అడ్డంగా దొరికిన బాబును కాపాడేందుకు ఎవరూ సిద్ధంగా లేరు: మంత్రి రోజా | Minister Roja Slams Lokesh Delhi Tour Ahead Chandrababu arrest | Sakshi
Sakshi News home page

అందుకే మోదీ, అమిత్ షా అపాయింట్‌మెంట్‌ కూడా ఇవ్వలేదు: మంత్రి రోజా

Published Wed, Sep 27 2023 1:04 PM | Last Updated on Wed, Sep 27 2023 1:52 PM

Minister Roja Slams Lokesh Delhi Tour Ahead Chandrababu arrest - Sakshi

సాక్షి, విజయవాడ: నారా లోకేష్‌ ఢిల్లీలో ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్‌ షా కాళ్లు పట్టుకోవడం కోసం తిరుగుతున్నారని మంత్రి రోజా ధ్వజమెత్తారు. ఇప్పటికే రాష్ట్రపతిని కలిసిన లోకేష్‌.. తప్పు చేసిన తన తండ్రిని కాపాడాలని కోరారని అన్నారు.  ప్రజల సొమ్ము దోచేసినా చర్యలు తీసుకోకూడదని అడిగేందుకు డిల్లీ వెళ్లారని విమర్శించారు. అడ్డంగా దొరికిన చంద్రబాబును కాపాడేందుకు ఎవరూ సిద్ధంగా లేరని.. అందుకే మోదీ, అమిత్ షా అపాయింట్‌మెంట్‌ కూడా ఇవ్వలేదని మండిపడ్డారు.

చంద్రబాబు స్కిల్ డెవెలప్ మెంట్ సహా అమరావతి, ఫైబర్ నెట్ వంటి అనేక స్కాంలు చేశారని మంత్రి రోజా దుయ్యబట్టారు. ఇన్నర్ రింగ్ రోడ్డు లేదు కదా.. ఇంకా స్కాం ఎలా జరిగిందని లోకేష్ అడుగుతున్నారని.. రోడ్డు వేయకముందే ఇన్నర్ రింగ్‌రోడ్డు అలైన్‌మెంట్‌ పేరుతో దోచుకున్నారని విమర్శలు గుప్పించారు. ఆరు నెలల్లో రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని లోకేష్ చెప్తుంటే అందరూ నవ్వుతున్నారని అన్నారు. స్కాంలలో ఇరుక్కుని లోకేష్ ఢిల్లీ పారిపోయాడని.. కాళ్ళ నుంచి కళ్ళ వరకూ భయంతో  వణికిపోతున్నాడని ఎద్దేవా చేశారు. 

‘రెడ్‌బుక్‌ రాసుకుంటానని బెదిరిస్తున్న లోకేష్ సీఐడీ మెమోలో ఆయన పేరు రాశారని గుర్తు చేసుకోవాలి.  హెరిటేజ్‌లో 2 శాతం షేర్లు అమ్మితెనే 400కోట్లు వస్తాయని భువనేశ్వరి చెప్తున్నారు. అంటే చంద్రబాబు ఆస్తి 20 వేల కోట్లా. చంద్రబాబు అఫిడవిట్‌ ఆ విషయం స్పష్టం చేశారా. కర్జూర నాయుడు చంద్రబాబుకు, ఆయన తమ్ముడికి చెరో ఎకరం ఇచ్చారు. అక్కడి నుంచి లక్షల కోట్లకు చంద్రబాబు ఆస్తి ఎలా పెరిగింది.

హైదరాబాద్ లో చంద్రబాబు ఇల్లు రూ. 600 కోట్లు.. భువనేశ్వరి లోకేష్ 118 కోట్ల అయితే నోటీసులకు సమాధానం చెప్పాలి. ప్రపంచ దేశాల్లోని తెలుగువారంతా ఈ స్కామ్‌ల గురించి తెలుసుకోవాలి. భువనేశ్వరి, బ్రహ్మణి అబద్ధాలు చెప్తుంటే ఎన్టీఆర్ కూతురు, మనవరాలు అనే గౌరవం కూడా పోతుంది. చంద్రబాబు దోపిడీదారుడు అని అందరికీ తెలుసు. చంద్రబాబు టీమ్ వర్క్‌గా కుటుంబసభ్యులంతా దోపిడీలో భాగస్వామ్యం అయినట్టు ప్రజలకు స్పష్టమైంది’ అని రోజా పేర్కొన్నారు.

విజయవాడ: ఏపీ ఆన్యువల్ టూరిజం ఎక్స్‌లెన్స్‌ అవార్డులను మంత్రి రోజా అందజేశారు. 5స్టార్, 7స్టార్, బడ్జెట్ హోటల్స్, ఎకో ఫ్రెండ్లీ విభాగాల్లో పలు హోటల్స్‌, పలువురు చెఫ్‌లు, ట్రావెల్ ఏజన్సీలకు, అడ్వెంచర్ క్లబ్స్‌కు అవార్డులు అందించారు. ఈ సందర్భంగా మంత్రి ఆరోజా మాట్లాడుతూ.. ‘టూరిజంలో అనేక మార్పులు వస్తున్నాయి. టూరిజంలో ఈ జనరేషన్‌కు క్రియేటివిటీ పెరిగింది. స్ట్రెస్ రిలీఫ్‌కు డెస్టినేషనే సొల్యూషన్. పర్యావరణ హిత టూరిజాన్ని ప్రోత్సహిస్తున్నాం. 2023 సంవత్సరానికి లేపాక్షి ఉత్తమ పర్యాటక ప్రాంతంగా ఎంపికైంది. 

దేశంలోనే 3వ ప్రజాదరణ కలిగిన పర్యాటక ప్రాంతంగా ఏపీ ఉందని కేంద్ర పర్యాటక శాఖ వెల్లడించింది. మొదటి స్థానంలోకి తీసుకు వచ్చేందుకు కృషి చేస్తాం. టూరిజంలో అంతర్జాతీయ స్థాయి పెట్టుబడులను ఆహ్వానిస్తున్నాం. పర్యాటక రంగంలో పెట్టుబడులకు రాయితీలు ఇస్తున్నాం. ఒబెరాయ్ ఏపీలో 7స్టార్ హోటళ్లు ప్రారంభించనుంది. 117 టూరిజం ప్రాజెక్టస్‌ విశాఖ గ్లోబల్ సమ్మిట్ లో ఎంవోయూలు కుదుర్చుకున్నాం.

సీఎం జగన్ పర్యాటక రంగాన్ని ప్రోత్సహిస్తున్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఏపీ దేశంలోనే నెం.1 స్థానంలో ఉంది. టెంపుల్ టూరిజం, నేచర్ టూరిజం కు ప్రాధాన్యత ఇస్తున్నాం. పర్యాటక స్థలాలను అన్యాక్రాంతం కాకుండా కాపాడుతున్నాం. ఏపీ టూరిజం పని చేస్తున్న ఉద్యోగులకు ప్రోత్సాహకంగా అవార్డులు ఇస్తున్నాం.’ అని తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement