Ravindrabharati
-
గడప దాటని రోజులు
హైదరాబాద్‌లోని రవీంద్రభారతి ప్రాంగణం ఈనెల ఎనిమిదవ తేదీన కొత్త కళను సంతరించుకుంది. ఆ తెలుగు వెలుగుల కళాప్రాంగణం.. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సంబరాలకు వేదికైంది. రాష్ట్రంలోని ఆడబిడ్డల గౌరవార్థం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న వేడుకలవి. ‘ఉమెన్ అచీవర్ అవార్డు –2020’ పురస్కారాల ప్రదానం జరుగుతోంది. వేదిక మీద నుంచి అచీవర్ అవార్డు విజేతలైన మహిళలకు ఆహ్వానం పలుకుతున్నారు. తెల్లటి ధోవతి కట్టుకుని, కాషాయం రంగు చొక్కా ధరించి, తలకు ఎర్రటి తలపాగా చుట్టుకున్న ఓ డెబ్బై ఐదేళ్ల వ్యక్తి వేదిక మీదకు వెళ్లడం కనిపించింది. ఇది మహిళలకు జరుగుతున్న పురస్కారం, వేదిక మీదకు వెళ్తున్నదెవరు? అందరిలో సందేహం. వేదికపైకి రమ్మని పిలుపు వచ్చిన పేరు స్త్రీదా పురుషుడిదా? ఆ సందేహానికి తగిన కారణమే ఉంది. అవార్డు అందుకోవడం కోసం వేదికపైకి వెళుతున్న ఆ వ్యక్తి పురుషుడి వస్త్రధారణలో ఉన్న మహిళ. తొలి ఒగ్గు కథా కళాకారిణి.. జమ్మ మల్లారి. రంగారెడ్డి జిల్లా, యాచారం మండలం, నక్కర్త మేడిపల్లి.. జమ్మ మల్లారి స్వగ్రామం. తెలుగు రాష్ట్రాల్లో ఒగ్గు కథ చెప్పిన తొలి మహిళ ఆమె. అప్పటి వరకు మగవాళ్లే కథకులు. లయబద్ధంగా పాడుతూ, ప్రేక్షకుల్లో ఉత్సాహం ఉరకలెత్తేటట్లు మధ్య మధ్య హూంకరిస్తూ ఒగ్గు కథ చెప్పడం మగవాళ్లకే పరిమితమైన రోజులవి. ఆ ఒగ్గు కథను చూడడానికి కూడా ఇంటి గడపదాటి రావడానికి ఆడవాళ్లకు అనుమతి లేని రోజుల్లో ఒక మహిళ ఏకంగా కథ చెప్పడానికి వేదిక మీదకు రావడమే ఓ సాహసం. అంతటి సాహసానికి నాంది వేసింది తన తండ్రి అని చెప్పారు మల్లారి. నాయన వెంట వెళ్లేదాన్ని ‘‘మా నాయన గుండాలు, అమ్మ చెన్నమ్మ. ఆరుగురు అక్కచెల్లెళ్లు, ముగ్గురు అన్నదమ్ములు మొత్తం తొమ్మిది మంది సంతానం. మా నాయనకు వారసత్వంగా వచ్చిన కళకు నన్ను కూడా వారసురాలిని చేశారాయన. నాయన కథ చెప్తుంటే ఇష్టంగా ఆయన వెంట వెళ్లేదాన్ని. మా అమ్మ కోప్పడేది. మగపిల్లల్లెక్క చొక్కా, ధోవతి కట్టుకునేదాన్ని. మా అమ్మ చీర కట్టినా సరే దాన్ని ధోవతి లెక్క గోచి పెట్టుకుని బర్రెలు తోలుకుని పొలం పోయేదాన్ని. మా నాయన నా ఇష్టాన్ని గమనించి మా అన్నదమ్ములతోపాటు నాకు కూడా తాళం వేయడం, డోలు వాయించడం, కథ చెప్పడం నేర్పించారు. పదహారేళ్ల వయసులో సొంతంగా ఎవరి సహాయమూ లేకుండా కథ చెప్పాను. బీరప్ప, మల్లన్న, ఎల్లమ్మ కథలను చెప్పేదాన్ని. ఒక్కో కథను కొన్ని వందలసార్లు చెప్పి ఉంటాను. ఆలకించారు.. ఆదరించారు మా చిన్నప్పుడు ‘మగవాడు ఇంటిపట్టున ఉంటే పనికి రాని వాడైపోతాడు. ఆడవాళ్లు గడప దాటితే గౌరవాన్ని కోల్పోతారు’ అనే ఒక నానుడి ఉండేది. ఆడవాళ్ల మీద అన్నేసి ఆంక్షలున్న అలాటి రోజుల్లో కూడా... అంటే అరవై ఏళ్ల కిందట నేను ఒగ్గు కథ చెబుతుంటే ఎవరూ అడ్డుకోలేదు. కథ చెప్పడంలో నేను ఎంత సంతోషాన్ని పొందేదాన్నో.. నా కథను వినడానికి జనం కూడా అంతే ఇష్టపడేవాళ్లు. నన్ను చూసి చాలా మంది ఒగ్గు కథ చెప్పడం నేర్చుకున్నారు. కానీ వాళ్ల ఇళ్లలో సరైన సహకారం లేకపోవడం వల్ల ఇందులో కొనసాగలేకపోయారు. ఆంక్షల వల్ల కళ ఉండి కూడా ఎంతోమంది ఆడవాళ్లు ఆ కళను ప్రదర్శించలేక, సాధన కొనసాగించలేక పోయారు. ఇప్పటి అమ్మాయిలకు ఒకటే చెబుతున్నాను. ఇది గొప్ప కళ. అంతరించిపోవడానికి దగ్గరగా ఉంది. మగవాళ్లు నేర్చుకున్నా నేర్చుకోకపోయినా... ఆడపిల్లలు మాత్రం తప్పకుండా నేర్చుకోవాలి. ఆడపిల్లలు నేర్చుకుంటే ఆ కళను తమ పిల్లలకు కూడా నేర్పిస్తారు. దాంతో ఈ కళ అందరి నాలుకల మీద నాట్యమాడుతుంది. తరతరాలు బతికి ఉంటుంది’’ అని చెప్పారు మల్లారి. జమ్మ మల్లారి ఒగ్గు కథ కోసం రంగారెడ్డి, నల్గొండ, మహబూబ్‌నగర్, వరంగల్ జిల్లాలతోపాటు హైదరాబాద్ నుంచి కూడా మేడిపల్లికి వస్తారు. ప్రస్తుతం వార్ధక్యం కారణంగా నడవలేకపోతున్న మల్లారిని కారులో సగౌరవంగా వాళ్ల ఊరికి తీసుకెళ్లి వాళ్ల కార్యక్రమం పూర్తయిన తర్వాత అంతే మర్యాదలతో ఇంట్లో దిగబెడతారు. – వాకా మంజులారెడ్డి ఫొటోలు: తాండ్ర శ్రీశైలం, సాక్షి, యాచారం నేను చిన్నప్పుడు పాలు తాగకుంటే మా నాయన ‘ఈ బిడ్డను బతికించు సామీ! నీకే అంకితం చేస్తాం’ అని మల్లన్న (మల్లికార్జునస్వామి)కు మొక్కినాడంట. ఆ మొక్కు కోసం నన్ను పదకొండేళ్లకే మల్లన్నకిచ్చి పెళ్లి చేశారు. అప్పటి నుంచి ప్రతి ఆదివారం మల్లన్న పూజ చేసుకోవడం అలవాటైంది. కథలు చెప్పడంలో మునిగిపోవడంతో నాకు ప్రత్యేకంగా మరో జీవితం కావాలని కూడా అనిపించలేదు. మా అన్నదమ్ములు సేద్యం చేసుకుంటూ ఒగ్గు కథ చెప్పేవాళ్లు. నేను మల్లన్న సేవలో ఒగ్గుకథ చెప్పుకుంటూ జీవితాన్ని సంతోషంగా వెళ్లదీశాను. మా గొల్ల కురుమలు ఇప్పటికీ ఇళ్లలో ఏ వేడుకైనా నన్ను తీసుకెళ్లి పూజలు, పిల్లల పెళ్లిళ్లు చేయించుకుంటారు. పానం ఉన్నంత కాలం కథ చెబుతా. అప్పట్లో చిందేసి చెప్పిన దాన్ని. ఇప్పుడు ఓపిక తగ్గింది. కథ మొత్తం నిలబడి చెప్పలేక, కూర్చుని చెబుతున్నాను. – జమ్మ మల్లారి, ఒగ్గు కథాకళాకారిణి -
‘దాశరథి’ నేటికీ స్ఫూర్తిదాయకం
సాక్షి, హైదరాబాద్: మహాకవి డాక్టర్ దాశరథి కృష్ణమాచార్య 95వ జయంతి వేడుకలు సోమవారం ఇక్కడి రవీంద్రభారతిలో కనులపండువగా జరిగాయి. తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో ప్రముఖ సాహితీవేత్త, ఈ తరం వట్టికోటగా పేరొందిన కూరెళ్ల విఠలాచార్యకు ప్రతిష్టాత్మకమైన దాశరథి పురస్కారాన్ని ప్రదానం చేశారు. యాదాద్రి భువనగరి జిల్లా రామన్నపేట మండలంలోని తన స్వగ్రామం వెల్లంకిలో 80 వేలకుపైగా పుస్తకాలతో మహాగ్రంథాలయాన్ని ఏర్పాటు చేసిన కూరెళ్ల సాహితీసేవలను వక్తలు కొనియాడారు. శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ దాశరథి సాహిత్యం నిజాం కాలం నుంచి నేటివరకు తెలంగాణ సమాజాన్ని ప్రభావితం చేస్తూనే ఉందన్నారు. ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అంటూ ఆయన చేసిన కవితాగానం తెలంగాణ తొలి, మలిదశ ఉద్యమనినాదమై ఉత్తేజితం చేసిందన్నారు. కోటి రతనాల వీణ అయిన తెలంగాణలో కోటి ఎకరాల మాగాణాన్ని సస్యశామలం చేసే బృహత్తరకార్యాన్ని సీఎం కేసీఆర్ చేపట్టారన్నారు. డాక్టర్ నందిని సిధారెడ్డి మాట్లాడుతూ తెలంగాణతల్లి బాధలను, కష్టాలను తీర్చే ఎదిగివచ్చిన కొడుకుగా దాశరథి కృష్ణమాచార్య ఉద్య మసాహిత్యాన్ని అందజేశారని కొనియాడారు. పల్లెపట్టుకే ఈ పురస్కారం అంకితం: దాశరథి పురస్కారాన్ని అందుకున్న విఠలాచార్య ఎంతో భావోద్వేగానికి గురయ్యారు. ఈ పురస్కారాన్ని పల్లెపట్టుకే అంకితం ఇస్తున్నట్లు ప్రకటించారు. మంత్రి రూ.లక్షా 16 వేల నగదు, వెండి మయూరి జ్ఞాపికను కూరెళ్లకు అందజేసి, శాలువాతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో హోంమంత్రి మహమూద్ అలీ, ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి, బీసీ కమిషన్ చైర్మన్ బీఎస్ రాములు, నందిని సిధారెడ్డి, బి.శివకుమార్, దాశరథి తనయుడు లక్ష్మణ్, మామిడి హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
ప్రపంచానికి భారతం కావాలి
అమెరికాలోని గన్ కల్చర్ గురించి విన్నప్పుడు ‘ఇదేంటి.. అక్కడి పిల్లల్ని అమ్మానాన్నలు పట్టించుకోరా!’ అనిపిస్తుంది. ఎక్కడో అమెరికాలో జరిగిన ఘటనలకు ఇండియాలో ఉన్న మనకే ఇలా అనిపిస్తే.. ఇండియా నుంచి అమెరికాకు వెళ్లిన అరుణిమకు ఎలా ఉండాలి? అసలు కుటుంబ వ్యవస్థే పటిష్టంగా లేని వాతావరణంలో పిల్లలకు విలువలు ఎలా అలవడతాయి? ‘అందుకే మా పిల్లల్ని ఇండియాకు తీసుకొచ్చి మరీ అవన్నీ నేర్పించాను’ అన్నారు అరుణిమ. ప్రపంచానికి భారతీయత అవసరం ఎంతైనా ఉందని కూడా అంటున్నారామె. ఏప్రిల్ 27వ తేదీ. హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో కూచిపూడి ప్రదర్శన జరుగుతోంది. అది అరుణిమ కూతురు ఇషిక అరంగేట్రం. గణేశ పంచరత్నం, రుక్మిణీ ప్రవేశం, మహిషాసుర మర్దని, బాలగోపాల తరంగం, పరులన్నమాట, శివాష్టకం ప్రదర్శించింది ఇషిక. గణేశ పంచరత్నం రూపకంలో ఇషికతోపాటు ఇషిక అమ్మ కూడా నాట్యం చేశారు. ఏ తల్లికైనా తనను... తన పిల్లల పేరు చెప్పి, వాళ్లకు తల్లిగా గుర్తిస్తే పట్టలేనంత సంతోషం కలుగుతుంది. తన ఐడెంటిటీ తన పిల్లలే అయినప్పుడు తల్లి పొందే ఆనందం అది. అలాంటి సంతోషాన్నే ఆస్వాదిస్తున్నారు అరుణిమ ఇప్పుడు. ఇషిక పుట్టింది అమెరికాలో. ఐదేళ్ల వయసులో తల్లి, తమ్ముడితోపాటు ఇండియాకి వచ్చేసింది. ఆ రావడానికి దారి తీసిన పరిస్థితులు ఎవరికైనా మనసును కదిలిస్తాయి. నిజానికి అవేవీ ఇషిక, అరుణిమల కుటుంబ సమస్యలు కావు. అమెరికా కుటుంబాల సమస్యలు. అమెరికాలో వేళ్లూనుకోని కుటుంబ వ్యవస్థ కారణంగా ఎదురవుతున్న సామాజిక సమస్యలు. గాల్లో దీపంలా మిణుకు మిణుకు మంటున్న అమెరికా పిల్లల బాల్యమే ఈ తల్లీబిడ్డలను ఇండియాకు తెచ్చింది. ఆ వివరాలను అరుణిమ సాక్షితో పంచుకున్నారు.‘‘నాకు 2000లో పెళ్లయింది. నా భర్త సత్యనారాయణ రాజు అప్పటికే యుఎస్‌లో ఉద్యోగం చేస్తున్నారు. పెళ్లయిన వెంటనే నేనూ అమెరికా వెళ్లాను. అక్కడ మెంటల్హెల్త్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేశాను. మానసిక స్థితి సరిగా లేని పిల్లల కేస్‌స్టడీలు చదువుతుంటే గుండె కలచివేసినట్లయ్యేది. అభివృద్ధి సాధించిన దేశంలో పిల్లలు ఇంతటి మానసిక అనారోగ్యానికి గురికావడం ఏమిటని కూడా అనిపించేది. అధ్యయనం చేసే కొద్దీ తెలిసిందేమిటంటే.. అక్కడ కుటుంబ వ్యవస్థ సరిగ్గా లేకపోవడమే ప్రధాన కారణం అని. మెంటల్ హెల్త్‌లో పాతికేళ్లు అమెరికాలోనే రీసెర్చ్ చేసిన ఒక మహిళా సీనియర్‌తో ఈ విషయాలను షేర్ చేసుకున్నప్పుడు ఆమె.. ‘ఈ పిల్లల్లో ఎక్కువ మంది సింగిల్ పేరెంట్ పెంపకంలో ఉన్న వాళ్లే. ఈ పిల్లల ఇంటి వాతావరణాన్ని మార్చగలిగితే వీళ్లను ఆరోగ్యవంతులను చేయడానికి మెంటల్ హెల్త్ ట్రీట్మెంట్ అవసరం ఉండదు కూడా’ అన్నారు. ఫ్యామిలీ బాండింగ్ ఉన్న కుటుంబాల్లో పిల్లల్లో ఇలాంటి ధోరణి తలెత్తదు. ఒకవేళ వేరే పిల్లల్ని చూసి అనుకరించినా సరే.. అమ్మానాన్నలు బాధ్యతగా వాళ్లకు వాల్యూస్ నేర్పించినట్లయితే అన్నీ సమసి పోతాయని కూడా చెప్పారామె. పిల్లల్ని అమెరికాలో పెంచుతూ ఇండియన్ ఫ్యామిలీ వాల్యూస్‌ని నేర్పించడం కంటే, ఇండియాలో పెంచడమే మంచిదనిపించి ఇండియాకి వచ్చేశాం. ఈ పదేళ్లలో మా రాజు గారికి ఇండియాకి– అమెరికాకి షటిల్ చేసినట్లయింది’’ అన్నారు అరుణిమ నవ్వుతూ. ప్రపంచానికి భారతం కావాలి పిల్లల పెంపకంలో ఒక తల్లి తీసుకోవాల్సిన జాగ్రత్తల కంటే.. అరుణిమ చాలా ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు అనిపించవచ్చు. కానీ ఆమె విశ్లేషణ మాత్రం సమాధానపరిచేటట్లే ఉంది. ‘‘పిల్లలను ఇండియాలో పెంచడం అనే నిర్ణయానికి గర్వపడుతున్నాను కూడా. ఎందుకంటే... అమెరికా.. పైకి ఓపెన్ సొసైటీగా కనిపిస్తుంది. కానీ అందులో మనం చాలా క్లోజ్డ్గా ఒక చట్రంలో జీవించేస్తాం. ఇండియాలో అనేక చట్రాల మధ్య జీవిస్తున్నట్లు ఉంటుంది. కానీ నిజమైన సమాజాన్ని చూడగలిగింది ఇండియాలోనే. జీవితపు గ్రౌండ్ రియాలిటీ తెలిసేది మనదేశంలో పెరిగినప్పుడే. ఇక కల్చర్ విషయానికి వస్తే.. నా వంతుగా తెలుగు భాషను, భారతీయ కుటుంబ విలువలను మరో తరం వరకు పరిరక్షించగలిగాను. అలాగే పిల్లలకు భారతీయ సంస్కృతిని వివరించగలిగాను. ‘బొట్టు ఎందుకు పెట్టుకోవాలి, గాజులు ఎందుకు వేసుకోవాలి’.. ఇలా ప్రతి ఆచారం వెనుక ఉన్న శాస్త్రీయతను చెప్తూ పెంచాను. అలాగని రోజూ పెద్ద బొట్టు పెట్టుకోమనే కండిషన్ ఏమీ ఉండదు. సంప్రదాయం కోసం పిల్లల సౌకర్యాన్ని హరించడమూ ఉండదు’’ అంటూ వెకేషన్లో ట్రాక్ సూట్లో సేదదీరుతున్న ఫ్యామిలీ ఫొటోలను చూపించారు. అంతరయానం... కలివిడితనం ఇండియా నుంచి వెళ్లి విదేశాల్లో ఉన్న వాళ్లలో ప్రతి ఒక్కరికీ కనీసం ఏదో ఒక్కటైనా సరే ఇండియన్ ఆర్ట్ వచ్చి ఉండాలని అరుణిమ అభిప్రాయం. మన కల్చరే గొప్ప అని ఎదుటి వాళ్లను తక్కువ చేయడానికి కాదు, ఇది మా కల్చర్ అని చెప్పుకోగలగడానికి మాత్రమేనంటారామె. ‘‘ఇషికకి కూచిపూడి నాట్యంలో శిక్షణ ఇప్పించాం. అయితే ఇంత బాగా పెర్ఫార్మ్ చేస్తుందని ఊహించలేదు. డాన్స్ మనిషికి తనలోకి తాను ప్రయాణించగలిగిన గొప్ప లక్షణాన్ని నేర్పిస్తుంది. ఆటలతో తోటి వాళ్లతో కలివిడిగా మెలగడం అలవడుతుంది. నేను చేసిన ఆ ప్రయత్నం ఇషికలో ఎంతటి పరిణితిని తెచ్చిందంటే.. తాను బాస్కెట్ బాల్ ప్లేయర్‌గా స్కూల్ టీమ్‌కు కెప్టెన్‌గా చేసింది. అప్పుడు మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అవార్డును వరుసగా రెండేళ్లు అందుకుంది. అప్పుడు వచ్చిన విమర్శలను ఇషిక ఎంత సమర్థంగా చక్కదిద్దుకున్నదంటే.. ప్రిన్సిపల్‌ను కలిసి ‘మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అవార్డును పక్షపాత ధోరణిలో సెలెక్ట్ చేశారనే ఆరోపణ వచ్చిన తర్వాత నేను కెప్టెన్‌గా కొనసాగడం సరి కాదు. మరెవరినైనా కెప్టెన్‌గా నియమిస్తే నేను టీమ్‌లో ఒక ప్లేయర్‌గా నా లెవెల్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ చూపిస్తాను’ అని చెప్పింది. ప్రిన్సిపల్ ఎంత తరచి అడిగినా... తనను ట్రోల్ చేసిన వాళ్ల పేర్లు మాత్రం చెప్పనేలేదు. ప్రిన్సిపల్ నాతో ఆ సంగతి చెప్పినప్పుడు మా అమ్మాయిలో నాకు పరిపూర్ణమైన కొత్త ఇషిక కనిపించింది. మా నాన్నగారు ఎప్పుడూ నాతో ‘నీకు వరపుత్రిక పుట్టింది’ అంటుంటారు. ఆ మాట నిజమే అనిపించింది కూడా’’ అన్నారు అరుణిమ. – వాకా మంజులారెడ్డి ఒకరి త్యాగం అవసరమే ఆధునిక జీవనశైలిలో ప్రతి ఒక్కరూ కెరీర్ ఓరియెంటెడ్‌గా ఉండడం అవసరమే. అయితే పిల్లల కోసం తల్లిదండ్రుల్లో ఒకరు కొంత త్యాగం చేయకతప్పదనే చెప్పాలి. నేను వైజాగ్ సెయింట్ జోసెఫ్‌లో డిగ్రీ చేసి, కోయంబత్తూరులో హ్యూమన్ డెవలప్మెంట్లో పీజీ చేసి అదే కాలేజ్‌లో ఏడాది పాటు ఉద్యోగం చేశాను. పెళ్లితో నా కెరీర్ లైన్ మారింది. యుఎస్‌లో బిహేవియర్ థెరపీ చేసి మెంటల్ హెల్త్‌కి మారాను. పిల్లల కోసం ఇండియాకి వచ్చిన తర్వాత స్కూల్లో చేరి పాఠాలు చెప్పాను. మా అమ్మాయికి టెన్త్ అయిపోయింది. తనకు బయోటెక్నాలజీ ఇష్టం. అందుకే మళ్లీ అమెరికా ప్రయాణమవుతున్నాం. అక్కడికి వెళ్లిన తర్వాత నా కెరీర్ ప్లాన్స్ అన్నీ మళ్లీ కొత్తగా మొదలు పెట్టాలి. తల్లిగా విజయవంతమయ్యానా లేదా అని చెప్పడానికి ఇంకా కొంత టైమ్ కావాలి. అయితే మా అమ్మాయితో కలిసి కూచిపూడి నాట్యంలో వేదికను పంచుకోవడం, మా పిల్లలిద్దరూ స్టేట్ బాస్కెట్‌బాల్ ప్లేయర్స్ కావడం తల్లిగా నేను అత్యంత సంతోషాన్ని పొందిన క్షణాలు. తల్లి ఎంత మంది పిల్లలను కన్నా సరే... తొలిబిడ్డను కన్నప్పుడు పొందినంత సంతోషాన్ని ప్రతిసారీ ఆస్వాదిస్తుంది. పిల్లల పురోగతి కూడా అలాంటిదే. చిన్న అచీవ్మెంట్ అయినా సరే ఎవరెస్ట్‌ను అధిరోహించినంత మురిసి పోయేది తల్లి మాత్రమే. వాళ్ల కోసం చేసిన త్యాగం కష్టమనిపించదు. అవసరమైన పనే చేశాననే సంతృప్తి తల్లికి ఉంటుంది. – అరుణిమ, ఇషిక తల్లి అమ్మకు అడుగులు నేర్పాను అమ్మ డాన్స్ ప్రాక్టీస్ చేసేటప్పుడు తన స్టెప్స్‌ని కరెక్ట్ చేసేదాన్ని. అమ్మను కరెక్ట్ చేసే చాన్స్ వచ్చిందని చాలా ఎంజాయ్ చేశాను. గత వారం తిరుమలకు వెళ్లాం. అక్కడ నాద నీరాజనం వేదిక మీద డాన్స్ చేస్తున్న గొప్ప గొప్ప కళాకారులను చూసినప్పుడు నేను కూడా ఎప్పటికైనా ఆ వేదిక మీద నాట్యం చేయాలనిపించింది. ఇప్పుడు అమెరికా వెళ్లిన తర్వాత కూడా ప్రాక్టీస్ ఆపను. -
స్టెప్స్ వారియర్స్.. డ్యాన్స్ అదుర్స్..
-
స్టెప్స్ వారియర్స్.. డ్యాన్స్ అదుర్స్..
సిటీబ్యూరో: చారిత్రక పేరిణి శివతాండవ నృత్యాన్ని నేటి తరానికి దగ్గర చేసేందుకు ‘డ్యాన్స్ ఆఫ్ వారియర్స్’ ప్రదర్శన ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. స్టెప్స్ డ్యాన్స్ స్టూడియో కళాకారుల ప్రయోగాత్మక ప్రదర్శన శుక్రవారం రాత్రి రవీంద్రభారతిలో అద్భుతంగా సాగింది. కళాకారులు ‘పేరిణి శివతాండవంలో కాకతీయుల వైభవాన్ని, బతుకమ్మ’ ఆటలతో అలరించారు. స్టెప్స్ డ్యాన్స్ స్టూడియో నిర్వాహకులు పృథ్వి మాట్లాడుతూ.. ఈ నృత్యానికి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించిందని, తెలంగాణలోని అన్ని కళారూపాలను సమకాలీన శైలిలో నేటి తరానికి పరిచయం చేస్తామన్నారు. -
ఘంటసాలకు నృత్యాంజలి
⇒ నేడు గానగంధర్వ ఘంటసాల నృత్యరూపక ప్రదర్శన ⇒ రవీంద్రభారతిలో సాయంత్రం 6 గంటలకు... సిటీబ్యూరో: అమరగాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు కోడలు పార్వతీ రవి ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం ‘గాన గంధర్వ ఘంటసాల’ పేరిట ప్రత్యేక నృత్యరూపకం ప్రదర్శిస్తున్నారు. రవీంద్రభారతి ఇందుకు వేదికవుతోంది. ఈ సందర్భంగా నగరానికి వచ్చిన పార్వతీ రవి సాక్షితో మాట్లాడారు. ఘంటసాల పాటలతో నృత్యరూపకం చేయాలనే ఆలోచన తనకు 2007లో వచ్చిందని చెప్పారు. భావితరాలు ఆయనను నిత్యం స్మరించుకునేలా చేయడమే ఈ ప్రదర్శన లక్ష్యమన్నారు. తొలిసారి పదేళ్ల క్రితం చెన్నై మ్యూజిక్ అకాడమీలో ఘంటసాల పాటలతో నృత్య ప్రదర్శన చేస్తే హాల్ పూర్తిగా నిండిపోయిందన్నారు. అప్పటి నుంచి పలుచోట్ల ప్రదర్శనలు ఇచ్చినట్లు చెప్పారు. ఘంటసాల స్ఫూర్తితోనే... అమరజీవి ఘంటసాల వెంకటేశ్వరావు స్ఫూర్తితోనే ఈ నృత్య ప్రదర్శన జాతీయంగా, అంతర్జాతీయంగా సాగుతోందని చెప్పారు. ఈ నృత్య ప్రదర్శనకు మల్టీమీడియాను జత చేశామన్నారు. ఘంటసాల పేరిట కళాకారులకు అవార్డులు ఇచ్చే యోచన కూడా ఉందన్నారు. ఘంటసాల వారసురాలిగా వీణ ఘంటసాల మూడో కుమారుడి కుమార్తె వీణ అద్భుతంగా పాటలు పాడుతుందని, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గానూ రాణిస్తోందన్నారు. ఆమెను ఘంటసాలకు వారసురాలిగా చెప్పొచ్చని పార్వతి పేర్కొన్నారు. ఘంటసాల వారసులు స్థాపించిన ‘కళా ప్రదర్శిని సంస్థ’ ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తుందన్నారు. కాగా ‘గాన గంధర్వ ఘంటసాల’ పేరుతో జరిగే నృత్యంలో పార్వతీ రవి ఘంటసాల, శైలజ, సంచిత భట్టాచార్య, కవితా రాము, గోపికా వర్మ(మోహినీ హట్టం), హరి, చేతన, ఎల్.నరేంద్ర కుమార్ తదితరులు పాలుపంచుకుంటారు. -
కళా రూపాలు
హ్యూమర్ ప్లస్ నాటకాలకు ముగింపు ఉండదు. ఒకచోట తెరపడితే ఇంకోచోట లేస్తూ ఉంటుంది. పాత నాటకాలే తమిళనాడులో మళ్లీ వేశారు. పాత్రలు మారాయంతే. అమ్మ ఎలా చనిపోయిందో ఎవరూ చెప్పరు కానీ, ఒకాయన కళ్లు మూసుకుని అమ్మ ఆత్మతో మాట్లాడతాడు! ఒకావిడ సమాధిపై పిడిగుద్దులు గుద్ది మరీ అమ్మ ఆత్మను తట్టి లేపుతుంది. ఇకపై నాటకం చెన్నైలో, బెంగళూరు జైలు నుంచి ప్రాంప్టింగ్. జైల్లో పుట్టడం వల్లే శ్రీకృష్ణుడు గీతను బోధించాడు. బ్రిటిష్ కాలం నుంచి ఇప్పటి వరకు జైళ్లు అధోగతిలోనే ఉండడం వల్ల అక్కడికెళితే చాలు.. తత్వం, వేదాంతం అన్నీ ఒంటపడతాయి. జైళ్ల సంస్కరణలు అని పుస్తకాలు రాస్తూ ఉంటారు కానీ సంస్కారం, జైలు.. ఇవి రెండూ వేర్వేరు విషయాలు. ఇళ్లకు రంగులు కొట్టడం ఆ మధ్యనొచ్చింది కానీ ముఖాలకు రంగులేసుకోవడం చాలా పురాతన ప్రక్రియ. అయితే అప్పుడు నాటకమేదో, జీవితమేదో కొంచెం తేడా తెలిసేది. ఇప్పుడు రెండూ కలిసిపోయి ఎవడి డైలాగులు వాడే ఇన్‌స్టంట్‌గా చెప్పేస్తున్నాడు. నా చిన్నప్పుడు మా ఊళ్లో రామాంజనేయ యుద్ధం నాటకం జరిగింది. మూడో ఆంజనేయుడు ఎవరికీ కనపడకుండా ఎక్కడో నిద్రపోయాడు. దాంతో రెండో ఆంజనేయుడే మూడో ఆంజనేయుడి అవతారం ఎత్తాడు. భారతంలో పద్యాలు పాడినా జనం వన్స్‌మోర్ అన్నారు. ఏం చూస్తున్నారో, ఏం వింటున్నారో తెలియకుండా నాటకం చూడడానికి జనం అలవాటు పడ్డారు. పూర్వం మైకులు లేకపోవడం వల్ల నటులు గట్టిగా అరిచేవాళ్లు. రాగం తీస్తే దోమలు జుమ్మంటూ టౌన్ గేటు వరకు ప్రయాణించేవి. మైకులొచ్చిన తరువాత కూడా కొంతమంది పరిషత్ నటులు గిట్టిగా గావుకేకలు పెట్టేవాళ్లు. వీళ్ల వల్ల రవీంద్రభారతిలో ప్రేక్షకులు స్పృహ కోల్పోయిన సంఘటనలు కూడా ఉన్నాయి. సామాజిక స్పృహ ఎక్కువైతే వచ్చే ఇబ్బందే ఇది. భటుడి వేషాన్ని ఏళ్ల తరబడి వేస్తున్న నటుడు ఒక్కసారిగా వేషం మార్చి తిరుగుబాటు వీరుడిగా మారితే రౌద్రానికి బదులు హాస్యరసం పుడుతుంది. పన్నీర్ సెల్వాన్ని పన్నీర్ బెటర్ మసాలాగా అంగీకరించకపోవడానికి కారణమిదే. పెద్దమ్మ కాళీమాత అయితే చిన్నమ్మ మహిషాసురమర్దిని. సివంగిని బోనులో పెట్టారు కానీ ఊచలు కొరికి ఎప్పుడైనా మీద పడుతుందని బోలెడంత మంది వణికి చస్తున్నారు. నాటకాల కంటే తోలుబొమ్మలాట ఇంకొంచెం ఓల్డ్. ఈ ఆర్ట్‌కి సంబంధించిన ప్రసిద్ధ కళాకారులంతా ఢిల్లీలో ఉంటారు. బ్యాగ్రౌండ్ మ్యూజిక్, డైలాగులు అన్నీ వాళ్లే చెబుతూ ఉంటారు. బొమ్మలు మాట్లాడుతున్నాయని మనం భ్రమపడతాం. ఆడించేవాళ్లు అప్పుడప్పుడూ మారుతారు కానీ ఆట మారదు. ఢిల్లీ నుంచి బుర్రకథ వినిపించడం కూడా మామూలే. అక్కడ కథ చెబితే ఇక్కడ పక్క వాయిద్యాలు వినిపిస్తూ తందాన అంటూ ఉంటారు. హోదా లేదు ప్యాకేజీనే అని బుర్ర కళాకారుడు అనగానే ఇక్కడి వాయిద్య నిపుణులు తాన తందనాన అంటారు. లేదంటే బుర్ర రామకీర్తనే. ఢిల్లీలో ప్రసిద్ధ మెజీషియన్లు కూడా ఉంటారు. పావురాన్ని మాయం చేసి చిలకల్ని సృష్టించినట్లు, వెయ్యి రూపాయలు మాయం చేసి రెండు వేలు సృష్టిస్తారు. వెయ్యి వల్ల ముప్పు ఉంటే రెండువేల వల్ల రెండింతలు ముప్పు కదా! రెండు రెళ్లు నాలుగంటే కీళ్లు విరుగుతాయి. లెక్కల్లో కూడా సొంత అభిప్రాయాలు ఉంటేనే ముద్దు. ఏనుగు తికమక పడి వరమాలని లె చ్చి మావటి మెళ్లో వేసినట్లు పళనిస్వామి నక్కతోకని తొక్కినా అది కరవకుండా కుర్చీలో కూచో పెట్టింది. రొట్టె విరిగి నేతిలో పడితే కొలెస్ట్రాల్ పెరిగితే పెరగవచ్చు కానీ, నెయ్యి రుచే వేరు. తేనె తాగుదామని కందిరీగల తుట్టెని కదిలించాడు పన్నీర్. కందిరీగలు కుడుతుంటే ఢిల్లీ వైఫై కూడా మోడెం ఆఫ్ చేసుకుంది. షేక్స్పియర్కి మించిన డ్రామా.. రాజకీయాల్లో ఎప్పుడూ నడుస్తూ ఉంటుంది. ఈగలు, దోమలు పోతున్నా లెక్క చేయకుండా ప్రజలు నోరెళ్లబెట్టి చూస్తూనే ఉంటారు. – జి.ఆర్.మహర్షి -
కళలు వర్ధిల్లిన చోట యుద్ధాలు జరగవు
ఆస్ట్రేలియా కాన్సులేట్ జనరల్ సియాన్ సాక్షి, హైదరాబాద్: ‘‘జపాన్‌కు చెందిన ప్రఖ్యాత టైకో డ్రమ్మింగ్ సంగీతానికి భారతీయ సంప్రదాయ నృత్యం కలరుుకతో సృష్టించిన ‘చీ ఉడాక’ సంగీత నృత్య కళను తొలిసారిగా భారతదేశానికి పరిచయం చేస్తున్నందుకు గర్వపడుతున్నాం’’అని ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ సియాన్ కెల్లీ పేర్కొన్నారు. ఆస్ట్రేలియా, భారత్‌ల మధ్య సాంస్కృతిక సంబంధాలను బలోపేతం చేసేందుకు తమ దేశ ప్రభుత్వం ఈ ప్రదర్శనలకు సహకారం అందిస్తోందన్నారు. కళలు వర్ధిల్లిన చోట యుద్ధాలు జరగవన్నారు. సిడ్నీకి చెందిన టైకోజ్, లింగలాయం ఇండియన్ క్లాసికల్ డ్యాన్స కంపెనీలు శనివారం సాయంత్రం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో చీ ఉడాక కళా ప్రదర్శన నిర్వహించాయి. అంతకు ముందు సియాన్ కెల్లీ నగరంలోని ఓ హోటల్లో విలేకరులతో మాట్లాడుతూ.. చీ అంటే జపనీలో భూమి అని, ఉడాక అంటే సంస్కృతంలో నీళ్లు అన్నారు. రెండు విభిన్న సంస్కృతుల కలరుుకగా చీ ఉడాక కళ పుట్టిందన్నారు. ఆస్ట్రేలియా ప్రభుత్వ సహకారంతో తొలిసారిగా భారత్‌లో టైకోజ్, లింగలాయం డ్యాన్స కంపెనీలు 3 చోట్లలో చీ ఉడాక ప్రదర్శనలకు ఏర్పాటు చేశాయన్నారు. 19న చెన్నైలో, శనివారం హైదరాబాద్‌లో ప్రదర్శనలు ముగిశాయని, 29న ముంబైలోని జంషెడ్ బాబా థియేటర్లో ప్రదర్శన ఉంటుందన్నారు. ఈ సమావేశంలో లింగలాయం డెరైక్టర్ ఆనందవల్లి, టైకోజ్ డెరైక్టర్ అయాన్ క్లివర్త్, చీ ఉడాక నిర్మాణ లీ, శాకుహచి గ్రాండ్ మాస్టర్ రైలీ లీ పాల్గొన్నారు. -
సాంస్కృతిక వేడుకకు సిద్ధం
రాయదుర్గం: బ్రహ్మకుమారీస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం, తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతున్న అంతర్జాతీయ కల్చరల్ ఫెస్ట్ ముగింపు వేడుకలకు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 7న రవీంద్రభారతిలో ప్రారంభమైన ఈ వేడుకలు దసరా పర్వదినమైన మంగళవారం గచ్చిబౌలి శాంతి సరోవర్‌లోని ఓపెన్ గ్రౌండ్లో ముగియనున్నాయి. ఇందుకోసం ఆదివారం ఆ ప్రాంగణంలో భారీ స్థాయిలో ఏర్పాట్లు చేశారు. ఇక్కడ జరిగే వేడుకల్లో భారతదేశంతో పాటు రష్యా, మలేసియా, ఇండోనేషియా, ఉక్రెయిన్, ఆర్మేనియా, అజర్బైజాన్, తజకిస్థాన్, బైలోరష్యా దేశాల్లోని బ్రహ్మకుమారీస్ శాఖల కళాకారులు ప్రదర్శనలు ఇవ్వనున్నారు. ప్రజల్లో ప్రాంత, కుల,మత, భాషా బేధాలు లేకుండా అంతా సోదర భావనతో మెలగాలనే సందేశాన్ని ప్రచారం చేస్తూ ఈ కళాకారులు ప్రదర్శనలు ఇస్తున్నారు. -
సరళీకృత ఆర్థిక విధానాలే శ్రీరామరక్ష
- జస్టిస్ కొండా మాధవరెడ్డి స్మారకోపన్యాసంలో కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ - తైవాన్, జపాన్, సింగపూర్ల ఎదుగుదలకు కారణమిదే - అప్పట్లో వాజ్‌పేయీ సాహస నిర్ణయాలు దేశగతినే మార్చాయి - పెట్టుబడుల తరలింపుతో ఆర్థిక రంగానికి మేలు సాక్షి, హైదరాబాద్ : ‘టెలికాం రంగంలో బీఎస్ఎన్ఎల్ గుత్తాధిపత్యం సాగిన నాలుగు దశాబ్దాల కాలంలో దేశ జనాభాలో 0.8 శాతం మందికే టెలిఫోన్ వసతి సమకూరింది. అదే ప్రైవేటు సంస్థలకు అవకాశం కల్పించిన రెండు దశాబ్దాల్లో అది 80 శాతంగా నమోదైంది. ప్రైవేటు సంస్థల ఆగమనానికి తలుపులు తెరిస్తే ప్రభుత్వరంగ సంస్థల మనుగడ ప్రశ్నార్థకమవుతుందని ఆందోళన చెందేవారు గుర్తించాల్సిన విషయమిది. దేశ ప్రగతి విషయంలోనూ ఇదే వర్తిస్తుంది. ఓ దేశం వేగంగా ఆర్థిక పురోగతి సాధించాలంటే సరళీకృత ఆర్థిక విధానాలను మరింత మెరుగ్గా ఉపయోగించుకోక తప్పదు’ అని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. ఆదివారం సాయంత్రం రవీంద్రభారతిలో జేకేఎంఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన జస్టిస్ కొండా మాధవరెడ్డి సంస్మరణ సభలో ఆయన కొండా మాధవరెడ్డి స్మారకోపన్యాసం చేశారు. ‘న్యాయవ్యవస్థ-ఆర్థిక రంగం’ అనే అంశంపై సుదీర్ఘంగా మాట్లాడారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థ 1991కి ముందు- 1991కి తర్వాత అన్నట్టుగా ఉందన్న జైట్లీ... అప్పటి వరకు మనదైన సంప్రదాయ పద్ధతిలో దేశ ఆర్థిక రంగం ముందుకు సాగగా ఆ తర్వాత సంస్కరణలతో కొత్త పుంతలు తొక్కిందన్నారు. నాటి ప్రధాని పీవీ నరసింహారావు, ఆర్థిక మంత్రి మన్మోహన్‌సింగ్‌లు లోతైన చర్చతో సంస్కరణలకు ఓ రూపం తెచ్చినప్పటికీ, వాటి అమలులో కొంత తటపటాయించారని గుర్తు చేశారు. ప్రభుత్వం మారి ప్రధానిగా అటల్ బిహారీ వాజ్‌పేయీ బాధ్యతలు తీసుకున్నాక దేశ ఆర్థికరంగం రూపురేఖలే మారిపోయాయన్నారు. ఇప్పుడు మనం అనుభవిస్తున్న ప్రగతి ఫలాలకు ఆయన తీసుకున్న సాహసోపేత నిర్ణయాలే కారణమని కొనియాడారు. పెట్టుబడులు వస్తేనే ప్రగతి ఓచోట నుంచి పెట్టుబడులు మరోచోటకి, అక్కడి నుంచి మరో రంగానికి ఇలా పెట్టుబడుల తరలింపు ఆర్థిక రంగానికి ఎంతో మేలు చేస్తుందని అభిప్రాయపడ్డారు. పెట్టుబడులు వస్తేనే ప్రగతి సాధ్యమవుతుందన్నారు. న్యాయవ్యవస్థ-ఆర్థిక వ్యవస్థ మధ్య సన్నటి విభజన రేఖ ఉందని, తాను దాన్ని సంక్లిష్ట విషయంగా భావిస్తానన్నారు. విశ్రాంత న్యాయవాదులు, న్యాయమూర్తులు తమ విలువైన సూచనలు, సలహాలతో ఆర్థికరంగాన్ని గాడిలో పెట్టేం దుకు సహకరిస్తున్నారన్నారు. గతంలో రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు కంపెనీల చట్టానికి సవరణలు కోరుతూ పత్రిపాదించానని, అది ఇప్పటి వరకు కార్యరూపం దాల్చలేదన్నారు. ఆర్థిక, న్యాయపరమైన సవాళ్లను అధిగమించేందుకు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యామ్నాయ పరిష్కారమార్గాలు అందుబాటులో ఉన్నాయన్నారు. అలాంటి వాటిని ఉపయోగించుకోవాలన్నారు. కొండా శైలి స్ఫూర్తిదాయకం ఆసియాఖండంలోనే భాగంగా ఉన్న తైవాన్, జపాన్, సింగపూర్, కొరియాలు సరళీకృత ఆర్థిక విధానాలతో ముందుగా ప్రగతిబాటపట్టగా, ఆ తర్వాత చైనా అనుసరించిందన్నారు. తాను యువ న్యాయవాదిగా ప్రాక్టీసు ప్రారంభించిన సమయంలో అనుభవజ్ఞుడైన న్యాయవాదిగా కొండా మాధవరెడ్డి వ్యవహారశైలిని నిశితంగా పరిశీలించేవాడినని అరుణ్‌జైట్లీ గుర్తుచేసుకున్నారు.అంతకుముందు ప్రతిభావంతులుగా అంతర్జాతీయస్థాయి ఖ్యాతి పొందుతున్న స్థానిక క్రీడాకారులు, చదువులో రాణిస్తున్న రంగారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ప్రోత్సాహకాలను అందించారు. కార్యక్రమంలో కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ వేణుగోపాల్‌రెడ్డి, అపోలో ఆసుపత్రుల చైర్మన్ ప్రతాప్ సి.రెడ్డి, ప్రొఫెసర్ రామచంద్రారెడ్డి, జస్టిస్ కొండా మాధవరెడ్డి తనయుడు, చేవెళ్ల పార్లమెంటు సభ్యుడు కొండా విశ్వేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
చెట్టు అమ్మ లాంటిది: డాక్టర్ కేవీ రమణాచారి
చెట్టు అమ్మ లాంటిదని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కేవీ రమణాచారి తెలిపారు. గురువారం రవీంద్రభారతి ప్రాంగణంలోలో భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో హరిత హారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మొక్కలు నాటడమే కాదు వాటిని సంరక్షించాల్సి బాధ్యత మనదేనన్నారు. ప్రకృతి సమతుల్యత ఉంది అంటే దానికి కారణం చెట్టేనని చెప్పారు. ఎప్పుడో మన పెద్దలు నాటిన మొక్కలతో మనం ఎంతో లబ్ధిపొందుతున్నామన్నారు. ఇప్పుడు నాటే మొక్కలు 20 ఏళ్ల తర్వాత ఫలితాలను మన భావితరాలకు అందిస్తాయని తెలిపారు. ఎంతోమంది కవులు, గాయకులు కూడా చెట్టు ప్రాధాన్యత విశదీకరించారన్నారు. సీఎం మందుచూపుతో ఎంతో గొప్ప కార్యక్రమాన్ని ప్రారంభించారన్నారు. ప్రభుత్వంలోని ప్రతిశాఖ మరో మూడు నెలల పాటు చెట్లను నాటడం వాటిని రక్షించటం చేయాలని తెలిపారు. చెట్లపై సారధి కళాకారిణి స్పందన బృందం పాడిన పాటలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో సాంస్కృతిక శాఖ డెరైక్టర్ మామిడి హరికృష్ణ, ఇన్చార్జ్ ఏవో మనోహర ప్రసాద్, రవీంద్రభారతి, సాంస్కృతిక శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
ఏ దేశమేగినా.. ఎందుకాలిడినా..
నాద ప్రభ కల్చరల్ ట్రస్టు ఆధ్వర్యంలో శుక్రవారం రవీంద్రభారతిలోనిర్వహించిన‘ఏ దేశమేగినా.. ఎందుకాలిడినా’ కార్యక్రమం ఆకట్టుకుంది.ఇందులో భాగంగా అమెరికాకు చెందిన హవిశ బాచె, విహిశ బాచె ‘పాడరే పరిమళ తపసి రాగాలు’ పేరుతో నిర్వహించిన సంగీత కార్యక్రమం ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసింది. ‘చూడరే భగవతీ భసిత రూపాలు’ పేరుతో డాక్టర్ అనుపమ కైలాశ్ చేసిన నృత్య ప్రదర్శన ఆహూతులను అలరించింది. ముఖ్య అతిథిగా గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి హాజరయ్యారు. ట్రస్టు ఉపాధ్యక్షులు డాక్టర్ పద్మజ పాల్గొన్నారు. -
కళలకు ‘తాళం’!
► ఆగిన రవీంద్రభారతి పునరుద్ధరణ పనులు ► సాంస్కృతిక, సామాజిక కార్యక్రమాలకు బ్రేక్ ► నిధుల విడుదలలో నిర్లక్ష్యమే కారణం ► పాత సీట్లే ఉంటాయట! నగరంలో కళా సాంస్కృతిక కార్యక్రమాలకు చక్కటి వేదికైన రవీంద్రభారతి మూగబోయింది. నిత్యం సాంస్కృతిక ప్రదర్శనలలు, సాహితీ సభలు, సామాజిక కార్యక్రమాలతో ఆబాల గోపాలాన్ని అలరించే ఈ అద్భుత వేదికకు రెండు నెలలుగా తలుపులు మూసుకున్నాయి. సకల సదుపాయాలు, ఆధునిక సాంకేతిక హంగులతో రవీంద్రభారతిని పునరుద్ధరించనున్నటు ప్రకటించిన ప్రభుత్వం...సకాలంలో నిధులు విడుదల చేయకపోవడంతో ప్రారంభించిన పనులు ఎక్కడివక్కడే ఆగిపోయాయి. సాహితీ, సాంస్కృతిక రంగాలపై ఎంతో మక్కువతో రవీంద్రభారతిని కళాత్మకంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.3 కోట్ల నిధులు కేటాయించారు. కానీ నిధుల విడుదలలో జాప్యం కారణంగా రెండు నెలల క్రితం మూసిన రవీంద్రభారతి తలుపులు ఇప్పటికీ తెరుచుకోలేదు. - సాక్షి, సిటీబ్యూరో - సాక్షి, సిటీబ్యూరో: గత ఆరేడు దశాబ్దాలుగా తెలుగు ప్రజల సాంస్కృతిక వికాసానికి కేంద్రబిందువుగా ఉన్న రవీంద్రభారతి ఆడిటోరియాన్ని ఆధునీకరించే చర్యల్లో భాగంగా ప్రభుత్వం పునరుద్ధరణకు శ్రీకారం చుట్టింది. ఇదెంతో ఆహ్వానించదగిన పరిణామమే. కాగా రాష్ర్ట పర్యాటకాభివృద్ధి సంస్థకు పునరుద్ధరణ పనులు అప్పగించారు. ప్రభుత్వం కేటాయించిన రూ.3 కోట్లతో ప్రధాన హాల్, గ్రీన్‌రూమ్, వీఐపీ హాల్, మినీ కాన్ఫరెన్స్ హాల్ తదితర భవనాల ఆధునీకరణ, రవీంద్రభారతి చుట్టూ రోడ్లు, పార్కింగ్ సదుపాయంతో పాటు సౌండ్, లైటింగ్ వ్యవస్థను కొత్తగా ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. భవనం మొత్తాన్ని చక్కటి రంగులతో అందంగా అలంకరించాలని భావించారు. ఇప్పుడు ఉన్న సీట్లను తొలగించి కొత్తవాటిని ఏర్పాటు చేసేందుకు కూడా ప్రణాళికలను సిద్ధం చేశారు. కానీ నిధుల లేమి కారణంగా సీట్ల పునరుద్ధరణను ఉపసంహరించుకున్నారు. ప్రస్తుతం సివిల్ పనులు మాత్రం ముగిశాయి. మిగతా పనులు పెండింగ్‌లో ఉన్నాయి. విద్యుదీకరణ, సౌండ్ అండ్ లైటింగ్ పనులు ఇంకా పూర్తి చేయాల్సి ఉంది. సీట్ల మార్పు ఎందుకు మరచినట్లు...? పాతకాలం నాటి సీట్ల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయాలని పునరుద్ధరణ కమిటీ మొదట ప్రతిపాదించింది. కానీ ఇప్పుడు ఆ అంశాన్ని పక్కనపెట్టినట్లు తెలిసింది. బాగా చిరిగిపోయి, పనికి రాకుండా ఉన్న సీట్లను వెంటనే తొలగించి కొత్తవి ఏర్పాటు చేయవలసి ఉండగా, ప్రస్తుతం ఆ అంశాన్ని విస్మరించడం అన్యాయమని పలువురు కళాకారులు, సాంస్కృతిక సంస్థలు అభిప్రాయపడుతున్నాయి. అయితే పనురుద్ధరణ పనుల జాబితాలో సీట్ల మార్పు ప్రతిపాదనే లేదని పర్యాటకాభివృద్ధి సంస్థ పేర్కొనడం గమనార్హం. నిలిచిన బుకింగ్‌లు... ప్రతిసాయంత్రాన్ని ఆహ్లాదభరితం చేసే రవీంద్రభారతి మూసి ఉంచడంతో ఆ పరిసర ప్రాంతాలన్నీ కళావిహీనంగా కనిపిస్తున్నాయి. రెండు నెలలుగా పనులు సాగదీస్తూ ఉండడంతో బుకింగ్‌లు నిలిచిపోయాయి. పలు సంస్థలు నిరీక్షణలో ఉన్నాయి. కొత్త సీట్లు ఏర్పాటు చేయాల్సిందే అన్ని పనులు పూర్తి చేసి సీట్లు పాతవే ఉంచడం వల్ల రవీంద్రభారతి కళాత్మకత దెబ్బతింటుంది. కచ్చితంగా కొత్త సీట్లు ఏర్పాటు చేయాల్సిందే. - మామిడి హరికృష్ణ, డెరైక్టర్, భాషా సాంస్కతిక శాఖ. ఆడిటోరియాలు దొరకడం లేదు... రవీంద్రభారతిని త్వరగా తె రవాలి. పునరుద్ధరణ పనుల కోసం మూసివేసి చాలా రోజులైంది. మదర్స్ డే సందర్భంగా... ఇంకుడు గుంతల ఏర్పాటుతో చేకూరే లాభం గురించి ప్రజలకు వివరించేందుకు ఓ కార్యక్రమం ఏర్పాటు చేయాలని రెండురోజులుగా ప్రయత్నిస్తున్నాను. నగరంలో ఎక్కడా ఆడిటోరియాలు దొరకటం లేదు. రవీంద్రభారతి అయితే అద్దె తక్కువ. అందరికీ అందుబాటులో ఉండేది. అక్కడ డెరైక్టర్, సిబ్బంది పూర్తిగా సహకరిస్తారు. కాబట్టి పనులు త్వరగా పూర్తి చేస్తే కళా సంస్థలు సామాజిక కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు వీలవుతుంది. - యు. అరుణా అశోక్, శ్రీసాయి అలేఖ్యా సాంస్కృతిక, సంఘ సేవా సంస్థ. -
‘రవీంధ్రభారతి’కి ఇక మంచిరోజులు
నిధులు రూ. 30 లక్షల నుంచి రూ.2 కోట్లకు పెంపు సాక్షి, హైదరాబాద్ : సాంస్కృతిక వికాస కేంద్రంగా విరాజిల్లుతున్న రవీంద్రభారతికి ఇక అన్నీ మంచిరోజులే అని చెప్పొచ్చు. ఇంతవరకు రవీంద్రభారతి ఆర్థిక ఇబ్బందులతో అవస్థలు పడుతోంది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ స్పందించి నిర్వహణ నిధులను రూ.30 లక్షల నుంచి రూ.2 కోట్లకు పెంచారు. వాస్తవంగా రవీంద్రభారతికి వివిధ కార్యక్రమాల నిర్వహణ ద్వారా నెలకు రూ.3 నుంచి 4 లక్షల వరకు ఆదాయం వస్తోంది. కానీ జీతభత్యాలే రూ. 9లక్షలు వరకు ఇవ్వాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో రవీంద్రభారతికున్న ఆర్థిక కష్ట నష్టాల గురించి సాంస్కృతిక శాఖ డెరైక్టర్ మామిడి హరికృష్ణ ఇటీవల సీఎం కేసీఆర్‌కు వివరించారు. స్పందిం చిన ఆయన తగిన నివేదిక సమర్పించాలని ఆదేశించారు. దీనిపై హరికృష్ణ నివేదిక ఇస్తూ రూ.2 కోట్లు ఇస్తే సరిపోతుందని వివరించారు. కేసీఆర్ వెంటనే సమ్మతం తెలుపుతూ రవీంద్రభారతికి మరమ్మతులు కూడా చేయించాలని ఆదేశించారు. అసెంబ్లీలో ప్రకటించిన బడ్జెట్ సందర్భంగా రవీంద్రభారతి నిధులకు ఆమోద ముద్ర కూడా వేశారు. దీంతో ఉద్యోగులు, సిబ్బంది ఆనందం వ్యక్తం చేస్తున్నారు. త్వరలో దీనికి సంబంధించిన ప్రత్యేక జీవో విడుదల కానున్నది. -
‘రవీంద్రభారతి’కి ఇక మంచిరోజులు
రూ. 30 లక్షల నుంచి రూ.2 కోట్లకు నిధులు పెంపు సాక్షి, సిటీబ్యూరో: సాంస్కృతిక వికాస కేంద్రంగా విరాజిల్లుతున్న రవీంద్రభారతికి ఇక అన్నీ మంచిరోజులే అని చెప్పొచ్చు. ఇంతవరకు రవీంద్రభారతి ఆర్థిక ఇబ్బందులతో అవస్థలు పడుతోంది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ స్పందించి నిర్వహణ నిధులను రూ.30 లక్షల నుంచి రూ.2 కోట్లకు పెంచారు. వాస్తవంగా రవీంద్రభారతికి వివిధ కార్యక్రమాల నిర్వహణ ద్వారా నెలకు రూ.3 నుంచి 4 లక్షల వరకు ఆదాయం వస్తోంది. కానీ జీతభత్యాలే రూ. 9లక్షలు వరకు ఇవ్వాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో రవీంద్రభారతికున్న ఆర్థిక కష్ట నష్టాల గురించి సాంస్కృతిక శాఖ డెరైక్టర్ మామిడి హరికృష్ణ ఇటీవల సీఎం కేసీఆర్‌కు వివరించారు. స్పందిం చిన ఆయన తగిన నివేదిక సమర్పించాలని ఆదేశించారు. దీనిపై హరికృష్ణ నివేదిక ఇస్తూ రూ.2 కోట్లు ఇస్తే సరిపోతుందని వివరించారు. కేసీఆర్ వెంటనే సమ్మతం తెలుపుతూ రవీంద్రభారతికి మరమ్మతులు కూడా చేయించాలని ఆదేశించారు. అసెంబ్లీలో ప్రకటించిన బడ్జెట్ సందర్భంగా రవీంద్రభారతి నిధులకు ఆమోద ముద్ర కూడా వేశారు. దీంతో ఉద్యోగులు, సిబ్బంది ఆనందం వ్యక్తం చేస్తున్నారు. త్వరలో దీనికి సంబంధించిన ప్రత్యేక జీవో విడుదల కానున్నది. -
పరిశ్రమలతోనే సమాజాభివృద్ధి
* కార్మికుల రక్షణకు చర్యలు * హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి సాక్షి, హైదరాబాద్: పరిశ్రమల్లోని కార్మికుల ప్రాణ రక్షణకు తగు చర్యలు చేపడుతున్నామని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలిపారు. శుక్రవారం రవీంద్రభారతిలో డిపార్ట్మెంట్ ఆఫ్ ప్యాక్టరీస్, జాతీయ భద్రతా కౌన్సిల్, హైదరాబాద్ ఆధ్వర్యంలో 45వ నేషనల్ సెఫ్టీ డే సెలబ్రేషన్స్ జరిగాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిశ్రమల ప్రగతితోనే సమాజం బాగుపడుతుందన్నారు. నిరుద్యోగ సమస్య ఉండదని.. నక్సలిజం లాంటి సమస్యలు ఉత్పన్నం కావని తెలిపారు. బయటి రాష్ట్రాల నుంచి కార్మికులు ఉపాధి కోసం వచ్చి ఇక్కడ పరిశ్రమల్లో చేరుతున్నారని.. అయితే వారికి సరైన శిక్షణ లేక ప్రమాదాల బారిన పడుతున్నారన్నారు. ఇలాంటి వారి కోసం ఓ శిక్షణా కేంద్రం ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు నాయిని చెప్పారు. తనిఖీల పేరుతో అధికారుల జేబు నిండే కార్యక్రమానికి చెక్ పెట్టేందుకు, కార్మిక సంఘాల నేతలు, అధికారులతో కలిపి పరిశ్రమల తనిఖీ కమిటీ వేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం డిపార్ట్మెంట్ ఆఫ్ ప్యాక్టరీస్ ఆధ్వర్యంలో నాయినిని ఘనంగా సత్కరించారు. పలువురికి అవార్డులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమలు, ఎంప్లాయ్మెంట్ శాఖ ముఖ్య కార్యదర్శి హర్‌ప్రిత్ సింగ్, నేషనల్ సెఫ్టీ కౌన్సిల్ ఉపాధ్యక్షుడు ఎస్ఎల్ఎన్ మూర్తి, ఎంబీ విజయ్‌కుమార్, డెరైక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ సీహెచ్ కిషన్, కనీస వేతనాల చట్టం సలహామండలి చైర్మన్ సదానంద గౌడ్, ఏఐటీయూసీ జాతీయ ఉపాధ్యక్షుడు టి. చంద్రశేఖర్, ఐఎన్టీయూసీ నేత ఆర్బీ చంద్రశేఖర్, బీఎంఎస్ నేత మల్లేశం, డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ గంగాధర్‌రెడ్డి తదిత రులు పాల్గొన్నారు. సార్ కంట్రోల్... ప్రసంగం తగ్గించండి కార్మికులన్నా, పరిశ్రమలన్నా... హోంమంత్రి తనను తాను మరిచిపోతారు. అదీ బాస్ కేసీఆర్ పేరును ఉటంకిస్తూ ఏవేవో అనేస్తారు. రవీంద్రభారతిలోనూ ఇదే జరిగింది. నగర సమీపంలోని కొన్ని పరిశ్రమలు అతి దారుణంగా వ్యవహరిస్తున్నాయని, దౌర్జన్యాలు, అన్యాయాలు సాగిస్తున్నాయని, వాటిని దేవుడే బాగు చేయాలని, తనకు మాత్రం ఛాన్స్ దొరికితే వాటిని గాడిలో పెట్టాలని ఉందన్నారు. సీఎం కేసీఆర్ పరిశ్రమల జోలికి వెళ్లొద్దని అంటున్నారని నర్మగర్భంగా పలు విషయాలు మాట్లాడేశారు. పక్కనే ఉండి ఇది గ మనించిన హర్‌ప్రీత్‌సింగ్.. సార్ ప్రసంగం తగ్గించండి, కంట్రోల్ అంటూ చెప్పే ప్రయత్నం చేశారు. దీంతో నాయిని అర్థం చేసుకుని కొంత శాంతించారు. -
అద్భుతం.. అగ్నివర్షం..
-
సినీ భస్మాసుర..
సిటీలో తెలుగు నాటక ప్రదర్శన పాత్రధారులుగా పలువురు సినీ నటులు బెంగాళీ, తమిళ్, మరాఠి భాషల్లో ఊపు మీదున్న నాటకం తెలుగులో మాత్రం చతికిల పడిందేం? హైదరాబాద్‌లో అన్య భాషల నాటకాలు ప్రదర్శిస్తే టిక్కెట్టు కొని మరీ చూస్తారు..మరి తెలుగు నాటకాన్ని ఎందుకు ఆదరించరు? ఈ ప్రశ్నలు రంగస్థల అభిమానుల మదిలో ఎప్పటి నుంచో ఉన్నవే. అప్పుడప్పుడు మాత్రం వారిలో కొందరు దీనికి సమాధానం చెప్పాలనే బాధ్యతను తీసుకుంటారు. ఈ సారి ఆ బాధ్యతను తీసుకున్నారు సీమా అజారుద్దీన్. నగరంలోని రవీంద్రభారతిలో ‘సినీ భస్మాసుర’ నాటకాన్ని ఈ నెల 21, 22 తేదీల్లో ప్రదర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలుగు నాటకం స్థితిగతులపై పలువురి అభిప్రాయాలు, అనుభవాలు...మీకోసం - సాక్షి, వీకెండ్ ప్రతినిధి అమెరికా నుంచి 32 సంవత్సరాల తర్వాత హైదరాబాద్‌కి తిరిగి వచ్చిన కర్తాల్ ప్రొడక్షన్స్ అధినేత్రి సీమా అజారుద్దీన్ తెలుగు నాటకానికి అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తీసుకు రావాలని ఎంతో తపన పడుతున్నారు. అదే లక్ష్యంతో ఆమె టాలీవుడ్ గ్లామర్‌ని, ఇటు థియేటర్ నటీనటులను కలిపి ‘సినీ భస్మాసుర’ నాటక ప్రదర్శనకు సంకల్పించారు. మొత్తం 10 మంది టాలీవుడ్ నటులు, 15 మంది థియేటర్ ఆర్టిస్టులు నటిస్తున్నారు. ప్రపంచంలోని 12 కోట్ల మంది తెలుగు వారికి తెలుగు నాటకాన్ని దగ్గర చెయ్యాలని, ఇక్కడ ఉన్న చిన్నా పెద్దా నాటక గ్రూప్‌లు అన్నిటినీ ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చి ఒక రంగస్థల అనుబంధ వేదిక ఏర్పాటు చేయాలనుకుంటున్నారు సీమ. కళలు వినోదాన్ని మాత్రమే కాదు వికాసాన్ని, జ్ఞానాన్ని ఇస్తాయని చెప్పే సీమా...ప్రయత్నానికి తెలాంగాణ ప్రభుత్వం సానుకులంగా స్పందించి సహకారాన్ని అందిస్తోంది. మరోవైపు తెలుగు చలనచిత్ర పరిశ్రమ నటీనటులు ఈ నాటకానికి గ్లామర్ జోడిస్తున్నారు. గత 40 రోజులుగా ఫిలింనగర్‌లోని ఫిలిం చాంబర్స్ హాల్లో జరుగుతున్న రిహార్సల్స్‌లో నటీనటులు పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ కలిసిన కళామతల్లి ముద్దు బిడ్డలతో ముచ్చటించినప్పటి విశేషాలివీ... ఇగోలను తుడిచేస్తుంది... యాక్టర్ అంటే ఇగో ఉంటుంది. సినిమాలో ఇది మరి ఎక్కువ. కానీ వాళ్లు థియేటర్‌కి వచ్చే సరికి చాలా హంబుల్‌గా మారిపోతారు. అది థియేటర్ గొప్పతనం. ఎందుకంటే ఇక్కడ ఆర్టిస్ట్ క్యారెక్టర్ పూర్తిగా ఆర్టిస్ట్ సొంతం. కెమెరా లేదు, డబ్బింగ్ లేదు. డూప్ ఉండరు. అందుకే నటుడు తనలో ఉన్న బెస్ట్ ఇవ్వడానికి సిద్ధమవుతాడు. సింగిల్ టేక్‌లో తన టాలెంట్ ప్రదర్శించడానికి అన్నీ నేర్చుకుంటాడు. - సీమా అజారుద్దీన్ నటన అంటే సినిమా ఒక్కటే కాదు... యాక్టింగ్ అంటే సినిమా అనే పరిస్థితి మారాలి. నటనకు అవకాశం ఇచ్చే వేదికలు పెరగాలి. అవి సిద్ధం చేయడానికి ఇది ప్రారంభం కావాలని కోరుకుంటున్నాం. వేరే రాష్ట్రంవాళ్లు వచ్చి చేసిన నాటకానికి పోస్టర్స్, హోర్టింగ్స్, మీడియాలో పూర్తి కవరేజ్. కానీ ఇక్కడి నాటకాలు ఏదో గుట్టుగా అయిపోయితాయి అంతే.. మన తెలుగు నాటకాలకు మాత్రం ఇలాంటి పరిస్థితి ఎందుకు అని అందరూ అలోచించాలి. అప్పుడే నాటకాన్ని నిలబెట్టడానికి మరి కొంత మంది ఆలోచిస్తారు. -రమాదేవి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ పాత కథకు కొత్త హంగులు... ఇది 18 ఏళ్ల క్రితం వేసిన నాటకం. దీన్ని మళ్లీ ప్రదర్శిస్తున్నాం. సుమ మినహా మిగతా వాళ్లంతా ఈ నాటకంలో కొత్త వాళ్లే. అప్పటి కథలో సెల్ఫోన్లు, మీడియా హడావుడిలేదు. వాటిని దీంట్లో చేర్చాం. ఈ సబ్జెక్టు కాంటెంపరరీ. రెండు గంటలపాటు ఉండే నాటకం ఇది. దీనిలో కోట శంకర్ రావ్, బాబూమోహన్, బ్రహ్మాజీ, తనికెళ్ల భరణి, సుమ, శివాజీరాజా, రవి వర్మ, రాళ్లపల్లి, ఢిల్లీ రాజేశ్వరి, వైజాగ్ ప్రసాద్, నంద కుమార్ ఇలా తెలిసిన నటులతో పాటు థియేటర్ ఆర్టిస్టులు ఉన్నారు. - ఉదయభాను గరికపాటి, నాటక దర్శకులు ఆ థ్రిల్ వేరు... గత కొంతకాలంగా సినిమాలు, సీరియల్స్ చేయడం తగ్గింది. నేను నా లాగే,..అంటే సుమ లాగే స్క్రీన్ మీద యాంకరింగ్ చేస్తున్నాను. యూంకరింగ్లో డైలాగ్, క్యారెక్టర్లు ఉండవు. అందుకే నాటకంలో క్యారెక్టర్ చేస్తావా అంటే వెంటనే ఒప్పుకున్నాను. ఉదయభాను గారి దర్శకత్వంలో అనురాధ పాత్ర 18 ఏళ్ల తర్వాత చేస్తున్నాను. లైవ్ పర్ఫార్మన్స్లో థ్రిల్ వేరుగా ఉంటుంది. ఆడియెన్స్ ఎలా రియాక్ట్ అయినా స్పందించకుండా మా పాత్రలో మేం లీనమయి నటించడం నాటకంలో స్పెషల్. - సుమ. యాంకర్ వాచీలు తాకట్టు పెట్టి నాటకాలు వేశాం నాటకం చూడటానికి ప్రేక్షకులు ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నారు. అయితే చేసేవాళ్లేరి? ఎందుకంటే...నాటకంలో వేషం వేసినా, రాసినా ఏం రాదు. సీరియల్స్‌కి, సినిమాలకు రాస్తే ఆదాయం వస్తుంది. అప్పట్లో మేం వాచీలు, ఉంగరాలు, సైకిల్లు తాకట్టు పెట్టి నాటకాలు వేశాం. ముందు మంచి నాటకం చూడటం జనానికి అలావాటు చేస్తే, తర్వాత టిక్కెట్టు ఖర్చు పెట్టడానికి ప్రేక్షకులు సిద్ధమని ఇతర భాషల నాటక ప్రదర్శనలు చూస్తే తెలుస్తుంది. - తనికెళ్ల భరణి, నటుడు, రచయిత -
బాలల హక్కుల కోసం ప్రత్యేక చట్టం
సాక్షి, హైదరాబాద్: బాలల హక్కులకు భంగం వాటిల్లకుండా, వారికి మంచి విద్య, ఉజ్వల భవిష్యత్తు అందించేలా వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ప్రత్యేక చట్టాన్ని తీసుకువస్తున్నట్టు కేంద్ర కార్మిక శాఖ సహాయమంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. 14 ఏళ్లలోపు వయసున్న బాలలను పనిలో పెట్టుకున్న ఫ్యాక్టరీలు, దుకాణాల యాజమాన్యాలను జైలుకు పంపేలా ఈ చట్టం ఉంటుందన్నారు. ప్రమాదకర (హజార్డస్) ప్రాంతాల్లో 18 ఏళ్ల లోపు చిన్నారులను పనిలోకి తీసుకోవడాన్ని కూడా నిషేధిస్తూ నిబంధనలను పొందుపరిచామని అన్నారు. శనివారం హైదరాబాద్ రవీంద్రభారతిలో స్త్రీ,శిశు సంక్షేమశాఖ నిర్వహించిన బాలల దినోత్సవానికి ఆయన విశిష్ట అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రత్యేకించి ఆడపిల్లల రక్షణ, విద్యాభివృద్ధి కోసం ప్రధాని నరేంద్రమోదీ ‘బేటీ బచావో... బేటీ పడావో’ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నారని చెప్పారు. సమాన హక్కు లు, సరైన అవకాశాలు కల్పిస్తే మగపిల్లల కంటే ఆడపిల్లలే మెరుగ్గా రాణిస్తారన్నారు. ఆడపిల్లలంటే ఆదిలక్ష్మిలుగా భావిస్తానని చెప్పారు. నిర్బంధ విద్యాహక్కు చట్టం పకడ్బందీగా అమలయ్యే లా చర్యలు తీసుకుంటున్నామన్నారు. చదువుకున్న బాలలకు మెరుగైన ఉపాధి అవకాశాలు లభించేలా కార్మికశాఖ తరపున నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. కేంద్ర ం తీరుపై మంత్రి తుమ్మల ఫైర్ సమగ్ర బాలల సంరక్షణ పథకాలకు రాష్ట్రానికి రావాల్సిన నిధుల్లో కేంద్రం భారీగా కోత విధిస్తోందని రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఆయా పథకాలకు 90 శాతం నిధులు కేంద్రం ఇస్తుండగా, తాజాగా 60 శాతానికి కుదించడంపై రవీంద్రభారతిలో నిర్వహించిన బాలల దినోత్సవ వేదికపైనే అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్రం ఇచ్చినా ఇవ్వకున్నా రాష్ట్ర ప్రభుత్వం బాలలను అక్కున చేర్చుకొని వారి అభివృద్ధి కోసం కార్యక్రమాలను అమలు చేస్తుందని అన్నారు. బాలల దినోత్సవం సందర్భంగా వివిధ అంశాల్లో ప్రతిభ కనబర్చిన బాలలకు బాలరత్న, బాలసూర్య పురస్కారాలను, నగదు బహుమతులను అందజేశారు. బాలబాలికలు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. కార్యక్రమంలో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి జగదీశ్వర్, డెరైక్టర్ ప్రశాంతి, జాయింట్ డెరైక్టర్ శ్యామసుందరి, డిప్యూటీ డెరైక్టర్ రాజ్యలక్ష్మి, జువైనల్ హోమ్స్ ఎండీ శైలజ, జవహర్ బాలభవన్ డెరైక్టర్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. -
నయన మనోహరం
-
రవీంద్రభారతికి నెలరోజుల విరామం..!
పునరుద్ధరణ పనులకు శ్రీకారం సాక్షి,సిటీబ్యూరో : దీర్ఘకాలంగా సమస్యలతో రవీంద్రభారతి కళ తప్పింది. దీంతో ‘సాక్షి’లో ఆగష్టు 30న ‘కళా విహీనం’ శీర్షికన కథనం ప్రచురితమైంది. దీనిపైటూరిజం- సాంస్కృతిక శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం స్పందించారు. టీఎస్‌టీడీసీ విభాగంలో అభివృద్ధి పనులను పరిశీలించే ఎస్ఈతో మాట్లాడి వెంటనే పనులు చేపట్టాలని సూచించారు. ఆ మేరకు గురువారం టీఎస్‌టీడీసీ డీఈ ఆశోక్ కుమార్ రవీంద్రభారతిని పరిశీలించి, సాంస్కృతిక డెరైక్టర్ మామిడి హరికృష్ణతో కలిసి ఎక్కడెక్కడ పునరుద్ధరణ పనులపై అంచనాలు సిద్ధం చేశారు. ఆయా పనులకు సంబంధించి టెండర్ల పని వేగవంతం చేశారు. ఈ పనుల నిమిత్తం అక్టోబర్ ఒకటి నుంచి రవీంద్రభారతిని నెలరోజుల పాటు టీఎస్‌టీడీసీకి అప్పగించనున్నారు. ఈ పనులు పూర్తయ్యే వరకు ఎలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించే అవకాశం ఉండదని టూరిజం శాఖ అధికారులు తెలిపారు. -
రవీంద్రభారతిలో వైఎస్ఆర్ జయంతి కార్యక్రమం
-
కళాకారులది నిర్మాణాత్మక పాత్ర
- రవీంద్రభారతిలో కవి సమ్మేళనం - కొత్తసాలు పుస్తకావిష్కరణ నాంపల్లి: తెలంగాణలో కవులు, కళాకారులు, రచయితలకు కొదవ లేదని, చరిత్రలో వారునిర్మాణాత్మకమైన పాత్రలను పోషించారని వక్తలు పేర్కొన్నారు. ఆదివారం రవీంద్ర భారతి వేదికపై రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ చెందిన 400 మంది కవులతో కవి సమ్మేళనం నిర్వహించారు. పద్య, వచన కవులతో పాటు ఆశు కవులు కూడా భాగస్వాములై సదస్సును విజయవంతం చేశారు. తెలంగాణ మాండలికాన్ని అద్భుతంగా చాటుతూ ప్రతి భను కనబరిచారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కె.వి.రమణాచారి, తెలుగు విశ్వవిద్యాలయం ఇన్చార్జ్ ఉపకులపతి ఆచార్య ఎల్లూరి శివారెడ్డి, జాతీయ సాహిత్య అవార్డు గ్రహీత ఆచార్య ఎన్.గోపితో కలిసి జ్యోతిప్రజ్వలన చేసి కవి సమ్మేళనాన్ని ప్రారంభిం చారు. ఈ సందర్భంగా డాక్టర్ కె.వి.రమణాచారి మాట్లాడుతూ తెలంగాణ సాంస్కృతిక, సాహిత్య నేపథ్యాన్ని భావితరాలకు తెలియజేయటం కోసం కవి సమ్మేళనాలు దోహదపడుతాయన్నారు. ఆచార్య ఎల్లూరి శివారెడ్డి మాట్లాడుతూ ఉద్యమనేత రాష్ట్ర పాలకుడైతే రాష్ట్రం ఎంతో సుభిక్షంగా ఉంటుందన్నారు. రాష్ట్రం ఎంత అలరారుతుందో సీఎం కేసీఆర్ ఈ ఉత్సవాల నిర్వాహణ ద్వారా నిరూపించారని అన్నారు. ఆచార్య ఎన్.గోపి తొలి కవితను వినిపించి కవి సమ్మేళనానికి శ్రీకారం చుట్టారు. కవి ఆచార్య అనుమాండ్ల భూమయ్య పద్య గానంతో సభికులను ఆకట్టుకున్నారు. ప్రారంభోపన్యాసం చేసిన రాష్ట్ర సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ మాట్లాడుతూ ఈ ఉత్సవాలను నభూతో నభవిష్యతి అన్న చందాన నిర్వహించామని అందుకు సహకరించిన అందరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సమ్మేళనం విజయవంతమైన తీరు చరిత్రలో నిలిచిపోతుందన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన కవి సమ్మేళనానికి ప్రముఖ కవులు ఆచార్య అనుమాండ్ల భూమయ్య, జూలూరి గౌరీ శంకర్, తూర్పు మల్లారెడ్డి, ఎస్.వి.సత్యనారాయణ, జూపాక సుభద్ర తదితరులు అధ్యక్షత వహించారు. అనువాద కవులను రాష్ట్ర సాంస్కృతిక శాఖ పక్షాన ఘనంగా సత్కరించారు. తొలుత రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ప్రపంచ కవితా దినోత్సవంలో పాల్గొన్న కవులు అందించిన కవిత్వాలతో పొందుపరిచిన ‘కొత్తసాలు’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. -
‘అక్కినేని ప్రపంచస్థాయి నటుడు’
హైదరాబాద్: ప్రపంచంలోని అగ్రస్థాయి నటుల్లో దివంగత సినీనటుడు అక్కినేని నాగేశ్వరరావు ఒకరని ఏపీ ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి అన్నారు. శనివారం హైదరాబాద్ రవీంద్రభారతిలో టి.సుబ్బరామిరెడ్డి లలితకళా పరిషత్ ఆధ్వర్యంలో రసమయి నిర్వహణలో అక్కినేని నాగేశ్వరరావు 91వ జయంతి సందర్భంగా అక్కినేనికి నీరాజనాలు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కేఈ మాట్లాడుతూ... తెలుగు భాష, సినీరంగం ఉన్నంత వరకు అక్కినేని ఉంటారన్నారు. కవి సి.నారాయణ రెడ్డి మాట్లాడుతూ అక్కినేని ముఖానికి తప్ప ఆయన మనసుకు మడతలు లేవు అని కొనియాడారు. సినీనటుడు కృష్ణ మాట్లాడుతూ తాను సినీ ఇండస్ట్రీలోకి రావటానికి కారణం అక్కినేని అని తెలిపారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.చంద్రకుమార్, హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి, ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్, టి.సుబ్బరామిరెడ్డి, నటి విజయనిర్మల, రసమయి వ్యవస్థాపక అధ్యక్షుడు ఎం.కె.రాము పాల్గొన్నారు. -
ప్రజలను జాగృతపరిచేవి కళలే
ఉమ్మడి రాష్ట్రంలో కళాకారులకు అన్యాయం డిప్యూటీ సీఎం రాజయ్య రవీంద్రభారతిలో అక్కినేని మీడియా అవార్డ్స్ ప్రదానం సాక్షి మీడియా ప్రతినిధులకు రెండు అవార్డులు సాక్షి, సిటీబ్యూరో: కళలు ఎప్పుడో ఒకప్పుడు ప్రజలను జాగృతం చేస్తుంటాయని తెలంగాణ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి టి.రాజయ్య అన్నారు. బుధవారం రవీంద్రభారతిలో శృతిలయ ఆర్ట్స్ అకాడమి, షి ఫౌండేషన్ ఆధ్వర్యంలో దివంగత సినీ దిగ్గజం డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు 91వ జయంతి సందర్భంగా అక్కినేని మీడియా అవార్డ్స్‌ను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా రాజయ్య మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో కళాకారులు వివక్షతకు గురయ్యారన్నారు. అసెంబ్లీ స్పీకర్ ఎస్.మధుసూదనాచారి మాట్లాడుతూ మీడియా అవార్డ్సు ప్రదానం మంచిని ప్రభావితం చేసే కార్యక్రమమన్నారు. అనంతరం శృతిలయ, షి ఫౌండేషన్ ఆధ్వర్యంలో అక్కినేని మీడియా అవార్డులను సాక్షి టీవీకి చెందిన బి.కల్పనకు, సాక్షి ఫిలిమ్ రిపోర్టర్ ఎస్.నాగేశ్వరరావు, ఎక్స్‌ప్రెస్ టీవీ నుంచి భవన, ఈటీవీ2 నుంచి సతీష్‌తోపాటు పలువురికి అందజేశారు. ఈ సందర్భంగా వారిని శాలువతో సన్మానించి, జ్ఞాపికతోపాటు ప్రశంసాపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో సమాచార హక్కు కమిషనర్ పి.విజయబాబు, శృతిలయ నిర్వాహకులు ఆర్ఎన్ సింగ్, ఆమని, దళిత సేవా అధ్యక్షులు జేబీ రాజు తదితరులు పాల్గొన్నారు. -
నిరంతర అధ్యయనానికే గుర్తింపు
వేడుకగా తెలుగు వర్సిటీ స్నాతకోత్సవం ప్రముఖ సాహితీవేత్త కపిలవాయికి గౌరవ డాక్టరేట్ 62 మందికి పీహెచ్‌డీలు, 59 మందికి బంగారు పతకాల ప్రదానం సాక్షి,సిటీబ్యూరో: మారుతున్న ప్రపంచ పరిణామాల్లో నిరంతర అధ్యయన శీలురుగా మసలుకొంటూ ముందుకు సాగాలని ప్రముఖ సాహితీవేత్త కపిలవాయి లింగమూర్తి ఉద్బోధించారు. ఎప్పటికప్పుడు విజ్ఞానాన్ని సముపార్జించుకుంటూ మీరు ఎంచుకున్న రంగంలో నిపుణులు కావాలని సూచించారు. అప్పుడే సమాజం గుర్తించే స్థాయికి చేరగలరన్నారు. శనివారం పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం 13 స్నాతకోత్సవం రవీంద్రభారతిలో నిర్వహించారు. శతాధిక గ్రంధకర్త, ప్రముఖ పండితుడు, కవి, నవలాకారుడు, ప్రముఖ సాహితీవేత్త కపిలవాయి లింగమూర్తి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. శాస్త్ర జ్ఞానం కంటే తనను తాను తెలుసుకున్నప్పుడే తత్త్వజ్ఞుడన్న సంగతి గ్రహించాలన్నారు. అనంతరం ఆయనకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక శాఖ సంచాలకులు ఆర్.కవితా ప్రసాద్, రిజిస్ట్రార్ ఆచార్య కె.ఆశీర్వాదం, వివిధ పీఠాల అధిపతులు, విశ్వవిద్యాలయ నిర్వహణ మండలి సభ్యులు చెన్నారెడ్డి, సత్తిరెడ్డి, అప్పారావు, రమేష్ తదితరులు పాల్గొన్నారు. వర్సిటీ ఉపాధ్యక్షులు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ వేడుకలో గడిచిన మూడు విద్యా సంవత్సరాల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు పట్టాలను ప్రదానం చేశారు. 62 మందికి పీహెచ్‌డీలు, 97 మందికి ఎంఫిల్ పట్టాలను, 59 మందికి బంగారు పతకాలను అందజేశారు. అన్ని కోర్సులకు కలిపి 2128 మందికి, సంగీత, నృత్య విభాగాల్లో 4757 మంది పట్టాలు అందుకున్నారు. ఈ సందర్భంగా బంగారు పతకాలు, పీహెచ్‌డీలు సాధించిన వారు తమ అభిప్రాయాలను ‘సాక్షి’తో పంచుకున్నారు. బాధ్యతను పెంచింది నృత్యంలో డాక్టరేట్ కొంత కష్టంతో కూడుకున్న పనే అయినా చేశా. లలిత కళల పీఠం నుంచి పట్టా తీసుకోవడం ఆనందంగా ఉంది. డ్యాన్స్‌కు ముక్తాయింపు పీహెచ్డీ. ఈ పట్టా ద్వారా ఆర్ట్స్‌పై నాలెడ్జ్ వస్తుంది. ‘సాహిత్యంలో సత్యభామ పాత్ర చిత్రీకరణ’ అంశంపై డాక్టరేట్ చేశాను. - మద్దాళి ఉషా గాయత్రి నా తల్లిదండ్రులకు అంకితం.. నాటక రంగంపై ఉన్న మక్కువతో కష్టమైనా ఇష్టంగా భావించి పరిశోధన చేశా. పీహెచ్డీ వచ్చింది. దీన్ని నా తల్లిదండ్రులకు అంకితమిస్తున్నా. గతంలో కూడా నా రచనలకు నాంది అవార్డు వచ్చింది. పలువురు సాహితీవేత్తలు నాకు సలహాలు ఇచ్చి సహకరించారు. అందరికి కృతజ్ఞతలు. - వి.త్రినాథరావు చాలా సంతోషంగా ఉంది జర్నలిజంలో ఒక అంశంపై అద్యయం చేశాను. కష్టానికి ఫలితమన్నట్టు బంగారు పతకం రావటం మరింత ఆనందం కల్గిస్తోంది. నా కష్టంతో పాటు చాలా మంది తనకి సలహాలు- సూచనలు ఇచ్చి సహకరించారు. భవిష్యత్తులో మరిన్ని అంశాలపై పరిశోధనలు చేస్తా. మా గురువు సత్తిరెడ్డి పొత్సాహం వెలకట్టలేనిది. - భువనగిరి రఘు అమ్మవారి కృపే.. కూచిపూడి నృత్య రూపాల్లో చాలా సార్లు అమ్మవారిపై నృత్యం చేశాను. అమె కృప వల్లే కూచిపూడిలో బంగారు పతకం వచ్చింది. చాలా సంతోషంగా ఉంది. మా గురువు సతీమణి సమక్షంలో రెండు గోల్డ్ మెడల్స్ అందుకున్నా. ఈ ఆనందమైన క్షణాలను వర్ణించలేను. జీవితంలో మరువలేను. - నూతి రోహిణి -
వైభవంగా త్రి శక్తి ఆడియో సీడీ ఆవిష్కరణ
-
ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం: స్వామిగౌడ్
సాక్షి,సిటీబ్యూరో: కొత్త ప్రభుత్వంలో అందరం ఏకమై ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందామని తెలంగాణ శాసనమండలి అధ్యక్షుడు స్వామిగౌడ్ పిలుపునిచ్చారు. రవీంద్రభారతిలో శుక్రవారం సత్కళా భారతి హైదరాబాద్ ఆధ్వర్యంలో ‘జయ జయహే తెలంగాణ’ సంగీత నత్యరూపకం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ జయజయహే నృత్యరూపకాన్ని తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో నిర్వహించాలని సూచించారు. 60 ఏళ్ల తెలంగాణ పోరాట ఘట్టాలను ఒక గంటలో చూపించడం మహాద్భుతమన్నారు. నృత్య రూపకానికి దర్శకత్వం వహించిన డాక్టర్ కోట్ల హనుమంతరావు, సంగీతం సమకూర్చిన డీఎస్వీ శాస్త్రి, రచన చేసిన డాక్టర్ వడ్డేపల్లి కష్ణలు అభినందనీయులన్నారు. తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కె.వి.రమణ మాట్లాడుతూ నృత్యరూపక కళాకారులకు అభినందనలు తెలిపారు. రాష్ట్ర ప్రెస్ అకాడమీ అధ్యక్షుడు అల్లం నారాయణ మాట్లాడుతూ తెలంగాణ స్వీయ రాజకీయ చిత్తం కోసం పోరాడి...చివరికి సాధించుకున్నదని చెప్పారు. రాజకీయాలు మాట్లాడేవారు తెలంగాణ పోరాటం విముక్తి కోసం జరిగిన పోరాటంగా గుర్తించడం లేదన్నారు. గురుకుల భూములను ప్రభుత్వం తీసుకోవాలనుకుంటోందన్నారు. ఉద్యమకారుల ఆకాంక్షను ప్రభుత్వం నెరవేరుస్తుందన్నారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య ఎల్లూరి శివారెడ్డి మాట్లాడుతూ జయ జయహే తెలంగాణ నృత్యరూపకం, తెలంగాణ జనపద గేయాలు భేషుగ్గా ఉన్నాయని ప్రశంసించారు. అనంతరం నృత్య రూపకంలో పాల్గొన్న కళాకారులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో సత్కళా భారతి అధ్యక్షుడు జి.సత్యనారాయణ, ఎమ్మెల్సీ పూల రవీందర్ తదితరులు పాల్గొన్నారు. ఉద్యమ ఘట్టాలను గుర్తుచేసిన రూపకం జయ జయహే తెలంగాణ సంగీత నృత్య రూపకం 60 ఏళ్ల తెలంగాణ పోరాటంలోని కీలక ఘట్టాలను ఒక గంటలో కళ్ల ముందుంచింది. దీన్ని తిలకించేందుకు వచ్చిన ప్రజలు, నేతలు ఉత్కంఠగా సన్నివేశాలను తిలకించారు. రవీంద్రభారతి ప్రాంగణంలో ఉన్న యావన్మంది రూపకాన్ని రచించిన డాక్టర్ వడ్డేపల్లి కష్ణ, దర్శకత్వం వ హించిన డాక్టర్ అనితారావు, డాక్టర్ కోట్ల హనుమంతరావు, సంగీతం సమకూర్చిన డీఎస్వీ శాస్త్రిలను ప్రశంసించారు. -
పెద్ద కూలీ ఐఏఎస్సే
ప్రేమతోనే సివిల్స్‌లోకి రావాలి సీనియర్ ఐఏఎస్‌ల ఉద్ఘాటన సాక్షి,సిటీబ్యూరో: సమాజంలో అతి పెద్ద కూలీ ఐఏఎస్ అధికారే.. ప్రజలపై విపరీతమైన ప్రేమ, సమస్య-పరిష్కారాలే శ్వాస ధ్యాసగా భావించే మనస్తత్వం, జన శ్రేయస్సే లక్ష్యంగా ఉన్నప్పుడు మాత్రమే సివిల్ సర్వీస్‌లోకి అడుగుపెట్టాలని సీనియర్ ఐఏఎస్ అధికారులు పేర్కొన్నారు. బుధవారం రవీంద్రభారతి తెలుగు అకాడమీ ఆధ్వర్యంలో సివిల్ సర్వీసులపై అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ఉన్నత విద్య ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్ మిశ్రా మాట్లాడుతూ దేశంలో అన్నింటి కన్నా విలువైన పరీక్ష నేడు సివిల్స్ ఎగ్జామ్ అని తెలిపారు. ప్రపంచాన్ని అర్థం చేసుకునే క్రమంలో తెలిసి వచ్చే ప్రతి అంశం సివిల్ సర్వీస్‌లో ఒక పాఠం లాంటిదనే విషయం ప్రతి గ్రాడ్యుయేట్ గుర్తెరగాలని కోరారు. మున్ముందు తెలుగువారు అత్యధికులు సివిల్ సర్వీస్ పరీక్షకు హాజరై, ఉత్తీర్ణులు కావాలని ఆకాంక్షిస్తున్నామన్నారు. సీనియర్ అధికారులు డాక్టర్ ఏ అశోక్, డాక్టర్ పి.వి.లక్ష్మయ్యలు నేటి తరం విద్యావంతులను సివిల్ సర్వీసుల వైపు కార్యోన్ముఖులను చేసేందుకు పుస్తకాలు రాయటం, అవగాహన కల్పించటం ఆదర్శ ప్రాయమన్నారు. భాషా సాంస్కృతిక శాఖ కార్యదర్శి ఎన్. ముక్తేశ్వరరావు మాట్లాడుతూ 120 కోట్ల మంది ఉన్న దేశంలో అటు సమాజాన్ని, ఇటు జన జీవితాన్ని ప్రభావితం చేసే అతి గొప్ప సర్వీసు సివిల్స్ అని తెలిపారు. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కమిషనర్ అధర్ సిన్హా మాట్లాడుతూ సివిల్స్‌లో పద్ధతి ప్రకారం చదివితే విజయం సొంతమన్నారు. సభకు అధ్యక్షత వహించిన తెలుగు అకాడమీ సంచాలకులు ఆచార్య కె.యాదగిరి మాట్లాడుతూ విద్యార్థులకు అవసరమయ్యే సమాచారం ఇస్తే మరిన్ని పుస్తకాల్ని తాము అచ్చు వేస్తామన్నారు. పుస్తకరచయితలు కార్మిక శాఖ కమిషనర్ డాక్టర్ ఏ అశోక్, పశువైద్య విద్య అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ పి.వి.లక్ష్మయ్యలు మాట్లాడుతూ డిగ్రీ పూర్తి చేసుకొని సివిల్ సర్వీసు పరీక్షలు రాయాలనే కోరిక ఉన్నవారు ఎవరైనా తమను సంప్రదిస్తే కెరీర్‌పై అవగాహన కల్పించేందుకు ఎల్లవేళలా తాము సిద్ధమేనని చెప్పారు. అనంతరం ‘మీరు ఐఏఎస్ కావాలనుకుంటున్నారా?’ అనే పుస్తకాన్ని అజయ్ మిశ్రా ఆవిష్కరించారు. ఆంత్రోపాలజీకల్ తాట్, సోషియో కల్చరల్ ఆంత్రోపాలజీ పుస్తకాలను కళాశాల విద్య కమిషనర్ కె. సునీత ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ ఐఏఎస్ అధికారులు ఎల్. శశిధర్రావు, ఎ.దినకర్ బాబు, డాక్టర్ ఎం జగన్మోహన్, డాక్టర్ యు.వెంకటేశ్వర్లు, వాణీ ప్రసాద్ కార్మికశాఖ కమిషనర్ డాక్టర్ ఏ. అశోక్, పశువైద్య విద్య అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ పి.వి.లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. -
దాసరి 70వ పుట్టిన రోజు వేడుకలు
-
రూ.300 కోట్లతో అత్యాధునిక స్టూడియో
=3న కేబినెట్ సమావేశంలో నిర్ణయం =మంత్రి పొన్నాల వెల్లడి =ఘనంగా పద్మమోహన ఆర్ట్స్ అవార్డుల ప్రదానం సాక్షి,సిటీబ్యూరో: రాష్ట్రంలో యానిమేషన్, గేమింగ్ సెంటర్ ఏర్పాటులో భాగంగా రూ.300 కోట్ల వ్యయంతో 30 ఎకరాల్లో రాయదుర్గం వద్ద అత్యాధునిక పరిజ్ఞానంతో కూడిన ఓ స్టూడియో త్వరలో నిర్మించనున్నట్లు ఐటీశాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య తెలిపారు. శుక్రవారం రవీంద్రభారతిలో పద్మమోహన ఆర్ట్స్ 23వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. బుల్లితెర కళాకారులకు పద్మమోహన టీవీ అవార్డు-2013లను ఆయన అందజేసి మాట్లాడారు. ఈ స్టూడియోకు సంబంధించి వచ్చేనెల 3న జరిగే కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. అలాగే బుల్లితెర కళాకారులకు ఉగాది పురస్కారాలు అందించేలా సీఎంతో మాట్లాడతానని చెప్పారు. సమాచార హక్కు చట్టం కమిషనర్ పి.విజయబాబు మాట్లాడుతూ మంచి-చెడులు రెండింటిని టీవీ రంగం ప్రభావితం చేస్తోందని పేర్కొన్నారు. ప్రతి కళాకారుడి చరిత్రలో చీకటిపుటలు ఎన్నో ఉంటాయని తెలిపారు. ఏఐసీసీ కార్యద ర్శి పొంగులేటి సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ ఫిల్మ్నగర్లాగా టీవీ కళాకారులకు అన్ని సౌకర్యాలతో టీవీనగర్‌ను ఏర్పాటు చేయాల్సిన అవసరముందన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన మిమిక్రీ, సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. అనంతరం ‘సాక్షి’ నుంచి బెస్ట్ న్యూస్‌రీడర్‌గా హరి, మాటీవీ నుంచి బెస్ట్ కామెడీయన్‌గా మల్లికతోపాటు టీవీ రంగానికి చెందిన మరో 41 మంది ఆర్టిస్టులకు పద్మమోహన్ అవార్డులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కార్యదర్శి అర్వింద్కుమార్గౌడ్, సినీనటి కవిత, శివశక్తి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఎండీ ఎన్ఎస్ రావు, వైష్ణవీ ఇంద్రకాన్ ఇండియా లిమిటెడ్ ఎండీ పాండురంగారెడ్డి, పద్మమోహన్ ఆర్ట్స్ ఫౌండర్ డి.యాదగిరి తదితరులు పాల్గొన్నారు. -
రంగస్థల దర్శకుడు గంటాకు అక్కినేని అవార్డు
పాలకొల్లు, న్యూస్‌లైన్ : ఇటీవల హైదరాబాద్ రవీంద్రభారతిలో అక్కినేని నాటక కళాపరిషత్ ఆధ్వర్యంలో క్రియేటర్స్ పాలకొల్లు వారు ప్రదర్శించిన ‘తప్పుటడుగులు’ నాటికకు దర్శకత్వం వహించి న గంటా రామమోహనరావు అవార్డు అందుకున్నారు. ఉత్తమ సాంకేతిక దర్శకుడు అవార్డును ఆయన అక్కినేని నాగేశ్వరరావు చేతులమీదుగా స్వీకరించారు. ఈ సందర్భంగా గురువారం గంటా రామమోహనరావు ‘న్యూస్‌లైన్’తో మాట్లాడుతూ అవార్డు రావడం ఆనందంగా ఉందన్నారు. శుక్రవారం 90వ పుట్టినరోజు జరుపుకుంటున్న అక్కినేనికి శుభాకాంక్షలు తెలిపారు. పాలకొల్లులో వేసిన నాటకాలు, అక్కడి కళాపోషకుల దాతృత్వం ఎప్పటికీ మరువలేనని అక్కినేని తన వద్ద ప్రస్తావించారని చెప్పారు. ఎమ్మెల్సీలు మేకా శేషుబాబు, అంగర రామమోహన్, ఎమ్మెల్యే బంగారు ఉషారాణి, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ త్సవటపల్లి సత్యనారాయణమూర్తి (బాబ్జి) తదితరులు గంటాను అభినందించారు. -
సాహితీ రెడ్డి కూచిపూడి ప్రదర్శన
కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డి మనవరాలు, డాక్టర్ ఎస్.ఆనంద్‌రెడ్డి, అరుణారెడ్డిల కుమార్తె సాహితీరెడ్డి కూచిపూడి రంగప్రవేశం అట్టహాసంగా జరిగింది. రవీంద్రభారతిలో ఆదివారం ప్రదర్శించిన ఈ నాట్య విన్యాసం అద్వితీయంగా సాగింది. పద్మభూషణ్ పురస్కార గ్రహీత రాజా, రాధారెడ్డి కొరియోగ్రఫీ చేశారు. జైపాల్‌రెడ్డి జ్యోతిప్రజ్వలన చేసిన ఈ కార్యక్రమంలో ఎంపీలు గుత్తా సుఖేందర్‌రెడ్డి, సీఎం సురేష్, ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి, మంత్రి జానారెడ్డి హాజరై సాహితిపై అభినందనల జల్లు కురిపించారు. -
ఆదివాసీ..ఎంతో మురిసి
సాక్షి,సిటీబ్యూరో: ప్రపంచ ఆదివాసి దినోత్సవం నగరంలో శుక్రవారం ఘనంగా జరిగింది. రవీంద్రభారతితోపాటు ఆయా ప్రాంతాల్లో జరిగిన కార్యక్రమాల్లో వెనుకబడిన ఆదివాసీల సమస్యలు, వారి హక్కుల ను వివరించడంతోపాటు వాటి సాధనకు ఐక్యఉద్యమాలు శరణ్యమని స్పష్టంచేశారు. ప్రతి తండాను పంచాయతీగా ప్రకటించాలని,గిరిజనుల కోసం ప్రత్యేకంగా యూనివర్సిటీని ఏర్పాటు చేయా ల ని,ఈ ప్రాంతాలను ప్రత్యేక ప్రాంతాలుగా పరిగణిం చాలని పలువురు నాయకులు డిమాండ్ చేశారు. గిరిజన విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో జరిగిన కార్యక్రమంలో వైద్యమంత్రి కొండ్రు మురళి హాజరై మాట్లాడారు. గిరిజనుల్లో చైతన్యం రావాలని, అప్పుడే అన్నింట్లోనే న్యాయం జరుగుతుందని తెలిపారు. విశ్రాంత డీజీపీ డీటీ నాయక్ మాట్లాడుతూ ప్రతి తండాను పంచాయతీగా మార్చాలనగా..గిరిజన జాతుల వికాసానికి పాలకులు అండగా నిలవాలని మాజీ ఎంపీ రవీంద్రనాయక్ విజ్ఞప్తి చేశారు. సమాఖ్య వ్యవస్థాపకుడు శంకర్‌నాయక్ మాట్లాడుతూ ప్రాంతాలకతీతం గా గిరిజనులు పోరాటాలకు సిద్ధం కావాలన్నా రు. కళాకారుడు బిక్షు బృందం నిర్వహిం చిన సాంస్కృతిక కార్యక్రమాలు, సరిత బృం దం నిర్వహించిన భరతనాట్యం అమితంగా ఆకట్టుకున్నాయి. ఐక్య వేదిక ఆధ్వర్యంలో కె. వివేక్ వినాయక్ నాయకత్వంలో జరిగిన కార్యక్రమం లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి పి.కె.మహంతి,మార్కెటింగ్ ప్రిన్సిపల్ సెక్రటరీ డి.శ్రీని వాసులు, ఐఏఎస్ పార్థసారథి పాల్గొన్నారు. వైద్యరంగానికి వేలకోట్లు ఖర్చు చేస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం గిరిజన ప్రాంతాలను పట్టించుకోవడం లేదని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు అన్నారు. ఆదివాసీ దినోత్సవం సందర్భంగా కొత్తపేట బీజేఆర్ భవన్లో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. గిరిజనులు, ఆదివాసీల ఉన్నత విద్యాభివృద్ధికి తెలంగాణలో గిరిజన యూనివర్సిటీని ఏర్పాటుచేయాలని గిరిజన విద్యార్థి సంఘం డిమాం డ్ చేసింది. ఓయూలో జరిగిన కార్యక్రమంలో జేఏసీ చైర్మన్ కోదండరాం,టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ,సీమాంధ్ర ప్రాంతాల్లో ఉన్న గిరిజనుల పరిరక్షణకు చర్యలు తీసుకొని,ఈ ప్రాంతాలను ప్రత్యేక స్వయంపాలిత ప్రాంతాలుగా ప్రకటించాలని మానవ హక్కుల వేదిక అధ్యక్షుడు జీవన్‌కుమార్, జడ్పీ మాజీ చైర్మన్ చందా లింగయ్యలు డిమాండ్ చేశారు. సుందరయ్య విజ్ఞానకేంద్రంలో జరిగిన రౌండ్‌టేబుల్ సమావేశంలో వారు మాట్లాడారు. సాకలేక, చదివించలేక, పెళ్లిళ్లు చేయలేక అనేకమంది లంబాడీలు తమ పిల్లలను అమ్మేస్తున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ ట్రైబల్ ఎంప్లాయీ స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఈటెలతోపాటు తెలంగాణ ఉద్యోగ సంఘాల నేతలు శ్రీనివాసగౌడ్, అద్దంకి దయాకర్ తదితరులు పాల్గొన్నారు. -
తేనె స్వరాల మైనా
ఇటీవల రవీంద్రభారతిలో జరిగిన ‘సుమధుర సంగీత విభావరి’లో మైన పాడిన పాటలు ప్రేక్షకుల చేత ‘వాహ్వా’ అనిపించాయి. పుట్టింది అమెరికాలో అయినా, చదువుతున్నది అక్కడే అయినా... చక్కటి తెలుగులో పాటలు పాడి ప్రేక్షకులను మెప్పించిన మైనతో ఇంటర్వ్యూ.... మీరుండేది అమెరికాలో కదా... కర్ణాటక శాస్త్రీయ సంగీతం గురించి ఎలా ఆసక్తి కల్గింది? అమెరికాలోని టీఎల్‌సీఏ ఆధ్వర్యంలో ఉగాది రోజు (2005) ఆలయాల్లో కాంపిటిషన్స్ జరిగాయి. అది ఫస్ట్‌గ్రేడ్ చదివే చిన్నారులకు. పలుకే బంగారమాయే... అనే కీర్తన, క్లాసికల్ సాంగ్స్ పాడాను. అందులో ప్రైజ్ వచ్చింది. ఇక అప్పటి నుంచి శాస్త్రీయ సంగీతమన్నా, కర్ణాటక సంగీతమన్నా, తెలుగు పాటలన్నా ఆసక్తి పెరుగుతూ వచ్చింది. మ్యూజిక్ క్లాసుల గురించి.... అమెరికాలో మల్లిక అనే టీచర్ దగ్గర మ్యూజిక్ నేర్చుకుంటున్నాను. వేసవిలో ఇండియాకు వచ్చినప్పుడు ప్రముఖ గాయకులు నీహాల్ దగ్గర క్లాసికల్ ఫిల్మ్ సాంగ్స్, లైట్ మ్యూజిక్ మెళకువలు తెలుసుకుంటూ ఉంటాను. మీ గాత్రం ఎలాంటి సంగీతానికి నప్పుతుందని భావిస్తున్నారు? ఫాస్ట్‌బీట్ సాంగ్స్, పాప్ సాంగ్స్‌కు కూడా నా గాత్రం సూట్ అవుతుందని ప్రముఖ గాయకులు కొందరు అన్నారు. ఇప్పుడిప్పుడే అటువైపు అడుగులు వేస్తున్నాను. అమెరికాలో పుట్టి పెరిగినా చక్కటి తెలుగు మాట్లాడుతున్నారు... ఎవరికైనా ఇది సహజంగా వచ్చే సందేహమే (నవ్వుతూ). ఇంట్లో ఎలాగూ తెలుగు మాట్లాడతారు. తెలుగు సినిమాలపై ఉన్న ఆసక్తి కూడా తెలుగు భాష నేర్చుకునేలా చేసింది. సినిమాలు కేవలం వినోదానికి మాత్రమే కాదు, భాషను అభివృద్ధి చేస్తాయి. అది నా విషయంలో నిజమైంది. అందుకు అమ్మ మాధవి కూడా చేయూతనిచ్చింది. నేను ఏదైనా కావాలని, తినాలని అడిగినా అది తెలుగులోనే చెప్పితే కానీ చేసి పెట్టేది కాదు. దాంతో నాన్న (ఈదుల మురళి)ని అడిగి తెలుసుకుని మాట్లాడేదాన్ని. దీంతో తెలుగు భాష అలవాటైంది. సంగీతంలో రాణించేందుకు మీకు స్ఫూర్తి ఎవరు? ఇన్స్పిరేషన్ అంటే చెప్పలేనుగాని ప్రోత్సాహం విషయానికి వస్తే మాత్రం మా తాతయ్య శ్రీనివాసరెడ్డి నన్ను ప్రోత్సహించారు. ఎప్పుడూ ‘చదువు..చదువు’ అనకుండా తల్లిదండ్రులు నన్ను సంగీతం వైపు ప్రోత్సహించారు. వారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని సహకరించటం వల్లే ఇంతవరకు రాగలిగాను. సంగీతం కాకుండా ఇతర ఆసక్తులు ఏమైనా ఉన్నాయా? టెన్నిస్ ఆడతాను, సైన్స్ కాంపిటీషన్స్‌లో, స్పెలింగ్ పోటీల్లో పాల్గొంటాను. పాఠశాలల్లో డిబేట్క్లబ్లో పాల్గొంటాను. మీ పేరు గురించి చెప్పండి... నా పేరుకు అర్థం ‘పాడే పక్షి’ అని. నేను పుట్టక ముందే ‘మైన’ అనే పేరు పెట్టాలని అమ్మ, నాన్న డిసైడ్ అయ్యారు. అలా పాడతానని ముందే ఊహించి, తెలిసే పెట్టారేమో(నవ్వుతూ) ఈవెంట్ ఎలా జరిగిందని భావిస్తున్నారు? గొప్ప వాళ్ల ఎదుట పాడే అవకాశం కలిగింది. వారి కామెంట్స్ మంచి స్ఫూర్తిని ఇచ్చాయి. ఈ ఈవెంట్ కొత్త ఎనర్జి ఇచ్చింది. ముఖ్యంగా ప్రముఖ సంగీత దర్శకులు ఆర్.పి. పట్నాయక్, గాయకులు నీహాల్, విశ్వ, ఉపాసకులు దైవజ్ఞశర్మల ప్రశంసలు ఉత్సాహాన్ని ఇచ్చాయి. హో... బాయ్ గీతావిష్కరణ చేశారు గదా? అలా మరో ఆల్బమ్ ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? ఆదిత్య మ్యూజిక్ వారి ద్వారా ‘హో..బాయ్’ ఆడియో ఆల్బమ్ తీసుకువచ్చాను. అంతర్జాతీయ స్థాయిలో దీనికి ప్రాచుర్యం కలిగించేందుకు ఆదిత్య వారు ప్రయత్నిస్తున్నారు. సోలో ఆల్బమ్‌కి తయారవుతున్నాను. - కోన సుధాకర్‌రెడ్డి భగవానుడు అంటే..? భగవానుడంటే... భ అంటే భరించువాడు; గ అంటే బల ఐశ్వర్యములు కలవాడు, ఉద్ధరించువాడు; వ అంటే సమస్త భూతములను తనలో దాల్చినవాడు; ఆనుడు అంటే మానవులకుండే లక్షణాలయిన దోషం, సంకోచం, హేయగుణం మొదలయిన లక్షణాలు లేని పవిత్రమైనవాడు అని అర్థం.