New packages
-
Union Budget 2023: బడ్జెట్ చరిత్రలో.. తొలిసారిగా వాళ్ల కోసం ప్యాకేజీ
సాక్షి, ఢిల్లీ: దేశ బడ్జెట్లో మొట్టమొదటిసారిగా ఓ కొత్త ప్యాకేజీని ప్రవేశపెట్టింది కేంద్రం. పీఎం విశ్వ కర్మ కౌశల్ సమ్మాన్ పేరుతో ఆ ప్యాకేజీని తీసుకురాబోతున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. బడ్జెట్ ప్రసంగం సందర్భంగా ప్రకటించారు. అమృత కాల బడ్జెట్లో భాగంగా.. పీఎం విశ్వ కర్మ కౌశల్ సమ్మాన్‌ను తీసుకొస్తున్నట్లు మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. సంప్రదాయ కళాకారులు, హస్తకళాకారులను ఉద్దేశించి ఈ ప్యాకేజీ తీసుకురాబోతున్నట్లు ఆమె వెల్లడించారు. ఎంఎస్ఎంసీ(సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ) వాల్యూ చెయిన్‌తో అనుసంధానం చేయడం ద్వారా.. వాళ్ల ఉత్పత్తుల నాణ్యత మెరుగు పర్చడం, క్షేత్రస్థాయిలో అవి వెళ్లే పరిస్థితి మెరుగుపరచడం సాధ్యమవుతుందని, ఆ ఉద్దేశంతోనే ఈ ప్యాకేజీ తీసుకురాబోతున్నట్లు ఆమె ప్రకటించారు. అయితే ఆ ప్యాకేజీ ఏమేర ఉండబోనుందనేది అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది. PM Vishwa Karma Kaushal Samman For the first time package of assistance for traditional artisans and craftspeople has been conceptualized, which will enable them to improve the quality, scale, and reach of their products, integrating with the MSME value chain#AmritKaalBudget pic.twitter.com/u2m4k6wAls — PIB India (@PIB_India) February 1, 2023 -
Tourism: భద్రాచలం, పాపికొండలు చూసొద్దాం రండి..
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ నుంచి భద్రాచలం.. అక్కడి నుంచి పాపికొండలకు కొత్త ప్యాకేజీని ప్రారంభించనున్నట్లు తెలంగాణ పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా తెలిపారు. ఈ ప్యాకేజీకి ప్రభుత్వం నుంచి శనివారమే అనుమతి లభించిందన్నారు. వచ్చేవారం నుంచి పర్యటన ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. ఈ పర్యటన ప్యాకేజీ పెద్దలకు రూ.4,999, పిల్లలకు రూ.3,999 చొప్పున ఉంటుంది. చదవండి: Medak CSI Church: మెతుకు పంచిన కోవెల.. ప్రత్యేకతలకు నిలయం.. పర్యటన ఇలా... మొదటి రోజు సాయంత్రం 7 గంటలకు పర్యాటక భవన్ నుంచి రాత్రి 8 గంటలకు బషీర్‌బాగ్ లోని పర్యాటక కార్యాలయం నుంచి బస్సు బయలుదేరుతుంది. రెండో రోజు ఉదయం 5 గంటలకు భద్రాచలంలోని హరిత హోటల్‌కు, 7.30కు పోచారం బోటింగ్ పాయింట్‌కు చేరుకుంటారు. 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పాపికొండలు, పేరంటాళ్లపల్లికి బోటింగ్. ఈ సమయంలోనే భోజనం, స్నాక్స్ అందజేస్తారు. సాయంత్రం 5 గంటలకు బయలుదేరి భద్రాచలం చేరుకుంటారు. మూడో రోజు ఉదయం 7 నుంచి 8 గంటల వరకు ఆలయ దర్శనం. 11.30 గంటల వరకు పర్ణశాల సందర్శన, అనంతరం తిరిగి హరిత హోటల్‌కు చేరుకుంటారు, మధ్యాహ్నం భోజనం అనంతరం 2.30 గంటలకు భద్రాచలం నుంచి బయలుదేరి రాత్రి 10.30 గంటలకు హైదరాబాద్ చేరుకుంటారు. -
జియో కొత్త ప్యాకేజీలు
న్యూఢిల్లీ: ఇంటర్‌కనెక్ట్ యూసేజీ చార్జీల (ఐయూసీ) విధింపుపై వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో టెలికం సంస్థ రిలయన్స్ జియో సవరించిన కొత్త టారిఫ్ ప్యాకేజీలను ప్రకటించింది. చార్జీలను సర్దుబాటు చేసే విధంగా వీటిని ప్రవేశపెట్టింది. ‘రోజుకు 2 జీబీ డేటా ప్యాక్ పరిమితి ఉండే మూడు నెలల ప్యాకేజీ ధరను రూ. 448 నుంచి రూ. 444కి తగ్గిస్తున్నాం. ఇతర నెట్‌వర్క్‌లకు 1,000 నిమిషాల కాల్స్‌కు సరిపడా టాక్‌టైమ్ (ఐయూసీ మినిట్స్) ఇందులో ఉంటుంది. సాధారణంగా ఈ ఐయూసీ మినిట్స్‌ను విడిగా కొనుగోలు చేయాలంటే అదనంగా రూ.80 చెల్లించాల్సి వస్తుంది‘ అని జియో ఒక ప్రకటనలో తెలిపింది. ఇక, రెండు నెలల ప్లాన్ గడువుండే ప్లాన్ రేటును రూ. 333కి తగ్గించడంతో పాటు ఇతర నెట్‌వర్క్‌లకు అవుట్గోయింగ్ కాల్స్‌కు సంబంధించి 1,000 నిమిషాలు పొందవచ్చు. మరోవైపు, ఒక నెల గడువుండే ప్లాన్ రేటును రూ. 198 నుంచి రూ. 222కి పెంచిన జియో, రూ. 80 విలువ చేసే ఐయూసీ మినిట్స్‌ను ఈ ప్యాక్‌లో చేర్చింది. ఇతర నెట్‌వర్క్‌ల నుంచి వచ్చే కాల్స్‌ను స్వీకరించినందుకు గాను టెల్కోలు పరస్పరం చెల్లించుకునే చార్జీలను ఐయూసీగా వ్యవహరిస్తారు. ఇది ప్రస్తుతం నిమిషానికి 6 పైసలుగా ఉంది. -
కేబిల్లు గుభేలు..!
‘మీరు వినియోగిస్తున్న కేబుల్ ప్యాకేజీ మారింది. ఇదివరకున్న బేసిక్ ప్యాకేజీని బెస్ట్ ఫిట్ ప్యాక్‌లోకి మార్చాము. ట్రాయ్ సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నాం.’–ఓ డీటీహెచ్ సర్వీస్ ప్రొవైడర్ నుంచి కస్టమర్‌కు వచ్చిన ఎస్ఎంఎస్ సారాంశమిది. వాస్తవానికి ఈనెలాఖరు వరకు కస్టమర్ ఎంపిక చేసుకున్న ప్యాకేజీ అమలు చేయాలని కేంద్రం స్పష్టం చేసింది. కానీ కేబుల్ ఆపరేటర్లు, సర్వీసు ప్రొవైడర్లు అత్యుత్సాహం చూపుతూ చానళ్లను తొలగిస్తున్నారు. డీటీహెచ్ సర్వీస్ ప్రొవైడర్లు ఎస్ఎంఎస్లు పంపుతుండగా, కేబుల్ ఆపరేటర్లు సమాచారం ఇవ్వకుండానే చానళ్లకు కోత పెడుతున్నారు. సాక్షి, హైదరాబాద్: కేబుల్ చానల్ వినియోగదారులకు ఆపరేటర్లు, సర్వీసు ప్రొవైడర్లు చుక్కలు చూపిస్తున్నారు. వినియోగదారుడు ఎంపిక చేసుకున్న ప్యాకేజీని ఆపరేటర్లు, డీటీహెచ్ ప్రొవైడర్లు ఒక్కసారిగా మార్చేస్తున్నారు. ట్రాయ్ సూచనలంటూ పలు చానెళ్లకు కోతపెడుతున్నారు. సాధారణంగా వినియోగదారుడు ఎంపిక చేసుకున్న ప్యాకేజీని మధ్యలో మార్చే వీలుండదు. ఎందుకంటే ఎంపిక చేసుకున్న ప్యాకేజీకి బిల్లును చెల్లించేయడంతో గడువు ముగిసే వరకు సేవలందించాలి. కేబుల్ చానళ్ల విషయంలో ట్రాయ్ సూచనలు చేసిన నేపథ్యంలో ఆపరేటర్లు, ప్రొవైడర్లు ఒక్కసారిగా తమ పంథాను మార్చేసుకున్నారు. వినియోగదారున్ని సంప్రదించకుండానే ప్యాకేజీలు మార్చేయడంతో తీవ్ర గందరగోళం చోటుచేసుకుంటోంది. వాస్తవానికి మార్చి 31వరకు చానళ్ల ఎంపికకు గడువున్నప్పటికీ నిబంధనలను బేఖాతరు చేస్తున్న ఆపరేటర్లు, ప్రొవైడర్లు చానళ్లను కట్ చేస్తున్నారు. డిమాండ్ ఉన్న చానళ్లకు కత్తెర రాష్ట్రంలో ఎక్కువ మంది తెలుగు చానళ్లు చూస్తుంటారు. హిందీ, ఇంగ్లీష్ చానళ్లకు పట్టణ ప్రాంతాల్లో ఎక్కువ మంది వినియోగదారులున్నప్పటికీ... గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం తెలుగు చానళ్లకే ఎక్కువ వీక్షకులున్నారు. తాజాగా ట్రాయ్ సూచనలు సాకుగా చూపుతున్న ఆపరేటర్లు, డీటీహెచ్ ప్రొవైడర్లు కీలకమైన చానళ్లకు కోత పెట్టేశారు. రాష్ట్రంలో దాదాపు 85శాతం వినియోగదారులు ఈ సమస్యతో లబోదిబోమంటున్నారు. ఈమేరకు డీటీహెచ్ ఆపరేటర్లు వినియోగదారులకు ఎస్ఎంఎస్లు పంపిస్తుండగా, కేబుల్ ఆపరేటర్లు మాత్రం అలాంటి సమాచారం ఇవ్వకుండానే కోత పెడుతున్నారు. తెలుగు చానళ్లతోపాటు కిడ్స్ చానళ్లు, న్యూస్ చానళ్లు కోత పడుతున్న కేటగిరీలో ఉన్నాయి. భారంగా కొత్త ప్యాకేజీ చానళ్ల కోతపై ఆపరేటర్లను ప్రశ్నిస్తే కొత్త ప్యాకేజీలోకి మారాలని సూచిస్తు న్నారు. దీంతో కొత్త ప్యాకేజీలోకి మారేందుకు ప్రయత్నిస్తే వినియోగదారుడు ఖంగుతినే పరిస్థితి వస్తోంది. కేబుల్ ఆపరేటర్లు అందిస్తున్న బేసిక్ ప్యాకేజీ కనిష్ట ధర రూ.230గా ఉంది. ఇందులో కేవలం 100 చానళ్లు మాత్రమే వచ్చినా... ఇందులో అన్ని తెలుగు చానళ్లు ప్రసారం కావు. పూర్తిస్థాయి తెలుగు చానళ్లు కావాలనుకుంటే రూ.350, న్యూస్ చానళ్లు కావాలనుకుంటే రూ.410, పిల్లలు చూసే కిడ్స్ చానళ్లు కావాలనుకుంటే రూ.450లోకి మారాల్సి వస్తుంది. ఇప్పటివరకు కేబుల్ ఆపరేటర్లకు నెలవారీగా రూ.150 నుంచి రూ.200 చొప్పున చెల్లిస్తున్న వినియోగదారులు... ఇకపై రూ.450 చెల్లించాల్సిందే. అతి తక్కువ ప్యాకేజీలో 163 చానళ్లు వస్తుండగా... ఇందులో వందకుపైగా చానళ్లుఇతర ప్రాంతీయ భాషలకు సంబం ధించినవి. దీంతో అవసరం లేకున్నా అధిక మొత్తంలో బిల్లు వసూలు చేసేందుకు ఆపరేటర్లు, ప్రొవైడర్లు ఒత్తిడి తీసుకువస్తున్నారు. -
ప్రీపెయిడ్కు ఎయిర్టెల్ కొత్త ప్లాన్లు
6 నెలలు; ఏడాదికి కొత్త ప్యాకేజీలు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెలికం రంగ కంపెనీ ఎయిర్టెల్ డేటా చార్జీలను గణనీయంగా తగ్గించింది. ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం మెగా సేవర్ ప్యాక్ కింద ఏడాది పాటు 1జీబీ 4జీ డేటాను రూ.51 చొప్పున అందిస్తామని పేర్కొంది. అయితే ఈ ప్యాక్ కోసం ముందుగా వారు రూ.1,498 చెల్లించి 1జీబీ 4జీ/3జీ డేటా ప్లాన్ తీసుకోవాలి. ఆ తరవాత ఏడాదిపాటు ఎన్నిసార్లయినా రూ.51 చెల్లించి 1జీబీ 3జీ/4జీ డేటాను రీఛార్జ్ చేయించుకోవచ్చు. అలాగే రూ.748 చెల్లించి 1జీబీ 4జీ/3జీ డేటా ప్యాక్ తీసుకున్న వారు... ఆ తరవాత 6 నెలల పాటు రూ.99 చొప్పున ఎన్నిసార్లయినా 1జీబీ 3జీ/4జీ డేటా ప్యాక్‌లు తీసుకోవచ్చు. -
వెన్నెల్లో హాయ్‌హాయ్
- బోటులో బ్రేక్‌ఫాస్ట్, క్యాండిల్ డిన్నర్‌కు విశేష స్పందన - ఆకర్షితులవుతున్న పర్యాటకులు - పుష్కర యాత్ర స్పెషల్స్ హౌస్‌ఫుల్ సాక్షి, విజయవాడ : పర్యాటకులను ఆకట్టుకునేందుకు ఆంధ్రప్రదేశ్ పర్యాటకాభివృద్ధి సంస్థ ప్రవేశపెట్టిన (ఏపీటీడీసీ) కొత్త ప్యాకేజీలకు విశేష స్పందన లభిస్తోంది. క్యాండిల్ డిన్నర్, బోటులో బ్రేక్‌ఫాస్ట్‌పై పర్యాటకులు ఆసక్తి కనబరుస్తున్నారు. ఉదయం కృష్ణానదిలో బోటులో తిరుగుతూ బ్రేక్‌ఫాస్ట్, రాత్రిపూట కొవ్వొత్తుల వెలుగులో డిన్నర్ చేసే కార్యక్రమాన్ని ఏపీటీడీసీ ఇటీవలే ప్రారంభించింది. ఈనెల 5వ తేదీన తొలిసారిగా క్యాండిల్ డిన్నర్‌ను ఏర్పాటుచేయగా, 30 మంది పర్యాటకులు పాల్గొన్నారు. 12వ తేదీ ఆదివారం ఒక కంపెనీ తన సిబ్బం దికి ఆటవిడుపు కలిగించడం కోసం 50 మందితో క్యాండిల్ డిన్నర్‌కు బుకింగ్ చేసుకుంది. సాధారాణ రోజుల్లో 10-15 మంది వస్తున్నట్లు తెలిసింది. వీనుల‘విందు’ క్యాండిల్ డిన్నర్ రాత్రి 8 నుంచి 9 గంటల వరకు ఉంటుంది. కృష్ణానదిలో బోటులో విహరిస్తూ చల్లనిగాలుల మధ్య వీనులవిందైన సంగీతం వింటూ రుచికరమైన వంటలు తినొచ్చు. మెనూలో రైస్‌తో పాటు పుల్కాలు, బిర్యానీ, పప్పు, రెండు రకాల కూరలు, స్వీట్స్, హాట్స్ ఉంటాయి. పెద్దలకు రూ.300, పిల్లలకు రూ.200 చెల్లించాలి. ఉదయం పూట సూర్యుడి లేలేత కిరణాలు తాకుతుండగా, నదిలో తిరుగుతూ ఇడ్లీ, పూరి, దోసె, గారెలు వంటి రుచికరమైన వంటలు వేడివేడిగా ఆరగించొచ్చు. ప్రచారం అవసరం క్యాండిల్ డిన్నర్, బ్రేక్‌ఫాస్ట్‌కు ప్రచారం కల్పిస్తే మరింత ఆదాయం వచ్చే అవకాశం ఉందని పర్యాటకులు అభిప్రాయపడుతున్నారు. పుష్కర ప్యాకేజీలు ఫుల్ గోదావరి పుష్కరాల కోసం నగరం నుంచి రాజమండ్రికి ఏపీటీడీసీ ఏర్పాటుచేసిన రెండు ప్యాకేజీల బస్ సర్వీస్ ఈనెల 13 నుంచి 19వ తేదీ వరకు ఫుల్ అయిపోయాయి. విజయవాడ-రాజమండ్రి-అంతర్వేది- పాలకొల్లు- భీమవరం-విజయవాడ, విజయవాడ-రాజమండ్రి, భీమవరం-విజయవాడ ప్యాకేజీలను భక్తులు ఎక్కువగా బుక్ చేసుకున్నారని, ఏపీటీడీసీ విజయవాడ డివిజనల్ మేనేజర్ వీవీఎస్ గంగరాజు తెలిపారు. కాగా, గోదావరి పుష్కర స్పెషల్‌కు మంచి డిమాండ్ ఏర్పడటంతో ఏసీ బస్సు కావాలని ఉన్నతాధికారులను కోరినట్లు తెలిసింది. ఈ బస్సు వస్తే ఈనెల 15 నుంచి 25వ తేదీ వరకు రోజూ నడపాలని అధికారులు భావిస్తున్నారు.