ఏకొల్లులో అదుపులోకి జ్వరాలు
Published Wed, Jul 27 2016 12:20 AM | Last Updated on Mon, Sep 4 2017 6:24 AM
దొరవారిసత్రం: ఏకొల్లు ఎస్సీ కాలనీలో ఎట్టకేలకు జ్వరాలు అదుపులోకి వచ్చాయి. మంగళవారం పీఓడీటీ(ప్రోగామ్ ఆఫీసర్ ఆఫ్ డిస్ట్రిక్ట్ ట్రైనింగ్) రమాదేవి వైద్యాధికారులతో కలిసి ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో పర్యటించారు. ప్రజల ఆరోగ్యంపై ఆరా తీశారు. జ్వరాలు పూర్తిగా అదుపులోకి వచ్చినట్లు ఆమె తెలిపారు. ఇకపై ప్రజలు స్థానికులు నిర్లక్ష్యంగా వ్యవహరించుకుండా ఇళ్లతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. పౌష్టికాహారాన్ని మాత్రమే తినాలన్నారు. వారంలో రెండు రోజులు డ్రైడే పాటిస్తే ఎవరూ అనారోగ్యానికి గురికారని అవగాహన కల్పించారు. కాలనీల్లో దోమలను అరికట్టేందుకు తీసుకుంటున్న చర్యలను స్థానికులకు వివరించారు. మొత్తం 113 మంది జ్వరాల బారిన పడ్డారని, వీరిలో ముగ్గురికి డెంగీగా నిర్ధారణ అయిందన్నారు. ప్రస్తుతం అందరూ కోలుకున్నారని రమాదేవి చెప్పారు. ఆమె వెంట వైద్యాధికారులు భాస్కర్‌రెడ్డి, వికాస్, సిబ్బంది ఉన్నారు.
Advertisement