TSTDC section
-
లాంచీలో విహరిద్దాం..అందాలు తిలకిద్దాం
సాక్షి, సిటీబ్యూరో : లాంచీలో 120 కిలోమీటర్లు... 5గంటల ప్రయాణం.. ఎన్నో అద్భుత ప్రాంతాల వీక్షణం.. ఊహించుకుంటేనే అద్భుతమైన అనుభూతిలా అనిపిస్తుంది కదూ! ఈ అనుభూతి మీరూ పొందాలంటే చలో సాగర్. తెలంగాణ పర్యాటకాభివృద్ధిసంస్థ(టీఎస్‌టీడీసీ) నాగార్జునసాగర్–శ్రీశైలం బోటింగ్ టూర్‌కు శ్రీకారం చుట్టింది. రోడ్ కమ్ రివర్ టూర్ పేరుతోఈ నెల 8 నుంచి నిర్వహించనుంది. నాలుగేళ్లుగా ఆశించిన మేర నీరు లేకపోవడంతో ఈ ప్రయాణానికి బ్రేకులు పడ్డాయి. ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు కువరడంతో సాగర్‌లో బోటింగ్‌కు సరిపడా నీరు చేరింది. దీంతో టీఎస్‌టీడీసీ టూర్ ఏర్పాటు చేసింది. నాగార్జుసాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు. సాగర్–శ్రీశైలం బోటింగ్ ప్రయాణం ప్రారంభించాలంటే కనీసం 570 అడుగుల నీటిమట్టం ఉండాలి. ప్రస్తుతం ఈ మేరకు ఉండడంతో పర్యాటకులకు బోటింగ్ అవకాశం లభించింది. టూర్ ఇలా... ఈ టూర్ బుధ, శనివారాల్లో మాత్రమే ఉంటుంది. ఇది రెండు రోజుల ప్యాకేజీ. ఈ నెల 8న ఉదయం 6:30 సికింద్రాబాద్ యాత్రినివాస్ నుంచి టూర్ ప్రారంభమవుతుంది. బస్ 7గంటలకు బషీర్‌బాగ్ సీఆర్వోకు చేరుకుంటుంది. అక్కడి నుంచి 10:30గంటలకు నాగార్జునసాగర్ చేరుకుంటుంది. ఉదయం 10:30గంటలకు లాంచీ ప్రయాణం మొదలవుతుంది. సాయంత్రం 4:30గంటలకు లాంచీ శ్రీశైలం చేరుకుంటుంది. శ్రీశైలంలో రోడ్డు మార్గంలో సాక్షి గణపతి చూపిస్తారు. రాత్రి ప్రైవేట్ హోటల్లో బస ఉంటుంది. రెండోరోజు ఉదయం 9:30గంటల నుంచి స్థానిక ప్రదేశాలను చూపిస్తారు. మధ్యాహ్నం 1:30గంటలకు శ్రీశైలం నుంచి ప్రయాణం ప్రా రంభమవుతుంది. సాయంత్రం 6గంటలకు హైదరాబాద్ చేరుకుంటారు. ధర ఎంత? పెద్దలకు రూ.3 వేలు (నాన్ ఏసీ), చిన్నారులకు(5–12 ఇయర్స్) రూ.2,400 చెల్లించాలి. ట్రాన్స్‌పోర్టు, లాంచీ ప్రయాణం, శ్రీశైలంలో బస టీఎస్‌టీడీసీ చూసుకుంటుంది. లాంచీలో భోజన వసతి ఏర్పాటు చేస్తారు. రెండో రోజు మాత్రం బ్రేక్‌ఫాస్ట్, లంచ్ వ్యక్తిగతమే. వివరాలకు 040–23262151, 52, 53, 54, 57 నెంబర్లలో సంప్రదించొచ్చు. సెల్ నెంబర్లు: 98485 40371, 98483 06435, 98481 26947. టోల్‌ఫ్రీ నెంబర్:180042546464. చాయిస్ మీదే... నగరవాసుల సౌకర్యార్థం ఈ టూర్ ఏర్పాటు చేశాం. వినోదంతో పాటు ఆధ్యాత్మికత జత చేశాం. టూర్ ఎంపికలో ప్రయాణికులు చాయిస్ ఉంది. ఎవరైనా సొంత వాహనాల్లో వచ్చి కేవలం బోటింగ్ చేయొచ్చు. బోటింగ్‌కు రానుపోను పెద్దలకు రూ.2,200, పిల్లలకు రూ.1,800. అదే కేవలం వన్‌వే అయితే పెద్దలకు రూ.1,000, పిల్లలకు రూ.800. – బి.మనోహర్, టీఎస్‌టీడీసీ ఎండీ -
దేశంలోనే అగ్రగామిగా రాష్ట్ర టూరిజం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పర్యాటక రంగాన్ని దేశంలోనే అగ్రగామిగా తీర్చిదిద్దనున్నామని టీఎస్‌టీడీసీ చైర్మన్ పి.భూపతిరెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రానికి టూరిజమే ప్రధాన ఆదాయ వనరు అయ్యేందుకు కృషి చేస్తానని చెప్పారు. సోమవారం హిమాయత్‌నగర్‌లోని టీఎస్‌టీడీసీ భవన్లో తొలిసారిగా ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. సింగపూర్, థాయ్ లాండ్ దేశాలు ప్రపంచంలో టూరిజంలో అగ్రస్థానంలో ఉన్నాయని.. ఆ దేశాల స్ఫూర్తితో రాష్ట్రాన్నీ దేశంలోనే టూరిజంలో నంబర్‌వన్‌గా నిలుపుతానన్నారు. రాష్ట్రంలోని 31 జిల్లాల్లో హరిత హోటళ్లు, రెస్టారెంట్లు, కాళేశ్వరం ప్రాజెక్టుకు టూరిజం బస్సులను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మిషన్ కాకతీయలో భాగం గా ఏర్పాటు చేసిన మినీ ట్యాంక్‌బండ్‌లలో బోటింగ్ ఏర్పాటు చేస్తామన్నారు. రాష్ట్రంలోని చెరువుల వద్ద బోటింగ్, కొండ ప్రాంతాల్లో రోప్ వేలు ఏర్పాటు చేసి, ప్రసిద్ధ స్థలాలను అభివృద్ధి చేస్తామన్నారు. త్వరలో బ్యాటరీ వాహనాలు.. టీఎస్‌టీడీసీ ఎండీ మనోహర్ మాట్లాడుతూ.. నిర్మల్, మంచిర్యాల, మహబూబ్‌నగర్ జిల్లాల కలెక్టర్లు హోటళ్ల నిర్మాణానికి స్థలం ఇస్తామన్నారని చెప్పారు. హైదరాబాద్‌లోని టూరి జం ప్లాజా వద్ద పర్మినెంట్ ఫుడ్‌స్టాల్ ఏర్పా టుకు టెండర్లు పిలిచామన్నారు. త్వరలోనే బ్యాటరీ వాహనాలను సాలార్జంగ్ మ్యూజి యం నుంచి చార్మినార్, చౌమహల్లా ప్యాలెస్, నిజాం మ్యూజియం మీదుగా తిప్పనున్నట్లు తెలిపారు. సోమశిల నుంచి శ్రీశైలానికి 100 కి.మీ. మేర బోటు నడుపుతామన్నారు. జోగుళాంబ ఆలయ ప్రాంతంలో రూ.50 నుంచి రూ.80 కోట్లు ఖర్చు చేస్తామ న్నారు. సిరిసిల్లలో బడ్జెట్ హోటల్‌కు 13న శంకుస్థాపన చేస్తామన్నారు. అల్లీసాగర్ ప్రాజె క్టు వద్ద కాటేజీలు నిర్మిస్తామని అనంతగిరిని ఊటీ తరహాలో తీర్చిదిద్దుతామని తెలిపారు. -
టీఎస్‌టీడీసీ చైర్మన్‌గా భూపతిరెడ్డి ప్రమాణస్వీకారం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ స్టేట్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్(టీఎస్‌టీడీసీ) చైర్మన్‌గా పి.భూపతిరెడ్డి పదవీ ప్రమాణస్వీకారం చేశారు. శనివారం హిమాయత్‌నగర్‌లోని టీఎస్ టీడీసీ భవన్లో ఈ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. టీఎస్‌టీడీసీ ఎండీ బి.మనోహర్ ఆయన చేత ప్రమాణస్వీకారం చేయించారు. ఈ సందర్భంగా భూపతిరెడ్డి మాట్లాడుతూ... పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి పాటుపడతానన్నారు. కార్యక్రమంలో టీఎస్‌టీడీసీ పీఆర్వో పురందర్, టీఎస్‌టీడీసీ అధికారులు సుమిత్‌సింగ్, జనార్దన్, సత్యకుమార్‌రెడ్డి పాల్గొన్నారు. అంతకుముందు టీఎస్‌టీడీసీ కాంట్రాక్ట్ – ఔట్సోర్సింగ్ ఎంప్లా యీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సబ్బు రాజమౌళి తన సంఘ ప్రతినిధులతో భూపతిరెడ్డిని కలసి అభినందనలు తెలిపారు. -
రవీంద్రభారతికి నెలరోజుల విరామం..!
పునరుద్ధరణ పనులకు శ్రీకారం సాక్షి,సిటీబ్యూరో : దీర్ఘకాలంగా సమస్యలతో రవీంద్రభారతి కళ తప్పింది. దీంతో ‘సాక్షి’లో ఆగష్టు 30న ‘కళా విహీనం’ శీర్షికన కథనం ప్రచురితమైంది. దీనిపైటూరిజం- సాంస్కృతిక శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం స్పందించారు. టీఎస్‌టీడీసీ విభాగంలో అభివృద్ధి పనులను పరిశీలించే ఎస్ఈతో మాట్లాడి వెంటనే పనులు చేపట్టాలని సూచించారు. ఆ మేరకు గురువారం టీఎస్‌టీడీసీ డీఈ ఆశోక్ కుమార్ రవీంద్రభారతిని పరిశీలించి, సాంస్కృతిక డెరైక్టర్ మామిడి హరికృష్ణతో కలిసి ఎక్కడెక్కడ పునరుద్ధరణ పనులపై అంచనాలు సిద్ధం చేశారు. ఆయా పనులకు సంబంధించి టెండర్ల పని వేగవంతం చేశారు. ఈ పనుల నిమిత్తం అక్టోబర్ ఒకటి నుంచి రవీంద్రభారతిని నెలరోజుల పాటు టీఎస్‌టీడీసీకి అప్పగించనున్నారు. ఈ పనులు పూర్తయ్యే వరకు ఎలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించే అవకాశం ఉండదని టూరిజం శాఖ అధికారులు తెలిపారు.