రవీంద్రభారతికి నెలరోజుల విరామం..!
పునరుద్ధరణ పనులకు శ్రీకారం
సాక్షి,సిటీబ్యూరో : దీర్ఘకాలంగా సమస్యలతో రవీంద్రభారతి కళ తప్పింది. దీంతో ‘సాక్షి’లో ఆగష్టు 30న ‘కళా విహీనం’ శీర్షికన కథనం ప్రచురితమైంది. దీనిపైటూరిజం- సాంస్కృతిక శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం స్పందించారు. టీఎస్‌టీడీసీ విభాగంలో అభివృద్ధి పనులను పరిశీలించే ఎస్‌ఈతో మాట్లాడి వెంటనే పనులు చేపట్టాలని సూచించారు. ఆ మేరకు గురువారం టీఎస్‌టీడీసీ డీఈ ఆశోక్ కుమార్ రవీంద్రభారతిని పరిశీలించి, సాంస్కృతిక డెరైక్టర్ మామిడి హరికృష్ణతో కలిసి ఎక్కడెక్కడ పునరుద్ధరణ పనులపై అంచనాలు సిద్ధం చేశారు. ఆయా పనులకు సంబంధించి టెండర్ల పని వేగవంతం చేశారు.
ఈ పనుల నిమిత్తం అక్టోబర్ ఒకటి నుంచి రవీంద్రభారతిని నెలరోజుల పాటు టీఎస్‌టీడీసీకి అప్పగించనున్నారు. ఈ పనులు పూర్తయ్యే వరకు ఎలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించే అవకాశం ఉండదని టూరిజం శాఖ అధికారులు తెలిపారు.