సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పర్యాటక రంగాన్ని దేశంలోనే అగ్రగామిగా తీర్చిదిద్దనున్నామని టీఎస్‌టీడీసీ చైర్మన్ పి.భూపతిరెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రానికి టూరిజమే ప్రధాన ఆదాయ వనరు అయ్యేందుకు కృషి చేస్తానని చెప్పారు. సోమవారం హిమాయత్‌నగర్‌లోని టీఎస్‌టీడీసీ భవన్‌లో తొలిసారిగా ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. సింగపూర్, థాయ్ లాండ్ దేశాలు ప్రపంచంలో టూరిజంలో అగ్రస్థానంలో ఉన్నాయని.. ఆ దేశాల స్ఫూర్తితో రాష్ట్రాన్నీ దేశంలోనే టూరిజంలో నంబర్‌వన్‌గా నిలుపుతానన్నారు. రాష్ట్రంలోని 31 జిల్లాల్లో హరిత హోటళ్లు, రెస్టారెంట్లు, కాళేశ్వరం ప్రాజెక్టుకు టూరిజం బస్సులను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మిషన్ కాకతీయలో భాగం గా ఏర్పాటు చేసిన మినీ ట్యాంక్‌బండ్‌లలో బోటింగ్ ఏర్పాటు చేస్తామన్నారు. రాష్ట్రంలోని చెరువుల వద్ద బోటింగ్, కొండ ప్రాంతాల్లో రోప్ వేలు ఏర్పాటు చేసి, ప్రసిద్ధ స్థలాలను అభివృద్ధి చేస్తామన్నారు.
త్వరలో బ్యాటరీ వాహనాలు..
టీఎస్‌టీడీసీ ఎండీ మనోహర్ మాట్లాడుతూ.. నిర్మల్, మంచిర్యాల, మహబూబ్‌నగర్ జిల్లాల కలెక్టర్లు హోటళ్ల నిర్మాణానికి స్థలం ఇస్తామన్నారని చెప్పారు. హైదరాబాద్‌లోని టూరి జం ప్లాజా వద్ద పర్మినెంట్ ఫుడ్‌స్టాల్ ఏర్పా టుకు టెండర్లు పిలిచామన్నారు. త్వరలోనే బ్యాటరీ వాహనాలను సాలార్‌జంగ్ మ్యూజి యం నుంచి చార్మినార్, చౌమహల్లా ప్యాలెస్, నిజాం మ్యూజియం మీదుగా తిప్పనున్నట్లు తెలిపారు. సోమశిల నుంచి శ్రీశైలానికి 100 కి.మీ. మేర బోటు నడుపుతామన్నారు. జోగుళాంబ ఆలయ ప్రాంతంలో రూ.50 నుంచి రూ.80 కోట్లు ఖర్చు చేస్తామ న్నారు. సిరిసిల్లలో బడ్జెట్ హోటల్‌కు 13న శంకుస్థాపన చేస్తామన్నారు. అల్లీసాగర్ ప్రాజె క్టు వద్ద కాటేజీలు నిర్మిస్తామని అనంతగిరిని ఊటీ తరహాలో తీర్చిదిద్దుతామని తెలిపారు.
దేశంలోనే అగ్రగామిగా రాష్ట్ర టూరిజం
Published Tue, Jun 12 2018 2:20 AM | Last Updated on Tue, Jun 12 2018 2:20 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment