ఆదివాసీ..ఎంతో మురిసి
సాక్షి,సిటీబ్యూరో: ప్రపంచ ఆదివాసి దినోత్సవం నగరంలో శుక్రవారం ఘనంగా జరిగింది. రవీంద్రభారతితోపాటు ఆయా ప్రాంతాల్లో జరిగిన కార్యక్రమాల్లో వెనుకబడిన ఆదివాసీల సమస్యలు, వారి హక్కుల ను వివరించడంతోపాటు వాటి సాధనకు ఐక్యఉద్యమాలు శరణ్యమని స్పష్టంచేశారు. ప్రతి తండాను పంచాయతీగా ప్రకటించాలని,గిరిజనుల కోసం ప్రత్యేకంగా యూనివర్సిటీని ఏర్పాటు చేయా ల ని,ఈ ప్రాంతాలను ప్రత్యేక ప్రాంతాలుగా పరిగణిం చాలని పలువురు నాయకులు డిమాండ్ చేశారు.
గిరిజన విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో జరిగిన కార్యక్రమంలో వైద్యమంత్రి కొండ్రు మురళి హాజరై మాట్లాడారు. గిరిజనుల్లో చైతన్యం రావాలని, అప్పుడే అన్నింట్లోనే న్యాయం జరుగుతుందని తెలిపారు. విశ్రాంత డీజీపీ డీటీ నాయక్ మాట్లాడుతూ ప్రతి తండాను పంచాయతీగా మార్చాలనగా..గిరిజన జాతుల వికాసానికి పాలకులు అండగా నిలవాలని మాజీ ఎంపీ రవీంద్రనాయక్ విజ్ఞప్తి చేశారు. సమాఖ్య వ్యవస్థాపకుడు శంకర్‌నాయక్ మాట్లాడుతూ ప్రాంతాలకతీతం గా గిరిజనులు పోరాటాలకు సిద్ధం కావాలన్నా రు. కళాకారుడు బిక్షు బృందం నిర్వహిం చిన సాంస్కృతిక కార్యక్రమాలు, సరిత బృం దం నిర్వహించిన భరతనాట్యం అమితంగా ఆకట్టుకున్నాయి. ఐక్య వేదిక ఆధ్వర్యంలో కె. వివేక్ వినాయక్ నాయకత్వంలో జరిగిన కార్యక్రమం లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి పి.కె.మహంతి,మార్కెటింగ్ ప్రిన్సిపల్ సెక్రటరీ డి.శ్రీని వాసులు, ఐఏఎస్ పార్థసారథి పాల్గొన్నారు.
వైద్యరంగానికి వేలకోట్లు ఖర్చు చేస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం గిరిజన ప్రాంతాలను పట్టించుకోవడం లేదని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు అన్నారు. ఆదివాసీ దినోత్సవం సందర్భంగా కొత్తపేట బీజేఆర్ భవన్లో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు.
గిరిజనులు, ఆదివాసీల ఉన్నత విద్యాభివృద్ధికి తెలంగాణలో గిరిజన యూనివర్సిటీని ఏర్పాటుచేయాలని గిరిజన విద్యార్థి సంఘం డిమాం డ్ చేసింది. ఓయూలో జరిగిన కార్యక్రమంలో జేఏసీ చైర్మన్ కోదండరాం,టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ,సీమాంధ్ర ప్రాంతాల్లో ఉన్న గిరిజనుల పరిరక్షణకు చర్యలు తీసుకొని,ఈ ప్రాంతాలను ప్రత్యేక స్వయంపాలిత ప్రాంతాలుగా ప్రకటించాలని మానవ హక్కుల వేదిక అధ్యక్షుడు జీవన్‌కుమార్, జడ్పీ మాజీ చైర్మన్ చందా లింగయ్యలు డిమాండ్ చేశారు. సుందరయ్య విజ్ఞానకేంద్రంలో జరిగిన రౌండ్‌టేబుల్ సమావేశంలో వారు మాట్లాడారు.
సాకలేక, చదివించలేక, పెళ్లిళ్లు చేయలేక అనేకమంది లంబాడీలు తమ పిల్లలను అమ్మేస్తున్నారని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ ట్రైబల్ ఎంప్లాయీ స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఈటెలతోపాటు తెలంగాణ ఉద్యోగ సంఘాల నేతలు శ్రీనివాసగౌడ్, అద్దంకి దయాకర్ తదితరులు పాల్గొన్నారు.