సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ నుంచి భద్రాచలం.. అక్కడి నుంచి పాపికొండలకు కొత్త ప్యాకేజీని ప్రారంభించనున్నట్లు తెలంగాణ పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా తెలిపారు. ఈ ప్యాకేజీకి ప్రభుత్వం నుంచి శనివారమే అనుమతి లభించిందన్నారు. వచ్చేవారం నుంచి పర్యటన ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. ఈ పర్యటన ప్యాకేజీ పెద్దలకు రూ.4,999, పిల్లలకు రూ.3,999 చొప్పున ఉంటుంది.
చదవండి: Medak CSI Church: మెతుకు పంచిన కోవెల.. ప్రత్యేకతలకు నిలయం..
పర్యటన ఇలా...
మొదటి రోజు సాయంత్రం 7 గంటలకు పర్యాటక భవన్ నుంచి రాత్రి 8 గంటలకు బషీర్‌బాగ్ లోని పర్యాటక కార్యాలయం నుంచి బస్సు బయలుదేరుతుంది. రెండో రోజు ఉదయం 5 గంటలకు భద్రాచలంలోని హరిత హోటల్‌కు, 7.30కు పోచారం బోటింగ్ పాయింట్‌కు చేరుకుంటారు. 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పాపికొండలు, పేరంటాళ్లపల్లికి బోటింగ్.
ఈ సమయంలోనే భోజనం, స్నాక్స్ అందజేస్తారు. సాయంత్రం 5 గంటలకు బయలుదేరి భద్రాచలం చేరుకుంటారు. మూడో రోజు ఉదయం 7 నుంచి 8 గంటల వరకు ఆలయ దర్శనం. 11.30 గంటల వరకు పర్ణశాల సందర్శన, అనంతరం తిరిగి హరిత హోటల్‌కు చేరుకుంటారు, మధ్యాహ్నం భోజనం అనంతరం 2.30 గంటలకు భద్రాచలం నుంచి బయలుదేరి రాత్రి 10.30 గంటలకు హైదరాబాద్ చేరుకుంటారు.
Comments
Please login to add a commentAdd a comment