'లైట్‌హౌస్ పేరెంటింగ్'..పదంలోనే ఉంది మార్గదర్శకం అని. అంటే..లైట్‌హౌస్ అనేది సముద్రంలో ఉంటుంది. ఇది పెద్ద పెద్ద ఓడలకు, పడవలకు ఓ దిక్సూచిలా ఉంటుంది. అలానే ఈ పేరెంటింగ్ విధానంతో పిల్లలు ప్రయోజకులుగా మారతారాని చెబుతున్నారు నిపుణులు.. అయితే ఈ విధానంలో పిల్లలు చాలా స్వతంత్రంగా ఉంటారు. మరీ ఇంత స్వతత్రంగా ఉంటే చేజారిపోయే అవకాశం ఉంటుదనే సందేహానికి తావివ్వకండి. ఎందుకంటే ఈ పేరెంటింగ్ విధానం వల్ల బాధ్యతయుతమైన పిల్లలుగా ఎదుగుతారని దీమాగా చెబుతున్నారు నిపుణులు. ఇంతకీ ఏంటి లైట్‌హౌస్ పేరెంటింగ్? బాధ్యతయుతంగా పెరిగేందుకు ఎలా ఉపయోగపడుతుంది..?
అంటే..ఈ విధానంలో తల్లిదండ్రులు తమ పిల్లలను స్వతంత్రంగా ఎదిగేలా చేస్తారు. ఎక్కడ వారిని నియంత్రించారు. స్నేహంగా మెలుగుతారు. ఇక్కడ తల్లిదండ్రులు పిల్లలకు వచ్చిన ప్రతి సమస్యను తమకు తామే పరిష్కరించుకునేలా దిశా నిర్దేశాం చేస్తారేగానీ జోక్యం చేసుకోరు. సవాళ్లను అధిగమించడం ఎలా అనేది అనుభవపూర్వకంగా తెలుసుకునేలా చేస్తారు. ఈ టైపు తల్లిదండ్రులు తమ పిల్లలకు స్పష్టమైన పరిమితులు, సరిహద్దులను ఏర్పాటు చేస్తారు. ప్రపంచం నుంచి తనంతట తానుగా ఎలా అభివృద్ధి చెందాలో గైడెన్స్ ఇస్తారు.
అంతేగాదు ఈ విధానంలో పిల్లలు తమ ఆత్మగౌరవానికి ప్రాముఖ్యత ఇవ్వడం తెలుసుకుంటారు. అలాగే తల్లిదండ్రులతో ఓపెన్ కమ్యునికేషన్ చేయగలరు. ప్రతి విషయం తమ తల్లిదండ్రులకు తెలియజేయడం మంచిదనే ఆటిట్యూడ్ వస్తుంది పిల్లలకి. తాము పరిష్కరించలేని సమస్యను తల్లిదండ్రుల వద్ద చర్చించి సరిచేసుకుంటారు. వాళ్లకంటూ ఓ అభిప్రాయలు, ఉన్నతభావాలతో ఉంటారు. ఆత్మవిశ్వాసంతో ముందకు సాగుతారు.
అలాగే అనుకున్న వెంటనే కొన్ని పనులు అవ్వవనే విషయం అనుభవ పూర్వకంగా తెలుసుకుంటారు. ఓపిక, సహనంతో వ్యవహరించడం అలవాటవ్వుతుంది. ఈ పేరెంటింగ్ విధానం వల్ల పిల్లలు ప్రమాదాల బారినపడటం అనేది అరుదని కూడా చెప్పొచ్చు. అయితే ఈ పేరెంటింగ్ విధానంలో పిల్లలతో తల్లిదండ్రులు ఎలా వ్యవహరించాలి అంటే..
తల్లిదండ్రులు ఎలా నడుచుకోవాలంటే..
పిల్లలతో స్నేహభావంతో మాట్లాడటం వంటివి చేయాలి. విసిగిస్తున్నా ఓ చిరునవ్వుతో మందలిస్తన్నట్లుగా చెప్పాలి. ఇలా చేస్తే తన అమ్మకి తనంటే ఇష్టం అనే బలమైన నమ్మకం ఉంటుంది. ఇలా ఉంటే ఏ విషయమైన మీతో ధైర్యగా చెబుతారు. భయం అనే పదం దూరం అవుతుంది. తల్లిదండ్రులంటే నా శ్రేయోభిలాషులనే గట్టి ఫీలింగ్, మంచి బాండ్ ఉంటుంది. సమస్యలను, సవాళ్లను ఎలా హ్యాండిల్ చేయాలో సూచించాలే తప్ప తల్లిందడ్రులే తలకెత్తుకునే పని చేయకూడదు.
అలాగే వాళ్లు సాధించిన ప్రతి విజయాన్ని సెలబ్రేట్ చేయడం, అభినందించడం వంటివి చేయాలి. అలాగే ఓడిపోయినా, వెనుకబడినా..భుజం తట్టి భరోశా ఇస్తూ ముందడుగు వేసేలా చేయాలి. ముఖ్యంగా నలుగురితో కలిసి ఉండటం ఏంటనేది తెలియజేయాలి. తమ నిర్ణయాలను తాము తీసుకునేలా స్వేచ్ఛగా బతకడం నేర్పిస్తే..ప్రతి అంశాన్ని సమాజం నుంచే సహజంగా నేర్చకుంటారు, వంటబట్టించుకుంటారు. ఇలా వ్యవహరిస్తే తల్లిందడ్రులు పిల్లల మధ్య మంచి బలమైన బాండింగ్ ఏర్పడుతుంది. అలాగే బాధ్యతయుతమైన పిల్లలుగా పెరగడమే కాకుండా గొప్ప ప్రయోజకులవుతారని చెబుతున్నారు. ఇంకెందుకు ఆలస్యం తల్లిదండ్రులు మీ పిల్లలతో ఇలానే ప్రవర్తిస్తున్నారో లేదో చెక్ చేసుకోండి.
(చదవండి: పారిస్ ఫ్యాషన్ వీక్‌లో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన హ్యాండ్ బ్యాగ్! అన్ని కోట్లా..!)
Comments
Please login to add a commentAdd a comment