక్సిడెంట్‌ రోగులైతే...  ప్రవూదం వల్ల అవ#తున్న  రక్తస్రావాన్ని ఆపేందుకు గుడ్డను అడ్డుగా పెట్టడం. రక్తం పోకుండా చూడటం వుుఖ్యం.
►కుక్క కరచిన సందర్భంలో నీళ్లను ఓ ప్రవాహంలా వదులుతూ సబ్బుతో గాయాన్ని కడగాలి.
►కాలిన గాయాలైతే... వాటిపైనుంచి నీళ్లు  ధారగా వెళ్లేలా 10 నిమిషాల పాటు చూడాలి. అలా నీళ్లు ప్రవాహంలా వెళ్లేలా చూస్తే కణజాలం (టిష్యూలు)  వురింతగా చెడకుండా ఉంటాయి. అంతేకాదు... బొబ్బలను ఏవూత్రం చిదపకూడదు.
►జ్వరంతో ఒళ్లు కాలిపోతుంటే... నుదుటిపై తడిగుడ్డతో అద్దుతూ ఉండాలి. ఒంట్లోని ఉష్ణోగ్రతను గ్రహించి, ఆ తడిగుడ్డలోని నీరు ఆవిరవుతూ ఉండటం వల్ల దేహ ఉష్ణోగ్రత క్రమంగా తగ్గేందుకు అవకాశం ఉంది.
►పాము కరచిన సందర్భంలో రోగికి తొలిసాయంగా ఆత్మస్థైర్యం కలిగించడం వుుఖ్యం. ఇక పావుు కాటేసిన ఆ కాలు లేదా చేతిని వీలైనంతగా కదపకుండా చూడటం వుుఖ్యం. కదలికలు ఎంత ఎక్కువగా ఉంటే విషం రక్తంలో కలిసే వేగం కూడా పెరుగుతుంది. కాబట్టి వీలైనంతగా ప్రశాంతంగా, కదలికలు లేకుండా చూడటం వుుఖ్యం. వీలైనంత త్వరగా ఆసుపత్రికి తరలించాలి. అంతేతప్ప సినిమాల్లో చూపినట్లుగా పాముకరచిన చోట గాటుపెట్టి రక్తం బయటకు పీల్చి ఉమ్మేయడం వంటి టెక్నిక్‌లను అనుసరించకూడదు. ఇక గుండెపోటు వచ్చి గుండె ఆగిన సందర్భాల్లో కార్డియో పల్మునరీ రీసుసీయేషన్‌ (సీపీఆర్‌) అనే ప్రథమచికిత్స చేసి రోగి ప్రాణాలు కాపాడవచ్చు. అయితే దీనికి కొద్దిపాటి శిక్షణ అవసరమవుతుంది. అలాంటి శిక్షణ పొందినవారు ఎవరైనా ఉంటే రోగికి సీపీఆర్‌ చేస్తూ ఆసుపత్రికి తరలించాలి. లేదా అంబులెన్స్‌లో పీసీఆర్‌ చేస్తూనే ఆసుపత్రికి తీసుకురావాలి. ఇలా సీపీఆర్‌తో కూడా చాలా ప్రాణాలను కాపాడేందుకు అవకాశం ఉంది. ఇది చాలా సింపుల్‌ టెక్నిక్‌ కాబట్టి ఆసక్తి ఉన్నవారు కొద్దిపాటి శిక్షణతో దీన్ని చేయవచ్చు.

అన్ని చోట్లా ఫస్ట్‌ ఎయిడ్‌ పనిచేయదు...
ఏదైనా ప్రవూదమో, అత్యవసర పరిస్థితో ఏర్పడినప్పుడు మెుదటి అరగంటను ప్లాటినం క్షణాలనీ, రెండో అరగంటను బంగారు క్షణాలనీ (గోల్డెన్‌ మెుమెంట్స్‌), ఆ తర్వాతి గంటను (సిల్వర్‌ మొమెంట్స్‌) అని అంటారు. అంతే... రోగికి ఎంత త్వరగా చికిత్స అందితే దాన్ని బట్టే అతడు కోలుకునే సవుయంలో వచ్చే (రికవరీ) సవుస్యలు అంతగా తగ్గుతాయి. గుండెపోటు వచ్చిన సందర్భాల్లో కొందరు అది గ్యాస్‌ వల్ల కావచ్చు అనుకొని నిర్లక్ష్యం చేసి సవుయం దాటిపోయాక ఆసుపత్రికి తీసుకొస్తే పరిస్థితి వురింత జటిలం కావచ్చు. అందుకే అది గ్యాస్‌ వల్ల వచ్చిన సవుస్యా లేక నిజంగానే హార్ట్‌ ప్రాబ్లవూ అన్నది డాక్టర్‌ నిర్ణయిస్తారు.

ఇది డాక్టర్‌ మాత్రమే తీసుకునే నిర్ణయమని గుర్తుంచుకోవాలి. అదే పక్షవాతం (స్ట్రోక్‌) విషయంలో కూడా వర్తిస్తుంది. ఓ నిర్ణీతమైన సవుయంలోనే మెదడులో గడ్డకట్టిన రక్తాన్ని తొలగించే ఇంజెక్షన్‌ ఇస్తేనే అది సత్ఫలితం ఇస్తుంది.  అందుకే అలాంటి సంక్లిష్టసవుయాల్లో అన్ని వసతులు ఉన్న ఆసుపత్రులకు వెళ్లడం వుంచిది. అదే సౌకర్యాలు లేని చోటికి వెళ్తే... ఒక డాక్టర్‌ నుంచి వురో డాక్టర్‌ వద్దకూ ఓ ఆసుపత్రి నుంచి వురో ఆసుపత్రికీ తిరుగుతూ విలువైన ఆ సవుయాన్ని కాస్తా అలా తిరగడంలోనే వృథా చేస్తే అవుూల్యమైన కాలం కాస్తా గడిచిపోయి పరిస్థితి వురింత విషమించే అవకాశం ఉంటుంది.

డా. శివనారాయణరెడ్డి వెన్నపూస సీనియర్‌ పీడియాట్రీషియన్‌
అండ్‌ నియోనేటాలజిస్ట్‌ రెయిన్‌బో చిల్డ్రన్స్‌ హాస్పిటల్స్, సికింద్రాబాద్

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement