రూ.300 కోట్లతో అత్యాధునిక స్టూడియో | Trendy Studio Rs 300 crore | Sakshi
Sakshi News home page

రూ.300 కోట్లతో అత్యాధునిక స్టూడియో

Published Sat, Nov 30 2013 4:37 AM | Last Updated on Sat, Sep 2 2017 1:06 AM

Trendy Studio Rs 300 crore

=3న కేబినెట్ సమావేశంలో నిర్ణయం
 =మంత్రి పొన్నాల వెల్లడి
 =ఘనంగా పద్మమోహన ఆర్ట్స్ అవార్డుల ప్రదానం

 
సాక్షి,సిటీబ్యూరో: రాష్ట్రంలో యానిమేషన్, గేమింగ్ సెంటర్ ఏర్పాటులో భాగంగా రూ.300 కోట్ల వ్యయంతో 30 ఎకరాల్లో రాయదుర్గం వద్ద అత్యాధునిక పరిజ్ఞానంతో కూడిన ఓ స్టూడియో త్వరలో నిర్మించనున్నట్లు ఐటీశాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య తెలిపారు. శుక్రవారం రవీంద్రభారతిలో పద్మమోహన ఆర్ట్స్ 23వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. బుల్లితెర కళాకారులకు పద్మమోహన టీవీ అవార్డు-2013లను ఆయన అందజేసి మాట్లాడారు.

ఈ స్టూడియోకు సంబంధించి వచ్చేనెల 3న జరిగే కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. అలాగే బుల్లితెర కళాకారులకు ఉగాది పురస్కారాలు అందించేలా సీఎంతో మాట్లాడతానని చెప్పారు. సమాచార హక్కు చట్టం కమిషనర్ పి.విజయబాబు మాట్లాడుతూ మంచి-చెడులు రెండింటిని టీవీ రంగం ప్రభావితం చేస్తోందని పేర్కొన్నారు. ప్రతి కళాకారుడి చరిత్రలో చీకటిపుటలు ఎన్నో ఉంటాయని తెలిపారు. ఏఐసీసీ కార్యద ర్శి పొంగులేటి సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ ఫిల్మ్‌నగర్‌లాగా టీవీ కళాకారులకు అన్ని సౌకర్యాలతో టీవీనగర్‌ను ఏర్పాటు చేయాల్సిన అవసరముందన్నారు.

ఈ సందర్భంగా నిర్వహించిన మిమిక్రీ, సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. అనంతరం ‘సాక్షి’ నుంచి బెస్ట్ న్యూస్‌రీడర్‌గా హరి, మాటీవీ నుంచి బెస్ట్ కామెడీయన్‌గా మల్లికతోపాటు టీవీ రంగానికి చెందిన మరో 41 మంది ఆర్టిస్టులకు పద్మమోహన్ అవార్డులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కార్యదర్శి అర్వింద్‌కుమార్‌గౌడ్, సినీనటి కవిత, శివశక్తి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఎండీ ఎన్‌ఎస్ రావు, వైష్ణవీ ఇంద్రకాన్ ఇండియా లిమిటెడ్ ఎండీ పాండురంగారెడ్డి, పద్మమోహన్ ఆర్ట్స్ ఫౌండర్ డి.యాదగిరి తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement