బాలీవుడ్ జంట రణ్‌వీర్ సింగ్-దీపికా పదుకొనేలపై ఓ మహిళ సంచలన ఆరోపణలు చేశారు. ఓర్లాండో(ఫ్లోరిడా) డిస్నీ ల్యాండ్ ఆ జంట చక్కర్లు కొడుతున్న ఫోటోలు కొన్నిరోజుల క్రితం వైరల్ అయ్యాయి. అయితే ఆ సమయంలో వీడియో తీసిన ఓ మహిళతో వీరిద్దరూ దురుసుగా ప్రవర్తించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు బాధితురాలు జైనబ్ ఖాన్ సోషల్ మీడియాలో వరుసగా పోస్టులు ఉంచారు.