
టాలీవుడ్‌లో మరో విషాదం నెలకొంది. కళాతపస్వి కె.విశ్వనాథ్ మరణవార్త మరువకముందే ఆయన సతీమణి జయలక్ష్మి(86) అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. విశ్వనాథ్ మరణంతో పుట్టెడు దుఃఖంలో మునిగిపోయిన ఆమె అప్పటి నుంచి అస్వస్థతకు లోనయ్యారు. గత కొద్దిరోజులుగా అపోలో ఆస్పత్రిలోని ఎమర్జెన్సీ వార్డులో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో ఆదివారం సాయంత్రం 6.15 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు.
తండ్రి విశ్వనాథ్ కన్నుమూసిన వార్డులోనే తమ తల్లి జయలక్ష్మి కూడా మరణించడం దురదృష్టకరమని కుటుంబసభ్యులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. రేపు మధ్యాహ్నం పంజాగుట్ట స్మశాన వాటికలో ఆమె అంత్యక్రియలు జరగనున్నాయి. కాగా ఈ నెల 2న కె.విశ్వనాథ్ శివైక్యమయ్యారు. విశ్వనాథ్-జయలక్ష్మిలకు పద్మావతి దేవి, కాశీనాథుని నాగేంద్రనాథ్, కాశీనాథుని రవీంద్రనాథ్ ముగ్గురు సంతానం.
చదవండి: విశ్వనాథ్ సతీమణి కన్నుమూత
Comments
Please login to add a commentAdd a comment