
సాక్షి, అమరావతి: తిరుపతిలోని శిల్పారామాన్ని రూ.10 కోట్లతో అభివృద్ధి చేయడంతోపాటు.. శ్రీకాకుళంలో కొత్తగా శిల్పారామం ఏర్పాటుకు తొలిదశలో రూ.3 కోట్లు కేటాయించినట్టు పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. ఇక రాష్ట్రంలోని శిల్పారామాల్లోకి మంగళవారం నుంచి సందర్శకులను అనుమతిస్తున్నట్టు వెల్లడించారు. కానీ, ఫిల్మ్స్ ప్రదర్శనలు, వినోద క్రీడలకు అనుమతి లేదని ఆయన సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు.
తిరుపతి శిల్పారామం మాస్టర్‌ప్లాన్‌లో భాగంగా పార్కును రూ.10 కోట్లతో అభివృద్ధి చేస్తామన్నారు. విశాఖపట్నంలో శిల్పారామం అభివృద్ధికి రూ.10.92 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించామని ఆయన తెలిపారు. వాటికి నిధులు కేటాయిస్తూ ఆర్థిక శాఖ త్వరలో ఉత్తర్వులు జారీ చేస్తుందన్నారు.