పిల్లల కలల రాజ్యం | Children's Dream Kingdom of Disneyland | Sakshi
Sakshi News home page

పిల్లల కలల రాజ్యం

Sep 26 2016 11:42 PM | Updated on Sep 4 2017 3:05 PM

పిల్లల కలల రాజ్యం

పిల్లల కలల రాజ్యం

డిస్నీల్యాండ్‌లో అడుగు పెట్టిన దగ్గర్నుంచి బయటకొచ్చేదాకా అంతా సంబ్రమాశ్చర్యాలే. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా పిల్లల కోసం...

డిస్నీల్యాండ్
డిస్నీల్యాండ్‌లో అడుగు పెట్టిన దగ్గర్నుంచి బయటకొచ్చేదాకా అంతా సంబ్రమాశ్చర్యాలే. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా పిల్లల కోసం ఏడు డిస్నీల్యాండ్‌లు, డిస్నీ థీమ్ పార్క్‌లు ఉన్నాయి. వీటిలో ఎక్కడికెళ్లాలనే సందేహమొస్తే... మనకు దగ్గరగా ఉన్నది ఎంచుకోవటమే బెటర్. ప్రస్తుతం ఆసియా, అమెరికాల్లో డిస్నీల్యాండ్‌లు తలా 3 చొప్పున ఉండగా ఒక్కటి మాత్రం యూరప్‌లో... అంటే ఫ్రాన్స్‌లో ఉంది. అవి...
అమెరికా: కాలిఫోర్నియా, ఫ్లారిడా, హవాయి.
ఆసియా: హాంకాంగ్, టోక్యో, షాంఘై.
యూరప్: ఫ్రాన్స్ (పారిస్)
   
* ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల వారికి హాంకాంగే దగ్గర. కాకపోతే తమ కుటుంబీకులో, బంధుమిత్రులో ఉన్నారని అమెరికా వెళ్లే వారికి మాత్రం అక్కడి డిస్నీల్యాండే ఉత్తమం.
* హైదరాబాద్ నుంచి హాంకాంగ్‌కు నేరుగా విమానాలున్నాయి. కాస్త ముందుగా బుక్ చేసుకుంటే ఛార్జీలు ఒక మనిషికి తక్కువలో తక్కువ ఒకరికి రూ. 21వేల నుంచి మొదలవుతాయి.
* డిస్నీల్యాండ్ ఎంట్రన్స్ టికెట్ ఛార్జీలు ఒక వ్యక్తికి రూ.5 వేల నుంచి మొదలవుతాయి. ముగ్గురికి రూ.12వేల వంటి ప్యాకేజీలు ఎప్పటికప్పుడు దొరుకుతుంటాయి.
* ఇక డిస్నీల్యాండ్‌లోనే హోటళ్లుంటాయి. వాటిలో బస చేయాలంటే మాత్రం ఛార్జీలు కాస్త ఎక్కువ.
* కొన్ని ట్రావెల్ సంస్థలు నాలుగు రోజుల హాంకాంగ్ ప్యాకేజీకి ఇద్దరు షేర్ చేసుకునే ప్రాతిపదికపై ఒక వ్యక్తికి రూ.40-50 వేల వరకూ వసూలు చేస్తున్నాయి. వీటిలో డిస్నీల్యాండ్‌లో ఒకరోజు బస కూడా ఉంటుంది.
 
ఎప్పుడు సందర్శించొచ్చు?

* మే నుంచి సెప్టెంబరు మధ్య సందర్శకుల తాకిడి ఎక్కువ.
* అక్టోబరు- ఏప్రిల్ మధ్య కూడా సందర్శకులు బాగానే వస్తుంటారు. ఎందుకంటే ఈ సమయాల్లో డిస్కౌంట్లు ఎక్కువగా ఉంటాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement