రెండు నెలల కిందటి వరకు సామాన్యులకు అందుబాటులోనే ఉన్న టొమాటో ధరలు ఇటీవలి కాలంలో కళ్లుబైర్లు కమ్మిస్తున్నాయి. దేశవ్యాప్తంగా టొమాటో ధరలు కిలో వంద రూపాయలకు పైగానే ఉన్నాయి. కొన్నిచోట్ల కిలో రెండువందల యాభై వరకు కూడా పలుకుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ధరలకే జనాలు బెంబేలుపడుతుంటే.. ఇంకో రకం టొమాటో ధర వింటే అమ్మ బాబోయ్! అంటారు
టొమాటోల్లో ఒక రకానికి చెందిన విత్తనాల ధర బంగారం కంటే ఎక్కువే! ‘హజేరా జెనెటిక్స్’ అనే యూరోపియన్ విత్తనాల కంపెనీ ‘సమ్మర్ సన్’ రకానికి చెందిన టొమాటో విత్తనాలను కిలో 3.50 లక్షల డాలర్లకు (దాదాపు రూ.3 కోట్లు) విక్రయిస్తోంది. ఈ విత్తనాలతో పండే టొమాటోల ధర యూరోప్ మార్కెట్‌లో కిలో దాదాపు 30 డాలర్ల (సుమారు రూ.2,500) వరకు ఉంటుంది. ఈ లెక్కన మన టొమాటోలు చౌకగా దొరుకుతున్నట్లే! ఈ రకం ఒక్కో విత్తనానికి సగటున ఇరవై కిలోల వరకు దిగుబడినిస్తుంది.
(చదవండి: ఆ దీవిలో అడుగుపెట్టాలంటే హడలిపోవాల్సిందే! బతుకు మీద ఆశ వదులుకోవాల్సిందే)
Comments
Please login to add a commentAdd a comment