ప్రపంచంలోని అత్యంత ఖరీదైన క్లబ్‌లలో డిస్నీలాండ్‌కు చెందిన క్లబ్–33 ఒకటి. దీనిలో సభ్యత్వానికి ప్రవేశ రుసుముగా 50 వేల డాలర్లు (రూ.41.02 లక్షలు), వార్షిక రుసుముగా 15 వేల డాలర్లు (రూ.12.30 లక్షలు) చెల్లించాల్సి ఉంటుంది. ప్రపంచంలోని అత్యంత విలక్షణమైన డిన్నర్ క్లబ్బులలో ఒకటిగా ఇది పేరు పొందింది. తొలుత దీనిని 1967లో ఏర్పాటు చేశారు. తర్వాతి కాలంలో ఫ్లోరిడాలోని డిస్నీలాండ్ పార్కులోను, టోక్యో, షాంఘై సహా పలు నగరాల్లోని డిస్నీ పార్కుల్లోనూ ఈ క్లబ్ శాఖలను ఏర్పాటు చేశారు.
న్యూ ఆలీన్జ్ స్క్వేర్‌లోని 33 రాయల్ స్ట్రీట్‌లో ఉన్న డిస్నీపార్కు చిరునామా ఆధారంగా ఈ క్లబ్‌కు క్లబ్–33 అని పేరు పెట్టారు. క్లబ్ తొలి శాఖను ఇక్కడే నెలకొల్పారు. తొలిరోజుల్లో ఈ క్లబ్ డిస్నీలాండ్ కార్పొరేట్ స్పాన్సర్లకు మాత్రమే పరిమితంగా పనిచేసేది. వాల్ట్ డిస్నీ మరణానంతరం ఇందులో ఇతర వీఐపీలకు కూడా సభ్యత్వం కల్పించడం ప్రారంభించారు. సామాన్యుల కంట కనబడకుండా ఉండటానికి హాలీవుడ్ సెలబ్రిటీలు ఎక్కువగా ఇక్కడ డిన్నర్ పార్టీలు చేసుకుంటూ ఉంటారు.
(చదవండి: 13 ఏళ్ల అమ్మాయి..తల్లిదండ్రులకు ఓ రేంజ్‌లో షాక్ ఇచ్చింది!)
Comments
Please login to add a commentAdd a comment