మెగాస్టార్ చిరంజీవికి మంచి పేరు తెచ్చిపెట్టిన సినిమాల్లో ఆపద్బాంధవుడు ఒకటి. కే. విశ్వనాథ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మీనాక్షి శేషాద్రి హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. కానీ చిరంజీవికి మాత్రం మంచి గుర్తింపుతో పాటు నంది అవార్డుని తెచ్చిపెట్టింది. ఈ సినిమాలో చిరు అభిమానుల కోసం ఓ ఫైట్ సీన్‌ని పెట్టారు విశ్వనాథ్. అది ఎద్దుతో జరిగేది.
ఇందుకోసం చిత్ర నిర్మాణ సంస్థ పూర్ణోదయ మూవీ క్రియేషన్ అప్పట్లోనే రూ. 50 వేలు ఖర్చు చేసిందట. ఫైట్ సీన్ కోసం ఆరు వేల కుండలను తెప్పించారట. దాదాపు నాలుగు రోజుల పాటు ఈ పోరాట ఘట్టాన్ని తెరకెక్కించారట. పగిలిపోయిన కుండల స్థానంలో ఎప్పటికప్పుడు కొత్త కుండలను పెట్టేవారట. ఇక ఈ ఫైట్ సీన్ ముగింపు దశకు వచ్చేసరికి కుండల కొరత ఏర్పడిందట.
(చదవండి: అభిమానులకు క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు చేయిస్తా, ఎన్ని కోట్లయినా ఖర్చు చేస్తా: చిరంజీవి)
అప్పటికే మద్రాస్‌లో తయారు చేసిన కుండలన్నీ కొనుగోలు చేశారట. మరిన్ని కుండల కోసం చుట్టు పక్కల గ్రామాలకు వెళ్లి కొనుక్కోచ్చారట. ఎంతో కష్టపడి తీసిన ఈ ఫైట్ సీన్ సినిమాలో హైలెట్‌గా నిలిచింది. 1992 అక్టోబర్ 9న అపద్బాంధవుడు చిత్రం విడుదలైంది. చిరంజీవితో పాటు ఉత్తమ డైలాగ్స్ రచయితగా జంధ్యాల, ఉత్తమ కొరియోగ్రాఫర్‌గా భూషన్ లకంద్రి, ఉత్తమ ఆర్ట్ డైరెక్టర్‌గా బి. చలం, అరుణ్ బి.గోడ్వంకర్‌లకు నంది అవార్డులు లభించాయి.
Comments
Please login to add a commentAdd a comment