సాక్షి, హైదరాబాద్: ఆకలి సూచీ (హంగర్ ఇండెక్స్)లో భారత్ స్థానం దిగజారడంపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ఎద్దేవా చేస్తూ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. 121 దేశాల జాబితాతో విడుదలైన ఆకలి సూచీలో భారత్ 101వ స్థానం నుంచి 107 స్థానానికి పడిపోయింది. ఈ అంశంపై టీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు.
‘ఎన్‌డీఏ ప్రభుత్వం సాధించిన మ రో అద్భుతమైన విజ యం ఇది. ఆకలి సూ చీలో భారత్ 101వ స్థానం నుంచి 107వ స్థానానికి చేరింది. ఈ వైఫల్యాన్ని కూడా బీజేపీ జోకర్స్ అంగీకరించకుండా.. భారత్‌కు వ్యతిరేకంగా వచ్చిన నివేదిక అని కొట్టిపారేస్తారని అనుకుంటున్నా’అని కేటీఆర్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. అచ్చేదిన్ అనే హ్యాష్‌ట్యాగ్‌తో ఓ ఆంగ్ల పత్రికలోని వార్తను ట్వీట్‌కు జత చేశారు.
Comments
Please login to add a commentAdd a comment