Disneyland
-
‘మామా.. హైదరాబాద్‌కు డిస్నీల్యాండ్ తీసుకొని రా’..కేటీఆర్‌కు చిన్నారి రిక్వెస్ట్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఐటీ, మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. రాజకీయ అంశాలతోపాటు వర్తమాన విషయాలు, నెటిజన్లు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇస్తుంటారు. ఆపదలో ఉన్న వారికి కూడా సాయం అందిస్తుంటారు. ఓ పక్క ఎన్నికల హడావిడీలో బిజీ బిజీగా గడుపుతున్న కేటీఆర్.. తాజాగా ఎక్స్‌లో (ట్విటర్)ఓ చిన్నారి అడిగిన ప్రశ్నకు స్పందించారు. ‘కేటీఆర్ మామా.. హైదరాబాద్‌కు డిస్నీ ల్యాండ్ తీసుకొని రా ప్లీజ్’ అంటూ ఓ చిన్నారి తన కోరికను తెలిపింది. ఈ వీడియోను ఆమె తండ్రి సురేంద్ర వినాయకం ట్విట్టర్లో పోస్టు చేశారు. ఈ వీడియోపై మంత్రి కేటీఆర్ స్పందించారు. ‘ప్రామిస్ చేయలేను కానీ బేటా.. తీసుకువచ్చే ప్రయత్నం అయితే చేస్తాను’ అంటూ సదరు చిన్నారికి రిప్లై ఇచ్చారు. ఈ పోస్టు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదిలా ఉండగా ఇటీవల ‘కేటీఆర్ తాతకు ఓటేస్తానంటూ’ అనన్య అనే ఓ చిన్నారి తల్లితో మారాం చేస్తూ మాట్లాడిన ముద్దు మాటలు అందర్నీ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. చదవండి: సర్వేల్లో నిజమెంత?.. తెలంగాణలో గెలుపెవరిది? Can’t promise Beta but will try my best 👍 https://t.co/YwWrgHwBNH — KTR (@KTRBRS) November 28, 2023 -
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన క్లబ్..ఇందులో చేరాలంటే..
ప్రపంచంలోని అత్యంత ఖరీదైన క్లబ్‌లలో డిస్నీలాండ్‌కు చెందిన క్లబ్–33 ఒకటి. దీనిలో సభ్యత్వానికి ప్రవేశ రుసుముగా 50 వేల డాలర్లు (రూ.41.02 లక్షలు), వార్షిక రుసుముగా 15 వేల డాలర్లు (రూ.12.30 లక్షలు) చెల్లించాల్సి ఉంటుంది. ప్రపంచంలోని అత్యంత విలక్షణమైన డిన్నర్ క్లబ్బులలో ఒకటిగా ఇది పేరు పొందింది. తొలుత దీనిని 1967లో ఏర్పాటు చేశారు. తర్వాతి కాలంలో ఫ్లోరిడాలోని డిస్నీలాండ్ పార్కులోను, టోక్యో, షాంఘై సహా పలు నగరాల్లోని డిస్నీ పార్కుల్లోనూ ఈ క్లబ్ శాఖలను ఏర్పాటు చేశారు. న్యూ ఆలీన్జ్ స్క్వేర్‌లోని 33 రాయల్ స్ట్రీట్‌లో ఉన్న డిస్నీపార్కు చిరునామా ఆధారంగా ఈ క్లబ్‌కు క్లబ్–33 అని పేరు పెట్టారు. క్లబ్ తొలి శాఖను ఇక్కడే నెలకొల్పారు. తొలిరోజుల్లో ఈ క్లబ్ డిస్నీలాండ్ కార్పొరేట్ స్పాన్సర్లకు మాత్రమే పరిమితంగా పనిచేసేది. వాల్ట్ డిస్నీ మరణానంతరం ఇందులో ఇతర వీఐపీలకు కూడా సభ్యత్వం కల్పించడం ప్రారంభించారు. సామాన్యుల కంట కనబడకుండా ఉండటానికి హాలీవుడ్ సెలబ్రిటీలు ఎక్కువగా ఇక్కడ డిన్నర్ పార్టీలు చేసుకుంటూ ఉంటారు. (చదవండి: 13 ఏళ్ల అమ్మాయి..తల్లిదండ్రులకు ఓ రేంజ్లో షాక్ ఇచ్చింది!) -
నైట్ షోలో అగ్ని ప్రమాదం..ఎగిసిపడ్డ అగ్నికీలలు
యూఎస్‌లోని ఓ నైట్ షోలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. దీంతో ఒక్కసారిగా షోని నిలపేసి ప్రేక్షకులకు కలిగిన అంతరాయానికి క్షమాపణలు తెలిపింది నిర్వాహణ సంస్థ. ఈ ఘటన కాలిపోర్నియాలోని చోటుచేసుకుంది. కాలిఫోర్నియాలోని డిస్నీల్యాండ్‌లో జరిగిన నైట్ షోలో ఈ అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో టామ్ సాయర్ ద్వీపం సమీపంలోని థీమ్ పార్క్ వద్ద జరిగే ఫ్యాంటాస్మిక్ ప్రదర్శనను అకస్మాత్తుగా నిలిపేశారు. ఈ అసౌకర్యానికి క్షమాపణలు తెలుపుతూ ప్రేక్షకుల కోసం ఓ ప్రకటన కూడా విడుదల చేసింది నిర్వాహక సంస్థ. శనివారం సాయంత్రం డిస్నీల్యాండ్ పార్క్‌లో ఫ్యాంటాస్మిక్ చివరి ప్రదర్శన సమయంలో ఈ అనుహ్య ఘటన చోటు చేసుకుంది. అక్కడ ఆకర్షణగా ఉండే 24 అడుగుల జెయింట్ డ్రాగన్ మంటల్లో చిక్కుకుంది. దీంతో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. ఈ అనుహ్య ఘటనతో నిర్వాహకులు ప్రదర్శనను నిలిపేసి ప్రదర్శనలిచ్చే నటీనటులందర్నీ సురక్షిత ప్రదేశాలకు తరలించారు. ఆ ద్వీపం అంతా హుటాహుటినా ఖాళీ చేయించారు. ఐతే ఈ ఘటనలో ఎవరూ ఎలాంటి గాయాల బారిన పడలేదు కానీ ఎంతమేర అగ్నిప్రమాదం సంభవించింది అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ప్రమాదం కారణంగా అక్కడ ప్రదేశం అంతా దట్టమైన పొగ కమ్మేసింది. ఈమేరకు పోలీసులు కేసు నమోదు చేసి ఈ సంఘటనకు గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఫ్యాంటాస్మిక్ అనేది 27 నిమిషాల ప్రత్యక్ష ప్రదర్శన. దీన్ని 1992 నుంచి నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో బాణసంచా, రంగురంగుల నీటి ప్రదర్శన తోపాటు లైవ్లోన నటులు పైరోటెక్నిక్‌లు, లేజర్లు, సంగీతం వంటి ప్రదర్శనలిస్తారు. Fantastic Fantasmic fail - wow! #fantasmic #disneyland pic.twitter.com/MZhNJhEXrB — JessicaT (@Ms_JessicaT) April 23, 2023 (చదవండి: సూడాన్‌లో చిక్కుకున్న వారిని ఆ మార్గంలో తరలించేందుకు సన్నాహాలు!) -
డేంజర్లో హలీవుడ్
అంతరిక్ష జీవులు దాడి చేస్తాయి. హాలీవుడ్ కాపాడుతుంది. యుగాంతం వచ్చి భూమి బద్దలవుతుంది. హాలీవుడ్ కాపాడుతుంది. సునామీ వచ్చి కెరటాలు ఆకాశానికి ఎగుస్తాయి. హాలీవుడ్ కాపాడుతుంది. ప్రపంచానికి ముప్పు వచ్చిన ప్రతిసారీ హాలీవుడ్ హీరో ఒకడు నిలబడతాడు. ఇప్పుడు కరోనా వచ్చింది. కాని– హాలీవుడ్ తనను రక్షించేది ఎవరా అని పిపిఇ ధరించి ఎదురు చూస్తూ ఉంది. ప్రపంచంలో ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్‌లో నంబర్ వన్ హాలీవుడ్. ఏడాదికి దాదాపు 9 లక్షల కోట్లు దాని టర్నోవర్. 120 సంవత్సరాల ఘన చరిత్ర, ఇంత వ్యాపారం ఉన్న హాలీవుడ్ కరోనా వల్ల ఏం కాబోతున్నది అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ఇప్పటికే అది కరోనా వల్ల 9 బిలియన్ల డాలర్లను నష్టపోయిందని ఒక అంచనా. నిజానికి చిన్న అవాంతరాలకే కుప్పకూలే వ్యవస్థ ఇది. 2008లో ఆర్థిక మాంద్యం వచ్చినప్పుడు 57 వేల మంది హాలీవుడ్ కార్మికులు ఉపాధి కోల్పోయారు. అదే సమయంలో తమ పారితోషికం పెంచమని 12 వేల మంది హాలీవుడ్, టెలివిజన్ రంగ రచయితలు సమ్మె చేశారు. వీటన్నింటి వల్ల 380 మిలియన్ డాలర్లు నష్టపోయింది హాలీవుడ్. ఆ సమయానికి ఇప్పటిలా డిజిటల్ స్ట్రీమింగ్ లేదు. జనం థియేటర్లలోనే సినిమాలు చూడాల్సిన పరిస్థితి. కాని జనం దగ్గర డబ్బు లేదు. ఆ సమయంలోనే హైవైగల్ అనే ఒక సినీ విశ్లేషకుడు ‘కరువు కాలంలో ఆల్కహాల్ అయినా కొంటారు కాని సినిమా టికెట్ కొనరు’ అని వ్యాఖ్యానించారు. అది అక్షరాలా నిజమైంది. దాదాపు రెండేళ్లపాటు పోరాడి ఆ గడ్డుకాలాన్ని దాటేసింది హాలీవుడ్. కరోనా సమయం హాలీవుడ్‌ని ‘డ్రీమ్ ఫ్యాక్టరీ’ అని కూడా అంటారు. కరోనా దెబ్బకు ఆ కలల వ్యాపారం కుప్పకూలి పోయింది. హాలీవుడ్లో పని చేసే వారందరూ ధనవంతులు కారు. హాలీవుడ్ మీద ఆధారపడి దాదాపు 9 లక్షల మంది పని చేస్తున్నారు. వీరిలో సుమారు రెండు లక్షల మంది మాత్రమే బాగా గడిచే ఆర్టిస్టులు, టెక్నీషియన్లు. మిగిలినవాళ్లంతా రెక్కాడితేగాని డొక్కాడని వారే. వీళ్లలో చాలామంది కరోనా వైరస్ వల్ల ఉపాధి కోల్పోయారు. డిస్నీలాండ్ తన పార్క్‌లో పని చేసే లక్ష మంది ఉద్యోగాలని తొలగించింది. అలాగే థియేటర్లలో పని చేసే వాళ్లల్లో లక్షా యాభై వేల మందిని తీసేశారు. వాళ్లని పనిలో నుంచి తీసేస్తున్న యజమానులు ఇందుకు వేదన అనుభవిస్తున్నారు. జూన్, జూలై నుంచి సినిమా కార్యకలాపాలు ప్రారంభమైనా ఇంతమందికి ఉపాధి కల్పించడం కష్టం కావచ్చు. ‘ఇంటి అద్దె చెల్లించలేని పరిస్థితిలో ఉన్నాం’ అని సినిమాటోగ్రాఫర్లు అంటున్నారు. ‘కేవలం డోమినోలో మాత్రం ఉద్యోగాలున్నాయి. అక్కడ పని వెతుక్కుంటున్నాం’ అని ప్రొడక్షన్ కో ఆర్డినేటర్లు అంటున్నారు. ‘కింగ్డమ్’ సీరియల్లో పాపులర్ అయిన నటుడు మాక్ బ్రిండెట్ తన రెగ్యులర్ ఈఎంఐలు కట్టలేక నిరుద్యోగ భృతికి అప్లై చేశాడు. రానున్న పోటీ రాబోయే రోజుల్లో ఎలా పని చేయాలి అనే విషయం మీద హాలీవుడ్ కసరత్తు చేస్తోంది. ఎలా చేసినా గతంలాంటి స్థితి తిరిగి రాదని అందరికీ తెలుసు. స్టూడియోలు, యూనియన్ల మధ్య చర్చలు ఏ నిర్ణయాలకు వస్తాయో తెలియదు. కాని తక్కువ మందితోనే షూటింగ్ చేయాలి. అవకాశాలు కొద్దిమందికే ఉంటాయి. వాటి కోసం అందరూ దారుణమైన పోటీ పడతారు. వేతనాలు తగ్గిస్తారనే వార్త కార్మికులను కలవర పరుస్తోంది. ప్రపంచాన్ని కాపాడే హీరో హాలీవుడ్లో ఉండొచ్చు. కాని ఆ హీరోను కూడా కాపాడే సూపర్ హీరో ప్రేక్షకుడే. ఆ ప్రేక్షకుడు థియేటర్లకు వచ్చి కూచునే వరకు హాలీవుడ్డే కాదు ఏ సినిమా రంగమైనా డేంజర్లో ఉన్నట్టే. రక్షించేవాడు క్రిస్టఫర్ నోలన్? ప్రపంచ ప్రఖ్యాత దర్శకుడు క్రిస్టఫర్ నోలన్ హాలీవుడ్‌ను కాపాడనున్నాడా? కాపాడాలనే సమస్త హాలీవుడ్ భావిస్తోంది. క్రిస్టఫర్ తీసిన తాజా భారీ సినిమా ‘టెనెట్’ జూలై 17న విడుదల కానుంది. లాక్డౌన్ తర్వాత కరోనాతో ‘సహజీవనం’ దాదాపు స్థిరపడ్డాక హాలీవుడ్ ప్రపంచం మీదకు ప్రేక్షకుల స్పందన కోసం వదలనున్న సినిమా ఇదే. ఈ సినిమా ప్రేక్షకులను రప్పించగలిగితే మిగిలిన సినిమాలన్నీ గాడిలో పడతాయని భావిస్తున్నారు. మూడో ప్రపంచ యుద్ధాన్ని ఓ సీక్రెట్ ఏజెంట్ ఎలా అడ్డుకున్నాడనేదే ‘టెనెట్’ కథ. మన డింపుల్ కపాడియా ఇందులో ముఖ్యపాత్ర పోషించింది. దీని తర్వాత బాండ్ ఫిల్మ్ ‘నో టైమ్ టు డై’ విడుదలవుతుంది.ఎలాగైనా అనుకున్న డేట్‌కే సినిమా విడుదల చేయాలని నోలన్ పట్టు పట్టి ఉన్నాడట. ఇదిలా ఉండగా ఏప్రిల్ 10న థియేటర్లతోపాటు కరోనా వల్ల డిజిటల్ ప్లాట్‌ఫామ్ మీద కూడా విడుదలైన ‘ట్రోల్స్ వరల్డ్ టూర్’ వివాదం రేపింది. థియేటర్ల కంటే డిజిటల్‌గా ఇది బాగా కలెక్ట్ చేయడంతో అమెరికాలోని థియేటర్స్ వ్యవస్థ భగ్గుమంది. ఈ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేసిన యూనివర్సల్ స్టూడియో వారి ఏ సినిమాలనూ విడుదల చేయబోమని అల్టిమేటం జారి చేసింది. దాంతో ఆ స్టూడియో నుంచి రాబోతున్న ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 9’, ‘జూరాసిక్ వరల్డ్: డొమినియన్’ తదితర సినిమాల భవిష్యత్తు ప్రశ్నార్థకం అయ్యింది. స్పానిష్ ఫ్లూ– హాలీవుడ్ సరిగ్గా వందేళ్ల క్రితం 1919 నవంబర్‌లో స్పానిష్ ఫ్లూ ప్రారంభమైంది. 1921 ఫిబ్రవరి వరకూ ఉధృతంగా తన ప్రభావం చూపి వెళ్లిపోయింది. అప్పటికి హాలీవుడ్ పసిపాప. న్యూజెర్సీ నుంచి 1912లో వలస వచ్చి ప్రస్తుతం హాలీవుడ్ ఉన్న చోట స్థిరపడుతూ ఉంది. అప్పటికి అమెరికా వ్యాప్తంగా 20 వేల థియేటర్లలో మూకీ సినిమాలు ఆడుతున్నాయి. అటువంటి సమయంలో స్పానిష్ ఫ్లూ దెబ్బతో హాలీవుడ్లో భయానక వాతావరణం నెలకొంది. ఎవర్ని కదిపినా అప్పుడే ఫ్లూ వ్యాధి బారిన పడ్డ వ్యక్తో లేదా ఆ వ్యాధి నుంచి కోలుకుంటున్న వ్యక్తో. మొదట్లో స్పానిష్ ఫ్లూని తేలిగ్గా తీసుకున్నాయి చాలా స్టూడియోలు, థియేటర్లు. అప్పుడే షూటింగ్ లో పాల్గొన్న ప్రముఖ తారలు బ్రియాంట్ వాష్‌బర్న్, అన్నా క్యూ నీల్సన్లకు ఫ్లూ వచ్చింది. దాంతో హాలీవుడ్ కలవరపడిపోయింది. షూటింగ్స్ ఆపేశారు. స్పానిష్ ఫ్లూ సమయంలో తీసిన మూకీ సినిమా ‘డాడీ లాంగ్ లెగ్స్’లో జనం ముఖాలకు మాస్క్‌లు హాలీవుడ్ స్టార్స్ తమ నెల జీతాలు తగ్గించుకుని ఆ మొత్తంతో స్టూడియోల్లోకి ఇతర సిబ్బందికి డబ్బులిచ్చారు. మాట్నీ ఐడియల్గా పేరొందిన హెరాల్డ్ లాక్వుడ్ స్పానిష్ ఫ్లూతో చనిపోయాడు. అయితే స్టూడియోలు నెలల తరబడి మూసి ఉంచడానికి మొరాయించాయి. స్టూడియోల్లో వర్క్ చేసుకుంటామని, అందుకు అనుమతి ఇవ్వమని విన్నపాలు ప్రారంభించాయి. దాంతో షూటింగ్స్‌కు పర్మిషన్ వచ్చింది. పోలీసులు చాలా నిబంధనలు పెట్టారు. సినిమాల్లో గుంపులు ఉండే సీన్స్ ఉండకూడదు. కేవలం ఇద్దరు ముగ్గురు ఆర్టిస్టుల మీదే సీన్స్ తీయాలి. అయితే దీనివల్ల మరికొందరు స్పానిష్ ఫ్లూ బారిన పడ్డారు. అప్పట్లో స్టూడియోలకి వచ్చేవాళ్ల మీద క్రిమి సంహారక మందులు జల్లేవాళ్లు. రెడ్‌క్రాస్‌కి చెందిన నర్స్ షూటింగ్‌కి వచ్చినవాళ్ల మీద పౌడర్ చల్లుతుండేది. 1921 ఫిబ్రవరి వరకూ ఈ అవస్థ తప్పలేదు. ప్రేక్షకుల మీద ప్రయోగాలు అమెరికాలో దాదాపు ఆరు వేల థియేటర్లు ఉన్నాయి. ఆ థియేటర్లలో 40 వేల స్క్రీన్స్ ఉన్నాయి. వాటిలో అధిక శాతం రీగల్, ఎ.ఎమ్.సి, సినీమార్క్ అనే మూడు ప్రధాన సంస్థలవి. అమెరికాలో రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఎమర్జెన్సీ పరిస్థితుల్లో తప్ప మిగిలిన నిర్ణయాధికారాలు స్టేట్ గవర్నర్స్కే ఉంటాయి. థియేటర్లు ఓపెన్ చేయాలా వద్దా అనే నిర్ణయాన్ని ఆయా రాష్ట్రాలకే వదిలేశామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. మొదటగా టెక్సాస్‌లో మే 8న కొన్ని థియేటర్లు తెరుచుకున్నాయి. అయితే థియేటర్లలో సీటింగ్ కెపాసిటీ 25 శాతానికి తగ్గించేశారు. టికెట్ రేట్లలో బాగా డిస్కౌంట్ ఇచ్చారు. హాలీవుడ్‌ని ‘డ్రీమ్ ఫ్యాక్టరీ’డిస్నీలాండ్ టెనెట్’ ఎయిర్ పోర్ట్‌లో ఎలా సెక్యూరిటీ చెక్ ఉంటుందో అంతకు మించి తనిఖీలు చేసి పంపిస్తున్నారు. అయితే పాత సినిమాలే ప్రదర్శిస్తున్నారు. ఒక్లహామా రాష్ట్రంలో థియేటర్లకి గ్లాస్ స్క్రీన్ ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నారు. జార్జియా రాష్ట్ర గవర్నర్ థియేటర్లను ఓపెన్ చేయమని ఆదేశాలిచ్చినా అక్కడ కొందరు థియేటర్ల యజమానులు అంగీకరించడం లేదు. అట్లాంటాలోని ప్లాజా థియేటర్ ఓనర్ కరోనా ఇంకా ఉండగా ఇలాంటి ప్రాణాంతకమైన పనులు చేయలేను అని తేల్చి చెప్పాడు. ‘ఈ పరిస్థితుల్లో ఆదాయం లేకపోగా శానిటైజేషన్ కోసం కొత్త పెట్టుబడి పెట్టాలి. పైగా సీటింగ్ కెపాసిటీ తగ్గించాలి. ఖర్చెక్కువ, రాబడి తక్కువ ఉండే ఇలాంటి పరిస్థితిలో థియేటర్లని మరికొంత కాలం మూసి ఉంచడం బెటర్’ అని మరో థియేటర్ ఓనర్ చెప్పాడు. కొందరు థియేటర్ల ఓనర్ల డిమాండ్ ఏమిటంటే కరోనా ఉండటం వల్ల ప్రేక్షకుల ఇళ్లకు నేరుగా క్యూబ్ సిస్టమ్ ద్వారా సినిమాలను విడుదల చేయాలి అయితే వచ్చిన దానిలో థియేటర్లకు కొంత వాటా ఇవ్వాలి అనేది. ఏమైనా జూలై నుంచి థియేటర్లు సంపూర్ణంగా తెరుచుకుంటాయని అక్కడి ప్రదర్శనారంగ దిగ్గజాలు భావిస్తున్నాయి. – తోట ప్రసాద్ (సినీ రచయిత) -
చచ్చిపోతా.. చిన్నోడి కోసం 4 లక్షల డాలర్లు!
సిడ్నీ: శారీరక ఎదుగుదల లోపం కారణంగా ఆత్మహత్య చేసుకోవాలని భావించిన చిన్నారి క్వాడెన్ బేల్స్కు సోషల్ మీడియా అండగా నిలిచింది. క్వాడెన్ కోసం అమెరికా కమెడియన్ బ్రాడ్ విలియమ్సన్ ప్రారంభించిన గోఫండ్‌మీ పేజ్ ద్వారా దాదాపు 4 లక్షల డెబ్బై ఐదువేల డాలర్లు పోగయ్యాయి. ఈ భారీ మొత్తాన్ని క్వాడెన్ తల్లికి పంపిన పేజీ నిర్వాహకులు.. చిన్నారిని డిస్నీల్యాండ్ ట్రిప్ కోసం ఈ నగదును సేకరించినట్లు పేర్కొన్నారు. ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌కు చెందిన క్వాడెన్ బేల్స్ అనే తొమ్మిదేళ్ల కుర్రాడు అచాన్రోప్లాసియాతో బాధపడుతున్నాడు. దీంతో మరుగుజ్జుగా ఉన్నావంటూ తోటి విద్యార్థులు అతడిని అవమానించేవారు. ఈ వేధింపులు తీవ్రతరం కావడంతో ఓరోజు ఆత్మహత్య చేసుకోవాలని భావించాడు. ఈ విషయాన్ని తన తల్లికి చెబుతూ.. ‘‘నేను చనిపోవాలని అనుకుంటున్నా.. లేదంటే ఎవరైనా నన్ను చంపేయండి’’ అంటూ హృదయ విదారకంగా ఏడ్వసాగాడు. ఇందుకు సంబంధించిన వీడియోను క్వాడెన్ తల్లి యర్రాక తన ఫేస్బుక్ అకౌంట్లో షేర్ చేయగా వైరలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో క్వాడెన్‌కు అన్ని వర్గాల నుంచి మద్దతు లభించింది. ఆస్ట్రేలియా నటుడు హుగ్ జాక్మాన్తో పాటు ఎన్బీఏ ఆటగాడు ఎన్స్ కాంటెర్ క్వాడెన్ వంటి సెలబ్రిటీలు సైతం అతడికి అండగా నిలిచారు. ఈ క్రమంలో క్వాడెన్ సంతోషపెట్టడం కోసం అతడి డిస్నీల్యాండ్ ట్రిప్ కోసమని నెటిజన్లు భారీ ఎత్తున విరాళాలు ఇచ్చారు. అయితే క్వాడెన్ తల్లి ఈ విరాళాన్ని... క్వాడెన్ కోసం కాకుండా చారిటీ కోసం ఉపయోగిస్తున్నట్లు ఆమె సోదరి మీడియాకు తెలిపారు.(తాడు ఇవ్వండి! ఉరేసుకుంటా..) ‘‘ఏ పిల్లాడైనా డిస్నీల్యాండ్ వెళ్లాలని ఆశపడతాడు. క్వాడెన్ కూడా అంతే. అయితే తనను వాస్తవానికి దూరంగా తీసుకువెళ్లి సంతోష పెట్టడం మాకు ఇష్టం లేదు. ప్రతీ సవాలును ధీటుగా ఎదుర్కొనేలా తనను తీర్చిదిద్దాలనుకుంటున్నాం. అందుకే నా సోదరి మంచి నిర్ణయం తీసుకుంది. అవమానాలు ఎదుర్కొని ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారు ఎందరో ఉన్నారు. ఇలాంటివి పునరావృతం కాకూడదు. ఇందుకోసం పనిచేస్తున్న సంస్థకు క్వాడెన్ డబ్బును వినియోగించాలని భావిస్తోంది’’ అని ఆమె పేర్కొన్నారు. -
వీడియో సాక్ష్యంతో బుక్కైన దీపిక-రణ్వీర్...!
-
‘బూతులు తిడుతూ.. దాడి చేశారు’
ముంబై: బాలీవుడ్ జంట రణ్వీర్ సింగ్-దీపికా పదుకొనేలపై ఓ మహిళ సంచలన ఆరోపణలు చేశారు. ఓర్లాండో(ఫ్లోరిడా) డిస్నీ ల్యాండ్ ఆ జంట చక్కర్లు కొడుతున్న ఫోటోలు కొన్నిరోజుల క్రితం వైరల్ అయ్యాయి. అయితే ఆ సమయంలో వీడియో తీసిన ఓ మహిళతో వీరిద్దరూ దురుసుగా ప్రవర్తించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు బాధితురాలు జైనబ్ ఖాన్ సోషల్ మీడియాలో వరుసగా పోస్టులు ఉంచారు. ‘నేను ఆమెకు(దీపిక) వీరాభిమానిని. కానీ, ఆరోజు జరిగిన ఘటన భయానకం. నేనేం వారి వెంటపడలేదు. హఠాత్తుగా నా కళ్ల ముందు కనిపించారు. కెమెరాతో వీడియో తీశా. అది గమనించిన ఆమె నవ్వుతూ నా దగ్గరికొచ్చారు. ఫోటోకు ఫోజు ఇస్తారేమో అనుకుంటే.. నాపై దాడి చేశారు. అంతటితో ఆగకుండా నాపై దుర్భాషలాడారు. ఆమెకు రణ్వీర్ కూడా జత కలిశాడు. సెలబ్రిటీల కోసం పాకులాడితే ప్రతిఫలం ఇంత దారుణంగా ఉంటుందా? అన్నది అనుభవమైంది. వారిపై గౌరవం పోయింది’ అని ఆమె వివరించారు. వీడియోతోసహా జైనబ్ పెట్టిన పోస్టులపై పలువురు మండిపడుతున్నారు. ఎంత సెలబ్రిటీలు అయితే మాత్రం అంత దారుణంగా ప్రవర్తించాలా? అని తిట్టి పోస్తున్నారు. మరోవైపు ఈ వ్యవహారంపై రణ్వీర్-దీపికా స్పందించలేదు. ఇదిలా ఉంటే నవంబర్‌లో ఈ జంట వివాహంతో ఒక్కటి కాబోతున్నట్లు కథనాలు జోరుగా చక్కర్లు కొడుతున్నాయి. -
సెలవులకు కొత్త ‘థీమ్’!
దేశంలో థీమ్ పార్కులకు పెరుగుతున్న ఆదరణ.. ♦ గతేడాది అమ్యూజ్మెంట్ పార్క్‌ల ఆదాయం రూ. 2,930 కోట్లు! ♦ ఏటా 5 కోట్ల మంది సందర్శన; 10–15 శాతం వృద్ధి ♦ వచ్చే మూడేళ్లలో రూ.4వేల కోట్ల ఆదాయంపై దృష్టి ♦ హైదరాబాద్‌లో డిస్నీల్యాండ్, యాడ్‌ల్యాబ్స్ ఇమాజికా? హైదరాబాద్, బిజినెస్ బ్యూరో రోలర్ కోస్టర్, ఫ్లై థీమ్ స్పేస్, ఫ్లాట్ రైడ్స్, ఫెర్సీస్ వీల్స్, వెట్–ఓ–వైల్డ్, డ్రాప్ టవర్... ఇవి హాలీవుడ్ సినిమా పేర్లనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఇవన్నీ వినోదభరిత క్రీడల పేర్లు. గతేడాది ఈ క్రీడలపై పెట్టిన ఖర్చు ఏకంగా రూ.2,930 కోట్లు! సినిమా అయితే రెండున్నర గంటల్లో పూర్తవుతుంది. ఇవి మాత్రం రోజంతా... ఇంకా చెప్పాలంటే మళ్లీ మళ్లీ వెళ్లాలనిపించే ప్రాంతాలు. ఈ అమ్యూజ్మెంట్, థీమ్ పార్క్‌లు వినోద, ఆహ్లాదభరితమైన ప్రాంతాలే కాదు.. కాసులు కురిపించే భారీ పరిశ్రమలు కూడా!!. రూ.2,930 కోట్లకు పరిశ్రమ.. ప్రపంచవ్యాప్తంగా అమ్యూజ్మెంట్, థీమ్ పార్క్ పరిశ్రమ విలువ రూ.2.7 లక్షల కోట్లుగా ఉంది. మన దేశంలో 2015లో రూ.2,660 కోట్లుకు చేరిన పరిశ్రమ 2016 నాటికి రూ.2,930 కోట్లకు వృద్ధి చెందినట్లు ‘ది ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ అమ్యూజ్మెంట్ పార్క్ అండ్ ఇండస్ట్రీస్‘ (ఐఏఏపీఐ) చెబుతోంది. వచ్చే మూడేళ్లలో ఏటా 17.5 శాతం వృద్ధితో రూ.4 వేల కోట్లను అధిగమిస్తుందని పేర్కొంది. ఈ పరిశ్రమ ద్వారా ప్రత్యక్షంగా 80 వేల మంది, పరోక్షంగా 1.5 లక్షల మంది ఉపాధిని పొందుతున్నారు. ఏటా 5 కోట్ల మంది సందర్శన.. ప్రస్తుతం దేశంలో 125 అమ్యూజ్మెంట్, థీమ్ పార్క్‌లున్నాయి. యాడ్‌ల్యాబ్స్ ఇమాజికా, ఎస్సెల్ వరల్డ్, నిక్కో పార్క్, వండర్లా, కిష్కింద వంటివి బాగా ప్రసిద్ధి చెందాయి. శరవేగంగా జరుగుతున్న నగరీకరణ, చిన్న కుటుంబాలు, మిగులు ఆదాయం వంటివి అమ్యూజ్మెంట్ పార్క్‌ల సందర్శకుల్లో వృద్ధికి కారణమని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఏటా దేశంలో 5 కోట్ల మంది పార్క్‌లను ఈ సందర్శిస్తున్నారని.. ఏటా 10–15 శాతం వృద్ధి నమోదవుతోందని వండర్లా హాలిడేస్ లిమిటెడ్ ఎండీ అరుణ్ కె చిట్టిలపిల్లి చెప్పారు. పరిశ్రమకు 55 శాతం ఆదాయం టికెట్ల అమ్మకాల ద్వారా, 35 శాతం ఆదాయం ఫుడ్ అండ్ బేవరేజెస్ (ఎఫ్అండ్బీ), మిగిలింది బ్రాండింగ్ ద్వారా వస్తోంది. ద్వంద్వ పన్నులే అడ్డు.. ప్రస్తుతం అమ్యూజ్మెంట్ పార్క్ పరిశ్రమ ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్, సర్వీస్ ట్యాక్స్‌లు రెండింటినీ చెల్లించాల్సి వస్తోంది. మలేíసియా, థాయ్‌ల్యాండ్, సింగపూర్, చైనా, జపాన్ వంటి దేశాల్లో ఈ పరిశ్రమకు పన్నులు 10 శాతం కంటే తక్కువుంటాయి. మన దేశంలో మాత్రం 25–50 శాతం వరకు చెల్లించాల్సి వస్తోంది. ఈ ద్వంద్వ పన్ను విధానమే పరిశ్రమ వృద్ధికి అడ్డుగా మారుతోందని ఐఏఏపీఐ జనరల్ సెక్రటరీ అనిల్ పద్వాల్ తెలిపారు. వాస్తవానికి అమ్యూజ్మెంట్ పార్క్ పరిశ్రమ పర్యాటక రంగంలో భాగం. ఆయా పార్క్‌లతో విదేశీ పర్యాటకులు మన దేశానికొస్తున్నారు. ఏటా టూరిజం వృద్ధి చెందుతోంది కూడా. అమ్యూజ్మెంట్ పార్కుల ఏర్పాటుకు ప్రధానంగా కావాల్సింది భూమి, యంత్ర సామాగ్రి, జల వనరులు, రవాణా సౌకర్యం. ప్రధాన నగరాల్లో భూముల విలువలు పెరగడం, పూర్తిగా యంత్ర సామగ్రిపై ఆధారపడటంతో పార్క్‌ల ఏర్పాటు ప్రారంభ పెట్టుబడులు అధికంగా ఉంటాయని అందుకే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు స్థల కేటాయింపులు, పన్ను ప్రోత్సాహకాలు కల్పించాలని ఆయన కోరారు. త్వరలో అమలులోకి రానున్న వస్తు సేవల పన్ను (జీఎస్టీ)తో ఈ రంగంలో పారదర్శకత నెలకొని, పెట్టుబడులు మరింత వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. నిర్మాణంలో మరో 12 పార్క్‌లు.. వచ్చే ఐదేళ్లలో దేశంలో కొత్తగా మరో 12 అమ్యూజ్మెంట్ పార్క్‌లు అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. వండర్లా, అట్లాంటా, ల్యాండ్‌మార్క్ వంటి కంపెనీలు స్థల సమీకరణ పూర్తి చేసి పార్క్ నిర్మాణ పనులు జరుపుతుంటే.. డిస్నీల్యాండ్, య్యాడ్ల్యాబ్స్ ఇమాజికా వంటి సంస్థలు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో ప్రాథమిక చర్చల్లో ఉన్నాయి. హైదరాబాద్‌లో డిస్నీల్యాండ్.. ప్రస్తుతం హైదరాబాద్‌లో వండర్లా, ఓషన్ వరల్డ్, మౌంట్ ఓపెరా వంటి అమ్యూజ్మెంట్ పార్క్‌లున్నాయి. ఏటా వీటిని 10 లక్షల మంది సందర్శిస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. కొత్తగా నగరంలో యాడ్‌ల్యాబ్స్ ఇమాజికా, డిస్నీల్యాండ్ సంస్థలు థీమ్ పార్క్‌లు ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చాయి. రూ.25 వేల కోట్లతో 1,300 ఎకరాల్లో డిస్నీ థీమ్‌పార్క్‌ను ఏర్పాటు చేయాలనుకుంటోంది. స్థల సమీకరణ కోసం రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలను పరిశీలిస్తోంది. యాడ్‌ల్యాబ్స్ ఇమాజికా నగర శివారులో స్థల సమీకరణ కూడా పూర్తి చేసిందని.. త్వరలోనే నిర్మాణ పనులు ప్రారంభించనుందని తెలిసింది. భలే పార్క్‌లు, బోలెడన్ని రైడ్లు ⇔ వండర్లా హాలిడేస్ లిమిటెడ్‌కు కొచ్చి, బెంగళూరు, హైదరాబాద్‌లో అమ్యూజ్మెంట్ పార్క్‌లున్నాయి. 35 ఎకరాల్లోని కొచ్చి పార్క్‌లో 58 రైడ్స్, 82 ఎకరాల్లోని బెంగళూరు పార్క్‌లో 62 రైడ్స్, 50 ఎకరాల్లోని హైదరాబాద్ పార్క్‌లో 43 రైడ్స్ ఉన్నాయి. ఏటా వీటిని 26 లక్షల మంది సందర్శిస్తున్నారు. ⇔ ఎస్సెల్ గ్రూప్ పాన్ ఇండియా పర్యాటన్ ప్రైవేట్ లిమిటెడ్ (పీఐపీపీఎల్) పేరుతో అమ్యూజ్మెంట్ పార్క్‌లను నిర్వహిస్తోంది. ఈ సంస్థకు ముంబైలో 64 ఎకరాల్లో ఎస్సెల్ వర ల్డ్, 22 ఎకరాల్లో వాటర్ కింగ్డమ్ థీమ్ పార్క్‌లున్నాయి. ఎస్సెల్ వరల్డ్‌లో 90 రైడ్స్ ఉన్నాయి. ఏటా 18 లక్షల మంది సందర్శిస్తున్నారు. వాటర్ కింగ్ డమ్‌లో 30 రైడ్స్ ఉన్నాయి. దీన్ని ఏటా 11 లక్షల మంది సందర్శిస్తున్నారు. ⇔ నిక్కో పార్స్ అండ్ రిసార్ట్స్ లిమిటెడ్ (ఎన్పీఆర్ఎల్) కోల్‌కతాలో నికోపార్క్ను నిర్వహిస్తోంది. 40 ఎకరాల్లో ఉన్న ఈ పార్క్‌లో 35 రకాల రైడ్స్ ఉన్నాయి. ఏటా 15 లక్షల మంది విజిట్ చేస్తున్నారు. ⇔ మహారాష్ట్ర రాయ్‌ఘడ్‌లోని ఖోపొలి ప్రాంతంలో 300 ఎకరాల్లో యాడ్‌ల్యాబ్స్ ఇమాజికా థీమ్ పార్క్ ఉంది. ఇందులో థీమ్, వాటర్, స్నో పార్క్ మూడు కలిపి ఉండటం దీని ప్రత్యేకత. ఏటా ఈ పార్క్‌ను 12 లక్షల మంది సందర్శిస్తున్నారు. -
డ్రగ్ కింగ్ ఇల్లా.. మజాకా?
తన తండ్రి బతికున్న రోజుల్లో తాను మహారాజులా ఉండేవాడినని, అప్పట్లో ఇంట్లో కాకుండా డిస్నీలాండ్లో ఉన్నట్లు అనిపించేదని అలనాటి డ్రగ్ కింగ్ పాబ్లో ఎస్కోబార్ కుమారుడు జువాన్ ఎస్కోబార్ చెప్పాడు. కొలంబియా ప్రాంతంలోనే కాక యావత్ ప్రపంచంలోనే అతి పెద్ద డ్రగ్ స్మగ్లర్‌గా పేరొందిన ఎస్కోబార్.. తన ఇంటి పెరట్లో ఏనుగులు, జీబ్రాలు.. ఇలాంటి పెద్దపెద్ద జంతువులను కూడా పెంచేవాడట. 1993లో ఎస్కోబార్ మరణంతో అతడి డ్రగ్స్ సామ్రాజ్యం మొత్తం కుప్పకూలింది. అప్పుడు పేరు మార్చుకుని కొలంబియా వదిలి వెళ్లిపోయే అవకాశం ఉన్నా జువాన్ మాత్రం అలా చేయలేదు. తన తండ్రి అంటే అతడికి అంతులేని ప్రేమ. ఇంట్లో బోలెడన్ని ఏనుగులు, జిరాఫీలు, పెద్దపెద్ద మోటార్ సైకిళ్లు అన్నీ ఉండేవని, ఇక ఖర్చుపెట్టుకోడానికి డబ్బులైతే లెక్కలేనన్ని ఉండేవని జువాన్ చెప్పాడు. తండ్రి కోసం కావాలంటే తన ప్రాణాలు సైతం ఇవ్వడానికి సిద్ధంగా ఉండేవాడినన్నాడు. తన తండ్రిని ద్వేషించడానికి తనకు ఒక్క కారణం కూడా లేదని, ఎందుకంటే ఆయన ఏం చేస్తారో అప్పటికి తనకు సరిగ్గా తెలియదని వివరించాడు. ఈశాన్య కొలంబియాలోని మెడెలిన్ అనే పట్టణంలో ఒక నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన ఎస్కోబార్.. ప్రపంచంలోనే మోస్ట్ వాంటెడ్ స్మగ్లర్‌గా ఎదిగాడు. కొకైన్ స్మగ్లింగ్ ద్వారా దాదాపు వారానికి 2862 కోట్ల రూపాయలు సంపాదించేవాడు! డ్రగ్స్ స్మగ్లింగ్ నుంచి మొదలుపెట్టి.. వేలాది హత్యలు చేయించడం, చివరకు ఒక విమానాన్ని కూడా పేల్చేసేవరకు తన నేరసామ్రాజ్యాన్ని విస్తరించాడు. సంపాదించిన డబ్బులో చాలావరకు పేదలకు పంచిపెట్టేసేవాడు. దాంతో అతడిని కొలంబియా రాబిన్ హుడ్ అనేవారు. పార్లమెంటుకు పోటీ చేయాలని భావించడంతోనే తన తండ్రి పతనం ప్రారంభమైందని జువాన్ ఎస్కోబార్ చెప్పాడు. ఎన్నికల్లో పోటీ అంటేనే అందరి దృష్టి ఆయనమీద పడుతుందని, ఆ పని చేసి ఉండకపోతే ఇప్పటికీ తన తండ్రి బతికే ఉండేవాడని తెలిపాడు. చాలాసార్లు పోలీసు దాడులు, ఇతర గ్యాంగ్స్టర్ల దాడుల నుంచి తప్పించుకున్న ఎస్కోబార్.. చివరకు 1993 డిసెంబర్ రెండో తేదీన కొలంబియా పోలీసుల కాల్పులలో మరణించాడు. తన తండ్రి చనిపోవడానికి పది నిమిషాల ముందు కూడా ఆయనతో తాను మాట్లాడానని జువాన్ అన్నాడు. తండ్రి పోయిన ఆవేశంలో.. ఆయన వ్యాపారాన్ని తాను కొనసాగిస్తానని చెప్పినా, తర్వాత నిర్ణయం మార్చుకుని శాంతియుత జీవనం గడిపాడు. -
పిల్లల కలల రాజ్యం
డిస్నీల్యాండ్ డిస్నీల్యాండ్‌లో అడుగు పెట్టిన దగ్గర్నుంచి బయటకొచ్చేదాకా అంతా సంబ్రమాశ్చర్యాలే. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా పిల్లల కోసం ఏడు డిస్నీల్యాండ్‌లు, డిస్నీ థీమ్ పార్క్‌లు ఉన్నాయి. వీటిలో ఎక్కడికెళ్లాలనే సందేహమొస్తే... మనకు దగ్గరగా ఉన్నది ఎంచుకోవటమే బెటర్. ప్రస్తుతం ఆసియా, అమెరికాల్లో డిస్నీల్యాండ్‌లు తలా 3 చొప్పున ఉండగా ఒక్కటి మాత్రం యూరప్‌లో... అంటే ఫ్రాన్స్‌లో ఉంది. అవి... అమెరికా: కాలిఫోర్నియా, ఫ్లారిడా, హవాయి. ఆసియా: హాంకాంగ్, టోక్యో, షాంఘై. యూరప్: ఫ్రాన్స్ (పారిస్) * ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల వారికి హాంకాంగే దగ్గర. కాకపోతే తమ కుటుంబీకులో, బంధుమిత్రులో ఉన్నారని అమెరికా వెళ్లే వారికి మాత్రం అక్కడి డిస్నీల్యాండే ఉత్తమం. * హైదరాబాద్ నుంచి హాంకాంగ్‌కు నేరుగా విమానాలున్నాయి. కాస్త ముందుగా బుక్ చేసుకుంటే ఛార్జీలు ఒక మనిషికి తక్కువలో తక్కువ ఒకరికి రూ. 21వేల నుంచి మొదలవుతాయి. * డిస్నీల్యాండ్ ఎంట్రన్స్ టికెట్ ఛార్జీలు ఒక వ్యక్తికి రూ.5 వేల నుంచి మొదలవుతాయి. ముగ్గురికి రూ.12వేల వంటి ప్యాకేజీలు ఎప్పటికప్పుడు దొరుకుతుంటాయి. * ఇక డిస్నీల్యాండ్లోనే హోటళ్లుంటాయి. వాటిలో బస చేయాలంటే మాత్రం ఛార్జీలు కాస్త ఎక్కువ. * కొన్ని ట్రావెల్ సంస్థలు నాలుగు రోజుల హాంకాంగ్ ప్యాకేజీకి ఇద్దరు షేర్ చేసుకునే ప్రాతిపదికపై ఒక వ్యక్తికి రూ.40-50 వేల వరకూ వసూలు చేస్తున్నాయి. వీటిలో డిస్నీల్యాండ్‌లో ఒకరోజు బస కూడా ఉంటుంది. ఎప్పుడు సందర్శించొచ్చు? * మే నుంచి సెప్టెంబరు మధ్య సందర్శకుల తాకిడి ఎక్కువ. * అక్టోబరు- ఏప్రిల్ మధ్య కూడా సందర్శకులు బాగానే వస్తుంటారు. ఎందుకంటే ఈ సమయాల్లో డిస్కౌంట్లు ఎక్కువగా ఉంటాయి. -
నగరంలో ‘డిస్నీల్యాండ్’!
రూ. 25 వేల కోట్లతో 300 ఎకరాల్లో ఏర్పాటు సాక్షి, హైదరాబాద్: అమెరికాలో చిన్నారుల వింత ప్రపంచం డిస్నీల్యాండ్.. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో త్వరలో కొలువుకానుంది. హాంకాంగ్.. షాంఘై.. తదితర విశ్వనగరాల్లో చిన్నారులకు ఆటవిడుపుగా అద్భుత ప్రపంచం సృష్టించిన అమెరికన్ సంస్థ డిస్నీల్యాండ్ ఆధ్వర్యంలోనే రాజధానిలోనూ డిస్నీల్యాండ్ ఏర్పాటుకు రంగం సిద్ధమయినట్లు విశ్వసనీయంగా తెలిసింది. టూరిజం శాఖ ఇందుకు సంబంధించిన సన్నాహాల రూపకల్పనలో నిమగ్నమైంది. దాదాపు 300 ఏకరాల స్థలంలో రూ. 25 వేల కోట్లతో దీన్ని నిర్మించనున్నారు. ఇందులో ప్రాచీన కట్టడాలు, యూరోపియన్ బిల్డింగ్స్, డ్రాగన్స్, డోనాల్డ్ డక్‌లు పిల్లలకు సంబంధించిన పలు అంశాలు ఏర్పాటు చేస్తారు. డిస్నీల్యాండ్ నిర్వాహకులు వచ్చే వారంలో హైదరాబాద్‌కు వచ్చి రాష్ట్ర ప్రభుత్వంతో ఈ విషయమై చర్చించనున్నారు. -
ఫుల్ ఎంజాయ్...
‘సర్దార్ గబ్బర్‌సింగ్’తో పాటు తమిళ చిత్రాలు, రెండు హిందీ చిత్రాలు చేస్తున్న రాయ్ లక్ష్మి కొత్త సంవత్సరం సందర్భంగా అమెరికా వెళ్లిపోయారు. దాదాపు అరడజను మంది స్నేహితులతో నాలుగైదు రోజుల క్రితమే ఇక్కణ్ణుంచి వెళ్లిన రాయ్ లక్ష్మి అమెరికాలో చూడవలసినవన్నీ చూస్తున్నారు. డిస్నీల్యాండ్ వెళ్లారు. అక్కడికెళ్లగానే చిన్నపిల్లలా అయిపోయాననీ, చుట్టూ జనాలు ఉన్న విషయాన్ని మర్చిపోయి హ్యాపీగా ఫుల్ ఎంజాయ్ చేశాననీ రాయ్ లక్ష్మి అన్నారు. యూనివర్సల్ స్టూడియోను కూడా సందర్శించారు. హాలీవుడ్లో ఉన్న ఆరు పెద్ద ఫిలిమ్ స్టూడియోల్లో ఇదొకటి. స్టూడియోలోని సౌకర్యాలు చూసి మైమరచిపోయానని లక్ష్మీ రాయ్ పేర్కొన్నారు. -
'ప్రతి ముస్లిం ముప్పేనని అమెరికా భావిస్తోంది'
లండన్: అమెరికాలో సెలవులను గడుపాలని, డిస్నీల్యాండ్‌ను పిల్లలకు చూపించాలని తపించిన ఓ తండ్రికి నిరాశ ఎదురైంది. తన సోదరుడు, తొమ్మిది మంది పిల్లలతో కలిసి బయలుదేరిన ఆయనను గేట్‌విక్ విమానాశ్రయంలో అమెరికా అధికారులు విమానం ఎక్కనివ్వకుండా అడ్డుకున్నారు. బ్రిటన్ వాసి అయిన మహమ్మద్ తారిఖ్ మహమూద్ కుటుంబానికి ఈ చేదు అనుభవం ఎదురైంది. లాస్ ఏంజిల్స్‌కు బయలుదేరనున్న విమానంలో ప్రయాణించేందుకు వారిని అనుమతించలేదు. అమెరికా భద్రతా సంస్థ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ సంస్థ ఆదేశాల కారణంగానే వారి పట్ల ఈ చర్యకు పాల్పడినట్టు తెలుస్తున్నది. ఈ ఘటనపై తారిఖ్ మహమూద్ స్పందిస్తూ విమానం ఎక్కనివ్వకుండా తమను అడ్డుకోవడంపై అమెరికా అధికారులు ఎలాంటి వివరణ ఇవ్వాలని, దీంతో సెలవుల్లో అమెరికా వెళ్లాలన్న తమ ఆశ ఆడియాస అయిందని చెప్పారు. అమెరికాపై జరిగిన దాడులతో ప్రతి ముస్లిం తమకు ముప్పేనని వారు భావించడమే తమను అడ్డుకోవడానికి కారణమని ఆయన చెప్పారు. ఈ ఘటనపై లేబర్ పార్టీ ఎంపీ స్టెల్లా క్రిసీ బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరాన్‌కు లేఖ రాశారు. ఈ విషయమై అమెరికా అధికారుల నుంచి వివరణ కోరాలని విజ్ఞప్తి చేశారు. దీంతో ఈ ఘటనపై విచారణ చేయనున్నట్టు కామెరాన్ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు.