నగరంలో ‘డిస్నీల్యాండ్’! | In the city of 'Disneyland'! | Sakshi
Sakshi News home page

నగరంలో ‘డిస్నీల్యాండ్’!

Published Wed, Mar 16 2016 4:01 AM | Last Updated on Sun, Sep 3 2017 7:49 PM

నగరంలో ‘డిస్నీల్యాండ్’!

నగరంలో ‘డిస్నీల్యాండ్’!

రూ. 25 వేల కోట్లతో 300 ఎకరాల్లో ఏర్పాటు

 సాక్షి, హైదరాబాద్: అమెరికాలో చిన్నారుల వింత ప్రపంచం డిస్నీల్యాండ్.. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో త్వరలో కొలువుకానుంది. హాంకాంగ్.. షాంఘై.. తదితర విశ్వనగరాల్లో చిన్నారులకు ఆటవిడుపుగా అద్భుత ప్రపంచం సృష్టించిన అమెరికన్ సంస్థ డిస్నీల్యాండ్ ఆధ్వర్యంలోనే రాజధానిలోనూ డిస్నీల్యాండ్ ఏర్పాటుకు రంగం సిద్ధమయినట్లు విశ్వసనీయంగా తెలిసింది.

టూరిజం శాఖ ఇందుకు సంబంధించిన సన్నాహాల రూపకల్పనలో నిమగ్నమైంది. దాదాపు 300 ఏకరాల స్థలంలో రూ. 25 వేల కోట్లతో దీన్ని నిర్మించనున్నారు. ఇందులో ప్రాచీన కట్టడాలు, యూరోపియన్ బిల్డింగ్స్, డ్రాగన్స్, డోనాల్డ్ డక్‌లు పిల్లలకు సంబంధించిన పలు అంశాలు ఏర్పాటు చేస్తారు. డిస్నీల్యాండ్ నిర్వాహకులు వచ్చే వారంలో హైదరాబాద్‌కు వచ్చి రాష్ట్ర ప్రభుత్వంతో ఈ విషయమై చర్చించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement