
ఏ దేశమేగినా.. ఎందుకాలిడినా..
నాద ప్రభ కల్చరల్ ట్రస్టు ఆధ్వర్యంలో శుక్రవారం రవీంద్రభారతిలోనిర్వహించిన‘ఏ దేశమేగినా.. ఎందుకాలిడినా’ కార్యక్రమం ఆకట్టుకుంది.ఇందులో భాగంగా అమెరికాకు చెందిన హవిశ బాచె, విహిశ బాచె ‘పాడరే పరిమళ తపసి రాగాలు’ పేరుతో నిర్వహించిన సంగీత కార్యక్రమం ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసింది.
‘చూడరే భగవతీ భసిత రూపాలు’ పేరుతో డాక్టర్ అనుపమ కైలాశ్ చేసిన నృత్య ప్రదర్శన ఆహూతులను అలరించింది. ముఖ్య అతిథిగా గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి హాజరయ్యారు.
ట్రస్టు ఉపాధ్యక్షులు డాక్టర్ పద్మజ పాల్గొన్నారు.