‘అక్కినేని ప్రపంచస్థాయి నటుడు’ | 'Akkineni world actor' | Sakshi
Sakshi News home page

‘అక్కినేని ప్రపంచస్థాయి నటుడు’

Published Sun, Sep 21 2014 12:31 AM | Last Updated on Thu, May 24 2018 12:20 PM

‘అక్కినేని ప్రపంచస్థాయి నటుడు’ - Sakshi

‘అక్కినేని ప్రపంచస్థాయి నటుడు’

హైదరాబాద్:  ప్రపంచంలోని అగ్రస్థాయి నటుల్లో దివంగత సినీనటుడు అక్కినేని నాగేశ్వరరావు ఒకరని ఏపీ ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి అన్నారు. శనివారం హైదరాబాద్ రవీంద్రభారతిలో టి.సుబ్బరామిరెడ్డి లలితకళా పరిషత్ ఆధ్వర్యంలో రసమయి నిర్వహణలో అక్కినేని నాగేశ్వరరావు 91వ జయంతి సందర్భంగా అక్కినేనికి నీరాజనాలు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కేఈ మాట్లాడుతూ... తెలుగు భాష, సినీరంగం ఉన్నంత వరకు అక్కినేని ఉంటారన్నారు. కవి సి.నారాయణ రెడ్డి మాట్లాడుతూ అక్కినేని ముఖానికి తప్ప ఆయన మనసుకు మడతలు లేవు అని కొనియాడారు.

సినీనటుడు కృష్ణ మాట్లాడుతూ తాను సినీ ఇండస్ట్రీలోకి రావటానికి కారణం అక్కినేని అని తెలిపారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.చంద్రకుమార్, హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి, ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్, టి.సుబ్బరామిరెడ్డి, నటి విజయనిర్మల, రసమయి వ్యవస్థాపక అధ్యక్షుడు ఎం.కె.రాము పాల్గొన్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement