సాక్షి, విజయవాడ: కృష్ణానదిలో బోధిసిరి బోటును పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. బోధిసిరి బోట్ మరోసారి లాంచింగ్ చేశాము. 2004లో వైఎస్సార్ చేతుల మీదుగా ప్రారంభించిన బోధిసిరిని తిరిగి నేను ప్రారంభించడం ఆనందంగా ఉంది. టూరిస్ట్‌లకు మెరుగైన వసతులు కల్పించేలా చర్యలు తీసుకుంటాం. టూరిజంకు సీఎం జగన్ పెద్దపీట వేస్తున్నారు. టెంపుల్ టూరిజం అభివృద్ధి చేస్తాం.
బోటు ప్రమాదాలు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. రాష్ట్రంలో ఏపీ టూరిజం నుంచి 45, ప్రైవేట్‌గా 25 బోట్లు అందుబాటులో ఉన్నాయి. 9 ప్రాంతాల్లో కంట్రోల్ రూమ్ ద్వారా బోట్స్ మానిటర్ చేస్తున్నాం. దేశ విదేశాలకు చెందిన టూరిస్ట్‌లకు అనుకూలంగా ఉండేలా టూరిజం అభివృద్ధి చేస్తాం. కోవిడ్ వల్ల టూరిజం ఆదాయం తగ్గింది. పీపీఈ మోడ్‌లో టూరిజంను డెవలప్‌మెంట్ చేస్తున్నాం. స్టేక్ హోల్డర్స్‌తో చర్చలు జరుపుతున్నాం' అని పర్యాటకశాఖ మంత్రి ఆర్కే రోజా అన్నారు. ఈ కార్యక్రమానికి టూరిజం శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు.
స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్ భార్గవ మాట్లాడుతూ.. సీఎం ఆదేశాల మేరకు టూరిజం అభివృద్ధి చేస్తాం. రోప్ వేస్ ప్రాజెక్టుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. రెండు రోప్ వేస్ పనులను త్వరలోనే ప్రారంభిస్తాం. విజయవాడ బరం పార్కులో 1, శ్రీశైలంలో 1 రోప్ వే ప్రాజెక్టు త్వరలోనే ప్రారంభం కాబోతున్నాయి అని రజత్ భార్గవ తెలిపారు.
చదవండి: (మాజీ మంత్రి అనిల్‌తో మంత్రి కాకాని గోవర్ధన్‌రెడ్డి భేటీ)
Comments
Please login to add a commentAdd a comment