
ప్రముఖ సినీ దర్శకులు, దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, కళాతపస్వి కె. విశ్వనాథ్‌కు ఈ ఏడాది ‘పద్మమోహన స్వర్ణకంకణం’ పురస్కారాన్ని ప్రదానం చేయనున్నట్లు పద్మమోహన ఆర్ట్స్ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు దేపల్లె యాదగిరి గౌడ్ తెలిపారు. సంస్థ 27వ వార్షికోత్సవాలు ఈ నెల 29న రవీంద్రభారతిలో జరగునున్న సందర్భంగా ఈ ప్రదానం జరుగుతుందన్నారు.
ముఖ్య అతిథిగా తెలంగాణ శాసనమండలి చైర్మన్ కె. స్వామిగౌడ్ హాజరు కానున్నారు. నగర మేయర్ బొంతు రామ్మోహన్, ప్రముఖ పాటల రచయిత ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రితో పాటు పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారని యాదగిరి గౌడ్ పేర్కొన్నారు. అవార్డు ప్రదానానికి ముందు కె. విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన సినిమాల్లోని పాటలతో ప్రత్యేక సినీ సంగీత విభావరి ఉంటుందని ఆయన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment