‘మామా.. హైదరాబాద్‌కు డిస్నీల్యాండ్‌ తీసుకొని రా’..కేటీఆర్‌కు చిన్నారి రిక్వెస్ట్‌ | KTR Reply To Girl Request To Bring Disneyland To Hyderabad | Sakshi
Sakshi News home page

‘మామా.. హైదరాబాద్‌కు డిస్నీల్యాండ్‌ తీసుకొని రా’..కేటీఆర్‌కు చిన్నారి రిక్వెస్ట్‌

Published Wed, Nov 29 2023 11:53 AM | Last Updated on Wed, Nov 29 2023 2:52 PM

KTR Reply To Girl Request To Bring Disneyland To Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ఐటీ, మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్‌ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. రాజకీయ అంశాలతోపాటు వర్తమాన విషయాలు, నెటిజన్లు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇస్తుంటారు. ఆపదలో ఉన్న వారికి కూడా సాయం అందిస్తుంటారు. ఓ పక్క ఎన్నికల హడావిడీలో బిజీ బిజీగా గడుపుతున్న కేటీఆర్‌.. తాజాగా  ఎక్స్‌లో (ట్విటర్‌)ఓ చిన్నారి అడిగిన ప్రశ్నకు స్పందించారు.

‘కేటీఆర్ మామా.. హైదరాబాద్‌కు డిస్నీ ల్యాండ్ తీసుకొని రా ప్లీజ్’ అంటూ  ఓ చిన్నారి తన కోరికను తెలిపింది. ఈ వీడియోను ఆమె తండ్రి సురేంద్ర వినాయకం ట్విట్టర్‌లో పోస్టు చేశారు. ఈ వీడియోపై మంత్రి కేటీఆర్ స్పందించారు.

‘ప్రామిస్ చేయలేను కానీ బేటా.. తీసుకువచ్చే ప్రయత్నం అయితే చేస్తాను’ అంటూ సదరు చిన్నారికి రిప్లై ఇచ్చారు. ఈ పోస్టు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదిలా ఉండగా ఇటీవల ‘కేటీఆర్ తాతకు ఓటేస్తానంటూ’ అనన్య అనే ఓ చిన్నారి తల్లితో మారాం చేస్తూ మాట్లాడిన ముద్దు మాటలు అందర్నీ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.
చదవండి: సర్వేల్లో నిజమెంత?.. తెలంగాణలో గెలుపెవరిది?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement